జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చింది. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లు ఉన్న చాలా మందిని , జగన్ మోహన్ రెడ్డి తీసేసి, కొత్త వాళ్ళని మంత్రులను చేస్తారాని ఇప్పటికే డిసైడ్ అయి పోయారు. అందరినీ తీస్తే బాధ లేదు కానీ, కొంత మందిని తీయటం లేదు అని చెప్పటంతో, ఇప్పుడు కుస్తీ పోటీలు మొదలు అయ్యాయి. ఎవరిని తీస్తారు, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనే చర్చ మొదలయింది. బయటే ఇంత చర్చ ఉంటే, ఆ మంత్రులలో ఇంకా ఎంత టెన్షన్ ఉంటుంది ? ఎప్పుడు పదవి ఊడుతుందో, ఎవరిది పోతుందో అనే టెన్షన్ లో ఉన్నారు. అందుకే అసెంబ్లీలో, భజన కార్యక్రమం, తిట్ల కార్యక్రమం, జగన్ మోహన్ రెడ్డిని మంచి చేసే కార్యక్రమం పీక్స్ లో ఉంది. మంత్రులు అందరూ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. టీవీల్లో జరుగుతున్న చర్చ, పార్టీలో జరుగుతున్న చర్చ, నువ్వు పోతావ్ అంటే నువ్వు పోతావ్ అనే ప్రచారం మధ్య,మంత్రులు చిరాకులో, అసహనంతో ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్న మంత్రులకు, టిడిపి నేతలు మరింత చిరాకు తెప్పిస్తున్నారు. స్వయంగా ఫోన్లు చేసి, నిన్ను పీకేస్తున్నారు అంట కదా అంటూ, ర్యాగింగ్ చేస్తున్నారు. దీంతో మంత్రులకు బీపీలు పెరిగి, తిట్ల దండకం అందుకుని, తమ ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నారు.
డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామికి సరిగ్గా ఇదే జరిగింది. ఎక్ష్సైజ్ శాఖా మంత్రిగా ఉన్న ఆయన, ఇప్పటికే టిడిపి చేస్తున్న కల్తీ సారా, జే-బ్రాండ్స్ తో చిరాకుగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక టిడిపి నేత నుంచి ఆయనకు ఫోన్ వెళ్ళింది. త్వరలోనే నిన్న పీకేస్తున్నారు అంట కదా అంటూ ఆయన ఫోన్ లో చెప్పటంతో, డిప్యూటీ సియంకు పట్టరాని కోపం వచ్చిందట. అసలకే పదవి పోతుందని చిరాకులో ఉంటే, టిడిపి నేతలు ఫోన్ లు చేయటంతో, మంత్రికి చిరాకు ఎక్కువైంది. ఈ చిరాకులోనే సభకు వచ్చిన మంత్రికి, అక్కడ లోకేష్ కల్తీ సారా మరణాల పై నినాదాలు చేయటంతో, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తనకు టిడిపి నేతలు ఫోన్లు చేసి విసిగిస్తున్నారని చెప్పారు. తరువాత ఇది వివాదాస్పదం అవ్వటంతో, తాను లోకేష్ ని ఏమి అనలేదని, ఫోన్ చేసిన వాడిని తిట్టానని కవర్ చేసారు. మొత్తానికి మంత్రి పదవి పోతుందనే అసహనంతో, మంత్రుల ప్రవర్తనలో విపరీత మార్పలు వస్తున్నాయి. ఇది టిడిపి రాజకీయంగా వాడుకుంటూ, వారిని మరింత విసిగిస్తుంది.