చంద్రబాబు మొదటిసారి, తన పుట్టిన రోజు నాడు, ముఖ్యామంటి హోదాలో, ధర్మ పోరాట దీక్ష చేసిన సందర్భంలో, పవన్ కళ్యాణ్ చేసిన డైవర్షన్ గుర్తుందా ? సరిగ్గా చంద్రబాబు ఉదయం 7 గంటలకు దీక్ష మొదలు పెడతారు అనగా, పవన్ అర్ధరాత్రి నుంచి మ్యూజిక్ మొదలు పెట్టాడు. శ్రీరెడ్డి అనే ఆమె, తన అమ్మని ఎదో అందని, నాలుగు రోజుల తరువాత వచ్చి, దానికి కారణం చంద్రబాబు అని మొదలు పెట్టాడు. అప్పట్లో చంద్రబాబు మొదటి సారి చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు, దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అటెన్షన్ చెడగొట్టి, మోడీ పై చంద్రబాబు చేసే విమర్శలు ఎక్కువగా మీడియాలో రాకుండా చెయ్యటానికి, అమిత్ షా వదిలిన బాణం. కాని, ఆ రోజు, పవన్ వ్యాఖ్యలు ఎవరూ ఎక్కువ గుర్తింపు ఇవ్వలేదు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు దీక్షకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

pkj 19072018 2

అయితే, ఇప్పుడు కూడా ఇదే డైవర్షన్ ఐడియా ప్లాన్ చేసారు అమిత్ షా. రేపు అవిశ్వాస తీర్మానం పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సభ సాక్షిగా, మోడీ చేసిన మోసం దేశానికి చెప్పటానికి తెలుగుదేశం రెడీ అవుతుంది. మరో పక్క, మోడీ కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. అన్నీ ఇచ్చేసాం, ఇంకా ఇస్తాం, చంద్రబాబు ద్రోహం చేసారు అంటూ నాలుగు సెంటిమెంట్ డైలాగ్ లు చెప్పి ఆంధ్రప్రదేశ్ విషయం ముగిస్తారు. అప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో మరోసారి, మోడీ, అమిత్ షా పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. మోడీ పై పోరాటం చేస్తున్న క్రెడిట్ అంతా తెలుగుదేశం పార్టీకి వస్తుంది. అందుకే, ఈ విషయం పై డైవర్ట్ చేయాలని, మళ్ళీ పవన్ కళ్యాణ్ ని దింపుతుంది బీజేపీ...

pkj 19072018 3

అవిశ్వాస తీర్మానం మీద ఫోకస్ డైవర్ట్ చేయడానికి, 21 లేదా 22 తారీఖుల్లో దైవదర్శనం ముసుగులో అమరావతిలోని పద్మనాభస్వామి ఆలయానికి వచ్చి, ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా రాజధాని పొలాల్లో మెరుపు ధర్నా చేసి, అక్కడ హడావిడి చేసి, అవిశ్వాస తీర్మానం పై, బీజేపీ పై వచ్చే వ్యతిరేకత డైవర్ట్ చేసే ప్లాన్ చేస్తున్నాడు పవన్. ఇప్పటికే విజయసాయి రెడ్డి, ముఖ్యమంత్రిగారిని పరుషపదజాలంతో తూలనాడి తెదేపా శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు. అన్నిటి పరమార్ధం ఒక్కటే. అవిశ్వాస తీర్మానం చర్చలో బీజేపీతో పాటు, బీజేపీ అంట కాగే పవన్, జగన్ లు కలిసి రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని పార్లమెంటులో బయటపెట్టబోతున్నారనే భయమే ఈ డైవర్షన్ టాక్టిక్స్ లక్ష్యం.

దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. లేఖతో పాటు విభజన చట్టం అమలుకు సంబంధించిన బుక్‌లెట్‌ను పంపారు. 2014 ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ఏపీని భాజపా మోసం చేసిందన్న ఆయన.. తిరుపతి, నెల్లూరు సభల్లో హోదాపై ప్రధాని అభ్యర్థిగా మోదీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సీఎం లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని.. విభజన హక్కుల సాధన కోసమే అవిశ్వాసం నోటీసు ఇచ్చామన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకే అవిశ్వాసం నోటీసులిచ్చామని.. అవిశ్వాసానికి అందరూ మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో కోరారు. లేఖతో పాటు, వారి వారి భాషల్లో అర్ధమయ్యేలా, రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై పుస్తకాలు కూడా ఇచ్చారు.

letter 19072018 2

ఇవి లేఖలోని అంశాలు... ఏపీ పునర్నిర్మాణం కోసం చేసిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు, రాజధానిగా అమరావతి నిర్మాణం, కొత్త రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, విద్యాసంస్థల ఏర్పాటు, దుగ్గరాజపట్నం పోర్ట్‌‌, పన్ను ప్రోత్సాహకాలు, హైదరాబాద్‌ నుంచి కొత్త రాజధానికి రైలు, రోడ్డు నిర్మాణాలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల పెంపు, రాష్ట్ర విభజన నాటి పెండింగ్‌ సమస్యలు.. ఇలా 18 అంశాలతో పొందుపర్చిన హామీలను అమలు చేయడంలో ఎలాంటి పురోగతి లేదు. అంతేగాక.. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా.. పునర్నిర్మాణ చట్టంలోని షెడ్యూల్‌-13 ప్రకారం.. 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆరు ఇంకా ప్రారంభ స్థాయిలో కూడా లేవు.

letter 19072018 3

వీటితో పాటు.. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభ వేదికగా ఏపీకి ఇచ్చిన ఆరు హామీలకు అన్ని రాజకీయ పార్టీలు సాక్ష్యంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని హామీ ఇచ్చారు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న భాజపా దీనికి అంగీకరించలేదు. ఏపీకి 10ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఆ తర్వాత కూడా హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ హామీలు ఈ రోజు వరకు నెరవేర్చలేదు. ఎన్నికల ప్రచారం సమయంలో తిరుపతి, నెల్లూరు సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హోదా హామీని కూడా నెరవేర్చలేదు. ఈ కారణాల వల్లే తెదేపా.. కేంద్రంపై అవిశ్వాసం తీసుకొచ్చింది. గత సెషన్‌లోనే అవిశ్వాసం తీసుకొచ్చినప్పటికీ అది చర్చకు రాలేదు. ఈసారి చర్చకు వచ్చింది. శుక్రవారం జరిగే అవిశ్వాస చర్చలో అన్ని పార్టీలు తెదేపాకు మద్దతివ్వాలని కోరుతున్నా..

ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసి, మోడీ ఫ్రంట్ లో చేరిన కెసిఆర్ పార్టీ, అసలు రంగులు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం పై సపోర్ట్ ఇవ్వని టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మరింత ముందుకెళ్ళింది. కేంద్రం నుంచి ఏపీ ప్రత్యేక ప్రోత్సాహకాలు కోరితే తాము వ్యతిరేకిస్తామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష ఉపనేత బి.వినోద్‌కుమార్‌ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది విభజన చట్టంలో లేదని, బీజేపీ చెప్పిన మాటలే చెప్పారు. దేశంలో ఎక్కడా లేనిదానిని కోరడమేంటని ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, హైదరాబాద్‌ పరిశ్రమలు విజయవాడకు తరలివెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

trs 19072018 3

2014లో తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే అంశంపై కేంద్రానికి లేఖ రాశారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కోరారని తెలిపారు. కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ తమను డిమాండ్‌ చేయడం అర్ధరహితమని, అన్నారు. అవిశ్వాసం పై చర్చను తెలంగాణ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటామన్నారు. అయినా అవిశ్వాసం అంశం ఓటింగ్‌కు వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో అవిశ్వాసం కోసం, తెలుగుదేశం పట్టుబడుతుంటే తెరాస యంపీ కవిత ఆంధ్ర ఎంపీలకు మద్దతు ఇచ్చారు. అవిశ్వాసం పై చర్చ జరిగే స్థితి లేదు కాబట్టి ఆరోజున వారు మద్దతు ప్రకటించారు. కానీ అవిశ్వాసం పై చర్చ మొదలు సమయాన తెరాస తన అసలు రంగు బయటపెట్టింది.

trs 19072018 2

కవిత మద్దతు తెలపటంతో, అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా, "చెల్లెలు కవిత గారికి ధన్యవాదాలు అంటూ" ట్వీట్ కూడా చేసారు. మరి ఇప్పుడు తెరాస చేస్తున్న దాని పై, తెలంగాణలో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరో ఆయనకే తెలియాలి. ఇది ఇలా ఉంటే, కెసిఆర్ చేస్తుంది మాత్రం ద్రోహం. సాటి తెలుగు రాష్ట్రం కష్టాల్లో ఉంటే, కలిసి పోరాడతా అని మాట ఇచ్చి, బీజేపీకి ఎదురు తిరుగుతునట్టు ప్రకటించి, ఫెడరల్ ఫ్రంట్ నాటకాలు ఆడి, ఇప్పుడు అమిత్ షా పక్కనే చేరారు. కెసిఆర్ గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విలువ తెలియక పోవచ్చు. కాని, ఎన్నికల సమయంలో, హైదరబాద్ ఓట్ల కోసం, ఆంధ్రా వారు కావలి కదా, అప్పుడు మాట్లాడుకుందాం. కర్ణాటక పరిణామాలు గుర్తుండే ఉంటాయి.

అప్పట్లో వైఎస్ఆర్ అసెంబ్లీ సాక్షిగా, చంద్రబాబుని అన్న మాట..."నీ తల్లి కడుపున ఎందుకు పుట్టావ్" అనేలా చేస్తా అంటూ అసెంబ్లీ సాక్షిగా అన్న మాట ఇది... ఈయన గారి పెద్ద కొడుకు సమానుడు, జగన్ కు సోదర సమానుడు అయిన గాలి జనార్ధన్ రెడ్డి, చంద్రబాబు మీద ఒక ప్రెస్ మీట్, అనరాని మాటలు అన్నారు... రోడ్డు మీద ఉండే మనుషులు కూడా అలాంటి మాట్లడారు.. కాని, చంద్రబాబు వీరి స్థాయికి ఎప్పుడు దిగలేదు... కాలమే సమాధానమే చెప్తుంది అని వదిలేసారు.. నిజంగానే ఇద్దరికీ కాలమే సమాధానం చెప్పింది... డబ్బు, పదవి చూసుకుని ఎగిరిన వారికి, సరైన రీతిలోనే కాలం సామధానం చెప్పింది... ఇప్పుడు కొత్తగా విజయసాయి తయారయ్యాడు... కొన్ని రోజుల క్రితం, చంద్రబాబు తల్లిని తిట్టిన విజయసాయి మాటలు ఇంకా గుర్తుండే ఉంటాయి.

vijaysai 19072018

ఈ రోజు కూడా, నా వెనుక మోడీ ఉన్నాడు అనే ధైర్యంతో,అప్పుడే ఫ్రెష్ గా, మోడీ కాళ్ళ మీద పడి బయటకు వచ్చి ఊగిపోయాడు... ‘చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని...ఆడ, మగ, నపుంసక కాని మరో జీవి అని వ్యాఖ్యానించారు. ఫోర్త్ జెండర్ అంటే ప్రకృతి కార్యంలో కూడా డ్యుయల్ రోల్ ప్లే చేసే వ్యక్తి అని, చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉంటూ ఫోర్త్ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ’ అంటూ చంద్రబాబు స్థాయి వ్యక్తిని అన్నాడు... చంద్రబాబు స్థాయి అనే కాదు, ఏ మనిషిని అయినా, ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా ? ఇదంతా రేపు, అవిశ్వాస తీర్మానం పై, తెలుగుదేశం చేస్తున్న పోరాటం డైవర్ట్ చెయ్యటానికి. ఇక్కడ తెలుగుదేశం నాయకులని రెచ్చగొట్టటానికి.

vijaysai 19072018

హుందాత‌నాన్ని వ‌దిలేసి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే జ‌నాలు అస‌హ్యించుకోవ‌టం ఖాయం. అయినా ఇదేమి రాజకీయం ? ఇదేనా రాజకీయ నాయకులు మాట్లాడే భాష ? చంద్రబాబు తల్లి దండ్రుల గురించి, పుట్టుక గురించి మాట్లాడే నీచ సంస్కృతికి ఇలాంటి వాడు దిగజారాడు అంటే, ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యంగా రెచ్చిపోతున్న లోటస్ పాండ్ పైడ్ బ్యాచ్, కూడా ఇలాగే మాట్లాడుతుంది కదా ? ఒక ఆర్ధక నేరగాడు, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో A2, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఈ మిడిసిపాటు చూసి, వైఎస్ఆర్, గాలి జనార్ధన్ రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు...

Advertisements

Latest Articles

Most Read