వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పటికే పవన్, జగన, బీజేపీతో కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారని, అందరూ నమ్ముతున్నారు. అమిత్ షా ఏది చెప్తే అది వీరిద్దరూ చేస్తున్నారని, ఢిల్లీ స్క్రిప్ట్ ప్రకారం వీరు నడుస్తున్నారని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. జగన్ తన కేసుల కోసం, పవన్ కళ్యాణ్ కొన్ని వ్యక్తిగత కారణాలతో అమిత్ షాకి లొంగిపోయారు, ఢిల్లీ పై పోరాటం చేస్తున్న చంద్రబాబుని బలహీనపరిచే కార్యక్రమం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి, రాష్ట్రం అంతా, మోడీ చేసిన మోసం పై రగిలిపోతుంటే, అందరూ కలిసి ఉద్యమిస్తుంటే, జగన, పవన్ మాత్రం, కలుగుల్లో దాక్కున్నారు. మోడీ అనే పేరు ఎత్తే ధైర్యం చెయ్యకుండా, మోడీ పై పోరాటం చేస్తున్న చంద్రబాబుని టార్గెట్ చేసారు.

jagan 19072018 2

అయితే ఇప్పుడు ఈ అపవాదు చేరుపుకునే అవకాశం ఇద్దరికీ వచ్చింది. మోదీ సర్కారు నాలుగేళ్ల పాలన తర్వాత తొలి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా, ఇతర హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకు మోదీ ప్రభుత్వంపై టీడీపీ గత బడ్జెట్‌ సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మరోసారి నోటీసు ఇచ్చింది. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సోమవారం సభ ప్రారంభమైన రోజే అవిశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చర్చ జరుగుతుందని చెప్పారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, దేశంలో అన్ని పార్టీలకు మనకు జరిగిన ద్రోహం చెప్పి, మనకు మద్దతు ఇవ్వమని కోరింది. ఇప్పుడు జగన, పవన్ కూడా, మోడీకి వ్యతిరేకంగా, అవిశ్వాసం పై స్పందించే టైం వచ్చింది.

jagan 19072018 3

ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. ఇప్పటికే వైసీపీ ఎంపీలు పార్లమెంట్ దగ్గర డ్రామాలు ఆడుతున్నారు. సభ లోపల పోరాడకుండా, రాజీనామా చేసి సభ బయట హడావిడి చేస్తున్నారు. దీని వల్ల ఏమి ఉపయోగం ఉండదు. వీరు కూడా అన్ని పార్టీలను ఢిల్లీలో కలవాలి. మోడీ పై వ్యతిరేకంగా ఓటు వెయ్యమని చెప్పాలి. మోడీ చేసిన మోసాన్ని అన్ని పార్టీలకు చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా, అప్పట్లో నేను ఢిల్లీలో కూర్చుని అందరి మద్దతు కూడగడతా అన్నారు. ఇప్పుడు పవన్ కూడా, మోడీ పై విశ్వాసం లేదు, వ్యతిరేకంగా ఓటు వెయ్యండి అని, అన్ని పార్టీలను కోరాలి. అవసరం అయితే చంద్రబాబు పై కూడా అందరికీ చెప్పుకోండి, కాని మోడీకి వ్యతిరేకంగా ఓటు వెయ్యమని చెప్పండి. జగన్, పవన్, ఇంతకంటే మంచి అవకాశం రాదు.ఈ పని చెయ్యండి. ఆంధ్ర రాష్ట్రం మీకు అండగా ఉంటుంది. మరి మీ ఇద్దరికీ ఆ దమ్ము ఉందా ? ఊరికే వచ్చి, ఇక్కడ హడావిడి చెయ్యటమేనా ?

దేశానికి, మన రాష్ట్రానికి చేసిన ద్రోహం గురించి తెలిపే, ఒక మంచి అవకాశం వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి, వివిధ పార్టీల సమక్షంలో అశాస్త్రీయ విభజన చేసి, మన గొంతు కోసిన చోటే నిలబడి, నాలుగేళ్ళు అయినా, మాకు న్యాయం జరగలేదు, మీరందరే అప్పటి ద్రోహానికి సాక్షి, ఇవాళ మళ్ళీ మోసం చేశారు , మాకు న్యాయం చెయ్యండి అని, అదే పార్టీల మధ్య, పార్లమెంట్ లో, నిలదేసే సమయం వచ్చింది. రేపు అవిశ్వాసం సందర్భంగా, మన రాష్ట్ర సమస్యలు చెప్పి, న్యాయం జరపమని, ఇచ్చిన హామీలు నేరవేర్చమని, ఈ దేశాన్ని కోరే రోజు. అయితే, ఇంతటి కీలకమైన సమావేశంలో, ఎవరు మాట్లడాలి అనే దాని పై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర కసరత్తు చేసారు. వైసిపీ ఎంపీలు లేకపోవటంతో, ఇప్పుడు బాధ్యత అంతా తెలుగుదేశం ఎంపీల పై పడింది. 5 కోట్ల మంది తరుపున, వారే ఇప్పుడు ఈ దేశానికి, మనకు జరిగిన అన్యాయం చెప్పాలి. అందుకే మంచి స్పీకర్స్ ని చంద్రబాబు ఎంపిక చేసారు.

parliament 19072018 2

అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు సిద్ధం కావాలని ఎంపీలు గల్లాజయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేశినేని నాని తీర్మానం ఇచ్చారు కాబట్టి, ఆయనే చర్చ మొదలు పెట్టాలి, తరువాత మనకు ఇచ్చిన టైంలో, సమర్ధవంతంగా చెప్పటానికి, గల్లాజయదేవ్‌, రామ్మోహన్‌నాయుడును కూడా చంద్రబాబు సిద్ధం అవ్వమని చెప్పారు. గల్లా ఇంగ్లీష్ లో, రామ్మోహన్‌నాయుడు హిందీలో మాట్లాడే అవకాశం ఉంది. గురువారం ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను టీడీపీనే ప్రారంభించాలని తెలిపారు. చర్చ ముగింపు కూడా టీడీపీతోనే జరగాలని ఎంపీలకు సీఎం సూచనలు చేశారు. విభజన చట్టంలో ఉన్న 19 అంశాలపై విస్తృతంగా చర్చించాలని, మద్దతిచ్చే అన్ని పార్టీల నేతలతో మాట్లాడాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

parliament 19072018 3

ముగింపు ఉపన్యాసం హిందీలో ఇస్తే దేశం మొత్తానికి విషయం అర్థం అవుతుందని, రామ్మోహన్‌ నాయుడుకు హిందీలో ప్రావీణ్యం ఉన్నందువల్ల ఆయనకు ఆ అవకాశం ఇస్తే బాగుంటుందని ఒక అధికారి సూచించారు. సభలో టీడీపీకి ఎంత సమయం కేటాయిస్తారన్న దానిపైనా చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ కాబట్టి ఎక్కువ సమయమే ఇచ్చే అవకాశముందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలు అవిశ్వాస తీర్మానం సందర్భంగా జాతీయ అంశాలు, ఇతర రాష్ట్రాల అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందని ఒక మంత్రి పేర్కొన్నారు. ఆ పరిస్థితి సహజంగానే ఉంటుందని, అన్ని పార్టీల నేతలను ముందుగా కలిసి మాట్లాడి ఏపీకి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తావించాలని కోరాలని ఎంపీలకు సూచించారు.

గత బడ్జెట్‌ సమావేశాలలో, ఒక్క రోజు కూడా లోక్‌సభ సమావేశాలు జరగలేదు. అవిశ్వాసం పై చర్చకు తెలుగుదేశం పార్టీ పట్టుబట్టటంతో ప్రతి రోజు, సమావేశం వాయిదా వేసుకుని వెళ్ళిపోయే వారు. దీనికి తెరాస, అన్నాడీయంకే సభ్యుల గొడవ సాకుగా చూపించారు. దీంతో అవిశ్వాసం పై మోడీ వెనుకడుగు వేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. అయితే, పోయిన సారి అవిశ్వాసం పై చర్చకు ఒప్పుకోని మోడీ, ఈ సారి మాత్రం, మొదటి రోజే, అవిశ్వాసానికి సై అంటున్నారు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రతి సారి అవిశ్వాసం పై చర్చ చేపట్టకపోతే, ఇక మోడీ అనే వాడు పిరికిపందగా చరిత్రలో మిగిలిపోతాడు. ముందస్తు ఎన్నికల నేపధ్యంలో, ఈ సమావేశాలు చివరివి అయ్యే అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వం చాలా బిల్లులు ఆమోదించుకోవాలి. ఇది ఒక కారణం అయితే, రెండో కారణం, ఈ సారి గొడవ చెయ్యకపోవటానికి ఏ పార్టీ దొరక్కపోవటం.

bjp 19072018 2

గత బడ్జెట్‌ సమావేశాల్లో ఏఐఏడీఎంకె, తెరాస లాంటి పార్టీలతో గొడవ చేపించారు. ఈ సారి గొడవ చేసే అవకాశం లేదు. ఇటీవల కావేరి బోర్డు ఏర్పాటుతో ఏఐఏడీఎంకె సమస్య తీరిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరే పార్టీ కూడా వెల్‌లోకి వచ్చి ఆందోళనచేసి అధికార పార్టీతో అంటకాగుతోందన్న అపవాదును వేసుకోవడానికి తెరాస సిద్ధంగా లేదు. దీంతో అవిశ్వాసాన్ని అడ్డుకోవడానికి భాజపా చేతుల్లో అస్త్రం లేకుండాపోయింది. ఇక మరోకటి, సభలో మెజారిటీ. మొన్నటి దాక బీజేపీకి బొటా బోటీ మెజారిటీ ఉంది. దీంతో అద్వానీ వర్గంలోని 4-5 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ సారి వైసీపీ ఎంపీలు రాజీనామా చెయ్యటంతో, హాఫ్ వే మెజారిటీ మార్క్ మరింత తగ్గటంతో, బీజేపీ ఇప్పుడు సంపూర్ణ మెజారిటీతో ఉంది, ఒకరిద్దరు వ్యతిరేకంగా ఓటు వేసినా, వారికి నష్టం ఉండదు. పైగా మొన్నటి దాక ఎదురు తిరిగిన శివసేన, ఇపుడు లైన్ లో కి వచ్చింది. అందుకే, అన్నీ చూసుకుని, ఇప్పుడు మోడీ సై అంటున్నారు.

bjp 19072018 3

అవిశ్వాసంపై చివరగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించే అవకాశం ఉందని భాజపా నాయకులు పేర్కొంటున్నారు. దేశంలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అదే కాబట్టి మోదీ గురి అంతా కాంగ్రెస్‌పైనే ఉంటుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ఆయన విమర్శల జోలికి వెళ్లకుండా... ఆ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాం, చట్టంలో చెప్పినవన్నీ చేస్తామని మాత్రమే చెప్పే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. తెలుగుదేశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించకుండా చేయడానికి మోదీ ఈ అంశంపై తక్కువగా మాట్లాడొచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి భాజపాకు ఇద్దరు సభ్యులున్నప్పటికీ అందులో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇస్తారని పేర్కొంటున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎంతో ముఖ్యమైనది. చెప్పాలంటే, అధికార పక్షం కంటే, ప్రతిపక్షమే, ప్రజలకు మేలు చేస్తుంది. ప్రజల తరుపన నిలబడుతుంది, పోరాడుతుంది, ప్రభుత్వాలను సరిగ్గా పని చేసేలా చేస్తుంది. చట్ట సభల్లో, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపి, అనేక చర్చల్లో పాల్గుని, ప్రజల సమస్యలు ప్రభుత్వాలకి చెప్పి, ప్రజల తరుపున పోరాడుతుంది. ఎన్ని రాజకీయాలు చేసినా, ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం అంటే ఇలాగే ఉంటుంది. కాని, మన కొత్త రాష్ట్రం చేసుకున్న దురదృష్టం, మన ప్రతిపక్షం మాత్రం, అసెంబ్లీకి వెళ్ళరు.. పార్లమెంట్ కు వెళ్ళరు... రోడ్ల మీద ముద్దులు పెడుతూ, ప్రజల నెత్తిన టోపీ పెడతారు... అసెంబ్లీకి, పార్లమెంట్ కు వెళ్లకపోయినా, ప్రతి శుక్రవారం కోర్ట్ మెట్లు మాత్రం ఎక్కుతారు.

jagan 1907201 2

మన రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ, అసెంబ్లీ సమావేశాలకు వచ్చి, సంవత్సరం దాటింది. ఎన్నో సమస్యలు ప్రభుత్వం దృష్టికి రాకుండా పోయాయి. కాపు రిజర్వేషన్, సహా అనేక బిల్లుల పై ప్రతిపక్షం చర్చల్లో పాల్గునలేదు. ఎంత ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నా, ప్రతిపక్షం ఉండి, చర్చల్లో పాల్గుని సూచనలు ఇస్తే ప్రజలకు మేలు ఉంటుంది. చివరకు కీలకమైన బడ్జెట్ సమావేశాలకు కూడా జగన్ అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి రాక పోగా, రోడ్ల పై తిరుగుతూ, రెండు సంవత్సరాల ముందు నుంచే, నేను సియం అయిన తరువాతే మీ సమస్యలు పరిష్కరిస్తా అంటూ, తన దగ్గరకు సమస్య అంటూ వచ్చిన ప్రజలకు చెప్తున్నారు.

jagan 1907201 3

ఇక పార్లిమెంట్ తీరు కూడా అంతే. ఎందుకు రాజీనామా చేసారో తెలియదు. అసలు రాజీనామా చేసి ఏమి సాధించారో తెలియదు. రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పై చర్చలో వైసిపీ ఉండి ఉంటే, మరో 15 నిమషాల సేపు, మన రాష్ట్ర సమస్యలు ఈ దేశానికి చాటి చెప్పే అవకాశం ఉండేది. కాని, బీజేపీతో కుమ్మక్కు అయ్యి, వారికి ఇబ్బంది లేకుండా, వారిని విమర్శించే పని లేకుండా, రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారు. ఈ సమయంలో వీరు పార్లమెంట్ లో ఉంటే, మరి కాస్త ఒత్తిడి కేంద్రం పై ఉండేది. ఇది మన ప్రతిపక్షం తీరు. అసెంబ్లీకి వెళ్ళరు.. పార్లమెంట్ కు వెళ్ళరు... కాని ప్రతి శుక్రవారం మాత్రం కోర్ట్ కి వెళ్ళాల్సిందే... ఇదీ మన ప్రతిపక్షం, మన ఖర్మ... రేపు అవిశ్వాసం కూడా శుక్రవారమే..

Advertisements

Latest Articles

Most Read