తిరుమలేశుని నగల విషయంలో వస్తున్న ఆరోపణలు, రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామాలు, ప్రజల్లో శ్రీవారి నగల పై ఆందోళన నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అటు రాజకీయ పార్టీల నోరు మూపిస్తూ, మరో పక్క ప్రజల్లో విశ్వాసం నింపటానికి కీలక నిర్నయం తీసుకున్నారు. బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో, ఈ అంశం తీసుకుని, తిరుమల గుడి కొట్టేసే ప్రయత్నం చెయ్యటం కూడా చూస్తున్నాం. ఈ ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జిని నియమించి... సమగ్ర ధ్రువీకరణ చేయించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను కోరారు. దీనిపై బుధవారం ముఖ్యామంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ కు ఒక లేఖ రాశారు.

cbn 28062018 2

‘‘తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యదైవం. అత్యంత భక్తి ప్రపత్తులతో స్వామివారిని కొలుస్తారు. స్వామివారి దగ్గర పాటించే ఆచారాలు అత్యంత పవిత్రం. వెలకట్టలేని నగలు, ఆభరణాలు, ఆస్తులు స్వామివారి సొంతం. అవి దొంగతానికి గురైనట్లు, దుర్వినియోగం జరిగినట్లు ఇటీవల కాలంలో పలువురు ఆరోపణలను వెల్లువెత్తించారు. స్వార్థం, స్వప్రయోజనాల కోసమే కొందరు ఈ పనిచేశారు. అంతా బాగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, ప్రభుత్వం చేసిన ప్రకటనలు ప్రజలు, ముఖ్యంగా భక్తుల మనసులకు సాంత్వన కలిగించలేదు. ఇది అత్యంత సున్నితమైన, భక్తుల భావోద్వేగాలతో ముడిపడిన విషయం. అందుకే ఈ విషయంలో వచ్చిన ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో సమగ్ర ధ్రువీకరణ జరిపించాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.

cbn 28062018 3

ఆ నివేదికను బహిరంగంగా ప్రజల ముందు పెట్టి ఈ వివాదానికి ముగింపు పలకాలన్నారు. స్వార్థపూరిత ఆరోపణలతో వెంకన్న భక్తుల్లో లేనిపోని ఆందోళనలు రేకెత్తించారని చంద్రబాబు తెలిపారు. గతంలో టీటీడీపై ఇలాంటి ఆరోపణలే వచ్చినప్పుడు కొన్ని కమిటీలు వేసినట్లు గుర్తు చేశారు. ‘‘2009లో జస్టిస్‌ జగన్నాథరావు కమిషన్‌, 2011లో జస్టిస్‌ వాద్వా కమిటీలను స్వామివారి ఆభరణాలు పరిశీలించేందుకు వేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మళ్లీ తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తుల్లో ఉన్న భయాందోళనలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో ధ్రువీకరణ చేయించాలి. రికార్డులు పరిశీలించేందుకు, వెలకట్టలేని నగలు, ఆభరణాలు, ఆస్తులను తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించాలి. స్వామివారికి కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయో లేదో కూడా ధ్రువీకరించాలి. అన్నీ పరిశీలించిన తర్వాత ఇచ్చే నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలి’’ అని చంద్రబాబు తన లేఖలో తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజయవాడ కనకదుర్గమ్మను గురువారం ఉదయం దర్శించుకునేందుకు రానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కు పుడకను సమర్పించుకుంటానని కేసీఆర్‌ మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడకు రానున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి దుర్గగుడి అధికారులకు అధికారికంగా బుధవారం సమాచారం అందింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత నాలుగేళ్లుగా కేసీఆర్‌ దుర్గగుడికి వస్తారంటూ ప్రతి దసరా సమయంలో ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ.. అధికారికంగా ఎప్పుడూ ఖరారు కాలేదు. ఎట్టకేలకు కేసీఆర్‌ దుర్గగుడి పర్యటన ఖరారైంది. విజయవాడలో కేసీఆర్‌ రెండు గంటలు ఉండనున్నారు.

kcr 28062018 3

పర్యటన ఏర్పాట్లకు సంబంధించి కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, సంయుక్త పోలీసు కమిషనర్‌ కాంతి రాణాటాటా ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు అధికారుల సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో కుటుంబంతో కలిసి కేసీఆర్‌ బయలుదేరతారు. గన్నవరం విమానాశ్రయానికి 12గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ వెటర్నరీ కళాశాల గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కొద్దిసేపు సేదదీరుతారు. అనంతరం రోడ్డు మార్గంలో దుర్గగుడికి చేరుకోనున్నారు. దుర్గగుడిలో కేసీఆర్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

kcr 28062018 2

దుర్గగుడి ఈవో పద్మ, పాలక మండలి ఛైర్మన్‌, సభ్యులు కలిసి కేసీఆర్‌ను స్వాగతించనున్నారు. అనంతరం కేసీఆర్‌ 40 నిమిషాలు దుర్గగుడిలో ఉంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకోనున్నారు. కేసీఆర్‌ రాక సందర్భంగా ఇప్పటికే విజయవాడ పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి దుర్గగుడి వరకూ కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ను సైతం బుధవారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారిక భద్రత, ప్రొటోకాల్‌ సిబ్బంది ఉదయాన్నే దుర్గగుడికి చేరుకుంటారు.

ఒక పక్క 8 రోజులుగా సియం రమేష్ దీక్ష చేస్తున్నా, కేంద్రం కనీసం స్పందించటం లేదు. మరో పక్క, ఎంపీలు వెళ్లి కేంద్ర మంత్రిని కలిసినా, నా చేతిలో ఏమి లేదు అని చేతులు ఎత్తేసారు.. ఈ సమయంలో చంద్రబాబు, మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. డిగిన ప్రశ్నలే రెండు, మూడు సార్లు అడుగుతూ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం ఆయన తెదేపా ఎంపీలు, కడపలో ఉక్కు దీక్ష నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ కడపలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సీఎం రమేశ్‌, బీటెక్‌ రవిల ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వివరించారు.

cbn 27062018 2

ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారడంతో దీక్షను భగ్నం చేసి ఆస్పత్రిలో చేర్పించిన బీటెక్‌ రవికి అందిస్తున్న చికిత్సపై సీఎంకు పలువురు మంత్రులు వివరించారు. ఉక్కు శాఖ మంత్రితో చర్చల సారాంశాన్ని సీఎంకు వివరించిన జేసీ.. ఉక్కు పరిశ్రమపై దిల్లీలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. రేపు మరోమారు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ను కలవనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రమంత్రికి తాను మరో లేఖ రాస్తానని, రేపటి భేటీలో ఆ లేఖను ఆయనకు అందజేయాలని సూచించారు. 2020లోగా మూడు గనులు రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోకి వస్తాయని, ప్రస్తుతం ఇచ్చిన భూముల్లో 87 మిలియన్‌ టన్నుల ఖనిజం ఉందన్నారు. మూడు గనులు అందుబాటులోకి వస్తే 266 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు ఉంటాయని వెల్లడించారు.

cbn 27062018 3

ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు 150 మిలియన్‌ టన్నులు ఉంటే సరిపోతుందన్నారు. 116 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు ఉంటే ఇంకా కేంద్రానికి అభ్యంతరం ఎందుకు?అని ప్రశ్నించారు. కర్మాగారం పూర్తిచేసేందుకు రెండేళ్లు పడుతుందని, ఆ లోపు మిగిలిన మూడు గనులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. ఉక్కు దీక్ష ప్రారంభమయ్యాక కేంద్రం మరో రెండు కొత్త కొర్రీలు వేసిందని, మొన్నటి దాకా తెలంగాణ ప్లాంట్‌ పై స్పష్టత లేదన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. బయ్యారం భూములు, నీళ్ల వివరాలు రాలేదన్నారని తెలిపారు. కడపలో రాష్ట్రం ఇచ్చే భూములపై ఏ వివాదమూ లేదని స్పష్టంచేశారు. కానీ, కావాలనే కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. విభజన చట్టంలో హామీ నెరవేర్చేందుకు ఎందుకీ జాప్యమని నిలదీశారు. రాష్ట్రం పట్ల కేంద్రం తన మొండి వైఖరిని వీడి హామీలు నెరవేర్చాలని చంద్రబాబు కోరారు.

వైసీపీ పార్టీ అంటేనే, దానికి ఒక బ్రాండ్ ఉంది.. విధ్వంసం చెయ్యటమే ఆ పార్టీ పని. గన్నవరం నియోజకవర్గంలో, ఎమ్మల్యే వంశీని ఎదుర్కునే దమ్ము లేక, అక్కడ ఉన్న వైసిపీ నేత దుట్టా రామచంద్ర రావు చేతులు ఎత్తేస్తే, ఎక్కడ నుంచో యార్లగడ్డ వెంకట్రావు అనే వ్యక్తిని ఇంపోర్ట్ చేసాడు జగన్. ఇతని దగ్గర డబ్బులు బాగా ఉండటంతో, ఆ డబ్బు మదంతో, అందరినీ కొట్టటం, ప్రతి ఊరిలో గొడవ పెట్టటం, పనిగా పెట్టుకున్నారు. అదే ఫ్లో లో, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేత యార్లగడ వెంకట రావు బాపులపాడు మండలం కే.సీతారామపురం గ్రామంలోని, ఎస్సీ కాలనీలో పర్యటించారు. తొలుత కాలనీలో మేరీమాత విగ్రహానికి పూలదండ వేసి పర్యటన సాగించారు. అక్కడే బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలదండ వేయకుండా విస్మరించడం పై అవమానంగా భావించిన టీడీపీ కార్యకర్త గండేపూడి నితీష్ ఫేస్ బుక్లో ఇదేనా? దళిత జాతికి ఇచ్చే గౌరవం.. అంటూ పోస్టు పెట్టాడు.

ycp 27062018 2

దీని పై, నువ్వా నన్ను ప్రశ్నించేది అంటూ, అక్కడ ఉన్న తన అనుచరులని, ఉసుగొల్పాడు యార్లగడ వెంకట రావు. దీంతో మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. యార్లగడ్డ వెంకట్రావు మద్యంతో కూడిన విందును ఏర్పాటుచేసి వై.సి.పి కార్యకర్తలను ఉసిగొల్పడం వలన ఈ దాడి జరిగినది. తెలుగుదేశం కార్యకర్తలను మద్యం మత్తులో ఉన్న వై‌.సి.పి కార్యకర్తలు 150 మీటర్లు వరకు వెంటాడి చితకబాదారు. ఈ దాడుల్లో ఎస్సీ కాలనీకి చెందిన ఏడుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ నేతలు చలసాని ఆంజనేయులు, చెన్నుబోయిన శివయ్యల సహకారంతో హను మాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ycp 27062018 3

అయితే, పోలీసులు విచారణ చేసి, తగు సెక్షన్ ల క్రింద, ఇరు పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేసారు. అయితే, ఈ విషయం రాజకీయంగా వాడుకోవటానికి వైసిపీ నేత యార్లగడ్డ వెంకట్రావు, ఈ రోజు హనుమాన్‌జంక్షన్ పోలీస్ స్టేషన్ ఎదుట , కొంత మంది కూలీలను తీసుకువచ్చి గోల గోల చేసారు. ఉదయం నుంచి హనుమాన్‌జంక్షన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పోలీసులు ఎంత చెప్పిన వినిపించుకోలేదు. ఈ సందర్భంగా పోలీసులపై దుర్భాషలాడారు. చేతకాని పోలీసులు అంటూ దూషించారు. మా కార్యకర్తల పై పెట్టిన కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు ఎత్తివేయాలి అని హడావిడి చేసారు. పోలీసులు మాత్రం, చట్ట ప్రకారం మేము చెయ్యాల్సిందే చేస్తున్నామని చెప్పిన వినిపించుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయి జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. మేము కొడతాం, కొట్టించుకోవాలి, మా మీదే కేసులు పెడతారా అంటూ, మద్యం మత్తులో ఊగిపోతున్నారు. పోలీసులు రంగంలోకి దిగటంతో తోక ముడిచారు.

Advertisements

Latest Articles

Most Read