కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. జమిలి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కూడా చేస్తోందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. గురువారం రాత్రి ఇక్కడ గుంటూరు జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభకు కేంద్రం ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తామంటే మనకు అభ్యంతరం లేదని, అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు జరుపుతామంటే అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. 'షెడ్యూల్‌ ప్రకారమే మన శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలి. జమిలి ఎన్నికల పేరుతో లోక్‌సభతోపాటే మన అసెంబ్లీకి కూడా అక్టోబరు, నవంబరుల్లో ఎన్నికలు పెట్టాలని కేంద్రం చూస్తోంది. అవసరమైతే న్యాయనిపుణులతో మాట్లాడి న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తాం’ అని స్పష్టం చేశారు

cbn 06072018

గుంటూరులో నిర్వహించనున్న ముస్లిం మైనారిటీల సభకు ముందే... రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు కల్పించాలని జిల్లా నాయకులు సూచించగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. గడచిన నాలుగున్నరేళ్లలో ఏం చేశామో గ్రామాలు, వార్డుల వారీగా వివరిస్తామని, రాబోయే ఐదేళ్లలో మనం చేసే అభివృద్ధి, సంక్షేమ ప్రణాళికలను ప్రజల ముందుంచి, అన్ని వర్గాల మద్దతు పొందుదామని ఆయన తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆరు నెలల పాటు గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాల్ని ఒక పండుగలా నిర్వహించాలన్నారు. ఆరు నెలల్లో 75 సభలు జరుపుతామని వాటిలో 25 రైతు సభలు, 25 మహిళా సభలు, 25 సంక్షేమ సభలు నిర్వహిస్తామన్నారు. నాలుగేళ్లలో మనం చేసిన పనులకు పుష్కలంగా ఓట్లు పడతాయన్న నమ్మకముందని, ఎక్కడైనా నాయకులు నష్టం చేస్తే తప్ప ఓట్లు తగ్గే ప్రసక్తి లేదన్నారు.

cbn 06072018

1100కి ఫోన్‌ చేసి విజ్ఞప్తి చేసినవారికి నేరుగా పింఛన్లు మంజూరు చేయడం వల్ల, విపక్ష పార్టీలకు చెందినవారికీ లబ్ధి చేకూరిందని కొందరు నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దానిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ... శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే అందర్నీ సమానంగా చూడాలని, తాను 175 నియోజకవర్గాల్ని సమానంగా చూస్తున్నానని తెలిపారు. ‘కొన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడా కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. దానిని సరిదిద్దుకోవాలి. మీ పొరపాట్లకు పార్టీ నష్టపోకూడదు.నేను కార్యకర్తల మనిషిని’ అని అన్నారు. రాజధాని జిల్లా అయిన గుంటూరులో ప్రజల అంచనాలు కొంత అధికంగా ఉంటాయని, ఆ స్థాయికి నాయకులు ఎదగాలన్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో త్వరలో ఆధునిక మిలటరీ స్టేషన్‌ ఏర్పాటు కానుంది. గురువారం సచివాలయంలో తెలంగాణ, ఏపి సబ్‌ ఏరియా జనరల్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ మేజర్‌ జనరల్‌ శ్రీనివాసరావు ఇన్‌ఛార్జి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠతో భేటీ అయ్యారు. అమరావతిలో ఆధునిక మిలటరీ స్టేషన్‌ ఏర్పాటుకు సంబంధించి ఆరున్నర ఎకరాల భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సిఎస్‌ను కోరారు. విజయవాడ, కర్నూలులో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాంప్రహెన్సివ్‌ హెల్త్‌ స్కీమ్‌ ( ఇసిహెచ్‌ఎస్‌ ) పోలీ క్లినిక్‌ల ఏర్పాటుకు స్థలాన్ని నామినల్‌ ధరకు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

amaravati 06072018 2

కోరుకొండ సైనిక్‌ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసిహెచ్‌ఎస్‌ స్కీమ్‌ కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాప్‌ను వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా లింక్‌ ఇస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మేజర్‌ జనరల్‌ శ్రీనివాసరావు ప్రతిపాదనల పై సిఎస్‌ సానుకూలంగా స్పందిస్తూ మిలటరీ స్టేషన్‌ ఏర్పాటుకు తగిన స్థలం కేటాయించేదుకు సిఆర్డీయే అధికారులతో మాట్లాడి వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర ప్రతిపాదనలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు వీలుగా ఒక లైజన్‌ అధికారిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

amaravati 06072018 3

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌కు విడుదల చేయాల్సిన నిధులపై విద్యా శాఖ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని సిఎస్‌ స్పష్టం చేశారు. అలాగే విజయవాడ, కర్నూల్‌లో ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ కాంప్రహెన్సివ్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈసీహెచ్‌ఎస్) పాలీ క్లినిక్‌ల ఏర్పాటుకు తగిన స్థలాన్ని నామమాత్రపు ధరకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మేజర్ కోరారు. గ్యాలంటరీ అవార్డులకు తెలంగాణ నుంచి ఎక్కువ ప్రతిపాదనలు వస్తున్నాయని, ఏపీ నుంచి కూడా వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్స్‌సర్వీ్‌సమెన్లు ఎక్కువగా ఉన్నారని, మిలటరీలో పని చేయడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య తెలంగాణతో పోల్చితే, ఏపీలోనే ఎక్కువగా ఉంటోందని చెప్పారు.

గత మూడు రోజుల నుంచి, అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రజలు, విభజన హామీల పై, సుప్రీంలో కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ పై రాగాలిపోతున్నారు. రెండు పార్టీలు తప్ప.. వారే, జగన్, పవన్... వైసీపీ అధ్యక్షుడు జగన్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లకు చత్వారం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ఇప్పటికే విభజన హామీలన్నింటినీ నెరవేర్చేశామంటూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దాన్ని చదివేందుకు వారిద్దరికీ ఇంకా పెద్ద భూతద్దాలేమైనా కావాలా? అసలు సమస్య ఎక్కడుందో? పరిష్కారం కోసం ఎక్కడ పోరాడాలో తెలియకుండా.. ముందుగా నేను ప్రస్తావించడం వల్లే హోదా అంశం సజీవంగా ఉందంటూ జగన్‌, పవన్‌ ఎక్కడపడితే అక్కడ మాట్లాడుతున్నారు.

pk 06072018 2

ఇప్పుడు, హోదాను అటకెక్కిస్తూ కేంద్రం సుప్రీంకోర్టులోనే అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇంకా ఆ అంశం సజీవంగా ఎక్కడుంది? హోదా, విభజన హామీల అమలుపై మోదీపై పోరాడాల్సిన జగన్‌, పవన్‌ ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతూ ఇప్పుడు మోదీకి భయపడితే.. భవిష్యత్తులో వారు ప్రజలకు ఇంక సేవ చేస్తారా? చేయగలరా? రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాల వైఖరిని గుర్తించాలి. మేము అన్నీ ఇచ్చేసాం అంటున్నారు. హోదా అవసరం లేదు అంటున్నారు. పోలవరం పై మడత పేచి పెట్టారు. రైల్వే జోన్ పై కనీసం ప్రస్తావించలేదు. సాక్షాత్తు సుప్రీం కోర్ట్ కే అబద్ధాలు చెప్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే, అన్ని పార్టీలు స్పందిస్తే, పవన్, జగన్ లకు ఏమి అయ్యింది ?

pk 06072018 3

ఎంత అమిత్ షా, వీరి బాస్ అయితే మాత్రం, బీజేపీ నాయకులు లాగా, జగన్, పవన్ కూడా గుజరాతీ భజన చేస్తారా ? వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు పట్టవా ? ఒకాయిన కేసుల కోసం లొంగిపోతే, ఇంకో ఆయన ఎందుకో లోంగాడో కాని, మొత్తానికి, అమిత్ షాకి బాగా లొంగిపోయారు. రాష్ట్రంలో ప్రజలందరూ కేంద్రం పై పోరాడుతుంటే, జగన, పవన్ మాత్రం, కేంద్రం పై పోరాడుతున్న, చంద్రబాబు పై విరుచుకుపడుతూ, వారి గుజరాతీ భక్తి ప్రదర్శిస్తున్నారు. ఇద్దరూ కలిసి, ఒకే ఎజెండా, ఒకే మాట, ఒకే స్క్రిప్ట్, ఒకే డైలాగ్ లు కొడుతున్నారు. ఒకడు కాల్చేస్తా అంటే, ఇంకొకడు చొక్కా పట్టుకుని లాగి, కాళ్ళు విరగ్గొడతా అంటాడు. అంతే కాని, మోడీని మాత్రం, అనే దమ్ము ఇద్దరికీ లేదు.

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను సపోర్ట్‌ చేయాలని అభిమానులు తనను బెదిరిస్తున్నారని అంటున్నారు నటి రేణూ దేశాయ్‌. ఓ వ్యక్తి పవన్‌ గురించి తప్పుగా పేర్కొంటూ ఫొటోలు షేర్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి స్పందిస్తూ ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నా జీవితం ప్రశాంతంగా ఉండడానికి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌నే వాడాలని అనుకున్నాను. కానీ జీవితంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. గత ఐదేళ్లుగా నన్ను అనరాని మాటలు అంటూ నేను చేయని తప్పులకు నిందిస్తున్నవారి గురించి పట్టించుకోవద్దని కొందరు నాకు సలహా ఇచ్చారు. నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నా కోసం నేను మాట్లాడుతుంటే అన్నీ మౌనంగా భరించాలని చెప్పారు. పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తున్నానని మరికొందరు అన్నారు".

renu 06072018 2

"ఇప్పుడేమో ఓ నీచుడు పవన్‌ ఫోటోలను సోషల్‌మీడియాలో పెడుతూ నెగిటివ్‌ కామెంట్లు చేస్తున్నాడు. దాంతో నా ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌బాక్స్‌ మెసేజ్‌లతో నిండిపోయింది. కొందరేమో పవన్‌ కల్యాణ్‌ను సపోర్ట్ చేయాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే మరికొందరు బెదిరిస్తున్నారు. ఆయనకొక రూల్‌, నాకొక రూలా? గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా? నోరుమూసుకుని అన్నీ భరించమని నాకు సలహాలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పవన్‌ పేరుకు మచ్చ వస్తుందని నన్ను స్పందించమని అడుగుతున్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ఈ సమాజంలో ఉంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏదో ఒక రోజు నాకంటూ మనశ్శాంతి దొరుకుతుందని ఆశిస్తున్నాను. మరో విషయం గుర్తుపెట్టుకోండి. నేనెప్పుడూ పవన్‌ గురించి తప్పుగా మాట్లాడను. అలా మాట్లాడమని నన్ను కానీ నా పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదు’ అని పేర్కొన్నారు రేణు.

renu 06072018 3

ఇటీవల రేణు.. తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం గోవాలో ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయంలోనూ తనకు పవన్‌ అభిమానుల నుంచి బెదిరింపులు, విమర్శలు వస్తున్నాయని రేణూ వెల్లడించారు. పవన్ ఫాన్స్ అరాచకం భరించలేక, ఆమె ట్విట్టర్ విదిలి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ లో కూడా, పవన్ ఫాన్స్ ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు.

Advertisements

Latest Articles

Most Read