ఏపీలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకే కొందరు పెద్దలు నిర్ణయించుకున్నట్టు పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. భారీగా అవినాష్ రెడ్డి ప్రైవేటు సైన్యాలు, వైకాపా మూకలు మొహరించేశారు. సీబీఐకి ఏపీ పోలీసులు సహకరించడంలేదు. ఈ గూండా మూకలు మీడియా వాళ్లని, జనాలని చావకొడుతున్నా పోలీసులు కన్నెత్తి చూడటంలేదు. మరోవైపు వ్యూహాత్మకంగానే ఇటువంటిదేదో ప్లాన్ చేసినట్టు ప్రభుత్వ పెద్దల మనిషి పోలీసు శాఖలో పెద్ద తలకాయ సెలవుపై వెళ్లడం అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కర్నూలు పోలీస్ గెస్ట్ హౌస్ లోనే సీబీఐ టీమ్ నిరీక్షిస్తున్నా, ఏపీ పోలీసులు వారిని కదలనివ్వడంలేదు. అవినాష్ అరెస్ట్ చేయాలని లోకల్ పోలీసుల సహకారం కోరినా సీబీఐకి సహకరించేందుకు వారు సిద్ధంగా లేరు. దీంతో కేంద్ర బలగాలను రప్పించి..అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ యత్నాలు ఆరంభించింది. సీబీఐ ఇచ్చిన వెసులుబాట్ల వల్లే ఇప్పటివరకూ ఫ్యాక్షన్ ముఠాలతో సీబీఐ కార్యాలయంలో, కోర్టుల్లో, ఇప్పుడు ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి కోసం చెలరేగిపోతున్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు కేంద్ర బలగాలు చేరుకున్నాక అరెస్టు చేయొచ్చనే సమాచారం నేపథ్యంలో..వైసీపీ నేతలు శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని నేరుగా హెచ్చరిస్తుండడం రాష్ట్రంలో అల్లర్లకి ప్లాన్ చేశారని స్పష్టం అవుతోంది.
news
జూనియర్ ఎన్టీఆర్ మౌనం..వైసీపీ నుంచి వాయిస్
జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాడు. ఆయన మాట్లాడాల్సిన సందర్భంలోనూ మాట్లాడడు. ఆయన తరఫున ఆయన ఫ్యాన్స్ మాట్లాడుతుంటారు. చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులు పట్టుకుని టిడిపి పగ్గాలు జూనియర్ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు. ఆ డిమాండ్లు..ఆందోళనలు వైసీపీ అధినేత జగన్ రెడ్డి సాక్షి మీడియా, దాని అనుబంధ సంస్థలైన ఎన్టీవీ-టీవీ9లో వస్తుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉంటాడు. ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుని వైసీపీ నేతలు, టిడిపి నాయకత్వం ఆయనకి ఇవ్వాలని మైకులు విరగ్గొడుతుంటారు. తాత అంటే ప్రాణమంటూ ఫుల్ పేజీలు ప్రకటనలు ఇచ్చే తాత పోలికలున్న జూనియర్ ఎన్టీఆర్ తన తాత తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలకి డుమ్మా కొట్టేశాడు. ఆయనేదో ముందస్తు కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నానని చెప్పినా, జూనియర్ మనసులో మాటలని సాక్షి మీడియాలో అచ్చేశారు. ఆ రాతలని ఆయన ఖండించరు అంటే, ఆయనే మనసెరిగి రాస్తున్నట్టే కదా! తాను రాలేనని ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే సావనీర్ కమిటీకి చెప్పానని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన రిలీజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన అభిమానుల కోసమే పనిచేస్తున్నట్టు వ్యవహరించే సాక్షి, దాని అనుబంధ మీడియాలో మాత్రం చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకి ఇష్టంలేకే గైర్హాజరయ్యారని ఒక రోత రాత రాశారు. ఎన్టీఆర్ శతజయంతి కమిటీ ఆధ్వర్యంలో తొలి సభను విజయవాడలో నిర్వహించి, జూనియర్‌ని పిలవలేదని...అందుకే రెండో సభను హైదరాబాద్‌లోని కైత్లాపూర్ మైదానంలో నిర్వహిస్తున్న సభకి డుమ్మా కొట్టారని వైసీపీ మీడియా రాసుకొస్తోంది. చంద్రబాబు, బాలకృష్ణ ఉన్న వేదిక పంచుకోవడానికి ఇష్టం లేకే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని వైసీపీ పేటీఎం వెబ్సైట్లలో రాస్తున్నారు. దీనిపైనా ఎన్టీఆర్ స్పందించడు. ఆయన వాయిస్‌ని సాక్షి, వైసీపీ వినిపిస్తుంది. అది ఆయన ఖండించడు.
కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ జగన్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి
రికార్డుల్లో నా పేరుండడం కాదు, నా పేరుతోనే రికార్డులుంటాయంటారు బాలయ్య. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులలో నా పేరుండడం కాదు, నా కేసులతోనే కేంద్ర దర్యాప్తు సంస్థల రికార్డులు ఉంటాయనేది జగన్ రెడ్డి డైలాగ్. తండ్రి అధికారం చేపట్టినప్పుడు చేసిన హత్యలపై సీబీఐ విచారణతో తన కెరీర్ స్టార్ట్ చేసిన జగన్ రెడ్డి, తన స్థాయికి తగ్గట్టు ఏనాడూ రాష్ట్ర దర్యాప్తు సంస్థల కేసుల్లో లేడు. అన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులే. క్విడ్ ప్రోకోతో 42 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ కేసులో జగన్ రెడ్డి ఏ1గా సీబీఐ, ఈడీ, ఫెమా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలే. అధికారంలోకి వచ్చాక కూడా తన స్థాయిని ఎక్కడా తగ్గించడంలేదు. పీపీఏల రద్దుతో అంతర్జాతీయ సంస్థలతో వివాదాలతో ప్రపంచస్థాయికి చేరింది ఘనత. బాంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుబడడంతో డీఆర్ఐ(డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటిలిజెన్స్) నమోదు చేసిన కేసులో ఏపీకి చెందిన వ్యక్తే కింగ్ పిన్. ట్రమడాల్ టాబ్లెట్స్ కేసూ వైసీపీ నేతదే. హవాలా మనీ తరలింపు కేసు వైసీపీ నేతలదే. అటు రుషికొండ, ఇటు మడ అడవులు, చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులలో పర్యావరణ నిబందనల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చీవాట్లు, జరిమానాలు ఎదుర్కొంటోంది ఏపీ సర్కారు. మరికొన్ని కేంద్రసంస్థలు కాగ్ వంటివి ఏపీ ఆర్థిక, అప్పుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నివేదికలు ఇచ్చాయి. అంతా నా ఇష్టం, చట్టం నా చుట్టం అంటూ నియంతలా జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీని కేంద్రసంస్థల ముందు దోషిగా నిలబెడుతోంది.
లోకేష్‌పైనే వైసీపీ ఫోకస్..ఏం మాట్లాడినా టార్గెట్
యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్‌పై వైసీపీ ఫోకస్ చేసింది. పాదయాత్ర ఇప్పటికే వందరోజులు పూర్తిచేసుకుని జనానికి చేరువైన దశలో ఏదో ఒక విధంగా లోకేష్‌ని బద్నాం చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకూ వైసీపీ, పేటీఎం గ్యాంగుల ఎత్తుగడలన్నీ జనాభిమానంతో చిత్తయ్యాయి. అందుకే లోకేష్ ప్రసంగాలని అబ్జర్వ్ చేస్తూ, అందులో మాటలని ఎడిట్ చేసి తప్పుగా మాట్లాడినట్టు మార్ఫింగ్ చేసి వదలడం మొదలుపెట్టారు. లోకేష్ కూడా ఎక్కడా తగ్గడంలేదు. దళితులకు ఏం పీకావ్ జగన్ రెడ్డి అని లోకేష్ వాడిన డైలాగ్‌ని ...``దళితులు ఏం పీకారు`` అని మార్చేసిన వైసీపీ ముఠాలు తాము ఎంతకైనా తెగిస్తామని సంకేతాలిచ్చాయి. తన వాడివేడి ప్రసంగాలు కొనసాగిస్తూనే, ఇటువంటి మార్ఫింగ్ మారీచ చేష్టలపైనా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల వరకూ అమ్మ తండ్రి ఎన్టీఆర్ నే తాతయ్య అని ప్రతీ సభలో లోకేష్ ప్రస్తావిస్తారని, నాన్న తండ్రి ఖర్జూరనాయుడు పేరే తలవరని చాలా రోజులు తమ పేటీఎం బ్యాచులతో ప్రచారం చేశారు. లేటెస్ట్‌గా నంద్యాల పరిధిలో రైతులతో జరిగిన సమావేశంలో తన తాత ఖర్జూరనాయుడు చదువుకోకపోయినా, నేచురల్ ఫార్మింగ్ చేసేవారని, ఆ తరంలో తమ పంటకి కావాల్సిన విత్తనాలు తామే తయారు చేసుకునేవారనీ, ఎరువులు-పురుగుమందుల జోలికి వెళ్లేవారు కాదని చెప్పుకొచ్చారు. దీనిని పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా కూలీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. మొన్నటివరకూ ఖర్జూరనాయుడు తాత పేరు ఎందుకు తలవవు లోకేష్ అని పోస్టులు పెట్టిన గాడిదపాటి బ్యాచ్, ఇప్పుడు ఖర్జూర తాత గుర్తొచ్చారా లోకేష్ అంటూ పోస్టులు పెడుతున్నారు. వీరి వైఖరి చూస్తే, లోకేష్ ఏం మాట్లాడినా...దానిని విమర్శిస్తూ పోస్టులు వేయాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్టు మాత్రం అర్థం అవుతోంది