బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆస్పత్రి క్లినిక్‌, సమాచార కేంద్రాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం విజయవాడలో ప్రారంభించారు. గవర్నర్ పేటలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ, ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమా, ఎం.వి.ఎస్. మూర్తి, ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పుట్టినగడ్డపై క్యాన్సర్‌ ఆస్పత్రి సేవలు ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

balayya 01072018 2

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రజలకు చేరువ చేస్తామన్నారు. అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి ఆగస్టులో భూమి పూజ చేస్తామని బాలకృష్ణ చెప్పారు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నమ్మకానికి చిరునామా బసవతారకం ఆస్పత్రని ఏపీ స్పీకర్‌ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమానికి కోడెలతోపాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు.

balayya 01072018 3

క్యాన్సర్ తో మా అమ్మ పడిన బాధ మరెవరూ పడకూడదనే ఉద్దేశంతోనే బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించామని బాలకృష్ణ తెలిపారు. ఆసుపత్రి సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. హైదరాబాదులోని ఆసుపత్రి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం పన్ను రద్దు చేసిందని... అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నది. కానీ మరో వైపు కేంద్రం నుంచి సరైన రీతిలో సహకారం లభించని ఫలితంగా నిర్వాసితులకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. ఇంకో వైపు నిధుల సమస్య తీవ్రంగా వేధిస్తూనే ఉంది. సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించక పోవడంతో పాటు రాష్ట్రం ఖర్చు చేసిన నిధులకు సైతం ఇంతవరకు పత్తా లేకుండా పోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఉంది. రాష్ట్రానికి ఇంకా కేంద్రం రూ. 1995 కోట్లు దాకా ఇవ్వాల్సి ఉంది. కానీ వీటి అతీగతీ లేదు. పెరిగిన ధరల నేపథ్యంలో భూసేకరణ, పునరావాసం వ్యయం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాల్లో పునరావాసంలో భాగంగా పెద్ద ఎత్తున ఇళ్ల కాలనీలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ఒక కొలిక్కి వస్తుందనుకున్న నేపథ్యంలో నిధుల సమస్య ఏర్పడిందంటున్నారు.

polavaram 010720118 2

తాజాగా కేంద్రం జలవనరుల సంఘం అధికారులు నిర్వహించిన సమావేశంలో కూడా ఈ విషయమై చర్చించినా పెద్దగా పురోగతి లేదంటున్నారు. దీంతో పునరావాస కార్యక్రమాలకు కొంత నిధుల సమస్య ఉన్నా,రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులుతో పునరావాస కార్యక్రమాలతో ముందుకెళుతుందంటున్నారు. నిర్వాసితులకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ వారికి చట్ట ప్రకారం చేయాల్సిన పునరావాస కార్యక్రమాలతో పాటు ఇళ్ల కాలనీల నిర్మాణం, భూమికి భూమి,నష్టపరిహారం,తదితర కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. నిర్దేశిత గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ఆంధ్ర జాతికి అంకితం చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరావాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ,ముందుకు వెళుతున్నారు. మారిన కాలమాన పరిసితులు,ధరలు వల్ల భూసేకరణ, పునర్నిర్మాణ, పునరావాస ప్యాకేజీకి రూ. 33,225.74 కోట్లుకు పెరిగిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమిని ఇంకా కొంత మందికి అందజేయాల్సి ఉంది.

polavaram 010720118 3

ఉభయగోదావరి జిల్లాల్లో భూసేకరణ, నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీకి సంబంధించి మొత్తం రూ. 5212.20 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 1991.27 కోట్లు పంపిణీ అయింది. ఇంకా రూ. 3220.93 కోట్లు నిర్వాసితులకు చెల్లించాల్సి ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 29,816 ఎకరాలు సేకరించి, రూ. 1404 కోట్లకు గాను ఇంకా రూ.86 కోట్లు చెల్లించాల్సి ఉందంటున్నారు. మొత్తం 16,871 మంది నిర్వాసిత కుటుంబాలకు రూ. 2221కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ. 164.60 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా రూ. 2056 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు పునరావాసం ప్యాకేజీ భూముల నష్టపరిహారానికి కలిపి మొత్తం రూ. 1482.60 కోట్లు పంపిణీ చేసినట్లు సమాచారం. ఇంకా రూ.2142.40 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.

తూర్పుగోదావరి జిల్లాలో 15,680.02 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు ఇందుకోసం రూ. 454.02 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.289.07 కోట్లు ఇవ్వాల్సిఉంది. 6187 నిర్వాసిత కుటుంబబాలకు కేవలం రూ. 54.65 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇంకా 4849 కుటుంబాలకు రూ. 839.46 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ జిల్లాలో భూసేకరణ,పరిహారం , పునరావాస ప్యాకేజీకి సంబంధించి ఇంకా రూ.1078.58 కోట్లను చెల్లించాల్సి ఉందంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కేవలం 500 ఎకరాలను మాత్రమే భూమికి భూమిగా ఇచ్చారని తెలిసింది. భూసేకరణ,సహాయ పునరావాస కార్యక్రమాలను 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి చేపట్టాల్సిరావడంతోనే వీటికయ్యే వ్యయం 33వేల కోట్ల రూపాయలకు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి నివేదించింది. అంతే కాకుండా పార్లమెంటరీ కమిటీతో పాటు ఎస్టీ కమిటీ, కేంద్ర ఎస్సీ కమిషన్ సహా పలు జాతీయ కమిటీలు నిర్వాసితుల ప్రాంతాల్లో పర్యటించి, రాష్ట్ర భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల పై పూర్తి సంతృప్తిని వ్యక్తంచేశాయి.

పవిత్ర సంగమంలో పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. పర్యాటకులు కొందరు సరదా పేరుతో సంగమం ఘాట్‌లలోకి దిగి ఈత కొడుతున్నారు. ఇటీవల కంచికచర్ల మిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు గోదావరి ఘాట్‌లోకి దిగి గల్లంతై మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో సంగమంలో భద్రత చర్యలు లోపభూయిష్టంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రమాద సంఘటన తెలుసుకుని 6 గంటలకు పైగా ఘాట్‌లలో ఉండి పరిశీలించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి స్థానికులు పలు సమస్యలు తీసుకువచ్చారు.

sangamam 01072018 2

పవిత్ర సంగమంలో ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడం వల్ల పర్యాటకులు, విద్యార్థులు ఘాట్‌లలోకి దిగి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల బాలుర దగ్గర నుంచి ఇంజనీరింగ్‌ విద్యార్థుల వరకూ ఘాట్‌లలోకి సరదా కోసం దిగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారుల సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీస్‌ భద్రతపై ప్రధానంగా చర్చించారు.

sangamam 01072018 3

పవిత్ర సంగమం ఘాట్‌ పొడవునా ఇకపై ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లతో నిఘా ఉంచనున్నారు. ఘాట్‌లలోకి వెళ్లకుండా వీరు అప్రమత్తంగా ఉంటారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో 15 మంది కానిస్టేబుల్స్‌ విధులు నిర్వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఘాట్‌లలోకి దిగి ఈతకొట్టేందుకు అనుమతులు ఇచ్చే ప్రసక్తి లేకుండా ఆదేశాలు జారీ చేశారు. పిండ ప్రదానాలకు సైతం ముందస్తు అనుమతులు తీసుకోవాలనే నిబంధన పెట్టారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది..బీజేపీ పేరెత్తితేనే జనం మండిపడుతున్నారు.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్న కోపం ప్రజల్లో నెలకొంది.. అయితే ఆరిపోతున్న దీపానికి కాసింత చమురు అందించే ప్రయత్నంలో పడ్డారు ప్రధాని నరేంద్రమోదీ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. ఇందుకోసం వరుస కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.. బీజేపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విస్తృత ప్రచారం చేయాలి.. కేంద్రం బోలెడన్ని నిధులు ఇస్తోందనీ... ఏపీ ప్రభుత్వం తప్పిదాల వల్లే నిధులు రాకుండా ఆగిపోయాయని జనానికి చెప్పాలి. ఇలా ఇచ్చిన బాధ్యతలను ఎంపీలు.. ఎమ్మెల్యేలు సక్రమంగా నిర్వర్తించాక కేంద్రమంత్రులను ఏపీకి పంపించాలన్నది బీజేపీ హైకమాండ్‌ ఆలోచన..

bjpleaders 01072018 2

అసలు విషయానికి వస్తే ఎప్పుడూ నెల్లూరు వైపు కన్నెత్తి కూడా చూడని కమలం పార్టీ ఎంపీ గోకరాజు గంగరాజు అకస్మాత్తుగా సింహపురిలో వాలిపోయారు. విశేష్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగానే గోకరాజు నెల్లూరుకు వచ్చారని బీజేపీ వాళ్లే చెప్పారు. ఈ క్రమంలోనే నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి అతిథిగృహంలో గోకరాజు గంగరాజు సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశానికి జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థల అధినేతలు కూడా వచ్చారు. ఇక సమావేశంలో గోకరాజు బీజేపీ గొప్పదనాన్ని.. నరేంద్రమోదీ ఏపీకి చేసిన మేళ్ల గురించి పెద్ద ప్రసంగమే చేశారు.. ఆ తర్వాత పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.. చివర్లో పార్టీ నేతలు.. ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో కలిసి ఓ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ గంగరాజుకు షాకుల మీద షాకులు తగిలాయి.. ఆయన స్పీచ్‌ స్టార్ట్‌ చేయగానే... సమావేశానికి వచ్చిన వారంతా అంతెత్తున లేచారు.. ఏపీకి బీజేపీ ఏం చేసిందండీ.. అంటూ సూటిగానే ప్రశ్నించారు.. నోట్ల రద్దు.. జీఎస్టీ కారణంగా జనం ఇంకా ఇబ్బందులు పడుతున్నారని.. పైగా పెట్రో ధరలు అమాంతం పెంచేయడంతో ప్రజలు పార్టీని తిట్టిపోస్తున్నారని గంగరాజుకు గట్టిగానే చెప్పారు.

bjpleaders 01072018 3

అమరావతికి నిధులు ఎందుకు ఇవ్వరు..? కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు అనుమతి ఇవ్వరు..? విశాఖ రైల్వే జోన్‌ సంగతేమిటి..? పోలవరం నిధుల మాటేమిటి..? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి గంగరాజుకు దిమ్మతిరిగే షాకిచ్చారు.. సమావేశానికి వచ్చినవారంతా ఉన్నత విద్యావంతులే! ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్నవారే! సమావేశం వేడెక్కడంతో అక్కడ ఉన్న కొందరు బీజేపీ నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.. ఇప్పుడు ఇవన్నీ వద్దు.. బయట మీడియా ఉందని అని చెప్పి సమావేశాన్ని ముగించారు. సమావేశానికి వచ్చిన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం గంగరాజు వల్ల కాలేదు.. పైగా వారి కోపాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మొత్తంమీద ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో నెల్లూరు పర్యటన ద్వారా బీజేపీ నేతలకు బాగా అర్ధమైంది.

Advertisements

Latest Articles

Most Read