ప్రయాణికులకు అతి తక్కువ ధరల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందజేయాలన్న లక్ష్యంతో రూపొందిన ‘రైల్‌ నీర్‌’ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అడుగు ముందుకుపడింది. విజయవాడ దగ్గరలోని మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో ‘ రైల్‌నీర్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌’ ఏర్పాటు చేయటానికి ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) శ్రీకారం చుట్టింది. మల్లవల్లిలో ప్లాంట్‌ కోసం 1.04 ఎకరాల భూమిని ఏపీఐఐసీ నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఎకరం రూ. 16.50 లక్షల ధరకు అవుట్‌రేట్‌ సేల్‌ కింద కొనుగోలు చేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. భూమి కేటాయింపుపై ఇప్పటికే ఏపీఐఐసీ నుంచి ఐఆర్‌సీటీసీకి మౌఖికంగా అనుమతి లభించింది. అధికారికంగా ఐఆర్‌సీటీసీకి, ఏపీఐఐసీ భూమిని కేటాయించాల్సి ఉంది.

rail neer 14072018 2

స్వాధీనంచేసే భూమిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఏపీఐఐసీ ఆసక్తి చూపింది. ఏపీఐఐసీ ఇంకా భూమిని తమకు కేటాయించకపోవటంతో బుధవారం ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో తమకు ప్రతిపాదించిన భూమిని పరిశీలించారు. ఆ తర్వాత ఏపీఐఐసీ అధికారులను ఎప్పటికి భూమిని స్వాధీనం చేస్తారని అడిగారు. అలాట్‌మెంట్‌ చేసిన తర్వాత సేల్‌ డీడ్‌ రాసుకున్నాక భూమిని స్వాధీనం చేస్తామని, దీనికి నెల రోజుల సమయం పట్టవచ్చని ఐఆర్‌సీటీసీ ప్రతినిధులకు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. తాము త్వరగా ‘రైల్‌ నీర్‌’ బాట్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయదలిచామని, సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్థలం స్వాధీనంతోనే ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తామని ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు ఏపీఐఐసీ దృష్టికి తీసుకు వచ్చారు.

rail neer 14072018 3

సరిగ్గా 2012-13 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రైల్‌ నీర్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేటాయింపులు చేయటం జరిగింది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్‌ తర్వాత కీలకమైన విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ నీర్‌ ’ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం కేటాయింపులు చే సింది. విజయవాడలో పుష్కలంగా నీటి లభ్యత ఉందని, కృష్ణానది చెంతనే ఉండటం వల్ల నీటికి సమస్య ఉండదని గుర్తించిన కేంద్రం ఈ ప్రాజెక్టును ఏరికోరి మరీ అప్పట్లో విజయవాడ డివిజన్‌కు కేటాయించింది. అప్పట్లో రూ.10 కోట్ల వ్యయంతో ‘రైల్‌ నీర్‌ ’ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. కానీ, కార్యరూపం దాల్చటంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంది.

ఇది కార్పొరేట్ ప్రీ స్కూల్ అనుకునేరు. కానే కాదు. దానిని తలదన్నే రీతిలో రూపుదిద్దుకున్న అంగన్ వాడీ కేంద్రం. నమ్మలేకపోతున్నారా? నమ్మి తీరాల్సిందే. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అత్యాధునిక అంగన్ వాడీ కేంద్రం. కృష్ణా జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో దీనిని తీర్చిదిద్దింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ కేంద్రాలను దశల వారీగా 'మోడల్ అంగన్ వాడీ సెంటర్స్'గా తీర్చిదిదటానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీకాంతం కొద్దికాలం క్రితం ప్రకటించారు. స్వీకారం కార్యక్రమంలో భాగంగా హాస్టల్స్, పాఠశాలలు, ఆసుపత్రులను దాతల సహాయ సహకారాలతో ఆధునికీకరిస్తున్న కలెక్టర్ అంగన్ వాడీ కేంద్రాలను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని భావించారు.

pre school 14072018 2

కృష్ణా జిల్లా వ్యాప్తంగా మోడల్ అంగన్ వాడీ స్కూళ్ళ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించారు. ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు. ముందుగా ఒక స్కూల్ను మోడల్గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దానిని ఆత్కూరు గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. భవనం లోపల చక్కటి ఫ్లోరింగ్, సీలింగ్, వాల్కేరింగ్ సదుపాయాలు కల్పించారు. అంగన్ వాడీ పిల్లలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే విధంగా తీర్చిదిద్దారు. పై ఫ్లోర్, గోడల నిండా విద్యాసంబంధ చిత్రాలు, ప్రహరీ లోపల, బయట సామాజిక స్పృహను పెంపొదించే ఛాయా చిత్రాలు ఉన్నాయి.

pre school 14072018 3

పిల్లల కోసం చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్డి కూడా సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. పిల్లలు ఆడుకోవటానికి ఆటపరికరాలను ఏర్పాటు చేశారు. కింద టైల్స్ పరిచారు. చుట్టూ చక్కని గార్డెనింగ్తో చూడచక్కటి వాతావరణాన్ని రూపొందించారు. ఇవన్నీ పేద పిల్లల కోసం. మనం, మన పిల్లలను పమించే కార్పొరేట్ ప్రీ స్కూల్స్ కూడా ఇంత అందంగా, సౌకర్యవంతంగా, హంగులతో ఉండదు అంటే ఆశ్చర్యం కాదు. ఇప్పుడు ఈ మోడల్, రాష్ట్రమంతటా ఏర్పాటు చేయ్యనుంది ప్రభుత్వం. త్వరలోనే అన్ని అంగన్ వాడీ కేంద్రాలు ఇలా మారనున్నాయి.

లంచం అడిగితే ఫోన్ చేయమంటూ ఎమ్మెల్యే యరపతినేని ప్రజలకిచ్చిన పిలుపునకు స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను ఆయనే స్వయంగా స్వీకరిస్తున్నారు. మాముళ్లను తిరిగి క్కిస్తున్నారు. పిడుగురాళ్లకు చెందిన ఒక వ్యాపార, దాచేపల్లికి చెందిన ఒక రైతు లంచంగా ఇచ్చిన సొమ్మును ఎమ్మెల్యే తిరిగి ఇప్పించారు. పిడుగురాళ్లకు చెందిన వ్యాపారికి ఓ ఆధికారితో చిన్న పని పడింది. ఆందుకుగాను రూ.లక్ష డిమాండ్ చేయడంతో ముట్టచెప్పాడు. అయినా పని జరగలేదు. బాధితుడు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని ఎమ్మెల్వే యరపతినేని దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారిని పిలిపించి మొత్తం సొమ్మును తిరిగి ఇప్పించారు.

acb 14072018 2

దాచేపల్లికి చెందిన రైతు కూడా ప్రభుత్వ కార్యాలయంలో అనుభవించిన లంచం యాతనను ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఇది జరిగిన అరగంటలో బాధ్యులైన అధికారులు సదరు రైతుకు తీసుకున్న మొత్తం ఇవ్వటంతో పాటు, అరపూటలో పని చేసి పెట్టారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల అమలుకు, వివిధ పనులు చేసేందుకు లంచాలు డిమాండ్ చేస్తున్న వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. సమస్యను ఎమ్మెల్వే దృష్టికే తీసుకెళ్లే అవకాశం ఉండటంతో అవినీతికి ఆలవాటు పడ్డవారు పెట్టేబేడ సరుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఆధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తారు అటువంటి పరిస్థితిల్లో వారే ప్రజలకు సమస్యగా మారుతున్న సందర్బాలు వినపడుతుండటంతో అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు.

acb 140720183

ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు మధ్య దళారులను నిరోధించేందుకు ప్రాధాన్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డైరెక్ట్గా ఎమ్మెల్యే దృష్టికే సమస్యను తీసుకెళ్లే అవకాశం దక్కుతుండటంతో నియోజకవర్గ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, "ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి ఆధిక ప్రాధాన్యం ఇస్తుంది. సబ్సిడీ రుణాలు, గృహరుణాలు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల మేలు కోసం చేపట్టినవే. ఎవరెవరికో లంచాలు ఎందుకివ్వాలి?. వాళ్లకు వచ్చే కొద్దిపాటి ప్రయోజనంలో లంచాలు పప్పు బెల్లాలైతే ప్రజలకు మిగిలేదేముంటుంది?, ఈ విషయంలో ఎంతటి వారినైనా సహించేది లేదు లంచాల కోసం ఎవరైనా పీడిస్తుంటే సెల్ నెంబర్ 97033 55955 కు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నా" అంటూ ఎమ్మల్యే చెప్పారు.

స్వామి పరిపూర్ణానంద.. గత కొన్ని రోజులుగా మీడియాలో వినిపిస్తున్న పేరు. కత్తి మహేష్ మీద పోరాటం చేస్తా అని పిలుపిచ్చి, హైదరాబాద్ పోలీస్ చేత నగర బహిష్కరణకు గురయ్యారు. అయితే, నిన్న హైదరబాద్ వచ్చిన అమిత్ షా, పరిపూర్ణానందకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో స్వామి పరిపూర్ణానందకు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించే అంశంపై అమిత్‌షా సంఘ్ పరివార్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపూర్ణానందను రాజకీయాల్లోకి తీసుకు వస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారు. తమ అభిప్రాయాలు చెప్పాలని సమావేశంలో ఉన్నవారిని అడిగారు. ఇందుకు సమావేశంలోని వారు సానుకూలంగా స్పందించడంతో కరీంనగర్‌ లోక్‌సభ నియోజికవర్గం నుంచి పోటీ చేయమని కోరదామని అన్నారు.

amitshah 14072018 2

పరిపూర్ణానంద అంశంపై సంఘ పరివార్‌ సంస్థలు పోరాటం చేయాలని, రాజకీయ పార్టీగా బీజేపీ తన వంతు పాత్రను పోషిస్తుందని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ విషయమై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని, హిందువులంతా ఏకమై స్వామిజీకి పూర్తి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపు నిచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెనక్కి తగ్గవద్దని ఆదేశించినట్టు సమాచారం. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్ ను శిక్షించకుండా, పరిపూర్ణానందను ఏ విధంగా నగర బహిష్కరణ చేస్తారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

amitshah 14072018 3

అయితే మరో పక్క, కత్తి మహేష్ ను క్షమిస్తున్నానని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి శుక్రవారం అన్నారు. అతను ఓ బోయవానిగా మాట్లాడినా వాల్మీకిగా మారగలడని ఆకాంక్షించారు. ఉన్నత విద్యావంతులు కూడా రామనామం గురించి తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అమిత్ షా, పరిపూర్ణానందకు ఎంపీ సీట్ ఆఫర్ ఇచ్చిన నేపధ్యంలో, కత్తి మహేష్ కూడా ఎదో ఒక ఎంపీ సీట్ ఇస్తే బాగుంటుందని, కొంత మంది వ్యంగ్యంగా సటైర్ వేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read