గత నాలుగు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అని, ఇక ముందు జరిగే పనులను సవాల్‌గా తీసుకోవాలని ఫలితాలను రాబట్టాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. జరగబోయేది మలిదశ అభివృద్ధి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. మొత్తం పది కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి సారించాలంటూ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన వెలగ పూడి సచివాలయంలో వివిధ విభాగాల అధిపతులు, కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూరు శాతం సంతృప్తిని సాధించే దిశగా పనిచేయాలన్నారు. ఎక్కడికక్కడ సమ స్యలుంటే పరిష్కరించుకొని ముందుకు సాగు తున్నామని, వృద్ధిరేటులో ఆంధ్రప్రదేశ్‌ స్థిరంగా కొనసాగుతున్నదని అన్నారు.

cbn officers 26072018 2

ఇండియాలో ఏదైనా ఒక రాష్ట్ర బృందం పటిష్టంగా, పకడ్భందీగా కష్టపడి పనిచేస్తుందంటే అది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని చెప్పారు. లక్ష్యాల సాధనలో ముందుండాలని, కేంద్రం పూర్తిగా రాష్ట్రానికి సహకరించడం లేదని, ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, అది ఇచ్చివుంటే వేగంగా అభివృద్ధి జరిగి వుండేదని అన్నారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పై ఉందన్నారు. హోదాపై తొలుత పదేళ్ళు అన్నారని, తర్వాత మాటతప్పారని , పరిశ్రమలు రావా లంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనని స్ప ష్టం చేశారు. హోదా అనేది రాజకీయ నిర్ణయమని, మనది ప్రజాస్వామ్య పాలన అని రాజకీయ నిర్ణయం తీసుకున్నాక అమలు చేయాల్సిందేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందంటే అన్ని పార్టీలు మద్దతుగా నిలిచాయని గుర్తుచేశారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని, ఇదే వేగంతో మరో ఏడు సంవ త్సరాలు కష్టపడితే దక్షిణ భారతదేశంలో ఆదాయంలో వృద్ధి చెందుతామని, దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తామని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పేర్కొన్నారు.

cbn officers 26072018 3

గత ఏడాది వర్షపాతం తక్కువైనా అభివృద్ధి తగ్గలేదని, వరుసగా సుస్థిర అభివృద్ధిని సాధిస్తున్నామని చెప్పారు. జలవనరుల పై కూడా ఎక్కువగా దృష్టి పెట్టామని తెలియజేశారు. గతంలో మౌలిక సదుపాయాలు లేవని, రాయలసీమలో నీళ్ళు లేవని, ఆంధ్రలో తుఫానులు వచ్చేవని, ఏడాదిలో విశాఖను సాధారణ స్థితికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌ నిండుతోందని, పట్టిసీమ వల్ల రాయలసీమకు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వడం సాధ్యమవుతున్నదని, పంటలు వేయడం, సీజన్‌ మిస్సయితే ఆదుకోవడంపై రైతులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీని తెచ్చామని, పంట కుంటలు, రెయిన్‌ గనులు వినియోగించామని, వర్షపునీటిని భూగర్భజలంగా మార్చుకుంటున్నామని, భూగర్భజలాల మట్టం పెరిగిందని, ప్రణాళిక ప్రకారం వెళితే ముందుగా కోటి ఎకరాల్లో ఉధ్యాన పంటలకు నీరందించడం వీలవుతుందని, తర్వాత మరో కోటి ఎకరాల వ్యవసాయయోగ్య భూమికి నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

దశాబ్ధాల ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ, కేంద్రాన్ని దుమ్మెత్తేందుకు ఆయుధంగా మారిన విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌కు ట్రాక్‌ రెడీ అయినట్లుగా సమాచారం. కీలకమైన విభజన హామీ, పైసా ఖర్చు లేని ప్రత్యేక రైల్వే జోన్‌ కల సాకారం అయ్యేరోజు దగ్గరలోనే ఉందనే సంకేతాలు ఉత్తరాంధ్ర ప్రజలకు సంతోషాన్ని చేకూర్చాయి. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తామన్న సంకేతం ఇవ్వటంతో ఇదైనా తీరే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. అయితే, ఇది కార్యరూపం దాల్చే వరకు నమ్మలేం అని, సాక్షాత్తు అప్పటి ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కు లేనప్పుడు, ఒక హోం మంత్రి, ఎదో చెప్పిన విషయం పట్టుకుని సంతోషపడితే, మరోసారి భంగపాటు తప్పదని అంటున్నారు.

modi 26072018 2

ఓ పక్క భారతీయ జనతా పార్టీ ఇదే విషయమై ఎప్పటికైనా ప్రత్యేక రైల్వే జోన్‌ సాధించుకువస్తామని చెబుతున్నప్పటికీ ఇతర అంశాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం, దుగ్గరాజుపట్నం పోర్టు ట్రస్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌ వంటి విషయాల్లో కేంద్రం జారిపోవడంతో ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తామని చెప్పుకొస్తున్నా ప్రజల్లో నమ్మకం ఏర్పడలేదు. అయితే, మంగళవారం నాటి రాజ్యసభ సమావేశంలో హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేరుగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తున్నట్లుగా ప్రకటన చేయడంతో ఈ విషయంలో ఒక స్పష్టత ఏర్పడిందని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. దీనికి ముందు విశాఖకు చెందిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు పార్టీ జాతీయ అధ్యక్షునితో భేటీ అయి ప్రత్యేక రైల్వే జోన్‌ విషయమై సుదీర్ఘంగా చర్చించారు.

modi 26072018 3

గత నెల (జూన్‌) 13న అమిత్‌షాతో భేటీ అయిన వారిలో పార్లమెంట్‌ సభ్యులు కంభంపాటి హరిబాబు, ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్‌ రాజులు కూడా ఉన్నారు. రైల్వే జోన్‌ విషయంలో అవసరమైన రాజకీయ నిర్ణయాన్ని ఈ సమావేశంలోనే పార్టీ పరంగా అమిత్‌షా తీసుకున్నారు. ఈ విషయాన్ని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు స్వయంగా వెల్లడించారు. రాజకీయ నిర్ణయం తీసుకున్న నెల రోజుల్లో కేంద్రం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా రాజ్యసభలో ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తున్నట్లుగా ప్రకటన చేయడం విశేషం. అయితే ఈ జోన్ వచ్చే దాక నమ్మకం లేకపోవటం ఒకెత్తు అయితే, ఒకవేళ ఇచ్చినా, మన రాష్ట్ర భూభాగం మొత్తం ఈ జోన్ లో కలుపుతారా, లేక ఒరిస్సా ఒత్తిడికి తలొగ్గి, కొంత మేర అటు వైపు కలుపుతారా అనేది కూడా చూడాలి.

దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఓటువేయగానే రసీదు వచ్చే వీవీపాట్‌ (ఓటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) యంత్రాలను 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే అందుబాటులో ఉంచుతామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రీపోల్‌ సన్నాహకాలకు ముందే అన్ని ప్రాంతాలకు అవసరమైనన్ని వీవీపాట్‌లను యంత్రాలు ఎన్నికల కమిషన్‌కు చేరతాయని పేర్కొంది. ఎన్నికల గడువు సమీపిస్తున్న వీవీపాట్‌ యంత్రాలను సకాలంలో అందుతాయో లేదోనన్న మీమాంశలో ఈసీ ఉందన్న వార్తల నేపథ్యంలో స్పందించిన ఎన్నికల కమిషన్‌… 2019 లోక్‌సభ ఎన్నికలకు దేశంలోని అన్ని పోలింగ్‌ స్టేషన్‌లకు వీవీపాట్‌ యాంత్రాలను చేరవేస్తామని స్పష్టం చేసింది.

ec 26072018 2

ఎన్నికలకు 16.15 లక్షల వీవీపాట్‌ యంత్రాలు అవసరమౌతాయని గుర్తించిన ఎన్నికల సంఘం మిషన్ల చేరవేత అంశాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొంది. 2019 సాధారణ ఎన్నికల్లో వీవీపాట్‌ యంత్రాలను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని భారత ఎన్నికల సంఘం గతేడాది సుప్రీంకోర్టుకు హామీపత్రాన్ని సమర్పించింది. వీవీపాట్‌ యంత్రాలను తయారు చేసేపనిని ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), ఎలక్ట్రానిక్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)కు ఈసీ గతేడాది అప్పగించింది. 2018 సెప్టెంబర్‌ నాటికి యంత్రాలను అప్పగించాలని డెడ్‌లైన్‌ విధించింది.

ec 26072018 3

ఆర్డర్‌ ఇచ్చిన 14 నెలలకు 22 శాతం వీవీపాట్‌ యంత్రాలను ఈసీ చేరడంతో అనుకున్న సమయానికి ఎన్నికల కమిషన్‌ తమహామీని నిలబెట్టుకుంటుందా అన్నకోణంలో పలు వార్త కథనాలు వచ్చాయి. మొత్తం 16.15 లక్షల వీవీపాట్‌ యంత్రాలకుగానూ ఈ ఏడాది జూన్‌ నాటికి కేవలం 3.48 లక్షల యంత్రాలను మాత్రమే తయారీ కంపెనీలు అందించినట్లు తమ కథనాల్లో ఉటం కించాయి. దీంతో వీవీపాట్‌ యంత్రాల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. అనుకున్న సమయానికి అన్ని పోలింగ్‌ కేంద్రాలకు ఓటు వేయగానే రసీదు వచ్చే యంత్రాలు చేరుకుంటాయని ఎన్నికల కమిషన్‌ వివరణ ఇచ్చింది.

డీజెల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి చేర్చాలన్న డిమాండ్‌తో లారీల యజమానులు చేపట్టిన బంద్‌ ఆరు రోజులు పూర్తయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందనాలేదు. ఓ వైపు పార్లమెంట్‌ జరుగుతోంది. ఇందులో అనేక అంశాలు చర్చకొస్తున్నాయి. కానీ లారీల సమ్మె ప్రభావం గురించి ఏ ఒక్కరు అడిగిన పాపాన పోలేదు. కనీసం దీనివల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులపై కూడా చర్చ లేదు. ఇప్పటికే రవాణా స్తంభనతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి మందగించింది. ముడిసరుకుల రవాణా నిలిచిపోవడంతో కార్మికుల కు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. చేపలు, గుడ్లు, కొబ్బరి వంటి వాటి ఎగుమతులు ఆగిపోయాయి. లారీలు స్తంభించడంతో రైల్వేయార్డులు కూడా బోసిపోతున్నాయి. గూడ్స్‌ల రవాణా కూడా పడిపోయింది. పోర్టుల్లో రవాణాపై ఇప్పటికే ప్రభావం ఏర్పడింది. సాధారణ మార్కెట్లలో కూరగాయల లభ్యత తగ్గిపోయింది. దీంతో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ట్యాంకర్ల యాజమాన్య సంఘాలు కూడా లారీల సమ్మెకు మద్దతు పలికాయి.

loksabha 26072018 2

ఇక ట్యాంకర్లలో రవాణా అయ్యే డీజెల్‌, పెట్రోల్‌ల లభ్యత కూడా తగ్గిపోతున్నది. ఇది జనజీవనాన్ని మరింత అతలా కుతలం చేస్తుంది. అయినా ప్రభుత్వంలో ఇంతవరకు ఎలాంటి స్పందనాలేదు. మహారాష్ట్రలో మరాఠాల ఆందోళన పై ఒకరోజు తిరిగేసరికి ప్రభుత్వం దిగొచ్చింది. వెంటనే చర్చలకు నడుంకట్టింది. కానీ దేశ వ్యాప్త ప్రభావం చూపుతున్న లారీల సమ్మెవైపు దృష్టి పెట్టడం లేదు. సమ్మె ప్రభావంతో సిమెంట్‌, ఇసుక, ఇనుముల రవాణా నిల్చిపోయింది. ఇది నిర్మాణ రంగం పై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దేశంలో వ్యవసాయం తర్వాత నిర్మాణరంగమే అత్యధిక సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. పైగా వీరంతా రోజువారి వేతనదారులే. ఏ రోజు పనుంటే ఆ రోజే వీరికి వేతనం లభిస్తుంది. పనిలేక పూట గడవక పస్తులుండాల్సిన పరిస్థితి ఇప్పుడు వీరికి ఏర్పడింది. వంటనూనెల నుంచి ఉల్లిగడ్డల వరకు నిల్వలు తగ్గిపోయాయి.

loksabha 26072018 3

దేశవ్యాప్తంగా పోర్టుల్లో రవాణా స్తంభించినా కేంద్రం మాత్రం స్పందించడం లేదు. పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతింటున్నా ప్రభుత్వాలకు పట్టడంలేదు. అన్నిరకాల వస్తువుల్ని జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చి గరిష్టంగా 28శాతం పన్ను వసూలు చేస్తుంటే డీజెల్‌పై కేంద్రం 47శాతం పన్ను వసూలు చేస్తోంది. ఇదికాక సెంట్రల్‌ ఎక్సైజ్‌ అంటూ మరో 11శాతం రాబడుతోంది. ఈ ఆదాయాన్ని వదులు కోలేక లారీల బంద్‌పై కేంద్రం దృష్టి పెట్టడంలేదు. కనీసం సామరస్య పూర్వకంగా నైనా సమ్మె ఉపసంహరణకు ప్రయత్నించడం లేదు. లారీ యజమా నులు, కార్మికుల ఆర్థిక దుస్థితి తెలిసినా చచ్చేట్లు వారే దిగొస్తారన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోంది. ఇది అన్నివర్గాల ప్రజల ఆగ్రహానికి కారణమౌతోంది. ఇప్పటికైనా కేంద్రం సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, కనీసం పార్లమెంట్‌లో దీనిపై ఓ ప్రకటన చేయాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మెల విషయంలో కార్మికుల ప్రయోజ నాలకు అనుకూలంగా వ్యవహరించాల్సిన వామ పక్షాల పార్లమెంట్‌ సభ్యులు కూడా ఈ సమ్మెపై స్పందించక పోవడం మరింత విడ్డూరంగా ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read