ఆంధ్రప్రదేశ్ లో, సంవత్సరం ముందే ఎన్నికల హడావిడి మొదలైంది. చక్కగా సాగిపోతున్న ఆంధ్రప్రదేశ్ నూతన ప్రస్థానంలో, బీజేపీ తన పగ తీర్చుకోవటం మొదలు పెట్టటంతో, చంద్రబాబు ఎదిరించి, మన హక్కులు అడిగారు. ఇదే బీజేపీ పార్టీకి ఇబ్బంది అయ్యింది. దీంతో ఢిల్లీ నేతలు, ఇక్కడ కొన్ని పార్టీల చేత, ఇప్పటి నుంచే ఎన్నికల హడావిడి మొదలు పెట్టించారు. వీరిని ఉపయోగించుకుని చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనే ప్లాన్. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే, పొత్తుల కోసం ప్రజలని ప్రిపేర్ చేస్తున్నారు. జగన్-పవన్-బీజేపీ, వీరి ముగ్గురూ కలిసి పోటీ చెయ్యటం, లేదా ఏదైనా రెండు పార్టీలు కలిసి పోటీ చెయ్యటం అనేది దాదాపు ఖరారు అయ్యింది. ఒకేసారి ఈ అపవిత్ర పొత్తు గురించి చెప్తే, వారి అభిమానులు తట్టుకోలేరు కాబట్టి, ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు...

cpi 25062018 2

అందుకు నేతల వ్యాఖ్యలే నిదర్శనం. వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. జనసేన అధినేత జగన్‌కు మద్దతిచ్చేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు అవినీతి జనసేనానికి నచ్చలేదని, జగన్ కష్టం నచ్చింది అని ఆయన అన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్, జగన్‌లు వచ్చే ఎన్నికల్లో కలుస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరో పక్క, కమ్యూనిస్ట్ పార్టీలు, మేము పవన్ తో కలిసి వెళ్తాయి అని చెప్తున్నాయి. కాని, వారికి పవన్ పై అనుమానాలు మాత్రం పోవటం లేదు. ఎందుకంటే, ఇప్పటి వరకు, పవన్, బీజేపీని ఒక్క మాట కూడా అనటం లేదు. బద్ధ శత్రువులు అయిన, కమ్యూనిస్ట్-బీజేపీల పొత్తు అనేది కుదరదు. అందుకే, కమ్యూనిస్ట్ లు, బయటకు పవన్ తో కనిపిస్తున్నా, లోపల మాత్రం, పవన్ పై అనుమానంతోనే చూస్తున్నారు. ఇప్పుడు, బీజేపీ ఒక్కటే కాదు, వైసిపీతో కూడా పవన్ పొత్తు అనే ప్రచారం మొదలైంది. దీన్ని ఇరు పార్టీలు ఖండించలేదు.

cpi 25062018 3

ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ సోమవారం ఆసక్తికర, కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, జగన్ కలిస్తే ఏమవుతుందో కూడా చెప్పారు. అదే జరిగితే కనుక పవన్ కళ్యాణ్ పార్టీ పని అయిపోయినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా ఇరు పార్టీల పొత్తు సరికాదని అభిప్రాయపడ్డారు. జగన్ ధ్యాస అంతా ముఖ్యమంత్రి పదవి సీటుపైనే ఉందని రామకృష్ణ మండిపడ్డారు. ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని వెల్లడించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దోచేశారని నిప్పులు చెరిగారు. జగన్‌ను అంత సులభంగా ప్రజలు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పవన్ జతకడితే జనసేన కథ ముగిసినట్లేనని ఆయన హెచ్చరించారు.

యధా నేత, తధా నాయకులు... జగన్ ఒక పక్క, ప్రతి ఊరిలో తిరుగుతూ, కలెక్టర్ ల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆ నేతలు కూడా అలాగే రెచ్చిపోతున్నారు. జగన్ సిఎం కుర్చీ ఎక్కగానే ,ఒక్కొక్క నా కొడుకుకి నడి బజారులో బట్టలూడదీసి కొడతామంటూ రెవిన్యూ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసాడు రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. దీని పై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన గళం విప్పారు. రెవిన్యూ ఉద్యోగులు దశల వారిగా ఆందోళనకు రంగం సిద్ధం చేశారు.

2G 21122017 1

ఉద్యోగుల మనోబావాలు దెబ్బతీసేలే ఆత్మస్థైర్యం సన్నగిల్లేలా ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండురోజులుగా సోషియల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో రెవిన్యూ ఉద్యోగులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు. రెవిన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి దశల వారి ఆందోళనకు రంగం సిద్ధం చేసుంది. ముఖ్యంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై చట్టపరచర్యలు చేపట్టే వరకు జిల్లా వ్యాప్తంగా రోజూవారి నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని...సోమవారం జరుగు గ్రీవెన్స్ డేని బహిష్కరించాలని...బుధవారం నుంచి జరుగు గ్రామ సభలు సైతం బహిష్కరిస్తామని ఏపీ రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ శనివారం తీర్మానం చేసింది. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ కి వివరించారు.

2G 21122017 1

ప్రధానంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రెవీన్యూ ఉద్యోగులపై నోరు పారేసుకోవడంతో పాటు జిల్లా కలెక్టర్ ని సైతం తూలనాడడం రెవిన్యూ ఉద్యోగుల ఆగ్రహానికి దారి తీస్తోంది. ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల ఉద్యోగులు మనోభావాలు దెబ్బతినడంతో పాటు,రెవిన్యూ సిబ్బంది భయాందోళనలకు గురిలకావడం వల్ల,స్వేచ్ఛగా ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వహించలేని వాతావరణం నెలకొందని రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సిబ్బందిలో మనోధైర్యం పెంపొందాలంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై చట్టపర చర్యలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆ నాయకుడు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడవచ్చు https://www.facebook.com/chankya.p/videos/181805822666724/

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఎల్‌ఈడీ వెలుగులు నింపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఇంధన, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రత్యేకించి గ్రామీణ ఇంధన సామర్థ్యం కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూరు శాతం ఎల్‌ఈడీ లైట్ల వాడకం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను అత్యున్నత స్థాయికి చేర్చుతామన్నారు. దేశంలోనే తొలిసారిగా, ప్రత్యేకించి మన రాష్ట్రంలో 30 లక్షల సంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

cbn 25062018 2

ఈ విషయంలో ఇప్పటికే చరిత్ర సృష్టించామని, ఇదే స్ఫూర్తితో అక్టోబరుకల్లా 10 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను అమర్చే బృహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం చెప్పారు. ఇంధన సామర్ధ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాను దేశంలోనే నూరు శాతం ఎల్‌ఈడీ వీధి దీపాలు కలిగిన జిల్లాగా నిలిపి రికార్డు సృష్టించామని, అలాగే రెండో దశలో అక్టోబరుకల్లా 10 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చే లక్ష్యా న్ని చేరుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని విప్లవాత్మక చర్యగా అభివర్ణించిన సీఎం దీనిద్వారా గ్రామీణ ప్రాంత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

cbn 25062018 3

తూర్పు గోదావరిని ఆదర్శంగా తీసుకుని అన్ని జిల్లాల్లో నూరు శాతం ఎల్‌ఈడీ వీధి లైట్లను అమర్చాలని విద్యుత్తు సంస్థలను ఆదేశించారు. అన్ని శాఖ ల్లోనూ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. నేటికి తొలిదశలో ఈఈఎస్‌ఎల్‌ ద్వారా 8.6 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశామని, 2.78 లక్షల లైట్లను ఆన్‌లైన్‌ డాష్‌ బోర్డుకు అనుసంధానం చేసినట్లు పంచాయతీరాజ్‌ మరియు రూరల్‌ డవలప్‌మెంట్‌ ముఖ్యకార్యదర్శి జవ హర్‌ రెడ్డి తెలిపారు. ప్రతి 100 అడుగుల దూరంలో ప్రతి మూడు ఇళ్లకు కనీసం ఒక ఎల్‌ఈడీ వీధి లైటు ఉండేలా చూసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి లోకేష్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

బీజేపీ నేతలు తమ అతి తెలివితేటల్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద చూపించుకోవాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఘాటుగా విమర్శించారు. ప్రాజెక్టుల నిధులు, విభజన హామీలను గురించి చేతనైతే దిల్లీలో మాట్లాడాలని.. గల్లీలో కాదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించి లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడిన బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలన్నాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ 55.73 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి స్పష్టం చేశారు.

uma 25062018 2

కేంద్రం నిధులు సకాలంలో ఇవ్వకపోయినా.. ప్రాజెక్టు నిర్మాణం ఆగకూడదన్న లక్ష్యంతో అప్పులు తెచ్చి మరీ నిర్మిస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయల వడ్డీలను కడుతోందని తెలిపారు. ప్రతిపక్షాలు దండగ అని విమర్శించిన అన్ని ప్రాజెక్టులకూ జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ నేతల దుగ్ధ ఏమిటో అర్ధం కావటం లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వాన్ని తిడుతున్న భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు ఇతర రాష్ట్రాల్లోని జాతీయ ప్రాజెక్టులను పరిశీలించాలని సూచించారు.

uma 25062018 3

ప్రాజెక్టుకు సంబంధించిన రెండో డీపీఆర్‌ను ఆమోదింప చేసుకునేందుకు జలవనరుల శాఖ అధికారులు దిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు ముంపు మండలాలను సాధించకపోతే పోలవరం ప్రాజెక్టు సాధ్యమయ్యేదే కాదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రగతిని చూడలేక, తట్టుకోలేక ప్రతిపక్ష నేత జగన్ మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్‌లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆరు నెలల తర్వాత కన్నా ఏ పార్టీలో ఉంటారో తెలియదాని, బీజేపీ నేతలు ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని అన్నారు. పోలవరానికి కేంద్రం ఒక్కపైసా బాకీ లేదని పురందేశ్వరికి ఎవరు చెప్పారు? పోలవరానికి సంబంధించిన అన్ని అంశాలు ఆన్ లైన్ లో పొందుపరిచాం, వెళ్లి చూసుకోండి అని చెప్పారు. ఏపీ సాగునీటి శాఖ కు 19 స్కోచ్ అవార్డులు వచ్చాయినే సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read