కొన్నేళ్ళుగా ప్రైవేటు స్కూల్స్ పై ఆకర్షితులై తల్లిదండ్రులు విధ్యార్ధులను అక్కడ చేర్పించటంతో ప్రభుత్వ స్కూల్స్ విధ్యార్ధులు సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో చాలా స్కూల్స్ ముత పడ్డాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్న చర్యల వల్ల మొత్తం మారిపోయింది. డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ స్కూల్స్ లో సదుపాయాలు మెరుగు పరచటం, ఆడ పిల్లలకు సైకిల్స్, బయో మెట్రిక్ ద్వారా ప్రతి రోజు టీచర్స్ స్కూల్ కు వచ్చేలా చెయ్యటం, ఇలా అన్ని చర్యల వల్ల, గత సంవత్సరం నుంచి, నెమ్మదిగా మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ వైపు చూడటం మొదలు పెట్టారు. అంతే కాదు చదువులో వెనుకబడిన పిల్లలకు స్పెషల్ క్లాసులు కూడా పెడుతున్నారు. పదవి తరగతిలో మంచి మార్కులు వచ్చిన పిల్లలను, ప్రోత్సహిస్తున్నారు.

schools 07072018

ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్ లు తీసుకుంటే కలిగే లాభాల పై ప్రచారం చేసారు. దీంతో మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ కు మంచి రోజులు వచ్చాయి. మూత పడతాయి అనుకున్న స్కూల్స్ అన్నీ, పిల్లలతో కళకళలాడుతున్నాయి. బడి ఈడు పిల్లలను గుర్తించి, బడిలో చేర్పించే ఉద్దేశంతో మొదలు పెట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పటికే డిజిటల్ తరగతులతో ఒక విప్లవం సృష్టించిన ప్రభుత్వం, ఆ ఫలితాలతో, పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా కూడా చేస్తుంది.. దీంతో సామాన్య ప్రజలకు కూడా ప్రైవేటు స్కూల్స్ కాకుండా, మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ వైపు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. ప్రైవేటు స్కూల్స్ దీటుగా, మేము కూడా చదువు చెప్తున్నాం అంటూ, ప్రభుత్వ స్కూల్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి.

schools 07072018

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్స్ లో, 2016-17లో కృష్ణా జిల్లాలో 3.25 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 3.49 లక్షల మంది ఉన్నారు. 2017-18లో కృష్ణా జిల్లాలో 3 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 3.56 లక్షల మంది ఉన్నారు. 2018-19లో కృష్ణా జిల్లాలో 3.50 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 3.78 లక్షల మంది ఉన్నారు. అలాగే ప్రైవేటు స్కూల్స్ చూసుకుంటే, 2017-18లో కృష్ణా జిల్లాలో 2.3 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 2.83 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కలు చూస్తుంటే, ప్రజలు ప్రభుత్వ స్కూల్స్ వైపు చుస్తున్నారనే విషయం అర్ధమవుతుంది. వచ్చే ఏడాదికి, మరింత ఎక్కువ మంది వచ్చేలా ప్రణాలికలు రచిస్తున్నారు.

ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదం పై ముందుకు వెళ్లనున్న మోడీ సర్కార్ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు జమిలి ఎన్నికలపై కేంద్రంలో కదలిక ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు ఈ నెలలో రాజకీయ పార్టీలతో లా కమిషన్ సంప్రదింపులు జరుపనున్నట్లు తెలుస్తోంది. లా కమిషన్ ప్రజలు, భాగస్వామ్య పక్షాల నుంచి సలహాలు, సూచనలు కోరుతుంది. లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై చర్చలు సాగించనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం రాష్ట్ర విభజన సమస్యలు పట్టించుకోకుండా ఎన్నికలపై దృష్టి సారించడాన్ని టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి. అందుకే ఈ సమావేశానికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంది.

ap 07072018 2

అయితే కేంద్రం మొదట్లో నవంబర్, డిసెంబర్ నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిందని ప్రచారం అయింది. ఆరు నెలల ముందు కాదు, 8నెలల ముందేఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహం రూపొందించుకుంటు అన్నట్లుగా ఢిల్లీ పెద్దలు లీక్ చేశారు. కాగా, దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని టిడిపితో పాటు కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు ముందస్తు ఎన్నికలకు సైతం సిద్దమైనట్లుగా చెబుతున్నాయి. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం లబ్దిపొందాలని చూస్తుందని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. గత రెండు, మూడు ఏండ్లుగా దేశంలో జమిలి ఎన్నికల ప్రస్తావన కేంద్ర పెద్దలు పదేపదే తెస్తున్నారు.

ap 07072018 3

చివరికి నూతన రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ నోట కూడా వినిపింపచేశారు. దేశంలో ఏడాది పొడవునా వేర్వేరు ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి పనులు నిర్వహించడం కష్టంగా ఉందని, ఐదేళ్ల కొకసారి ఒకేసారి అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరిగితే ఖర్చులు తగ్గడంతో పాటు అభివృద్ధి పనులు కూడా సులభంగా సాగుతాయని ఢిల్లీ పెద్దలు పదేపదే చెబుతు న్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్తాన్ ఎన్నికలు నవంబర్, డిసెంబర్లో జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మేలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరుగనున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాల్లో కనీసంగా సగం రాష్ట్రాలైనా కలుపుకుని లోక్ సభతో పాటు జమిలీ ఎన్నికలకు పోవాలని కేంద్రం నిర్ణయానికి వచ్చిందంటున్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న శ్రమ తెలుగు ప్రజల గుండెల్లో పదిలంగానే ఉంటుందని ఐటీ మంత్రి లోకేశ్‌ ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్ గా ట్వీట్ చేసారు. ‘68 ఏళ్ల వయసులో సీఎం చంద్రబాబు 24 ఏళ్ల యువకుడిలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారు. అందుకోసం ఆయన్ను ద్వేషిస్తాం అంటే ద్వేషించండి. కానీ మీరు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని.. అందుకోసం సీఎం పడుతున్న శ్రమని తెలుగు ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరు’ అని ట్వీట్ చేసారు. ‘ప్రపంచంలోనే ఉత్తమ కంపెనీలు విశాఖకు వస్తోండటంతో మన యువతకు ఉద్యోగాలు లభిస్తుంటే కొన్ని దుష్టశక్తులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి’ అని విమర్శించారు. ‘ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వాటిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

lokesh 07072018 2

లోకేష్ గతంలో కూడా, పవన్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు "రాష్ట్ర విభజన తరువాత కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితిని అధికమించి ఇప్పుడు ఐటీలో 24వేలు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 18వేల ఉద్యోగాలు కల్పించాం. మరో 65వేల ఉద్యోగాలు త్వరలోనే రాబోతున్నాయని, వీటికి సంబంధించి భూమి కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన పూర్తి అవుతుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కట్టుబడి ఉన్నాను.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం బురద రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చెయ్యొద్దని, యువతి, యువకుల పొట్టకొట్టదని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు చంద్రబాబు గారి పై ఉన్న నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చారు. కనీస ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసి రాష్ట్రానికి వచ్చే కంపెనీలను భయపెట్టి లక్షల మంది యువతీ, యువకుల భవిష్యత్తుని దెబ్బతీయకండి" అని ట్వీట్ చేశారు.

lokesh 07072018 3

విశాఖపట్నంలో వచ్చిన పెద్ద కంపెనీలు ఇవే.. వీటి పైనే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. 1.ఫ్రాంక్లిన్ టెంపుల్టన్(ప్రపంచంలోనే ఉత్తమ ఫింటెక్ కంపెనీల్లో ఒక్కటి).. 2.కాన్డ్యూయెంట్.. 3.ఏఎన్ఎస్ఆర్(గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్ కంపెనీ).. 4.గూగుల్ ఎక్స్(ప్రపంచంలో అమెరికాలో తప్ప ఇంక ఎక్కడా కార్యాలయం లేని కంపెనీ) మారు మూల ప్రాంతాలకు సైతం ఎఫ్ సాక్ టెక్నాలజీ తో ఇంటర్నెట్ సదుపాయం.. విశాఖపట్నంలో ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న హిల్ 1,2 ఇప్పుడు ఐటి కంపెనీలతో నిండిపోయాయి.. మిలీనియం టవర్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.. కాపులపాడ లో ఐటి పార్క్ ఏర్పాటుకు పనులు ప్రారంభం అయ్యాయి..

ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకే జమిలి ఎన్నికల అంశాన్ని తెస్తున్నారని ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ద్వయంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ మేర‌కు శుక్ర‌వారం త‌న కార్యాల‌యం నుంచి ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అనేక ప్రాంతీయ పార్టీల నేతలు ఆయా ప్రాంతాలలో బలంగా ఉన్నారని, వారిని బలహీన పరిచేందుకే జమిలి ఎన్నికల ఎత్తుగడను భాజపా వేస్తోందన్నారు. ఏ జాతీయ పార్టీకూడా సొంతబలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థితిలో లేదని జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో బలోపేతం కావడం రాజకీయంగా జాతీయ పార్టీలకు విఘాతంగా మారిందన్నారు.

modi 07072018 2

15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రమాదకరంగా పరిణమించాయని తెలిపారు. భాజపా నేతలే ఈ మార్గదర్శకాలను 15వ ఆర్థిక సంఘానికి సూచించారన్నారు. జీఎస్టీని కూడా రాష్ట్రాలను బలహీన పరిచేందుకే వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాయాలని చూస్తున్నారని వివరించారు. జీఎస్టీ, 15వ ఆర్థిక సంఘం, జమిలి ఎన్నికల వంటి ఆలోచనలన్నీ జాతీయ పార్టీల ఆధిపత్యం పెంచుకునేందుకే అని విమర్శించారు.

modi 07072018 3

రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టడం, ఆర్థికంగా రాష్ట్రాలను బలహీనపరచడమే అజెండాగా కేంద్రంలోని భాజపా నేతలు పెత్తందారీ పోకడల్లో వ్యవహరిస్తున్నారని యనమల అన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమ్‌బంగలోని మమతా బెనర్జీ, దిల్లీలో కేజ్రీవాల్, బిహార్‌లో నితీశ్‌కుమర్‌, లాలూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పట్ల ఆ పార్టీ ఏవిధంగా వ్యవహరిస్తోందో దేశ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. నరేంద్రమోదీ తరహాలో గతంలో ఎవరూ ఇలా రాజకీయ కుట్రలు చేయలేదన్నారు. మోదీ, షా ద్వయం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read