విజయవాడ నగర పోలీసు కమీషనర్‌ గౌతం సవాంగ్‌ రాష్ట్ర పోలీసు బాస్‌గా నియమితులు కానున్నారని ప్రచారం జరిగింది. డీజీపీగా తనను నియమిస్తారని ఆయన విశ్వాసంతో ఉన్నారు. డీజీపీ పదవికి గౌతం సవాంగ్‌తో పాటు ఆర్‌పిఠాకూర్‌ పోటీపడ్డారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తారని పోలీసు ఉన్నతాధికారుల్లో ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం కీలకం కానుంది. ప్యానెల్‌ కమిటీ మొగ్గుతో పాటు సీఎం నిర్ణయంతో డీజీపీ ఎంపిక కావాల్సి ఉంది. శనివారం నాడు డీజీపీగా ఆర్‌పి ఠాకూర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విజయవాడ నగరపోలీసుల్లో కొంత నిరాశ అలుముకుంది. శనివారం నాడు గౌతం సవాంగ్‌ కూడా కొంత అన్యమనస్కంగా ఉన్నారు. కొత్త డీజీపీగా ఎంపికైన ఠాకూర్‌ సీపీ గౌతం సవాంగ్‌ను కలిసి వెళ్లినట్లు తెలిసింది. ఉదయం పరేడ్‌కు వెళ్లిన సీపీ మళ్లీ హెడ్‌ క్వార్టర్‌కు వెళ్లలేదని తెలిసింది. 1986 బ్యాచ్‌కు చెందిన సీపీ సవాంగ్‌కు ఇంకా అయిదేళ్ల సర్వీసు ఉంది. ప్రస్తుతం నియిమితులైన ఠాకూర్‌కు కేవలం రెండేళ్ల సర్వీసు మాత్రమే ఉంది. ఇదే కారణమని పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు.

అయితే, ఇప్పుడు గౌతం సవాంగ్ కు కొత్త బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసు కమిషనర్‌గా చేస్తున్న గౌతం సవాంగ్‌ను ఏసీబీ డీజీగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సవాంగ్‌ స్థానంలో విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్‌ గా, సీహెచ్‌ ద్వారకాతిరుమల రావు కొత్త సీపీగా వచ్చే అవకాశం ఉంది. ఈయన ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. సమర్థుడైన అధికారిగా ద్వారకా తిరుమలరావుకు పేరు ఉంది. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సైబరాబాద్‌ కమిషనర్‌గా పనిచేశారు. అంతకు ముందు అనంతపురం, మెదక్‌, కడప ఎస్పీగా, అనంతపురం రేంజి డీఐజీగా అక్టోపస్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఐజీగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

సీఐడీ అదనపు డీజీగా క్లిష్టమైన కేసులను కొలిక్కి తేవడంలో ఈయన సమర్థంగా పనిచేశారన్న పేరు ఉంది. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావును విజయవాడ పోలీసు కమిషనర్‌గా నియమించేందుకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తోపాటు కొత్త డీజీపీ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వీరి ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఒకటి రెండు రోజుల్లో విజయవాడకు కొత్త పోలీసు బాస్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజధాని ప్రాంతమైన విజయవాడ శాంతిభద్రతల పరంగా చాలా సున్నితమైన స్థానం. అంతే కాదు, ఇంకా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. వీటన్నింటినీ గాడిలో పెట్టాలంటే సమర్థుడైన అధికారిని కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు పేరు తెరపైకి వచ్చింది.

ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపించింది. అటల్ భూజల్‌లో రాష్ట్రానికి చోటు దక్కలేదు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే స్థానం కల్పించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కేంద్రంపై పోరు తీవ్రతరం చేయనుంది. రాష్ట్ర విభజనతో ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు, సాయం విషయంలో ఉదారంగా వ్యవహరించాల్సిన కేంద్రం... అందుకు విరుద్ధంగా మళ్లీ మొండిచేయి చూపింది. భూగర్భజలాలు పెంచడానికి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో రూ. 6వేల కోట్లతో కేంద జలవనరుల మంత్రిత్వ శాఖ అటల్ భూజల్ యోజనలో ఆంధ్రప్రదేశ్‌కు చోటు దక్కలేదు. ఎప్పటి మాదిరిగానే దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక మినహా మరో రాష్ట్రానికి స్థానం దక్కలేదు. ఉత్తరాదిలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చింది.

bjp 01072018 2

పథకం కింద రాష్ట్రం 25 శాతం భరిస్తే... కేంద్రం మిగిలిన 75 శాతం నిధులు ఇస్తుంది. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని 78 జిల్లాల్లో 8,350 గ్రామ పంచాయతీల్లో అటల్‌ భూజల్‌ పథకాన్ని నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న నీరు-ప్రగతి, నీరు -చెట్టు స్ఫూర్తితో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించినా... ఏపీని మాత్రం ఇందులో చేర్చలేదు. ఇందులోనే కాదు సమగ్ర శిక్షా అభియాన్‌ నిధుల్లోనూ ఏపీకి మొండి చేయి చూపించింది. ఇటీవలే కేంద్రం ప్రాథమిక (సర్వశిక్షా అభియాన్‌), మాధ్యమిక(రాష్ట్రీయ శిక్షా అభియాన్‌) విద్యారంగాలతో పాటు ఉపాధ్యాయ విద్యావ్యవస్థలను కలిపేసి ‘సమగ్ర శిక్షా అభియాన్‌’ పేరుతో ఒక కొత్త సొసైటీని ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాలు కూడా పూర్వ సొసైటీలను రద్దు చేసి సమగ్ర శిక్షా అభియాన్‌ పేరుతో కొత్త సొసైటీలను ఏర్పాటు చేసుకున్నాయి.

bjp 01072018 3

ఏపీ కూడా ఈ ఏడాది మే 9న ఢిల్లీలో జరిగిన ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు(పీఏబీ) సమావేశానికి హాజరై సమగ్ర శిక్షా అభియాన్‌ కింద 2018-19 విద్యా సంవత్సరానికి కావాల్సిన నిధులకోసం ప్రతిపాదనలు పంపింది.దాదాపు రూ.4వేల కోట్లకు ప్రతిపాదనలు ఇస్తే కేంద్రం కేవలం రూ.1875కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ నిధులు ప్రాథమిక, మాధ్యమిక విద్యారంగాలకు ఏమాత్రమూ సరిపోవని విద్యాశాఖ అధికారులే వాపోతున్నారు. ఎప్పుడు ఫోన్‌ చేసినా అదిగో... ఇదిగో అని చెప్పిన కేంద్ర ప్రభుత్వ అధికారులు గురువారం విడుదల చేసిన నిధుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపడం చూసి అధికారులు షాక్‌ అయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలుపుకొని మొత్తం 36 రాష్ట్రాలకుగానూ సమగ్ర శిక్షా అభియాన్‌ కింద రూ.8229.33 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా రూ.8109.59 కోట్లను అడ్‌హాక్‌ కింద విడుదల చేసింది.

అమరావతికి బ్రాండ్ ఇమేజ్ కోసం, పెట్టుబడులు కోసం, ప్రపంచంలో బెస్ట్ సిటీస్ లో ఒకటిగా చెయ్యటం కోసం, చంద్రబాబు ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 8, 9 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ నగరాల సదస్సు (డబ్ల్యూసీఎస్‌)లో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, సీఆర్‌డీఏ, ఏడీసీ, ఈడీబీకి చెందిన అధికారుల బృందం వెళ్లనుంది. సదస్సులో రాజధాని అమరావతి గురించి ప్రసంగించనున్నారు. అమరావతికి సంబంధించి సీఆర్‌డీఏ ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తోంది. డబ్ల్యూసీఎస్‌ సింగపూర్‌లో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచస్థాయి సదస్సు. ఈసారి జులై 8-12 వరకు జరగనుంది. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు...సదస్సులో పాల్గొనాలని చంద్రబాబుని ఆహ్వానించారు.

cbnsingapore 01072018 2

ఈ నెల 8న ఉదయం డబ్ల్యూసీఎస్‌లో జరిగే ప్రపంచ మేయర్ల ఫోరంలో చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం చేస్తారు. ఆధునిక నగరాలలో సమీకృతాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్ని అందిపుచ్చుకోవడం వంటి అంశాల్లో రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సమన్వయం, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడంలో అనుసరించాల్సిన వ్యూహాలు వంటి అంశాల్ని ప్రసంగంలో ప్రస్తావిస్తారు. అదే రోజు సాయంత్రం వివిధ దేశాల మేయర్లు, ప్రతినిధులతో జరిగే విందులో పాల్గొంటారు. ఆ మధ్యలో వివిధ కంపెనీలు, సంస్థల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు.

cbnsingapore 01072018 3

జులై 9న ఉదయం జరిగే ‘జాయింట్‌ ఓపెనింగ్‌ ప్లీనరీ సదస్సు’లో సీఎం ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు సింగపూర్‌ వెళుతున్నారు. ప్రపంచ నగరాల సదస్సులో సీఆర్‌డీఏ ఏర్పాటు చేసే పెవిలియన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాజధానిలో పెట్టుబడులకు అవకాశమున్న వివిధ ప్రాజెక్టులు, అమరావతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఏర్పాటు చేసే వసతుల కల్పనలో ఆయా సంస్థల భాగస్వామ్యానికి ఉన్న అవకాశాల్ని ఇందులో ప్రదర్శిస్తారు.

చంద్రబాబు ఏమి చేసిన అది టాక్ అఫ్ ది కంట్రీ అవుతుంది. 10 సంవత్సరాలు ముందు ఆలోచించే చంద్రబాబు, ఇప్పుడు తాజాగా జీరో బడ్జెట్ ఫార్మింగ్ విధానం పై రాష్ట్రంలో కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఇది న్యూయార్క్ టైమ్స్ లో కూడా వచ్చింది. ఇప్పుడు దేశంలో వివిధ రాష్ట్రాలు కూడా, ఈ విషయం పై, మన వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం/జీరో బడ్జెట్ ఫార్మింగ్ విధానం పై కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది. ఈ విధానాన్ని అందిపుచ్చుకుని స్థానికంగా రసాయనరహిత ఉత్పత్తులు తీసే దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ విషయమై గత వారం బెంగళూరులో నిర్వహించిన సమావేశానికి ఏపీ వ్యవసాయ సలహాదారు, జడ్బీఎన్‌ఎఫ్‌ అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న విజయకుమార్‌ను ఆహ్వానించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామితోపాటు కేబినెట్‌ మంత్రులు, వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

karnataka 01042018 2

ఆంధ్రప్రదేశ్‌లో జడ్బీఎన్‌ఎఫ్‌ అమలును ఈ సందర్భంగా విజయకుమార్‌ వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాలను ఆయన తెలియజేశారు. రైతులు కూడా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారన్నారు. సీఎం కుమారస్వామి ఆహ్వానం మేరకే కర్ణాటకకు వెళ్లి వచ్చినట్లు విజయకుమార్‌ చెప్పారు. సుమారు రెండు గంటల పాటు సమావేశంలో ఉన్న కుమారస్వామి ఈ విధానంపై ఎంతో ఆసక్తి కనబరచారన్నారు. ఏపీకి వచ్చి సాగు విధానాలు పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడాలని ఆహ్వానించగా అందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. త్వరలోనే తాను ఆంధ్రప్రదేశ్‌ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని చెప్పారన్నారు.

karnataka 01042018 3

పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేయాలని నీతిఅయోగ్‌ యోచిస్తోంది. దీనిపై జులై 9న దిల్లీలో అన్నిరాష్ట్రాల వ్యవసాయశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తోంది. దీనికి సుభాష్‌ పాలేకర్‌తోపాటు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌, ఏపీ వ్యవసాయ సలహాదారు విజయకుమార్‌ హజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అయిదుగురు రైతులకూ ఆహ్వానం అందింది. ప్రకృతి సాగులో వారు తమ అనుభవాలను నీతి అయోగ్‌ వేదికపై వివరించనున్నారు.

Advertisements

Latest Articles

Most Read