ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ సిఫారుసు మేరకు, ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, 378 డీఈడీ కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తూ, ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను, రాష్ట్ర హైకోర్టు కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను కొద్ది సేపటి క్రితం జారీ చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 47 డీఈడీ కాలేజీలు సవాల్ చేసాయి. దీని పైన, ఎన్‍సీటీఈ చట్టంలోని సెక్షన్ 17ను అమలు చేయలేదని, కోర్టుకు తెలిపారు. పిటీషనర్ తరుపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణతో పాటు ముతుకుమల్లి శ్రీ విజయ్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు, నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు 378 డీఈడీ కాలేజీలు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని న్యాయవాదులు వాదనలు వినిపించటమే కాకుండా, ఆన్లైన్ లో తమకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కావలని చెప్పి, కేంద్రంలో ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కోరిందని వారు హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఆన్‍లైన్‍లో షోకాజ్ నోటీసులిచ్చి, తమ కాలేజీలకు అనుమతులు రద్దు చేయటం ఏమిటో తమకు అర్ధం కావటం లేదు అంటూ హైకోర్టు దృష్టికి తెచ్చారు.

hc 30032022 2

అసలు రాష్ట్ర ప్రభుత్వం తమకు అధికారాలు లేక పోయినా, పలు నిబంధనలు విధించి, ఈ నిబంధనలు అన్నీ కూడా డీఈడీ కాలేజీలు అమలు చేయలేదని చెప్పి, కేంద్ర ప్రభుత్వానికి వీటి అనుమతి రద్దు చేయాలని, ఎన్‍సీటీఈకి రికమెండ్ చేయటం, చట్ట న్యాయ విరుద్ధం అని కూడా న్యాయవాదులు వాదించారు. అదే విధంగా చట్టంలోని సెక్షన్ 17ను అమలు చేయలేదని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున న్యాయవాదులు, ప్రభుత్వం తరుపున చెప్పే వాదనలు కూడా హైకోర్టు వింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, డీఈడీ కాలేజీలు నిబంధనలు పాటించటం లేదని పేర్కొంది. అందుకే వారి అనుమతులు రద్దు చేయాలని కోరం అంటూ కోర్టుకు తెలిపింది. ఈ నేపధ్యంలోనే ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఢిల్లీలోని ఎన్‍సీటీఈ ఉత్తర్వులను కొట్టేసింది. కేసు విచారణ వాయిదా వేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో మొత్తం దేశంలో ఉన్న 378 డీఈడీ కాలేజీలకు ఉపసమనం కలిగింది అని చెప్పవచ్చు.

2014లో హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, స్థానిక పోలీసులు జగన్ పై కేసు నమోదు చేసారు. దీని పైన ఇప్పటికే నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా, జగన మోహన్ రెడ్డి, తమ ముందు హాజరు కావాలి అంటూ, నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా జగన్ విచారణకు హాజరు కావాలని వారం రోజులు క్రితం నోటీసులు ఇచ్చింది. అయితే నాంపల్లి కోర్టు ఇచ్చిన సమన్లు తమకు అందలేదు అంటూ, జగన్ మోహన్ రెడ్డి విచారణకు ఎగ్గొట్టారు. దీని పై స్పందించిన నాంపల్లి కోర్టు, వెంటనే జగన్ కు సమన్లు ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి రెండు రోజుల క్రిందట సమన్లు అందాయి. అయితే దీని పైన జగన్ మోహన్ రెడ్డి, ఆ సమన్లు అందుకున్న వెంటనే, తెలంగాణా పిటీషన్ కు వెళ్ళారు. తెలంగాణా పిటీషన్ లో, ఈ కేసు పైన క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి, 2014లో తన పైన నమోదు అయిన కేసుని కొట్టి వేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అంటే, దాదాపుగా ఎనిమిది ఏళ్ళ పాటు జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కొట్టేయాలని కోర్టుకు వెళ్ళలేదో తెలియదు.

jagan 30032022 2

దాదాపుగా ఎనిమిది ఏళ్ళ తరువాత, జగన్ తన కేసు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లారు. జగన్ వేసిన పిటీషన్ పై, తెలంగాణా హైకోర్టు వెంటనే విచారణ చేసింది. నిన్న హుజూర్ నగర్ పోలీసులకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. అలాగే జగన్ మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసిన అంశం పై కూడా విచారణ చేసింది. ఈ కేసు నుండి, తొలగించాలని జగన్ పిటీషన్ లో అభ్యర్దించటంతో, హుజూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు ఇస్తూ, ఏప్రిల్ 20 లోపు ఈ అంశం పై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని, ఆధారాలు అన్నీ కూడా కోర్టు ముందు ఉంచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు కూడా జగన్ మోహన్ రెడ్డి, ఏప్రిల్ 26 వరకు కూడా కోర్టుకు రావాల్సిన అవసరం లేదు అంటూ, తెలంగాణా హైకోర్టు స్టే ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి తమ ముందు హాజరు కావాలి అంటూ, నాంపల్లి కోర్టు, రెండో సారి కూడా సమన్లు జారీ చేయటంతో, జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అందరినీ స్టేలు అని ఎగతాళి చేసే జగన్, స్టే తెచ్చుకుని, కోర్టు హాజరు తప్పించుకున్నారు.

ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, జగన్ మోహన్ రెడ్డి పార్టీలో తన పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన వారిని వదిలి పెట్టేది లేదని పట్టుదలగా ఉన్నారు. ఏదో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయటం కాదు, వారిని వెంటాడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్న వారికి పది రోజుల క్రిందట ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి వాయించి పడేసారు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో, తన పై నిరాదర ఆరోపణలు చేసిన వారి పై పరువు నష్టం దావా వేస్తున్నట్టు చెప్పారు. అయితే ఆయన అధికారి కావటంతో, పరువు నష్టం దావా వేయాలి అంటే, ప్రభుత్వ అనుమతి తప్పనిసరి, అందుకే దీని పై వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఈ విషయం పైన, పరువు నష్టం దావా వేయటానికి, తనకు అనుమతి కావాలి అంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. మరి అక్కడ నుంచి ఏ అనుమతి వచ్చిందో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన సాధారణ పరిపాలనశా ఖకు లేఖ, ఇదే అంశం పై లేఖ రాసారు. తనను మీడియాలో అప్రతిష్ట పాలు చేసి, తన పరువుకు భంగం కలిగించి, తన పై వ్యాఖ్యలు చేసి తనను రాజకీయంగా వాడుకుని, లబ్ది పొందతున్న వారి పైన తాను పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పారు.

kodalinani 30032022 2

మొత్తం ఐదుగురిపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం తీసుకున్నానని, పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి కావాలని కోరుతూ సాధారణ పరిపాలనా శాఖకు లేఖ రాసారు. తన పైన తప్పుడు ఆరోపణలు చేసారని, ఆ లిస్టు లో ఉన్న వారి పేర్లు చెప్పారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పరువు నష్టం దావా వేయాలని దానికి అనుమతి కోవాలని కోరుతూ లేఖ రాసారు. అలాగే సాక్షి పత్రిక, సాక్షి టీవీపైన కూడా పరువునష్టం దావా వేయాలని, దానికి కూడా అనుమతి కోరుతూ లేఖలో తెలిపారు. అలాగే సీఎం సీపీఆర్వో శ్రీహరిపై కూడా పరువు నష్టం దావా వేయాలని, అతను తన సస్పెన్షన్‍పై మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని, మీడియాకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేష లో తప్పుడు ఆరోపణలు చేసారని, అయితే శ్రీహరి ప్రచారం చేసిన విషయాలు మాత్రం, తన సస్పెన్షన్ జీవోలో ఎక్కడా లేవని ఏబీవీ తెలిపారు. మీడియా కథనాలు తన కుటుంబ సభ్యులకు బాధ కలిగించాయని, వీరి పైన పరువు నష్టం దావాకు అనుమతి కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఎలాగూ అనుమతి ఇవ్వదు కాబట్టి ఆయన ఏమి చేస్తాడో చూడాలి మరి.

జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఛానల్ ప్రస్తుతం స్టే మీద నడుస్తున్న విషయం తెలిసిందే. సాక్షి ఛానల్ ని మూసేయాలని కేంద్రం ఎప్పుడో ఆదేసించినా, జగన్ మోహన్ రెడ్డి స్టే తెచ్చుకుని సాక్షి టీవీ నడుపుతున్నారు. ఇప్పటికే సాక్షి పుట్టుక పైనే సిబిఐ కేసులు, అవినీతి కేసులు, దొంగ పెట్టుబడులు తెచ్చారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని అస్తలు సిబిఐ, ఈదీ అటాచ్ చేసాయి కూడా. అయితే ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉండగానే, అసలు సాక్షి టీవీ అనే దానికి అనుమతులే లేవని రద్దు చేసేస్తున్నాం అంటూ కేంద్రం సంచలన ఆదేశాలు ఇచ్చింది. దీంతో హుటాహుటిన జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లి, స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం సాక్షి స్టే మీద నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇదే విషయం పై కేంద్రం మరో సంచలన ప్రకటన చేసింది. అసలు సాక్షి టీవీ ఛానెల్ అనుమతిని రద్దు చేసింది నిజమా కాదా ? లేకపోతే వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తుందా అనే విషయం తేల్చుకోవటానికి, కేంద్రాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద ఒక వ్యక్తి, కేంద్ర సమాచార ప్రసార శాఖను ఒక ప్రశ్న అడిగారు. జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఛానల్ రద్దు చేసిన మాట వాస్తవమేనా ? అంటూ కేంద్ర సమాచార శాఖను, సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ప్రశ్న అడగటంతో వారు సమాధానం ఇచ్చారు.

sakshi 30032022 2

కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన అండర్‌ సెక్రటరీ విజయ్‌ కౌశిక్‌ ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సాక్షి టీవీ అనుమతులు రద్దు చేసిన మాట నిజమే అని ఆయన తెలిపారు. దానికి సంబంధించి, తమ శాఖకు చెందిన అండర్‌ సెక్రటరీ సోనియా ఖట్టర్‌ జారీచేసిన ఉత్తర్వు ప్రతిని కూడా ఆయన పంపించారు. సాక్షి టీవీ పేరుతో వార్త ఛానల్ ప్రసారాల కోసం, ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌కు 2006 జూలై 7న, పదేళ్ళ పాటు తాము అనుమతి ఇచ్చామని చెప్పారు. అయితే పదేళ్ళ తరువాత మాత్రం, ఆ అనుమతులు పొడిగించలేదని అన్నారు. సాక్షి ఛానల్ పై పలు అభ్యంతరాలు ఉండటంతో, భద్రతాపరమైన అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర హోం శాఖ ఒప్పుకోలేదని తెలిపారు. మీ ఛానల్ ను ఎందుకు తొలగించకూడదో చెప్పాలని సాక్షిని కోరగా వారు సమాధానం ఇచ్చారని, అయితే ఆ వివరణ తమకు సంతృప్తి ఇవ్వలేదని, అందుకే రద్దు చేసి పడేసాం అని చెప్పారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి, సాక్షి రద్దు పై స్టే తెచ్చుకుని నడిపిస్తున్నారు. మరి హైకోర్టు ఎప్పటి వరకు స్టే ఇస్తుందో చూడాలి మరి.

Advertisements

Latest Articles

Most Read