ఈనెల 20 నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, బీటెక్‌ రవి- ఇద్దరూ కడపలోని జడ్పీ ప్రాంగణంలో దీక్షకు దిగారు. వైద్యపరీక్షలు నిర్వహించిన రిమ్స్‌ వైద్యులు.. ఇద్దరి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు హెచ్చరించారు. ప్రధానంగా బీటెక్‌ రవి పరిస్థితి బాగోలేదని వివరించారు. పరిస్థితిని అంచనా వేసి తదనుగుణ చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మంత్రి గంటా శ్రీనివాసరావును కడపకు పంపించారు. ఆయన బుధవారం ఉదయం నుంచి జిల్లా ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. చివరగా పోలీసులు 6 గంటల సమయానికి రవి దీక్షను భగ్నం చేశారు. అయితే సీఎం రమేష్‌ దీక్ష ఇంకా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో, ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు, రకరకాల పద్ధతిలో కేంద్రం పై ఒత్తిడి తీసుకువవచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

modi 28062018 2

ఇందులో భగంగా, ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, రమేష్ చేస్తున్న దీక్ష, రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష ప్రధానికి తెలపటానికి, ఆయన అపాయింట్‌మెంట్‌ అడిగారు తెలుగుదేశం ఎంపీలు. అయితే, అయితే అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రధాని తిరస్కరించారు. ప్రధాని మిమ్మల్ని కలిసేందుకు టైం లేదని, ఇప్పుడు అపాయింట్‌మెంట్ కుదరదు అంటూ మన ఎంపీలకు తేల్చి చెప్పారు. దాంతో కాసేపట్లో ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలు సమావేశంకానున్నారు. ఉక్కుశాఖ మంత్రిని మరోసారి కలిసి, చంద్రబాబు రాసిన లేఖను టీడీపీ ఎంపీలు అందజేయనున్నారు.

modi 28062018 3

మరో పక్క కడపలో దీక్ష చేస్తున్న శిబిరం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. మంత్రులు, నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నేత జగన్‌పై దుమ్మెతి పోశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో జనాలు దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. కడప నారాయణ జూనియర్‌ కళాశాల, జమ్మలమడుగు ఎస్వీ కళాశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు భారీగా హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. తెదేపా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగాయి. మధ్యాహ్నం నుంచి దీక్షాశిబిరానికి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీక్షాశిబిరానికి ఇరువైపులా రెండు అంబులెన్స్‌లు ఉంచడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠలో అటు కుటుంబీకులు, ఇటు కార్యకర్తలు, శ్రేణులుండిపోయారు. సాయంత్రం సుమారు 200 మంది పోలీసుల వరకు శిబిరం వద్దకు చేరుకుని పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన బీటెక్‌ రవిని అంబులెన్స్‌లోకి చేర్చి రిమ్స్‌కు తరలించారు.

చంద్రబాబు ప్రభుత్వం టాప్ గేర్ లో ఉంది... ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్.. రెండూ బాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది... పేదలకు ఇల్లు కట్టిస్తున్నాం అని ప్రభుత్వాలు చెప్పటం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం... కాని అవన్నీ పేపర్ లోనే ఉంటాయి.. బయట కనిపించవ్... కాని చంద్రబాబు ఇల్లు లేని ప్రతి పేదవాడికి, ఇల్లు కాట్టిస్తున్నారు.. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన మూడు లక్షల ఇళ్లలో జులై 5న సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని బుధవారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ గృహ ప్రవేశాలుంటాయన్నారు.

housing 28062018 1

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇంతవరకు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా గత ఏడాది అక్టోబరులో లక్ష సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామని, నాలుగేళ్లలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మొత్తం 5.61 లక్షల ఇళ్లను నిర్మించామని మంత్రి తెలిపారు. ఒక్కపైసా అవినీతికి తావులేకుండా ఒకే రోజు లక్ష నూతన గృహాల ప్రారంభోత్సవం చరిత్రాత్మకమైనదని మంత్రి అన్నారు. ఎవరైనా సరే మంజూరులో కానీ, బిల్లు ఇచ్చే సందర్భంలో లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలా ఎక్కడైనా జరిగితే 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తమ దృష్టికి తేవాలని కోరారు.

housing 28062018 3

ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా రూపాయి అవినీతికు తావు ఉండదు. మొత్తం డబ్బులు బ్యాంకు ఎకౌంటు లో పడతాయి. అంతే కాదు, మొత్తం ప్రక్రియ అంతా, ప్రతి స్టేజ్ రియల్ టైం లో ఆన్లైన్ లో ఉంటుంది. మీరు చూడండి... పైసా అవినీతి లేకుండా, పేద వాడికి ఎలా లబ్ది చేకురుస్తున్నారో...ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in//NTRNutanaGruhaPravesam.do ఇక్కడ మీ జిల్లా, ఊరు సెలెక్ట్ చేస్తే, మీ ఊరిలో ఎవరికి ఈ ఇల్లు ఇచ్చారు... వారి పేరు, గృహప్రవేశం చేసిన ఫోటోలు వస్తాయి... మరిన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in/gruhapravesaluReport.do . ఇలా ప్రక్రియ అంతా ఆన్లైన్ లో ఉంటుంది. అవినీతి అనే ఆస్కారం అసలు ఉండదు.

పోలవరం ప్రాజెక్ట్ లో, గత నెల రోజుల్లో పనులు చాలా స్పీడ్ గా సాగుతున్నాయి. కీలకమైన పనులు అన్నీ పూర్తవుతున్నాయి. డయాఫ్రం వాల్ పూర్తి చెయ్యటం ఒక రికార్డు అయితే, ఒక్క రోజులో నవయుగ చేసిన కాంక్రీట్ పనులు కూడా ఒక రికార్డు. అయితే, అన్నీ ప్రణాళిక ప్రకారం జరుగుతున్న పోలవరం పనులకు అనుకోని అవరోధం ఎదురైంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ‘స్టాప్‌ వర్క్‌’ ఉత్తర్వుపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇచ్చిన స్టే ఆదేశాల గడువు జూలై 2తో ముగుస్తోంది. ప్రతి సంవత్సరం కేంద్రం, దీన్ని పొడిగిస్తూ వస్తుంది. మరి ఈ సారి ఏమి చేస్తుందో అని రాష్ట్ర అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండటంతో, టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే అధికారులు ఈ విషయం పై అనేక సార్లు ఢిల్లీ వెళ్లి చర్చించారు. స్వయంగా ముఖ్యమంత్రి లేఖలు రాసారు.

polavaram 28062018 2

పోలవరం పనులు నిలిపేయాలని 2011 ఫిబ్రవరి 8న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా సడలించడం కాకుండా, శాశ్వతంగా ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలసంఘాన్ని కోరింది. డిశాలో తలెత్తే ముంపును దృష్టిలో ఉంచుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేంతవరకూ నిర్మాణ పనులు నిలిపేయాలని 2011 ఫిబ్రవరి 8న అప్పటి యూపీయే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాతి కాలంలో ఈ షరతులను సమయానుకూలంగా ఆరునెలలు, సంవత్సరంపాటు సడలిస్తూ వస్తున్నారు. తాజాగా 2017 జులై 5న ఇచ్చిన సడలింపు ఈ ఏడాది జులై 2తో ముగియనుంది. ఇలా ప్రతిసారీ నిర్మాణ పనుల పై ఆంక్షలు విధించడం వల్ల తమకు పూర్తి అసౌకర్యం కలుగుతోందని, ఈ నిబంధనలను శాశ్వతంగా ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అనేక సార్లు కేంద్రాన్ని కోరారు.

polavaram 28062018 3

ఇదే అంశం పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రికి లేఖ కూడా రాసినట్లు వారి దృష్టికి తీసుకొచ్చారు. స్టే ఎందుకు కొనసాగించాలో స్పష్టం చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు లేఖ కూడా రాసింది. తర్వాత రెండ్రోజులకే ఒడిసా సీఎం లేఖ రాశారు. తమ అభ్యంతరాలను అందులో పేర్కొన్నారు. ఆయన చెప్పిన కారణాలు సహేతుకంగా లేవంటూ ఆంధ్ర జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కేంద్ర పర్యావరణ అటవీశాఖకు వివరిస్తూ మరో లేఖ రాశారు. స్టే పొడిగింపుపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి ఝా సానుకూలంగా ఉన్నా.. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కేంద్రం స్టాప్‌ ఆర్డర్‌ పై స్టేను పొడిగిస్తుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. గత ఏడాది కూడా ఇదే తరహాలో నాలుగు రోజులు ఆలస్యం కావడంతో పనులు నిలిచిపోయాయి. అప్పట్లో కాంక్రీట్‌ పనులు మందకొడిగా ఉండడంతో.. దీని ప్రభావం పెద్దగా కన్పించలేదు. కానీ ఇప్పుడు వడివడిగా కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై స్టే ఎంత ఆలస్యమైతే.. అంతకు రెండింతల నష్టం వాటిల్లుతుందని జల వనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

కడపలో ఉక్కుపరిశ్రమ కోసం సాగుతున్న ఉద్యమాల నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియని గాలి హఠాత్తుగా ఉక్కు పరిశ్రమను తానే నిర్మిస్తానని, అవకాశం తనకే ఇవ్వాలని రెండేళ్లలో పూర్తిచేస్తాననంటూ చెప్పడంతో. ప్రజా సొమ్ము మళ్లీ ఎక్కడగాలి పాలు అవుతుందోనన్న ఆందోళన ప్రజలను వేధిస్తోంది. బిజెపితోనూ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అడ్డంపెట్టుకుని అప్పట్లో కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కుపరిశ్రమ స్థాపనకు అనుమతిని పొందాడు. ఈ మేరకు ప్రభుత్వం ఎకరా రూ. 18,500 చొప్పున దాదాపు 10760 ఎకరాలను బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌కు అప్పగించింది.

jagan 28062018 2

బ్రాహ్మిణికి ముడి ఖనిజం సరఫరా కోసం ఓబులాపురంలో కేటాయించిన గనుల నుంచి అక్రమంగా ఖనిజాన్ని తరలించారన్న కేసులో 2009లో గనులను సీజ్‌ చేయడంతో పాటు గాలిజనార్ధన్‌ రెడ్డితో పాటు పలువురు ఐఎఎఎస్‌ అధికారులు సైతం జైలు పాలయ్యారు. దాదాపు 5.20 కోట్ల టన్నులకుపైనే అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కేవలం జిల్లా పరిధిలో మాత్రమే దాదాపు రూ. 500 కోట్లకు పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది. ప్రజల సొమ్ము కొల్లగొట్టి తిరిగి అదే పరిశ్రమను నిర్మిస్తానని ముందుకు రావడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం అటు పరిశ్రమ స్థాపన లేక ఇటు ఉద్యోగం రాక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.

jagan 28062018 3

గాలి జనార్థన్‌రెడ్డిని హఠాత్తుగా తెరముందుకు తెచ్చి బిజెపి తన రాజకీయ ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. ఏళ్లతరబడి నోరుమెదపని గాలి జనార్థన్‌రెడ్డి ప్రస్తుతం తనకే పరిశ్రమ నిర్మాణ పనులు అప్పగించాలని చెప్పడం వెనక బిజెపి హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఉక్కు ఉద్యమాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పరిశ్రమను ప్రకటిస్తే ఇతర పార్టీల జాబితాల్లో చేరుతుందని, గాలి జనార్ధన్‌రెడ్డి ద్వారా నిర్మించడం వల్ల బిజెపి ఖాతాలో జమచేసుకోవచ్చన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా, ఉక్కు పరిశ్రమ పై, ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. మొత్తానికి అందరూ కలిసి, పెద్ద ప్లానే వేసారు.

Advertisements

Latest Articles

Most Read