మ‌హాత్ముడు న‌డ‌యాడిన గాంధీ కొండ కొత్త రూపును సంత‌రించుకోనుంది. నాడు విజ‌య‌వాడ‌కు శాస్త్ర సాంకేతిక ప‌ర్యాట‌క ప్రాంతంగా విరాజిల్లిన ఈ కొండ కాల‌క్ర‌మంలో ఆధునీక‌ర‌ణ‌కు నోచుకోక‌, గ‌త కొంతకాలంగా ప‌ర్యాట‌క ఆద‌ర‌ణ‌కు దూర‌మైంది. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం అధారిటీ ఈ విష‌యంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. గాంధీ హిల్ పౌండేష‌న్ ఆధీనంలో ఈ కొండ ఉండ‌గా, ప్ర‌భుత్వ ఆకాంక్ష‌ల మేర‌కు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఈ ప‌ర్యాట‌క ప్రాంతాన్ని అభివృధ్ది చేయ‌నున్నారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం అమ‌రావ‌తి ప్రాంత ప‌ర్యాట‌క అభివృద్ధిపై ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోగా, శుక్ర‌వారం జ‌రిగిన ఎపిటిఎ పాల‌క‌మండ‌లి స‌మావేశం కొండ ఆధునీక‌ర‌ణ‌కు రూ.5 కోట్లు వ్య‌యం చేయాల‌ని నిర్ణ‌యించింది. పాల‌క మండ‌లి ఛైర్మ‌న్, ప‌ర్యాట‌క భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో జ‌రిగిన స‌మావేశం ఈ మేర‌కు ప్రాధ‌మికంగా నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మొత్తంతో గాంధీ కొండ రూపురేఖ‌లు మార్చాలని, విజ‌య‌వాడ‌లో భ‌వానీ ద్వీపం మాత్ర‌మే ప‌ర్యాట‌క అవ‌స‌రాల‌ను తీర్చుతున్న‌త‌రుణంలో దీనికి కూడా పూర్తి స్ధాయిలో కొత్త రూపు తీసుకు రావాల‌ని మీనా సూచించారు. భ‌వానీ ఐలండ్ టూరిజం కార్పోరేష‌న్ ఈ ప‌నుల‌కు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను చేప‌ట్ట‌నుండ‌గా, గాంధీ హిల్ పౌండేష‌న్ పెద్ద‌ల‌తో ప‌ర్యాట‌క శాఖ అధికారులు ఇప్ప‌టికే ప‌లు మార్లు భేటీ అయ్యారు. తొలుత రూ.3.15 కోట్ల‌తో ఒక్క న‌క్ష‌త్రశాల‌ను మాత్ర‌మే ఆధునీక‌రించాల‌ని తొలుత భావించినా, పాల‌క మండ‌లి స‌మావేశం నిధుల స‌మ‌స్య రాకుండా చూస్తామ‌ని, అన్నివిభాగాల‌ను ఆధునీక‌రించి ప‌ర్యాట‌క భ‌రితంగా తీర్చి దిద్దాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌ధ్యంలో మీనా మాట్లాడుతూ అక్క‌డి పిల్ల‌ల రైలును తిరిగి న‌డ‌పాల‌ని, అదే క్ర‌మంలో గ్రంధాల‌య భ‌వ‌నానికి మెరుగులు దిద్ది ప్ర‌తి ఒక్క‌రూ వినియోగించుకునేలా చూడాల‌ని అన్నారు. స‌ర్వాంగ సుంద‌రంగా కొండ ప్రాంతం ఉండాల‌ని ల్యాండ్ స్కేపింగ్‌ మంచి ఆర్కిటెక్చ‌ర్‌కు అప్ప‌గించాల‌ని బోర్డు నిర్ణ‌యించింది.

మ‌రోవైపు భ‌వానీ ద్వీపంలో వెలుగుల ఉద్యాన‌వ‌నం ఏర్పాటు చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం అధారిటీ పాల‌క మండ‌లి నిర్ణ‌యించింది. దేశంలోనే తొలిసారిగా ప‌దిల‌క్ష‌ల‌కు పైగా ఎల్ఇడిల‌తో వెలుగుల ఉద్యాన‌వ‌నం తీర్చిదిద్ద‌నున్నారు. ఈ వెలుగులు కృష్ణాన‌దిలో ప్ర‌తిబింబించ‌నుండ‌గా, అమ‌రావ‌తి ప్రాంతానికి కొత్త అందాల‌ను స‌మ‌కూర్చుతాయి. సాధార‌ణంగా మొక్క‌ల‌తో జంతువులు, ప‌క్షుల ఆకారాల‌ను తీర్చిదిద్ద‌టం మ‌నం చూస్తుంటాం, ఈ వెలుగుల ఉద్యాన‌వ‌నంలో అవ‌న్ని ఎల్ఇడి వెలుగుల ద్వారానే రూపుదిద్దుకుంటాయి. ఈ నేప‌ధ్యంలో టూరిజం అధారిటీ సిఇఓ హిమాన్హు శుక్లా మాట్లాడుతూ, వెలుగుల ఉద్యాన‌వ‌నం ప్ర‌పంచ శ్రేణి ప‌ర్యాట‌క కేంద్రాల‌లో ఒక‌టిగా ఉండ‌నుంద‌ని, స‌మావేశం దృష్టికి తీసుకువ‌చ్చారు. ఉద్యోగుల పున‌ర్ నిర్మాణంకు సంబంధించి అంశాలు పాల‌క మండ‌లి ఎజండా అంశాలుగా ఉండ‌గా వాటిని ప్ర‌భుత్వ ప‌రిశీల‌నకు పంపాల‌ని మీనా నిర్ణ‌యించారు. ఈ స‌మావేశంలో సంస్ధ పాల‌నా వ్య‌వ‌హారాల సంచాల‌కులు డాక్ట‌ర్ సాంబ‌శివ రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ తో, ఢిల్లీ ఇచ్చిన స్క్రిప్ట్ తో ఉత్తరాంధ్రలో వేర్పాటు వాదం తీసుకురావటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని పవన్ మాట్లాడే లాజిక్ లేని మాటలే అర్ధం కావటం లేదు. ఉత్తరాంధ్రని దోచుకుంటున్నారు అంటూనే, ఉత్తరాంధ్రను అభివృద్ధి చెయ్యట్లేదు అంటాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు భూములు అంటూ అనాలోచితంగా మాట్లాడినా, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రము అంటూ ఆయాసంగా మాట్లాడినా ఆయనకే సాధ్యం. ఏదన్నా వింటే అర్ధం కాదు, ఆలోచిస్తే అవుతుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ గురించి తెలిసిందే. అది ఎంత పెద్ద కంపెనీనో ప్రపంచం మొత్తం తెలుసు. ఆ కంపెనీ కోసం 5 రాష్ట్రాలు పోటీ పడితే, చివరకు మన రాష్ట్రానికి సాధించారు చంద్రబాబు. అవకాశాలు లేకుండా ఇంత పెద్ద కంపెనీ పెట్టుబడులు పెట్టదు. అంతర్జాతీయ కంపెనీలు ఉత్తరాంధ్రలో అవకాశాలు గుర్తించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటే, ప్రభుత్వం ప్రోత్సహిస్తూ, అనుమతులను త్వరితగతిన ఇస్తుంది.

pk 07072018 2

అభివృద్ధి చెందాలి అంటే కంపెనీలు రావాలి, అర్హత కల ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి. ప్రభుత్వం ఇచ్చే అనుమతుల్లో లోపాలను ఎత్తిచూపొచ్చు, నియమాలను పాటించకపోతే వివరాలు అడగొచ్చు. అనుమానాలు లేపుతూ ప్రజలను పక్కదారి పట్టించటం తప్పు. ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయాన్ని కాగ్ ఆడిట్ చేస్తుంది. ఆ ఆడిట్ కి ప్రభుత్వం జవాబు చెప్తుంది. ఒప్పందాల ప్రకారం కంపెనీలు ప్రారంభిచకపోతే ప్రాసెస్ ని ప్రశ్నించాలి. ప్రతి దానిలో అనుమానాలను రాజకీయాలకు లేపుతూ రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్నాడు. మరో పక్క అన్నీ అమరావతిలోనేనా అని చెప్పే పవన్, తన ఇల్లు అమరావతిలో కట్టుకుంటున్నాడు, తన ఆఫీస్ అమరావతిలో, చివరకు 2 లక్షల అద్దె ఇల్లు కూడా అమరావతిలోనే తీసుకున్నాడు. ఏ ఉత్తరాంధ్రలో పెట్టవచ్చుగా ?

pk 07072018 3

సరే, ఇదంతా బాగానే ఉంది.. ఉత్తరాంధ్ర బాగుపడాలి అంటే, మనకు విభజన హామీల్లో ఇచ్చిన రెండు అంశాలు ఇప్పటికీ కేంద్రం తేల్చలేదు. కొన్ని దశాబ్దాలుగా రైల్వే జోన్ పై విశాఖలో ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి డబ్బులు కూడా ఏమి పెట్టనవసరం లేదు. ఒక నిర్ణయంతో మోడీ, రైల్వే జోన్ ఇవ్వచ్చు. కాని, మనకు ఆదాయం అంతా మన వైజాగ్ కు వస్తుంది కాబాట్టి, మోడీ ఇవ్వటం లేదు. దీని పై ఉత్తరాంధ్ర ప్రజలు, ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. అలాగే, వెనుకబడిన జిల్లాలు అయిన, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, నిధులు ఇస్తాం అని విభజన చట్టంలో పెట్టారు. మొన్న 350కోట్లు మన రాష్ట్ర ఎకౌంటు లో వేసి, చంద్రబాబు ఎదురు తిరిగాడు అని, ఆ 350కోట్లు వెనక్కు తీసుకున్నారు. మరి ఇవి ఉత్తరాంధ్రకు అన్యాయం చెయ్యటం కాదా ? ఇలాంటి నిజమైన సమస్యల పై కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు కాని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి పెట్టుబడులు పెట్టి, వేల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ పై మాత్రం, ఏడుస్తాం అంటే ఎలా పవన్ గారూ ?

చంద్రబాబు వెంటనే రాజీనామా చేసే, నాతో కలిసి పోరాడాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై, మంత్రి యనమల స్పందించారు. మూడు పార్టీల లాలూచీ పై ధ్వజమెత్తారు. చంద్రబాబును రాజీనామా చేయమనడం మూడు పార్టీల గేమ్ ప్లాన్ లో భాగమని అన్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధంగా లేదని తెలుసుకుని, ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తెలివితేటలు చూపిస్తున్నారని అన్నారు. అక్కడ అమిత్ షా ఏమి చెప్తే, అది ఇక్కడ పవన్ కళ్యాణ్ చెయ్యల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయినా పోరాటం చెయ్యాలి అంటే, ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేసి రావాలా అని ప్రశ్నించారు యనమల.

pavan 07072018 2

ఏపి ప్రయోజనాల కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలియజేసారు. టిడిపిని ఎలా ఓడించాలా అనేదే జగన్, పవన్ ఆలోచనలని, ఇద్దరూ నరేంద్ర మోది డైరక్షన్ లో గోతులు తవ్వుతున్నారు అని అన్నారు. వాళ్లిద్దరూ మోది, అమిత్ షాలపై నోరు తెరవరు, అటువంటి పార్టీలతో టిడిపి ఎలా కలిసి పోరాటం చేస్తుంది అని ప్రశ్నించారు. మోదిని చూసి చంద్రబాబు భయపడుతున్నట్లు పవన్, జగన్ వ్యాఖ్యలు పెద్ద జోక్ అని, ఇద్దరూ కలిసి, ఈ మధ్య ఒకటే డైలాగ్ మాట్లాడుతున్నారని అని అన్నారు.

pavan 07072018 3

"ప్రధానమంత్రిని చూసి ఏ ముఖ్యమంత్రి అయినా భయపడతారా..? భయపడితే 12ఛార్జిషీట్ల ప్రధాన నిందితుడు భయపడాలి. ఐటి దాడులు చేస్తారని అక్రమార్జన చేసేవారు భయపడాలి. జగన్,పవన్ లకే భయం ఉంటుంది కాని చంద్రబాబుకు ఎందుకు భయం ఉంటుంది..? మూడు ధర్మపోరాట సభల్లో మోదిని నిలదీసింది చంద్రబాబు కాదా..? బిజెపి మోసాన్ని ఎండగట్టింది చంద్రబాబు కాదా...? బిజెపి నమ్మకద్రోహాన్ని దేశం మొత్తం చాటింది చంద్రబాబు కాదా..? రాజీనామా చేసిన వైసిపి ఎంపిల వల్ల ఏం ప్రయోజనం వచ్చింది..?గోదా వదిలేసి పారిపోతే పోరాటంలో ఏవిధంగా గెలుస్తారు..? అందరూ రాజీనామా చేస్తేనే తాను పోరాటంలో దిగుతాను అనడం పిరికితనానికి పరాకాష్ట పోరాటంలో ముందుండాలి. పారిపోవడం వీరత్వం కాదు. ఇక్కడ జగన్, పవన్ అక్కడ నరేంద్ర మోది, అమిత్ షా, నలుగురి అజెండా టిడిపిని ప్రజలకు దూరం చేయడమే. ఆంధ్రప్రదేశ్ పాలిట దుష్టచతుష్టయంగా మారారని" ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజంమెత్తారు.

విజయవాడ నగర పోలీసు కమీషనర్‌ గౌతం సవాంగ్‌ బదిలీ అయ్యారు. ఆయన్ను విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొన్నటి దాకా గౌతం సవాంగ్ రాష్ట్ర పోలీసు బాస్‌గా నియమితులు కానున్నారని ప్రచారం జరిగింది. డీజీపీగా తనను నియమిస్తారని ఆయన విశ్వాసంతో ఉన్నారు. డీజీపీ పదవికి గౌతం సవాంగ్‌తో పాటు ఆర్‌పిఠాకూర్‌ పోటీపడ్డారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తారని పోలీసు ఉన్నతాధికారుల్లో ప్రచారం జరిగింది. కాని చంద్రబాబు చివరకు డీజీపీగా ఆర్‌పి ఠాకూర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో విజయవాడ నగరపోలీసుల్లో కొంత నిరాశ అలుముకుంది. గౌతం సవాంగ్‌ కూడా అప్పటి నుంచి కొంత అన్యమనస్కంగా ఉన్నారు.

sawang 07072018 2

అయితే, ఇప్పుడు గౌతం సవాంగ్ కు కొత్త బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసు కమిషనర్‌గా చేస్తున్న గౌతం సవాంగ్‌ను విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమించారు. సవాంగ్‌ స్థానంలో విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్‌ గా, సీహెచ్‌ ద్వారకాతిరుమల రావు కొత్త సీపీగా వచ్చే అవకాశం ఉంది. ఈయన ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. సమర్థుడైన అధికారిగా ద్వారకా తిరుమలరావుకు పేరు ఉంది. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సైబరాబాద్‌ కమిషనర్‌గా పనిచేశారు. అంతకు ముందు అనంతపురం, మెదక్‌, కడప ఎస్పీగా, అనంతపురం రేంజి డీఐజీగా అక్టోపస్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఐజీగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

సీఐడీ అదనపు డీజీగా క్లిష్టమైన కేసులను కొలిక్కి తేవడంలో ఈయన సమర్థంగా పనిచేశారన్న పేరు ఉంది. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావును విజయవాడ పోలీసు కమిషనర్‌గా నియమించేందుకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తోపాటు కొత్త డీజీపీ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వీరి ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఒకటి రెండు రోజుల్లో విజయవాడకు కొత్త పోలీసు బాస్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజధాని ప్రాంతమైన విజయవాడ శాంతిభద్రతల పరంగా చాలా సున్నితమైన స్థానం. అంతే కాదు, ఇంకా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. వీటన్నింటినీ గాడిలో పెట్టాలంటే సమర్థుడైన అధికారిని కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు పేరు తెరపైకి వచ్చింది.

Advertisements

Latest Articles

Most Read