భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. రాజ్యసభలో తమ సంఖ్యా బలాన్ని పెంచుకోవటంతో పాటు ఇంత వరకు తమకు దూరంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు తెర వెనక చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం 69. అయితే ఈ సంఖ్యను పెంచుకొనేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు నామినేటెడ్ సీట్లను భర్తీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదిక పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేయటం ద్వారా తమ సంఖ్యా బలాన్ని 69 నుండి 73 పెంచుకునేందుకు బీజేపీ అధినాయకత్వం శరవేగంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. నాలుగు నామినేటెడ్ సీట్లకోసం బీజేపీ అధినాయకత్వం పన్నెండు పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

amitshah 30062018 2

ఈ పన్నెండు మందిలో నలుగురిని ఎంపిక చేసి వీరి పేర్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందకు పంపిస్తారని అంటున్నారు. ఆ నలుగురిలో బాలీవుడ్ మాజీ సూపర్ స్టార్ మాధురీ దీక్షిత్, హర్యానాకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్, శివాజీ జీవితం ఆధారంగా 'జనతా రాజ్' అనే పుస్తకం రాసిన బాబాసాహెబ్ పురందరేతో పాటు పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడిని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కూటమికి ప్రస్తుతం 106 మంది సభ్యుల మద్దతు ఉన్నది. నలుగురు నామీనేటెడ్ సభ్యులను కలుపుకుంటే ఈ సంఖ్య 110కు చేరుకుంటుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు బీజేపీ కూటమికి మరో ఇరవై మూడు మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఆరుగురు రాజ్యసభ సభ్యులున్న టీఆర్ఎస్ అధినాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరాపుతో ఈ విషయం గురించి ప్రస్తావించి ఉంటారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

amitshah 30062018 3

ముగ్గురు సభ్యులున్న వైఎస్ఆర్ సీపీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తుందనే మాట వినిపిస్తోంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్న బీజేడీని ఒప్పించేందుకు బీజేపీ అధినాయకత్వం తెర వెనక ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేడీ మద్దతు ఇచ్చేందుకు అంగీకరిస్తే బీజేపీకి మరో ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఆ ఐదుగురి మద్దతు సంపాదించటం పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు పెద్ద పని కాదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికల కోసం శివసేనతో రాజీపడేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధం కావటం తెలిసిందే. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వటం ద్వారా శివ సేనను మంచి చేసుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకూ సత్పలితాలను ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రాంతీయ పార్టీల కూటమి ప్రతిపాదించే అభ్యర్థికి బీజేడీ మద్దతు సంపాదించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

పేద వర్గాల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లు నిర్మాణం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల నిర్మాణ పనులు చివరకు వచ్చాయి. మరో వారం పది రోజుల్లో విజయవాడ, భవానీపురంలో అన్న క్యాంటీన్ మొదలు పెట్టనున్నారు. అన్న క్యాంటీన్లు ఏడాదిలో 365 రోజులూ పని చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పూటకు ఒక్కో క్యాంటీన్లో కనీసం 350 మందికి అల్పాహారం/ఆహారం అందించేలా రూపొందిస్తున్న వీటి నిర్వహణ పరిశీలనకు వాస్తవిక సమీక్ష వ్యవస్థ (రియల్‌ టైం మోనిటరింగ్‌ సిస్టం)ను ప్రవేశపెడుతున్నారు. 50వేల జనాభా పైబడిన 71 పట్టణాల్లో వీటిని 203 చోట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

anna 30062018 2

మొదటి విడతగా 40 క్యాంటీన్లను వారం రోజుల్లో ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకటి, రెండు నెలల్లో మొత్తం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో తమిళనాడు, కర్ణాటక తర్వాత పేదలకు ప్రత్యేకంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపి రూ.15కే అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.131 కోట్లు ఖర్చు చేయనుంది. తగిన సదుపాయాలతో ఒక్కో క్యాంటీన్‌ నిర్మాణానికి రూ.36 లక్షలు చొప్పున మరో రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు. 750 చదరపు అడుగుల విస్తీర్ణం (ఎస్‌ఎఫ్‌టీ)లో చేపట్టే భవనాల్లో తాగునీటి సదుపాయం, విద్యుత్తు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాటు, ఇంటర్నెట్‌, ఎల్‌సీడీలు, సీసీ టీవీలు, చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయనున్నారు.

anna 30062018 3

ఆధార్‌ అనుసంధానించి ప్రజల నుంచి బయోమెట్రిక్‌ తీసుకొని ఎలక్ట్రానిక్‌ విధానంలో టోకెన్లు జారీ చేస్తారు. ఆహారం తయారీ, పంపిణీ టెండర్‌ను అక్షయపాత్ర దక్కించుకుంది. వాస్తవిక సమీక్ష వ్యవస్థ(ఆర్టీఎం)తో వీటి పనితీరును సచివాలయం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు గమనించవచ్చు. ఆహార పదార్థాల నాణ్యత నుంచి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేలా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం సమీపంలోని మందడం గ్రామంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీను విజయవంతంగా కొనసాగుతుంది.

జగన్ మోహన్ రెడ్డికి ప్రధాన ఓటు బ్యాంకుగా, దళితులు ఉన్నారు అనేది విశ్లేషకుల భావన. అయితే దీని పై చంద్రబాబు తనదైన మార్క్ తో తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోజిటివ్ ఫీల్ తో, వారిని తమ వైపు తిప్పుకోవటానికి, ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసారు. సార్వత్రిక ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దళితుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టిడిపి. విపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు టీడీపీ ఎప్పికప్పుడు సరికొత్త పథకాలను రూపొందిస్తూ ఆయా సామాజికవర్గాల ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని దళిత ఓటర్లను ఆకర్షించేందుకు దళిత తేజం తెలుగుదేశం పేరుతో ముందడుగు కార్యక్రమానికి జవరి 26 రిపబ్లిక్ డే నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేవరకు వారికి అండగా ఉండే బాధ్యతను స్వీకరిస్తానని ఆనాటి సభలో సీఎం హామీ ఇచ్చారు.

ఎన్టీఆర్ హయాంలో దామాషా ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించినా, ఉద్యోగ రిజర్వేషన్ కల్పించింది తానేనని చంద్రబాబు స్పష్టం చేశారు. అందరికీ చేయూతనిస్తాను, అన్ని విధాలా ఆదరిస్తాను, ఈ కార్య క్రమాన్ని స్ఫూర్తి దాయకంగా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, శ్రేణులకు సీఎం ఆదేశించారు. ఇంటింటికీ టీడీపీ తరహాలో రాష్ట్రంలోని దళిత వాడలకు వెళ్లి వారితో మమేకం కావాలని చంద్రబాబు సూచించిన నేపద్యంలో, పార్టీలోని దళిత నాయకులు ఈ కార్యక్రమంలో ముందుండి నిర్వహించారు. గుంటూరు జిల్లాలో దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించగా ఈనెల 30న నెల్లూరు పట్టణంలో ముగింపు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల 20 లక్షల దళిత కుటుంబాల వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు దళిత నేతలు వెళ్లి వారి సంక్షేమం కోసం చేపట్టిన వివిధ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోగా ఎన్డీఏ నుండి టీడీపీ వైదొలగడం, సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం తదితర కార్యక్రమాలతో ముగింపు సభ వాయిదా పడుతూ వచ్చింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న కోటి దళిత కుటుంబాలకు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించని విధంగా రూ. 3 వేల కోట్లతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు కరపత్రాలు ప్రచురించడంతో పాటు డాక్యుమెంటరీలను దళితవాడల్లో ప్రదర్శించారు. ముఖ్యంగా దళితులకు ఇన్నోవా కార్లు, జేసీబీలు, ట్రాక్టర్లు, బ్యాటరీ వాహనాలు, ఎన్టీఆర్ విద్యోన్నతిలో భాగంగా సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ, ఎన్టీఆర్ విదేశీ విద్య, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు తదితర పథకాల గురించి దళితవాడల్లో ప్రచారం నిర్వహించారు.

టీడీపీ హయాం లోనే దళితుల అభివృద్ధి జరిగిందని, టీడపీ ఉంటేనే దళితుల సంక్షేమం ఉంటుందని అభిప్రాయాన్ని కలుగ జేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా వైపు మొగ్గుచూపిన దళిత ఓటర్లను ఆకర్షించేందుకు పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయంగా వస్తున్న బీసీ ఓట్లతో పాటు దళితుల ఓట్లను కూడా రానున్న ఎన్నికల్లో ఆకర్షించేందుకు దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని రూపొందించి సఫలీకృతులయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగానే ఏప్రిల్ 5న బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి, 11న జ్యోతీరావు ఫూలే జయంతి, 14న అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిర్వహించారు. ఈనేపద్యంలోనే రాజధాని అమరావతి ప్రాంతంలో 100 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల భారీ విగ్రహ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అదే విధంగా దళిత నాయకత్వాన్ని పెంపొందించడంతో పాటు వారికి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి దళిత వాడల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దీనికోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా యాప్ ను రూపొందించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. మొత్తానికి చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నాలతో, పూర్తిగా కాకపోయినా, ఎంతో కొంత జగన్ ఓటు బ్యాంకు దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని అంచనా వేస్తున్న జగన్, దీనికి విరుగుడుగా ఏమి చెయ్యాలో తెలియక, ఖంగారు పడుతున్నారు.

రమణ దీక్షితులు ఫ్రెండ్ అయిన క్రైస్తవ మత ప్రచారకుడు బోరుగడ్డ అనిల్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం ధాకలు చేసాడు. శ్రీవారి కైంకర్యాల్లో ఆగమ నియమాలను విస్మరించి అపచారం చేస్తున్నారంటూ తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన అభియోగాలను ఉటంకిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని క్రైస్తవ మత ప్రచారం నిర్వహించే సైమన్‌ అమృత్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి, ఆర్‌పీఐ నాయకుడైన గుంటూరు అరండల్‌పేటకు చెందిన అనిల్‌కుమార్‌ బోరుగడ్డ, గుజరాత్‌కు చెందిన భూపేంద్ర కె. గోస్వామి సంయుక్తంగా దాఖలు చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్‌, ఈవో, ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను ప్రతివాదులుగా చేర్చారు. కనబడకుండా పోయిన స్వామివారి పురాతన నగలపై కమిటీ వేయాలని కోరాడు.

tiruamala 30062018 2

టీటీడీ బోర్డు చూపుతున్న ఆదాయ వ్యయాలు, నేలమాళిగల్లోని రహస్య నిధులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరాడు. తిరుమల తిరుపతి దేవస్థానం, దాని అనుబంధ ఆలయాలను రక్షిత కట్టడాలుగా గుర్తిస్తూ ఈ ఏడాది మే 4న ఆర్కియాలజీ శాఖ జారీచేసిన సర్క్యులర్‌ను పునరుర్ధరించాలని కోరారు. తద్వారా, తిరుమలను కేంద్రం స్వాధీనం చేసుకునేలా చెయ్యాలనే ప్లాన్ వేసారు. కొన్ని రోజుల క్రితం, క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొనే బోరుగడ్డ అనిల్‌తో కలిసి రమణ దీక్షితులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టటంతో, యావత్ హిందూ మతం అవాక్కయింది. ఇప్పుడు ఏకంగా, తిరుమల ఆగమ నియమాల గురించి, ఒక క్రైస్తవ మత ప్రచారకుడు పిల్ వెయ్యటం చూస్తుంటే, దీని వెనుక ఎలాంటి కుట్ర దాగి ఉందో మరి.

tiruamala 30062018 3

గుంటూరుకు చెందిన అనిల్‌.. సైమన్స్‌ అమృత్‌ ఫౌండేషన్‌ అనే క్రైస్తవ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన... రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా. బోరుగడ్డ అనిల్‌పై పలు కేసులు, ఆరోపణలున్నాయి. గత ఏడాది రాజధాని పరిధిలోని తాడికొండ స్టేషన్‌లో ఆయనపై మారణాయుధాలు కలిగి ఉండటంతోపాటు చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలో 2016 ఏప్రిల్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన ఇంటూరి సురేశ్‌ బాబును బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశారని, తప్పుడు డాక్యుమెంట్లతో ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. అనిల్‌ను అరెస్టు చేశారు. ఈ సమయంలో ఆయన కారులో మారణాయుధాలు లభించాయి. దీంతో రెండు కార్లను కూడా తాడికొండ పోలీసులు సీజ్‌ చేశారు. ‘మా పిన్నమ్మ జగన్‌కు బంధువు’ అని అనిల్‌ పేర్కొంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఓ క్రైస్తవ సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పత్రికలకు ఫొటోలు పంపుతుంటారు. జగన్ బావమరిదిని అని చెప్పుకుంటూ, వైఎస్ వై. యెస్. వివేకానంద రెడ్డికి మేనల్లుడు వరుస అని కూడా చెప్పుకుంటూ తిరుగుతాడని, ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీ ఈ ప్రచారాన్ని ఖండించలేదని, వైఎస్ ఫ్యామిలీకి ఈయన బంధువు అని చెప్పటానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read