ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించటానికి రాష్ట్ర ప్రజలు అందరికి అవకాశం కల్పిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ఉచితంగా సందర్సించాలి అనుకునేవారు ముందుగా ఒక అసోసియేషన్‌గా ఏర్పడాలి. లేదా అమలులో వున్న ఏదో ఒక అసోసియేషన్ ద్వారా అయినా వెళ్ళవచ్చు. అంటే ఒక డ్వాక్రా గ్రూప్, లేదా ఒక రైతులు సంఘం, స్కూల్స్, వాకర్ క్లబ్, లయన్స్ క్లబ్, యువజన సంఘం, ఇలా ఒక గ్రూపుగా ఏర్పడాలి. తరువాత జిల్లాలోని నీటిపారుదల శాఖ ఆఫీస్‌లో వుండే జిల్లా స్థాయి అధికారికి పోలవరం యాత్ర గురించి తెలియచేస్తూ, బస్సు సదుపాయం కల్పించమని దరఖాస్తు చెయ్యాలి. నీటి పారుదల జిల్లా అధికారి సమీపంలోని ఆర్ టి సి డిపోకి సదరు సంఘం లేదా సంస్థకి బస్సు సదుపాయం కల్పించమని ఆదేశాలు జారీ చేస్తారు.

polavaram 29062018 3

నీటి పారుదల శాఖ జిల్లా అధికారి ఇచ్చిన సిఫార్సులేఖని బట్టి మీ సమీపంలోని ఆర్టీసీ డిపోలో సమర్పించి ఉచిత బస్సు పొందవచ్చు. నీటి పారుదలశాఖ జిల్లా అధికారికి మీ ప్రయాణ తేదీని ముందే తెలియచేసినట్లయితే, వారు పోలవరం సైట్‌లో వున్న నీటిపారుదల విభాగానికి ఫలానా రోజు ఫలానా డిపో బస్సు వస్తుంది అని ముందే తెలియచేస్తారు. అప్పుడు మీకు సైట్ దగ్గర క్యాంటీన్ లో భోజన సదుపాయం ఉచితంగా లభిస్తుంది, లేనిచో ఉచిత భోజన సదుపాయం లభించదు. ఈ ప్రొసీజర్ అంతా మనకి ఎందుకు అంటారా..? మనమే డబ్బు పెట్టుకుని ప్రైవేట్ వాహనాలలో వెళ్ళొచ్చు. ప్రైవేట్ వాహనాలని సైట్ లో చూడటానికి అనుమతిస్తారు. సైట్ కాంటీన్ దగ్గర పెయిడ్ భోజనం ఉంటుంది.

polavaram 29062018 2

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వైపు నుంచి వచ్చేవారు రాజముండ్రి వచ్చి అక్కడ నుంచి రోడ్ కం రైల్ బ్రిడ్జ్ మీదగా కొవ్వూరు వచ్చి, కొవ్వూరు, చిదిపి, కుమారదేవం, తాళ్లపూడి, తాడిపూడి, గూటాల, పట్టిసీమ, పోలవరం, మీదుగా పోలవరం డ్యామ్ చేరుకోవచ్చు. కొవ్వూరు నుంచి పోలవరం 28 కిలోమీటర్లు అక్కడ నుంచి డ్యామ్ 10 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ వైపు నుంచి వచ్చే వారు, విజయవాడ, గుండుగొలను, బీమడోలు, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి, తాడిపూడి, గూటాల, పట్టిసీమ, పోలవరం మీదగా పోలవరం డ్యామ్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి దేవరపల్లి 130 కిలోమీటర్లు, దేవరపల్లి నుంచి గోపాలపురం 10 కిలోమీటర్లు, గోపాలపురం నుంచి తాళ్లపూడి 15 కిలోమీటర్లు, తాళ్లపూడి నుంచి పోలవరం 15 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి వచ్చేవారు సత్తుపల్లి, అశ్వారావుపేట, జిలుగుమిల్లి, కన్నాపురం, గోపాలపురం, తాళ్లపూడి, తాడిపూడి, గూటాల, పట్టిసీమ, పోలవరం మీదుగా పోలవరం డ్యామ్ చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి గోపాలపురం 170 కిలోమీటర్లు ఉంటుంది. గోపాలపురం నుంచి తాళ్లపూడి 15 కిలోమీటర్లు, తాళ్లపూడి నుంచి పోలవరం 15 కిలోమీటర్లు.

ఏమి ఏమి చూడాలి ?? * పట్టిసీమ పంప్ హౌస్ : ఇది గోదావరి నది ఒడ్డున నిర్మించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 14 అడుగులు ఉంటేనే ఇక్కడ పంపుల ద్వారా నీరు తోడగలుగుతారు. * పట్టిసీమ డెలివరీ పాయింట్: పట్టిసీమ పంప్ హౌస్ కి, డెలివరీ పాయింట్ కి మధ్య 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పట్టిసీమ నుంచి పోలవరం వచ్చి, పోలవరం నుంచి లెఫ్ట్ వైపు 3 కిలోమీటర్లు వెళ్తే పట్టిసీమ డెలివరీ పాయింట్ వస్తుంది. పంపు హౌస్ లో తోడిన నీరు డెలివరీ పాయింట్ లో నుంచి బయటకి వస్తాయి. * పోలవరం కుడి కాలవ టన్నెల్స్: పోలవరం నుంచి విజయవాడ వైపు వచ్చే కాలవ కోసం ఒక కొండలోనుంచి రెండు టన్నెల్స్ నిర్మిస్తున్నారు ఇవి చూడాలి. * పోలవరం సైట్ మ్యాప్: సైట్ లో ప్రధాన ఇంజనీర్ కార్యాలయంలో ఇది ఏర్పాటు చేసారు. ఇది చూడటం వల్ల మనకి పూర్తి అవగాహనా వస్తుంది. * వ్యూ పాయింట్: ప్రాజెక్ట్ ని పూర్తిగా చూసేందుకు వ్యూ పాయింట్ ఉంది. ఇది సముద్ర మట్టానికి 150 అడుగుల ఎత్తులో కొండ మీద వుంది. ఇక్కడ నుంచి పూర్తిగా ప్రాజెక్ట్ కనిపిస్తుంది. * స్పిల్ వే, దయాఫ్రొమ్ వాల్, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్, విద్యుత్ కేంద్రం చూడటంతో పోలవరం సైట్ సందర్శన పూర్తవుతుంది.

రాష్ట్రస్థాయిలో ఆరోగ్య సూచికల్లో ఆశా వర్కర్లది కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండ‌వ‌ల్లిలోని సీఎం నివాసం స‌మీపంలో ఉన్న ప్రజాదర్బార్ హాలులో శుక్ర‌వారం “ఆశాలకు బాసట” పేరిట ఆయన ఆశా వర్కర్లతో సమావేశం నిర్వ‌హించి వారికి వరాలు కురిపించారు. నెలకు కనీస వేతనం రూ.3వేలు తప్పనిసరి చేస్తున్నట్టు చెప్పారు. వారికి స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే వారికి నెలకు రూ.6వేలు నుంచి 8వేలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ప్రజల్లో పౌష్టికాహారం, పరిశుభ్రతపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారని, రోజు రోజుకు జీవన ప్రమాణాలు పెరగాలని సూచించారు.

anganvadi 29062018 2

ఆనందం, ఆరోగ్యం పెరిగి ప్రపంచంలో పదో స్థానంలో నిలవాలని ఆకాంక్షించిన చంద్రబాబు అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లంతా ఆదర్శంగా నిలవాలని కోరారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రూ.3000 స్థిర వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. వేత‌నాలు పెంచ‌డం ఫ‌లితంగా రూ.156 కోట్లు అదనంగా ప్రభుత్వంపై భారం పడుతోంద‌న్నారు. రూ.312 కోట్లు ఇందుకోసం నిధులు ఖర్చు చెయ్యడం జరుగుతోంద‌ని తెలిపారు.

anganvadi 29062018 3

రాష్ట్రంలో రూ.3000 వేలు చొప్పున ఆశా కార్యకర్తలకు ఫిక్సడ్ గౌరవ వేతనం 1వ తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుంద‌ని, ఆశా కార్యకర్తలకు ఏఎన్‌ఎం పోస్టుల భ‌ర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన‌ట్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 43 వేల మంది ఆశా వర్కర్లు ఉన్నార‌ని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం అని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు ఆరోగ్య నిపుణులుగా ఎంతో సేవలు అందిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. “ఆశాలకు బాసట” గా కార్యక్రమంలో హెల్త్ డైరెక్టర్ ఎస్.అరుణకుమారి, ఎస్పీఎం జి.వాసుదేవరావు, జెడి సావిత్రి, ప్రోగ్రాం అధికారిణి నాగమల్లేశ్వరి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు, తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్నారా ? అయితే, ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ సమయంలో, పరిమితి స్థాయిలోనే, అతి తక్కువ మందికి మాత్రమే స్వామి వారి దర్శనం జరుగుతుంది. ఇవి వివరాలు... తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువును ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నామని తిరుమల జేఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు గురువారం విలేకరులకు తెలిపారు. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని నిలిపివేశారు.

tiruamala 29062018 2

ఐదురోజుల పాటు పరిమిత సమయంలో కొద్దిమంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. రోజుకు 30 వేల మందికి మించి శ్రీవారి దర్శనం కల్పించే అవకాశాల్లేవని జేఈవో తెలిపారు. పన్నెండేళ్లకోసారి ఈ క్రతువును నిర్వహిస్తారని, శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ఉపఆలయాల మహాసంప్రోక్షణ చేస్తారని అన్నారు. ఆగస్టు 11, 12 తేదీల్లో నిర్వహించే తోమాల, అర్చన సేవలకు ఉదయాస్తమాన సేవ భక్తులను మాత్రమే అనుమతిస్తారు. 16న ఉదయం మహాసంప్రోక్షణ జరుగుతుంది. చివరి రోజున యాగశాలలోని ఉత్సవమూర్తులను గర్భాలయంలోకి చేర్చడంతో వైదిక కార్యక్రమాలు సమాప్తమవుతాయి.

tiruamala 29062018 3

మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి మూలవిరాట్టు, ఇతర దేవతామూర్తుల శక్తిని బింబం నుంచి కుంభంలోకి ఆవాహనచేసి ఉపచారాలు, శాంతిహోమాలు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. అష్టబంధనం అంటే ఎనిమిది రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణమని, దీని ఆయుర్దాయం 12 ఏళ్లు ఉంటుందని ఆగమ సలహాదారు సుందర వరదభట్టాచార్యులు వివరించారు. ఈ అష్టబంధనాన్ని శ్రీవారి పాదాల కింద ఉంచుతామన్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటి వరకు 60 శాతం మేర రన్‌వే పనులు పూర్తయ్యాయి. నూతన రన్‌వే అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్టుగా గుర్తింపు వస్తుంది. విశాఖపట్నం, రాజమండ్రి, చిత్తూరు ఎయిర్‌పోర్టులు కూడా విజయవాడ తర్వాత స్థానంలోనే ఉంటాయి. ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు ప్రారంభించటం వల్ల విజయవాడ ప్రస్తుత రన్‌వేతో సమానంగా ఉంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు 10 వేల అడుగుల విస్తీర్ణంలో ఉంది. విస్తరిస్తున్న రాజమండ్రి ఎయిర్‌పోర్టు విస్తీర్ణం 9 వేల అడుగుల విస్తీర్ణంలో ఉంది. విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే పొడవు ప్రస్తుతం 7500 అడుగులు (2286 మీటర్లు). దీనిని మరో 3500 అడుగులు (1704 మీటర్ల) మేర ప్రస్తుతం పొడిగిస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టుకు అదనపు రన్‌వే అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో అత్యంత పొడవైన రన్‌వేగా రికార్డుకెక్కుతుంది.

gannavaram 29062018 2

ఆరు నెలల కాలంగా రన్‌వే విస్తరణ పనులు ఎంతో పురోగతిలో ఉన్నాయి. లోతట్టు వ్యవసాయ భూములలో రన్‌వే అనుసంధానానికి, ఐసోలేషన్‌ బే, ప్రహరీ గోడల నిర్మాణానికి మార్కింగ్‌ పనులు చకచకా ప్రారంభించారు. రన్‌వేను విస్తరించటానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. లోతట్టు పంట భూములను మెరక చేయటానికి బ్రహ్యయ్యలింగం చెరువు నుంచి రోజూ వందల సంఖ్యలో పెద్ద టిప్పర్లతో మట్టిని ఇక్కడ డంప్‌ చేస్తే కానీ ఇప్పుడు చూస్తున్న స్వరూపం రాలేదు. మరో రెండు నెలలు మట్టి డంప్‌ చేస్తే ఎర్త్‌ పిల్లింగ్‌ పూర్తవుతుంది. ఎర్త్‌ ఫిల్లింగ్‌కు సంబంధించి 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఎర్త్‌ ఫిల్లింగ్‌ మీద ఐదు రకాల ధృడమైన లేయర్లను వేశారు. డబ్ల్యూబీఎం, వెట్‌మిక్స్‌, హాట్‌మిక్స్‌ వంటి ఐదు రకాల లేయర్లతో నేలను దృఢంగా తయారు చేస్తారు. దీనిపై రెండు లేయర్ల బీటీ వేశారు. నూతన రన్‌వే పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

gannavaram 29062018 3

ప్రస్తుత రన్‌వే దగ్గర అనుసంధానించాల్సిన ప్రాంతంలో మాత్రమే రోడ్డు ఉండటం వల్ల కొంత బిట్‌ మిగిలి ఉంది. ఇది కూడా పూర్తి చేసిన తర్వాత మాత్రమే మూడవ లేయర్‌ను వేస్తారు. మూడవ లేయర్‌ ఏర్పాటుతో నూతన్‌ రన్‌వే విస్తరణ పూర్తవుతుంది. ఇకపోతే ప్రధానంగా స్వాధీనం చేసుకున్న 700 ఎకరాల విస్తీర్ణం వెంబడి ప్రహరీ గోడ నిర్మాణ పనలు చేపట్టారు. ప్రహరీ పనులు కూడా 90 శాతం మేర పూర్తయ్యాయి. విమానాశ్రయ రన్‌వే విస్తరణ ప్రధాన పనులు జరగాల్సిన చోట ఉన్న బుధవారం రోడ్డును మూసివేయాల్సి ఉంది. ప్రత్యామ్నాయ రోడ్డు విషయంలో ఇంకా అడుగులు పడకపోవటంతో ప్రస్తుత రోడ్డును కొనసాగించాల్సి వస్తోంది. దీంతో నూతన రన్‌వేను, ప్రస్తుత రన్‌వేకు అనుసంధానం చేయలేని పరిస్తితి ఏర్పడుతోంది. ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత త్వరగా రన్‌వే పూర్తి చేసే అవకాశం ఉంది.

Advertisements

Latest Articles

Most Read