నిన్న పవన్ కళ్యాణ్ వైజాగ్ లో, తన ఉక్రోషం మొత్తం బయటకు కక్కాడు. పెట్టిన పేరు విభజన హామీల పై కవాతు, కాని ప్రసంగం మొత్తం, ఈ సారి వెరైటీగా లోకేష్ మీద సాగింది. మధ్యలో చంద్రబాబుని తిడుతూ ఉన్నా, ఎందుకో కాని, నిన్నటి స్పీచ్ అంతా లోకేష్ మీదే విమర్శలు సందించాడు పవన్. పోనీ ఆ విమర్శలు ఏమన్నా హుందాగా ఉన్నాయా అంటే, రోడ్డు పక్కన గాలి మంద మాట్లాడుకునే మాటలు లాగా ఉన్నాయి. ప్రతి సారి, పవన్ ఇలాగే మాట్లడతాడు కాని, నిన్న మాత్రం పీక్స్ కు వెళ్ళిపోయాడు. తన ప్రతిభ, తెలివి, రెండు లక్షల పుస్తాకాల జ్ఞానం ఒకేసారి బయటకు తీసాడు. అసలు ఎందుకు మాట్లాతున్నాడో తెలీదు, ఏమి మాట్లాడుతున్నాడో తెలియదు, ఎవర్ని అంటున్నాడో తెలియదు, ఈ కన్ఫ్యూషన్ లో , ఆయన ఫాన్స్ కూడా జుట్టు పీక్కున్నారు.

pk 08072018 2

ముందుగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గురించి చెప్పుకోవాలి. పవన్ కు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు, మంచి అవినాభావ సంబంధం ఉన్నట్టు ఉంది. కొన్ని రోజుల క్రితం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది సంస్థ కాదు, వ్యక్తి అన్నాడు పవన్. దాని పై కొన్ని కౌంటర్ లు వచ్చాయి. అయితే నిన్న పవన్ మాట్లాడుతూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది వ్యక్తి కాదు రా, సంస్థ రా చవటల్లారా, దద్దమ్మల్లారా అంటూ, తిట్టాడు. ఎవర్ని అన్నాడో తెలియదు కాని, చూసే అభిమానులకు మాత్రం, తనని తాను తిట్టుకుంటున్నాడా ఏంటి అని అనుకున్నారు. ఇక ఎప్పుడో చిరంజీవి కూతురు శ్రీజ, ప్రేమించి, ఢిల్లీ వెళ్ళిపోయిన సంగతి చెప్తూ, రాజకీయ నాయకులకు ఆ విషయం లింక్ పెట్టాడు. సోదరుడు కూతురు ప్రేమను కూడా రాజకీయం కోసం వాడుకోవటంతో, పవన్ ఫాన్స్ ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి.

pk 08072018 3

ఇక లోకేష్ సంగతికి వస్తే, లోకేష్ ఢిల్లీకి సైకిల్ యాత్ర చెయ్యాలి అంట, లోకేష్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆపాలి అంట, ఇలా ఒకటి కాదు రెండు కాదు, మరీ చిల్లరతనంగా మాట్లాడాడు. శ్రీకాకుళంలో రైల్వే స్టేషన్ లేదు అన్నాడు. లక్ష ఎకారాలు విశాఖలో కబ్జా అయిపోయాయి అన్నాడు. ఇలా అనేక గుళికలు వదిలాడు. చివరగా నేను గెలవకపోయినా పరవాలేదు, మిమ్మలను గెలిపించను అంటూ ఫైనల్ ట్విస్ట్ ఇచ్చాడు. అయితే నిన్న పవన్ అలా పీక్స్ కు వెళ్లి మాట్లాడటానికి కారణం, రేణు దేశాయ్ ఇంటర్వ్యూ అనే వాదనలు వినిపిస్తున్నాయి. నేను ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాడిని అని చెప్పుకునే పవన్ నిజ స్వరూపాన్ని, నిన్న రేణు దేశాయ్ బట్టబయలు చేసింది. అందులో ఒక 10 సెకండ్లు అయితే, మనోడు ఎంత గొప్ప వాడో అనే విషయం చెప్పింది. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వగా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చింది. దీంతో, తన గుట్టు బయట పడింది అనే ఫ్రస్ట్రేషన్ లో, నిన్న పవన్ కళ్యాణ్ ఆ కోపం అంతా, ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడుతూ, పీక్స్ కు వెళ్ళిపోయారు.

ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు జగన్ ను కలవకపోవటం, మరో పక్క కాంగ్రెస్ కూడా ఆనం రామనారాయణరెడ్డిని ఆహ్వానించటంతో, ఆయన కన్ఫ్యూషన్ లో ఉన్నారు అని అందరూ అనుకున్నారు. కాని, వీటన్నటికీ తెర దించుతూ, ఆనం, జగన్ ను కలిసారు. శుక్రవారం కోర్ట్ కు వెళ్లి తిరిగి వస్తూ, సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ విమానాశ్రయంలో జగన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు సుమారు 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. అయితే ఆనం కోరిక మేరకు ఆత్మకూరు టిక్కెట్టు దక్కుతుందా, లేక మరే నియోజకవర్గానికైనా మారాల్సి వస్తుందా అనే విషయం మాత్రం అస్పష్టంగానే ఉంది. ఆనం మాత్రం ఆత్మకూరు టిక్కెట్టు కోసమే, తెలుగుదేశం పార్టీ వీడుతున్నారు.

aanam 08072018 2

అయితే, ఆయన ఈ రోజు (జూలై 8న ) వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కాని, ఈ రోజు ఆయన చేరలేదు. దీంతో మళ్ళీ పుకార్లు మొదలయ్యాయి. అయితే, జగన్ ఆనం కలిసిన విషయం తెలుసుకున్న నెల్లూరు వైసిపీ నేతలు మాత్రం, జగన్ పై కోపంగా ఉన్నారు. ఆత్మకూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, మేకపాటి కుటుంబం జగన్ పై ఫైర్ అయ్యారు. ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి తానే పోటీ చేస్తున్నానని, ఇందులో ఏ మాత్రం అనుమానం లేదని స్పష్టం చేశారు.

aanam 08072018 3

తొమ్మిదేళ్లు పార్టీకి కష్టపడిన వారిని కాదని నిన్న, మొన్న పార్టీలోకి వచ్చే వారికి టిక్కెట్టు ఇచ్చే సంస్కృతి వైసీపీలో లేదన్నారు. సిద్ధాంతాలు నచ్చి పార్టీకి పనిచేస్తామని వచ్చే వారిని కాదనేది లేదని, అయితే నిబంధనలతో పార్టీలోకి రావాలంటే అంగీకరించే ప్రశ్నే లేదని గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గౌతంరెడ్డి సమ్మతి లేకుండా ఆత్మకూరు టిక్కెట్టు మరొకరికి ఇస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, క్యాడర్ కూడా అంటుంది. జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నచ్చజెప్పితే సాధ్యమవుతుంది కాని, తానే పోటీ చేయబోతున్నట్లు గౌతంరెడ్డి బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో జగన్‌ కూడా ఆయనపై ఒత్తిడి చేసే అవకాశం ఉండదు. ఈ క్రమంలో ఆనం రామనారాయణరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఆత్మకూరు కాకుండా మరో చోట పోటీ చేయడానికి ఆయన సమ్మతిస్తారా.. అనే కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చంద్రన్న రైతు బీమా’ పథకంలో పేర్ల నమోదు కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభమయ్యింది. చంద్రన్న బీమా పథకం తరహాలో రైతులకు కూడా బీమా సదుపాయం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా అధికారులు జిల్లాలోని రైతులకు జీవిత బీమా, వ్యక్తిగత ప్రమాద బీమాను వర్తింప చేసి వారి కుటుంబ సభ్యులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టారు. గత నెల 28వ తేదీన ఏరువాక కార్యక్రమంలో చంద్రన్న రైతు బీమా పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం కింద ఎలాంటి రుసుం వసూలు చేయకుండా పేర్ల నమోదు ప్రక్రియను నిర్వహించనున్నారు.

గ్రామ నమోదు కమిటీల ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో డ్వాక్రా సంఘాల సభ్యులు ముగ్గురు ఉంటారు. వీరు ట్యాబ్‌ల ద్వారా రైతుల నమోదు ప్రక్రియను నిర్వహిస్తారు. చంద్రన్న బీమా పథకంలో నమోదు కాని రైతులు ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇవీ అర్హతలు.. 18 నుంచి 69 ఏళ్లలోపు వయసుండాలి... ఆధార్‌ కార్డులో నమోదైన వయసును పరిగణలోకి తీసుకుంటారు... పట్టాదారు పాసు పుస్తకం ఉండాలి... కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఉండాలి.. రైతు వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు లోపు ఉండాలి.. బీమా నమోదు సమయంలో రైతు పూర్తి ఆరోగ్యవంతుడై ఉండాలి.. స్థానికంగా నివసిస్తూ ఉండాలి..

బీమా ప్రయోజనాలు ఇలా.. ఆధార్‌ కార్డు ప్రకారం వయసును పరిగణనలోకి తీసుకుంటారు... 18 నుంచి 50 ఏళ్లలోపు వారు సహజ మరణం చెందితే రూ.రెండు లక్షలు, 51 నుంచి 59 ఏళ్లలోపు వారు మరణిస్తే రూ.30 వేలు పరిహారంగా అందజేస్తారు... 18 నుంచి 69 ఏళ్లలోపు వారు ప్రమాదంలో మరణిస్తే రూ.అయిదు లక్షలు పరిహారంగా ఇస్తారు.... ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం పొందితే 19 నుంచి 69 ఏళ్లలోపు వారికి రూ.2.50 లక్షలు, పూర్తి అంగవైకల్యం చెందితే 18 నుంచి 69 ఏళ్లలోపు వారికి రూ.అయిదు లక్షలు పరిహారంగా అందజేస్తారు... నమోదు బృందాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్‌తో అనుసంధానమై బ్యాంకు ఖాతా వివరాలు అందజేయాలి. ఈనెల 15వ తేదీలోగా రైతుల నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రత్యేక బృందాల సభ్యులు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు.

ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో, కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అక్టోబర్ నెలలో ఎన్నికలకు వెళ్తున్న మోడీ ప్రభుత్వానికి, ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. అందుకే, ఈ సమావేశంలో అన్ని విషయాల పై, పై చేయి సాధించటానికి, మోడీ, అమిత్ షా ప్లాన్ చేసారు. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో, తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం పై చర్చించే దమ్ము లేక, వాయిదాలు వేసుకుని పారిపోయారు. ఒక్క రోజు కూడా, పార్లమెంట్ సమావేశాలు జరగ లేదు. అయితే, ఈ సారి కూడా మోడీ పై అవిశ్వాస తీర్మానం పెట్టటానికి, తెలుగుదేశం రెడీ అవుతుంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం, ఇలా అన్ని విషయాల పై మోడీ ప్రభుత్వాన్ని కడిగేయటానికి రెడీ అయ్యింది.

modicbn 08072018 2

ఇదే సందర్భంలో, అమిత్ షా , మోడీ కూడా, ఈ విషయంలో డిఫెన్సు లో పడకుండా, ఈ సారి, ఈ చర్చ తీసుకురావటానికి రెడీ అవుతున్నారు. అన్నీ ఇచ్చేసాం అని బయట చెప్పినట్టు, ఇక్కడ చెప్తే కుదరదు. అందుకే, మరోసారి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నంలో, రెండు నెలల్లో చేస్తాం, మూడు నెలల్లో చేస్తాం, కమిటీ వేస్తాం అంటూ చెప్పి, ఇన్నాళ్ళు చేయ్యకపోవటానికి కారణం, చంద్రబాబే అనే రాజకీయ దాడికి ప్లాన్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో, పార్లమెంట్, రాజ్యసభాల్లో తెలుగుదేశం ఎంపీలకు కౌంటర్ ఇచ్చే అవకాసం లేకుండా, ప్లాన్ లు వేసారు. ఇదే సందర్భంలో, తెలుగుదేశం ఎంపీలు, మోడీ ముందుకు వచ్చి నిరసన తెలిపే అవకాసం లేకుండా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఎదో ఒకటి చేసి, ఈ చర్చ ముగించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ..

modicbn 08072018 3

అయితే, ఇవన్నీ గ్రహించిన చంద్రబాబు, దీనికి కౌంటర్ వ్యూహం సిద్ధం చేసారు. కేంద్రం తన వాదనను సమర్ధించుకోవడానికి వన్‌సైడ్‌గా ప్రకటనలుండడం ఖాయం. లోక్‌సభలో తిప్పికొట్టడానికి ఎంపీలకు అవకాశం ఇవ్వరు. బయట కేంద్రం అబద్ధాలు చెబుతోందని ఎంతగా మొత్తుకున్న అవి రాజకీయ ప్రకటనల్లాగానే ఉంటాయి. అందుకే చంద్రబాబు వినూత్నంగా ఆలోచించారు. కేంద్రం పార్లమెంట్‌లో చేసే ప్రకటనలకు అసెంబ్లీ వేదికగా సమాధానాలివ్వాలని భావిస్తున్నారు. అప్పడైతేనే అధికారికంగా సమాధాలిచ్చినట్టు అవుతుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్ జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ సమావేశపర్చటానికి రెడీ అయ్యారు. తెలుగుదేశం, మోడీ చేస్తున్న ద్రోహాన్ని ఇలా ఎదుర్కుంటుంటే, జగన్, పవన్ మాత్రం, చంద్రబాబు నామస్మరణలో మునిగి తేలుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read