ఢిల్లీ పెద్దల పాదాలు కనిపిస్తే చాలు, A1, A2 వాలిపోతున్నారు.. A1కు పాదయాత్రలో ఉండి, ఢిల్లీ పెద్దలను కలిసే ఛాన్స్ లేక కాని, లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో రామ్ నాథ్ కోవింద్ పై ఎలా పడ్డాడో చూసాం.. ఇక A2 గారి సంగతి అయితే చెప్పేది ఏముంది, ప్రత్యేక్షంగా ఒక 10 సందర్భాలు అయినా చూసి ఉంటాం... ఒక ఇద్దరు ఆర్ధక నేరగాళ్ళు, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో A1, A2, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న వీళ్ళు, అవలీలగా వెళ్లి ఒక దేశ ప్రధానిని కలుస్తూ, ప్రాధాన మంత్రి ఆఫీస్ లోనే ఉంటూ, రాష్ట్రం పై ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో చూస్తూనే ఉన్నాం... అయితే, ఇప్పుడు కాకా పట్టటంలో మన A2 గారు కొత్త రకంగా ప్లాన్ చేసారు.

vijayasar 02072018 2

విజయసాయి రెడ్డి ఓ పుస్తకం రాశారు.. అవాక్కయ్యారా ? లక్షల కోట్లు ఎలా సంపాదించాలి, దొంగ కంపంలీ ఎలా పెట్టాలి అనే పుస్తకాలు కాదు అండి... ఆయన రాసిన పుస్తకం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపైన. తాను వెంకన్నపై ఓ పుస్తకాన్ని రాసినట్లు విజయసాయి స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ‘గ్లోరీ ఆప్ లార్డ్ వెంకటేశ్వర’ అనే పేరుతో ఈ పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తానని ట్వీట్ చేశారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ అంటే అర్ధం చేసుకోవచ్చు, గుజరాతీ భాషలో కూడా పుస్తకం ఎందుకు అనే అనుమానాలు వస్తున్నాయి. మరాఠీ నుంచి చాలా మంది వెంకన్న భక్తులు ఉన్నారు, పక్కన తమిళనాడు అయితే చెప్పే పనే లేదు. అలాగే ఇంకా అనేక భాషలు ఉండగా, విజయసాయి రెడ్డి, గుజరాతీ ప్రాంతీయ భాషలోనే పుస్తకం రాసారు.

vijayasar 02072018 3

ఎందుకో చెప్పే పని లేదు అనుకుంటా... ఈ విధంగా, గుజరాత్ బాస్ ని కాక పట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గుజరతీలో రాయటం వెనుక మరో కారణం కూడా ఉంది. ఈ పుస్తకాన్ని, ప్రధాని మోడీ చేత ఆవిష్కరించే ప్లాన్ వేసాడు అని ఢిల్లీ వర్గాల టాక్.. ప్రధానికి ఇప్పటికే ఈ విషయం తెలుపుగా, ఆయాన కూడా సరే అన్నట్టు తెలుస్తుంది. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు మన ప్రధానికి కనపడవు కాని, A2 రాసిన పుస్తకం మాత్రం విడుదల చేస్తారంట... ఆయినే, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న వాడికి, ప్రధాని స్థాయి వ్యక్తి ప్రోత్సహిస్తున్నాడు అంటే, ఇంకా ఏమి చెప్పాలి ? మరో పక్క, దీనిలో రాజకీయం కూడా జోడించారనే ప్రచారం జరుగుతుంది. తిరుమల చుట్టూ ఇటీవల జరిగిన వరుస వివాదాలు, విజయసాయి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, రమణ దీక్షితులు వివాదం వంటి పరిణామాల తర్వాత ఆయన ఈ పుస్తకాన్ని తీసుకువస్తున్నారు.

ప్రాభవాన్ని కోల్పోతున్న డప్పు కళకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. యవతకు డప్పు వాయిద్యంలో శిక్షణ ఇవ్వడానికి తోడుగా, డప్పు కళాకారులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. డప్పు కళాకారులకు నెలకు రూ.1,500 పింఛన్‌ మంజూరు చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. పింఛన్‌ పొందేందుకు వయో పరిమితి 50ఏళ్లుగా నిర్ణయించారు. లబ్దిదారులు బీపీఎల్‌ కేటగిరికి చెందినవారై ఉండాలనీ, గతంలో మరో పింఛన్‌ పొంది ఉండరాదనీ, సంక్షేమ శాఖ నిర్దేశించిన ఇతర అర్హతలను కలిగి ఉండాలని ఆ జీఓ పేర్కొన్నది.

cbn 02072018 2

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థానిక, సులభ, సాంప్రదాయిక వాయిద్యం ‘డప్పు’..అనేక కుటుంబాలకు వారసత్వంగా వస్తున్న గ్రామీణ కళారూపం. జానపద సంగీత, నత్య విభావరుల్లో కీలక వాయిద్యం డప్పు. శుభానికి, అశుభానికి, ఆనందంలో, ఆవేదనలో గ్రామాల్లో, పట్టణాల్లో డప్పు ఢమఢమలు ప్రతిధ్వనించడం అనాదిగా సాంప్రదాయంగా వస్తోంది. మన రాష్రంలో మానవ జీవన దశలన్నింటిలో డప్పు దరువు మోగాల్సిందే. పండుగ, పబ్బాలు, గ్రామోత్సవాలు, తిరునాళ్ల సందడుల్లోనే కాదు పుట్టుకలో, పెళ్లిళ్లు, చావులు అన్ని కార్యక్రమాల్లోనూ దాదాపు ఏపీలోని పల్లెల్లో, వార్డులలో డప్పు మార్మోగుతుంది.

cbn 02072018 3

అయితే, ఇప్పటి యువతరం డప్పు కళను జీవనోపాధిగా చేసుకోవడానికి సుముఖంగా లేదు. దానినే ప్రధాన ఉపాధిగా మలుచుకోలేని పరిస్థితిలో వేరే వృత్తులకు మళ్లుతున్నారు.దీనితో డప్పుకళ మనుగడ కోల్పోయే దుస్థితి ఏర్పడింది. పల్లెల్లో, పట్టణాలలో డప్పు కళాకారుల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయిక డప్పు కళకు జవం, జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే పింఛన్‌ మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హోంగార్డుల ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీయిజం ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి అన్నారు. హోంగార్డులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటున్నారని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను, పోలీసులకు వేరుగా చూడటం లేదన్నారు. ఇది సన్మాన సభ కాదని.. హోంగార్డుల చైతన్య సభ అని పేర్కొన్నారు. కేంద్ర సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థ సహకరిస్తే మొట్టమొదట హోంగార్డులనే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడటంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలసి సీఎం పోలీసుశాఖకు సూచించారు. లాక్డ్ హౌస్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు.

homegaurds 02072018 1

1948లో ఆంధ్రప్రదేశ్ హోం గార్డ్ చట్టం రూపకల్పన చేశారు. పోలీసులతో సమానంగా ప్రకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతల, ట్రాఫిక్ విధుల్లో, నేరపరిశోధన పనుల్లో, బీటు డ్యూటీ సమయంలో విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ వ్యవస్థ ఏర్పడి 70 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం మేలు చెయ్యని విధంగా ఈ వ్యవస్థ కు గౌరవం, గుర్తింపు తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకు రోజువారి అందించే దినసరి భత్యాన్ని రూ.400 నుంచి రూ.600 పెంచుతూ నెలకు రూ.9000 ఉన్న జీతాన్ని రూ.18000 జీతం చెల్లింపుకు ఉత్తర్వులు జారీచేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి గరిష్టంగా రూ.2,50,000 వైద్య సేవలు కల్పిస్తున్నారు. హోం గార్డ్ మరణించిన సమయంలో ఇచ్చే సహాయాన్ని రూ.1000 నుంచి రూ.10 వేలకు పెంచారు.

homegaurds 02072018 1

ప్రమాదవశాత్తు గాని, సహజ మరణం గాని సంభవిస్తే రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల రెండు రోజులు జీతం తో కూడిన సెలవు మంజురూ చెయ్యడం జరిగింది. రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డు లు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్ నియామకంలో హోంగార్డు లకు 8 శాతం కోటాను అమలుచేస్తున్నారు. మహిళా హోంగార్డు లకు మూడు నెలల ప్రసూతి సెలవులు. విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సహా ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ సహకరిస్తే మొదట హోంగార్డులనే ఆదుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఒక శాఖ సమీక్షకు ముందు డేటా రావల్సి ఉంటుంది. అది ఉంటేనే సమీక్ష. లేకపోతే లేదు. అది పాత పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి మార్చేశారు చంద్రబాబు నాయుడు. అధికారుల కంటే ముందే తన ట్యాబ్‌లో సమాచారం సిద్ధంగా ఉంచుకుంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసు మీరుతున్నకొద్దీ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. సర్కారు శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక్క నిమిషంలో తెలుసుకునేందుకు రూపొందించుకున్న డ్యాష్‌బోర్డు ఇప్పుడు అధికారులను హడలెత్తిస్తోంది. ఇది ఇలా ఉండగా, తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు ఐటి శాఖా మంత్రి నారా లోకేష్. తన శాఖకు ప్రత్యేకంగా ఒక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసారు. ఏ మంత్రికి లేని విధంగా, తన శాఖకు ఒక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసారు.  http://www.mydepartments.in/PRRWS/ministerHomePage

lokesh dash 02072018 2

ఈ డ్యాష్‌బోర్డు ఒక్క క్లిక్‌ద్వారా పారదర్శకతను ఆవిష్కరిస్తోంది. పంచాయితీ రాజ్, ఐటి శాఖలకు చెందిన సమగ్ర సమాచారం ఇందులో అందుబాటులో ఉంచారు. డ్యాష్‌బోర్డు లో తన మంత్రిత్వశాఖ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, తన మంత్రిత్వ శాఖ పెట్టే ప్రతి ఖర్చు, వివిధ జీఓలతో పాటు, అనేక గణాంకాలు ఉన్నాయి. పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు ఐటి ఇ & సి కి సంబంధించిన వివిధ సెక్షన్స్ ఈ డ్యాష్‌బోర్డులో ఉన్నాయి. గ్రామీణాభివృద్ధిలో, ఉపాధి హామీ కూలీల వివరాలు, ఎన్టీఆర్ జలసిరి, తదితర వివరాలు రియల్ టైంలో అందుబాటులో ఉంటాయి.

lokesh dash 02072018 3

ఇక గ్రామీణ నీటి సరఫరాలో, నీళ్ళ టాంకర్ల వివరాలు, ఆ టాంకర్ ఎక్కడ ఉందో జీపీఎస్ ద్వారా కనిపెట్టటం, ఇలా పూర్తి వివరాలు, గ్రామ స్థాయి వరకు ఉన్నాయి. ఎన్టీఆర్ సుజల, జాలవని, వాటర్ ట్యాంక్ క్లీనింగ్, నీటి సరఫరా, ఇలా పూర్తి సమాచారం రియల్ టైంలో ఉంది. ఇక ఐటి శాఖ పేజికు వస్తే, పెట్టుబడుల వివరాలు, ఈ ఆఫీస్, ఫైబర్ గ్రిడ్, ఇలా అనేక వివరాలు ఉన్నాయి. ఇవన్నీ ఎదో పెట్టాం అంటే పెట్టాం అన్నట్టు కాకుండా, పూర్తి వివరాలు ఉన్నాయి. ఎక్కడా పారదర్సకత లోపించకుండా, గ్రామ స్థాయి వరకు ఇందులో వివరాలు ఉన్నాయి. ప్రస్తుత్తం ఉంటున్న సియం డ్యాష్‌బోర్డులో దాదాపు 33 శాఖలకు సంబందించిన వివరాలు ఉన్నాయి. అయితే, అందులో ఆ శాఖలకు సంబంధించిన అతి ముఖ్యమైన పనులు వివరాలు ఉంటాయి. ఇప్పుడు లోకేష్ తన శాఖకు ప్రత్యెక డ్యాష్‌బోర్డు పెట్టటంతో, తన శాఖ పరిధిలో, ప్రతి విషయం రియల్ టైంలో ప్రజల ముందు ఉంచుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read