ఏషియన్‌ పెయింట్స్‌, మన రాష్ట్రానికి గుడ్ న్యూస్ వినిపించింది. వాటర్‌ బేస్డ్‌ పెయింట్ల ఉత్పత్తి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దగ్గర ఏర్పాటు చేసే ప్లాంట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అందు బాటులోకి రానుందని ఏషియన్‌ పెయింట్స్‌ వెల్లడించింది. రూ.1,785 కోట్ల పెట్టుబడితో ఏటా ఐదు లక్షల కిలో లీటర్ల వార్షిక ఉత్పత్తి సామ్ధ్యంతో కంపెనీ ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. రూ.2,300 కోట్ల పెట్టుబడితో మైసూర్‌ దగ్గర ఆరు లక్షల కిలో లీటర్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే యూనిట్‌ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే పూర్తవుతుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ కెబిఎస్‌ ఆనంద్‌ వెల్లడించారు. అయితే తొలి దశలో ఈ రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం మూడు లక్షల కిలో లీటర్లు మాత్రమే. కరెన్సీ మారకం సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ మార్కెట్లు పెద్దగా కలిసి రాలేదని కంపెనీ పేర్కొంది.

asian 26062018 2

ముఖ్యంగా ఈ రెండు సమస్యలతో ఈజిప్టు, ఇథోపియా, శ్రీలంక దేశాల్లో సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిపింది. పెద్దగా అమ్మకాలు లేకపోవడంతో కరేబియన్‌ దేశాల మార్కెట్‌ నుంచి కంపెనీ పూర్తిగా తప్పుకుంది. మరో పక్క, నెల్లూరులో ప్రభుత్వ రంగ సంస్థ నాల్కోతో కలిసి ఏర్పాటు చేయనున్నఅల్యూమినియం అల్లాయ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి సవివరమైన నివేదిక ఆరు నెలల్లో సిద్ధం కానుందని ప్రభుత్వ రంగంలోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ) వెల్లడించింది. ప్రతిపాదిత ప్లాంట్‌కు సంబంధించిన కసరత్తు అంతా కొలిక్కి వచ్చిందని, రానున్న కొద్ది నెలల్లో ప్రాజెక్ట్‌ నివేదిక రెడీ కానుందని మిధానీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేశ్‌ కుమార్‌ లిఖి తెలిపారు.

asian 26062018 3

రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న మిధానీ..స్పెషల్‌ స్టీల్‌, సూపర్‌ అల్లాయ్స్‌, టైటాటియం అల్లాయ్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ప్రత్యేకమైన మెటల్స్‌లో భారత్‌ ఎవరిపై ఆధారపడకుండా ఉండేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మిధానీ చిన్న కంపెనీ అయినప్పటికీ భారీ లక్ష్యాలను నిర్ధేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే కీలకమైన ఉత్పత్తులకు సంబంధించి పలు ప్రభుత్వ రంగ సంస్థలతో జట్టు కట్టినట్లు దినేశ్‌ తెలిపారు. నాల్కోతో కలిసి నెల్లూరులో అల్యూమినియం అల్లాయ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవగా మరొక ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండిసి లిమిటెడ్‌తో కలిసి వియత్నాంలోని టంగ్‌స్టన్‌ గనిలో మైనారిటీ వాటాను చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వియత్నాంతో పాటు మరికొన్ని స్నేహపూర్వక దేశాల్లో ప్రాజెక్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం, మోడీ చేస్తున్న వంచనకు వ్యతిరేకంగా, తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేస్తున్న ఆమరణ దీక్షలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయని జనసేన ఎద్దేవా చేసింది. గత ఏడు రోజులుగా కడప ఉక్కు కర్మాగారం కోసం, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు దీక్ష చేస్తున్నారు. వీరి దీక్ష చూసి, ఏడు రోజులు అయినా ఇలాగే ఉండటంతో, పక్కన ఉన్న తమిళనాడు డీఏంకే పార్టీ వచ్చి, మనకు మద్దతు ఇచ్చి ఆందోళనలో పాల్గున్నారు. మన దౌర్భాగ్యం ఏంటో, బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా, దీక్ష చేస్తున్న వారికి కనీస మానవత్వంగా కూడా సపోర్ట్ ఇవ్వకుండా, ఎద్దేవా చేసే పార్టీలు మన మధ్య ఉన్నాయి. రెండు రోజలు క్రితం పవన్ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ రాకపోవటానికి, చంద్రబాబు కారణం అన్నాడు.. ఇక జగన్ అయితే సరే సరి.

janasena 26062018 2

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మన వాళ్ళు ఆందోళన చేస్తుంటే, హైదరాబాద్ పార్టీ ఆఫీస్ లో కూర్చుని, జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ నేత శ్రీ మాదాసు గంగాధరం మాట్లడారు. కేంద్రం పై పోరాటం చేస్తున్న పవన్ ఎక్కడ, దొంగ దీక్షలు చేస్తున్న రమేష్ ఎక్కడ అంటూ ఎద్దేవా చేసారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం జనసేన రాజీలేని పోరాటం చేస్తోందని చెప్పారు. పవన కళ్యాణ్ కేంద్రం పై పోరాడే తీరు అందరికీ ఆదర్శం అని అన్నారు. అదే విధంగా, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం, చేస్తున్న దీక్షల్లో చిత్తశుద్ధి లేదని తమ పార్టీ అభిప్రాయం అని చెప్పారు.

janasena 26062018 3

దీక్ష చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి... ఆసుపత్రికి తరలించమంటారా? అని అడుగున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయని... ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడగలమని మాదాసు ప్రశ్నించారు. నిజానికి ఇలాంటి వార్తా, ఆ సాక్షిలో తప్ప ఎక్కడా రాలేదు. ఆ వార్తా పట్టుకుని, వీరి దీక్షలో చిత్తశుద్ధి లేదు అని, దొంగ దీక్ష అని జనసేన పార్టీ తేల్చింది. అంతే కాదు, అభివృద్ధి అంతా అమరావతిలోనే అంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను నిర్లక్ష్యం చేస్తే జనసేన తప్పకుండా ప్రశ్నిస్తుందని... అమరావతితోపాటు అన్ని ప్రాంతాలనూ సమాన అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నిజానికి ఈయన హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి, ఇక్కడ ఏమి జరుగుతుందో కనీసం అవగాన లేదు. ఈ రోజు ప్రపంచంలోనే టాప్ 3 లో ఉన్న ఫ్లెక్స్ట్రానిక్స్ అనే కంపెనీ, తిరుపతిలో పెట్టుబడి పెట్టింది. ఇది అమరావతిలో ఉందని జనసేన పార్టీ అనుకుంటే ఏమి చెయ్యలేము.. ఇదండీ, వీరి సంగతి...

మన సొంత రాష్ట్రంలో ఉన్న నాయకులు, బీజేపీ పై మాట పడకుండా, ఇవ్వ వలిసిన వారిని కనీసం ఒక్క మాట కూడా అనకుండా, బీజేపీ మీద పోరాడుతున్న వారిని బలహీనపరిచే ప్రయత్నాలు చూస్తున్నాం. మరో పక్క, పక్క రాష్ట్రాల నాయకులు మాత్రం, మనం చేసే దీక్షలకు వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఉక్కు ప్యాక్టరీ కేటాయించాలంటూ కేంద్రం తీరుకు నిరసగా టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు పొరుగు రాష్ట్రాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. సీఎం రమేష్ చేపట్టిన దీక్షకు తమిళనాడులో ముఖ్య పార్టీయైన డీఎంకే మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత కనిమొళి నేడు కడపకు రానున్నారు. సీఎం రమేష్‌కు సంఘీభావం తెలపనున్నారు.

ramesh 26062018 2

ఇదిలాఉండగా, దీక్ష కారణంగా సీఎం రమేష్‌, బీటెక్‌ రవి ఆరోగ్యం నానాటికి విషయమిస్తోందని వైద్యులు తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో వీరి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం దీక్షల్లోని ఎంపీ, ఎమ్మెల్సీని రాష్ట్ర మంత్రి జవహర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వాసు కలిసి మద్దతు తెలిపారు. మంత్రి జవహర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తే ఎన్టీయేలోని భాజపా నమ్మించినట్టేట ముంచేసిందన్నారు. జిల్లాకు చెందిన జగన్మోహన్‌రెడ్డి తన కేసుల మాఫీ కోసం పాకులాడుతూ ఉక్కు గురించి మాట్లాడటంలేదన్నారు. జనసేన అంటూ గాలిపోగేసుకుంటున్న ఓ నటుడు చంద్రబాబు, లోకేష్‌ను తిడుతున్నారని భారతదేశ చరిత్రలో నీతి వంతపాలన, పరిపాలనాధక్షుడుగా పేరెన్నిగన్న చంద్రబాబును తిట్టడంలో అర్థంలేదన్నారు.

ramesh 26062018 3

మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ 120 గంటల పాటు ఆహారం లేకుండా ఉన్నవీరి పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తించాలన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ కోరుతున్నా కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే సుమారు రెండు లక్షలమందికి ఉపాధి, ఉద్యోగాలు వస్తాయని, అవి రావడం ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి ఇష్టంలేదన్నారు. ఉక్కు పరిశ్రమపైన, ప్రత్యేక హోదాపైన కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్‌ నరసింహారావు, పురందేశ్వరి తమ పరిధికి మించి మాట్లాడుతున్నారని, నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ప్రకాశ్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉక్కుపై ఒక్క ప్రకటన చేస్తే వీరిద్దరూ దీక్ష విరమిస్తారని అన్నారు. రాష్ట్ర గవర్నర్‌ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అర్థంలేకుండా దొంగదీక్షలని మాట్లాడటం తగదని అన్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, చంద్రబాబు పార్టీ పై సమీక్షలు చేస్తున్నారు. రోజుకి ఒక జిల్లా చొప్పున, సమీక్ష చేస్తున్నారు. ఈ సమావేశాల్లో, పార్టీకి నష్టం చేకురుస్తున్న నాయకులకు చెమటలు పట్టిస్తున్నారు. అవినీతి ఆరోపణలు, పనితీరులో తేడా, అలసత్వం, ఇలా ఎమ్మెల్యేల జాతకాలను అన్ని కోణాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బయటకు తీస్తున్నారు. ఆరోపణల చిట్టాను వారి చేతికే అందించి... దీనికి ఏమిటి మీ సమాధానమని నిలదీస్తున్నారు. తప్పులు దిద్దుకొని ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోకపోతే దెబ్బతింటారని, ఆ తర్వాత తనను అనుకొని ప్రయోజనం లేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. మూడో మనిషి లేకుండా... ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యి చర్చిస్తున్నారు. ఈ సమయంలో ఆ నేతకు సంబంధించి పార్టీలో అంతర్గతంగా ఉన్న నివేదికలు, పనితీరుపై పార్టీ వర్గాలు, ప్రజల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, సర్వేల ఫలితాలను ముందుంచుకుని మరీ మాట్లాడుతున్నారు

cbn 26062018 2

రాయలసీమలోని ఒక జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ‘నీరు - చెట్టు’ పనులను తమ అనుచరులతో చేయిస్తూ భారీగా గడించారని, ఖరీదైన కార్లు కొనుక్కొని తిరుగుతున్నారని పార్టీ అధిష్ఠానానికి సమాచారం అందింది. ఈ భేటీల్లో చంద్రబాబు ఆ ఇద్దరినీ దీనిపై ప్రశ్నించారు. అవన్నీ ప్రతిపక్షాల ప్రచారమని వారిద్దరూ షరా మామూలుగా బదులిచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబు ఒకింత కరుకుగానే మాట్లాడారని సమాచారం. ‘‘ఏం జరుగుతోందో నాకు తెలుసు. ప్రజలు ఒక విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించారు. దానిని నిలుపుకోండి. సంపాదనలో పడి పార్టీకి మీరు బరువుగా మారితే మిమ్మల్ని మోసుకొంటూ తిరగాల్సిన అవసరం పార్టీకి లేదు. మిమ్మల్ని మీరు దిద్దుకోండి. ప్రజలకు సన్నిహితంగా ఉండి మంచి పేరు తెచ్చుకోండి. రాజకీయాల్లో దీర్ఘకాలం నిలబడగలిగేలా మీ పనితీరు ఉండాలి. ఒక్కసారితో పోయేవారి జాబితాలో చేరకండి’’ అని ఆయన వారికి క్లాస్‌ పీకారు.

cbn 26062018 3

ఇకపై ఇటువంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా చూసుకొంటామని వారు ఆయనకు హామీ ఇచ్చారు. తాను ప్రతి నెలా సర్వేలు చేయిస్తున్నానని, వాటిలో పనితీరు మెరుగుపడకపోతే తర్వాత తన చేతిలో కూడా ఏమీ ఉండదని ఆయన వారికి తేల్చిచెప్పారు. ముఖాముఖి భేటీల్లో ఆరోపణల చిట్టాలను ముఖ్యమంత్రి బయట పెడుతున్న విషయం ప్రచారంలోకి రావడంతో ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ముఖాముఖి ముగించుకున్న నేతల్లో తమ మిత్రులైన వారికి ఫోన్లు చేసి ఏం జరిగిందో తెలుసుకొంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read