భారత దేశంలోనే కాదు, మన రాష్ట్రంలో, అనేక రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల పొత్తులు అనేవి సర్వ సాధారణం. మన రాష్ట్రానికి వస్తే, గత 30 ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ, ఎక్కువగా బీజేపీతో కలిసి వెళ్ళింది, 2014లో జనసేన తోడయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా కమ్యూనిస్ట్ లతో, మజిలీస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళేది. 2004లో టీఆర్ఎస్ తో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. చివరకు కేసీఆర్ పార్టీని తన క్యాబినెట్ లో కూడా పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. గత కొన్ని రోజులుగా, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయి అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వస్తున్న దగ్గర నుంచి, వైసీపీలో వణుకు మొదలైంది. టిడిపి-జనసేన కలిస్తే, వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలియదు కానీ, తెగ కంగారు పడి పోతుంది. జనసేన పార్టీకి పడే ఓటింగ్, చాలా వరకు తెలుగుదేశం పార్టీదే ఉంటుంది. అందుకే టిడిపి ఓటు చీల్చే జనసేన పార్టీ విడిగానే ఉండాలని, టిడిపితో కలిస్తే తమకు ఇబ్బందని, ఇద్దరి ఓటు ఒకటై, తమ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇద్దరూ కలిసి తీసుకుంటే, తమ పని అయిపోతుంది అని జగన్ భావిస్తున్నారు. అందుకే టిడిపి-జనసేన పొత్తు అంటూ వార్తలు వస్తున్న దగ్గర నుంచి, వైసిపి వణికిపోతుంది.

alliance 23032022 2

ఈ పొత్తుని ఎలాగైనా బ్రేక్ చేయాలని, రెచ్చగొట్టటం మొదలు పెట్టింది. పొత్తు పెట్టుకుంటే తప్పు అయినట్టు, మీకు దమ్ము లేదు, సింగల్ గా రావాలి, గుంపుగా ఎందుకు, ఒక్కరే పోటీ చేసే దమ్ము లేదా ? ఇలా వైసీపీ నాయకులు రెచ్చగొడుతూ,పొత్తు ఎదో పాపం అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ లేకుండా రాగలడా ? దీనికి వైసీపీ దగ్గర జవాబు లేదు. ఇక బీజేపీలోని ఒక వర్గం ఏమి తక్కువ కాదు. పవన్ కళ్యాణ్ ని సియం క్యాండిడేట్ చేస్తాం, మాకు ఎవరితో పత్తు ఉండదు అని వీళ్ళే ప్రకటిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి అటు పవన్ మీద ఒత్తిడి తెస్తూ, ఇటు టిడిపిని రెచ్చగొడుతూ, టిడిపి-జనసేన కలవకుండా, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలి, మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి సియం అవ్వాలి అనే ఉద్దేశంతో, వైసీపీ, బీజేపీలోని ఒక వర్గం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుని ప్రజలలోకి వెళ్తే తప్పు ఎలా అవుతుంది ? చీకటి ఒప్పందాలు చేసుకుని, డబ్బులతో కులాల మధ్య తగువులు పెట్టే వారిని పెట్టుకుంటే తప్పు కానీ ?

ప్రజల ప్రాణాలు ఒక వైపు.. గాలి వార్తలు ఒక వైపు... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజల ప్రణాలను అజెండాగా తీసుకుంటే, అధికార వైసీపీ గాలి వార్తలను ఆధారంగా తీసుకుంది. గత పది రోజులుగా అసెంబ్లీ జరుగుతున్న తీరు పరిశీలిస్తే, వైసీపీ ఎన్ని వ్యూహాలు పన్నినా, టిడిపి ట్రాప్ లో మాత్రం పడలేదు. పది రోజుల క్రితం, జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు కలకలం సృష్టించాయి. యుక్త వయసులో వాళ్ళు కూడా చనిపోవటంతో, అందరూ ఉలిక్కి పడ్డారు. ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యే కూడా ఇవి కల్తీ సారా మరణాలు అని మొదట చెప్పారు. చనిపోయిన వారి లక్ష్యనాలు చూసి అందరూ అదే అనుకున్నారు. తరువాత దీని పైన తెలుగుదేశం పార్టీ ఆందోళన మొదలు పెట్టింది. ఇవి కల్తీ సారా మరణాలు అని తేలటంతో, అసెంబ్లీలోనే తేల్చుకోవటానికి టిడిపి సిద్ధం అయ్యింది. అయితే ఇక్కడ ప్రభుత్వం ధైర్యంగా చర్చ పెట్టాల్సింది పోయి, నిస్సిగ్గుగా, అవన్నీ సహజ మరణాలు అని, తెలుగుదేశం పార్టీ స్మశానానికి వెళ్లి అక్కడ సవాలు తెస్తుంది అంటూ, ఎదురు దా-డి చేసారు. అయినా తెలుగుదేశం పార్టీ ఆగలేదు. అక్కడకు చంద్రబాబు వెళ్లారు. బాధితులతో మాట్లాడారు, అక్కడ వారికి టిడిపి శాసనసభ సభ్యులు వెళ్లి పరామర్శించి, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం కూడా అందించారు.

jagan 23032022 2

చివరకు టిడిపి ఆందోళన, కల్తీ సారాతో పాటుగా, కల్తీ జే-బ్రాండ్స్ మద్యం వైపుకు కూడా మళ్ళింది.సరిగ్గా ఇక్కడే అసలు కధ మొదలైంది. జే-బ్రాండ్స్ మద్యం, వైసీపీకి అతి పెద్ద ఆదాయ వనరు. అందుకే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తెలుగుదేశం పార్టీ ఈ టాపిక్ ను వదలక పోవటంతో, ఇది ప్రజల్లోకి వెళ్లి పోవటంతో, దీని నుంచి ఎలాగైనా డైవెర్ట్ చేయటానికి, పెగాసిస్ అనే ఒక కట్టు కధను తెర పైకి తెచ్చింది. ఎక్కడా కూడా మమతా చెప్పినట్టు రికార్డు లేకపోయినా, రచ్చరచ్చ చేసింది. ఇలా ఫేక్ చేస్తే, చంద్రబాబు ట్రాప్ లో పడతారని అనుకుంది, అయినా టిడిపి లెక్క చేయలేదు, కల్తీ మద్యం పైనే ఉంది. దీంతో అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టారు. అయినా టిడిపి డైవెర్ట్ అవ్వలేదు. బాటిల్ మూత అడ్డు ఉంటే, చంద్రబాబు ఒక కాలుకు చెప్పు, ఒక కాలుకి బూటు వేసుకున్నారని ఫేక్ చేసారు. అయినా టిడిపి డైవెర్ట్ అవ్వలేదు. ఈ రోజుకీ కల్తీ మద్యం పైనే టిడిపి గట్టిగా నిలబడింది. దీంతో వైసీపీ ఎంత ట్రాప్ చేయాలని చూసినా, టిడిపి మాత్రం వాళ్ళ ట్రాప్ లో పడలేదు.

ఈ రోజు మధ్యానం అసెంబ్లీలో, 2023 ఖరీఫ్ సీజన్ నాటికి, పోలవరం పూర్తి చేస్తానని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రకటించిన గంటలోనే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఎందుకు ఆగిపోయింది అనే వివరాల్లోకి వెళ్తే, ఇసుక సరఫరా నిలిచి పోవటంతో, పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. జేపీ వెంచర్స్ అనే ఒక బినామీ కంపెనీకి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రంలో ఇసుక ర్యాంప్ లు అన్నీ కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీని వెనుక డైరెక్ట్ గా జగన్ ఉన్నాడని, టిడిపి ఆరోపిస్తూ ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ చేస్తుంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. పోలవరం ప్రాజెక్ట్ లో నవయుగని బయటకు పంపించి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ కు పోలవరం కట్టబెట్టింది. అయితే మేఘా ఇంజనీరింగ్ అక్కడ పనులు ఏమి చేయలేదని, ఎన్నో ఆర్టిఐ రిపోర్ట్ లు చెప్తున్నాయి. అయితే ఒక పక్క మేఘా ఇంజనీరింగ్ కానీ, మరో పక్క ఇసుక తీసే జేపీ కానీ, రెండూ కూడా ప్రభుత్వ అనుకూల సంస్థలే. రెండూ కూడా ప్రభుత్వ పెద్దలకు అతి దగ్గరవే. అలాంటిది జేపీ వెంచర్స్ ఇసుక ఆపేయటం, తమకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తేనే తాము, ఇసుక ఇస్తామని చెప్పటం, మేఘా టిప్పర్లు అన్నీ వెనక్కు వచ్చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

mega 22032022 2

జేపీ సంస్థ ఇసుక ఆపేసిందని, మేఘా సంస్థ ప్రభుత్వానికి కూడా సమాచారం అందించిందని చెప్తున్నారు. తమకు ఇసుక తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చినా, జేపీ సంస్థ అడ్డుపడుతుందని, మేఘా వాదన. అయితే ఈ రెండు సంస్థలు ప్రభుత్వ పెద్దలకు దగ్గరవి అయినా, ఇలా ఎందుకు చేసాయో, ఎవరికీ అర్ధం కావటం లేదు. తెలుగుదేశం పార్టీ ఇదంతా డ్రామా అని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కోసం, ఇసుకని తీసుకునే హక్కు కాంట్రాక్టర్ కు ఉంది. అయితే ఇప్పటి వరకు, ఇసుక ఇచ్చిన జేపీ వెంచర్స్, ఇప్పుడు ఎందుకు ఆపేసిందో, ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఎవరి స్కెచ్ ప్రకారం, ఈ పరిణామం జరిగిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇప్పటి వరకు ఇచ్చే, ఇప్పుడు ఎందుకు ఆపెసారో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా డ్రామా అని, ఎక్కడా పోలవరం పనులు పూర్తి కాక పోవటంతో, ఇప్పుడు ఈ కొత్త డ్రామా మొదలు పెట్టారని, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా ఆరోపించారు.

పెగాసిస్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయింది. వైసీపీ చేసిన అతి ప్రచారం , వాళ్ళు చేసింది ఫేక్ అని, తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా నిరూపించటంతో, ఇప్పుడు వైసీపీ అడ్డంగా ఇరుక్కుంది. దీంతో ఒక రోజులునే, పెగాసిస్ పైన వైసీపీ సైలెంట్ అయిపొయింది. ముఖ్యంగా పెగాసిస్ పైన తెలుగుదేశం పార్టీ, 8 ఆధారాలు బయట పెట్టింది. అందులో మొదటిది ఆర్టిఐ రిపోర్ట్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, జగన్ కు అత్యంత ప్రీతి పాత్రుడు గౌతం సవాంగ్ గారే, అసలు ఇప్పటి వరకు తాము పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ కొనలేదు కొనలేదు కొనలేదు అంటూ కుండ బద్దలు కొడుతూ ఇచ్చిన ఆర్టిఐ రిప్లై. దీనికి మించిన తిరుగులేని ఆయుధం మరొకటి లేదు. ఇక రెండో అతి ముఖ్యమైన అంశం, ఎన్నికల ముందు వైవీ సుబ్బా రెడ్డి నా ఫోన్ ని చంద్రబాబు ట్యాప్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసారు, తరువాత ఎన్నికల్లో గెలవగానే కేసు వెనక్కు తీసుకున్నారు, ఇలా ఎందుకు చేసారని టిడిపి ప్రశ్నిస్తుంది. ఇక మూడో అంశం సజ్జల రామకృష్ణా రెడ్డి ఫోన్ ట్యాప్ అయ్యిందని ఎన్నికల ముందు అమరావతి హైకోర్టులో కేసు వేసారు, ఆ కేసు విచారణకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. దీంతో, మీకు ఈ కేసు పై ఇంట్రెస్ట్ లేకపోతే మాకెందుకు అని, హైకోర్టు కేసు కొట్టేసింది.

pegasus 23032022 2

ఇక నాలుగో అంశం, మమతా బెనర్జీ అన్నట్టు వైసిపీ ప్రచారం చేస్తుంది. అయితే ఎక్కడా కూడా మమతా బెనర్జీ ఆ వ్యాఖ్యలు చేసిన రికార్డు లేదు. కేవలం గాలి వార్తలు ఆధారంగా వైసీపీ ఇంత హడావిడి చేస్తుంది. ఇక మరో అంశం, ఈ పెగాసిస్ పైన పిచ్చ కధనాలు అన్నీ సోషల్ మీడియాలో రాసి, అవి డబ్బులు పెట్టి మరీ ప్రోమోట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. డబ్బులు పెట్టి ఎందుకు ప్రోమోట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. మరో అంశం పెగాసిస్ పైన అసలు పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన అవసరం లేదని విజయసాయి రెడ్డి చెప్పటం, ఢిల్లీలో వద్దు అంటే, ఇక్కడ మాత్రం గోల చేయాలి అంట. ఎందుకో మరి ? ఇక చివరి అంశం, ఈ పెగాసిస్ తయారు చేసిన NSO సంస్థ, ఇది కేవలం ప్రభుత్వాలకు మాత్రమే ఇచ్చే సాఫ్ట్వేర్ అని, ఎక్కడా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వం అని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే రికార్డు ఉంటుంది కదా ? ఒక్క మమతా బెనర్జీ చెప్పింది అంటూ, ఎక్కడో వచ్చిన గాలి వార్త పట్టుకుని, ఇన్ని ఆధారాలు ఉన్నా సరే, వైసీపీ ఎంత గట్టిగా ఫేక్ చేసిందో అర్ధం అవుతుంది.

Advertisements

Latest Articles

Most Read