నాలుగు రోజులు యాత్ర అన్నాడు.. రెండు రోజులు రిసార్ట్ లో ఉన్నాడు.. తరువాత హైదరాబాద్ వెళ్ళిపోయాడు... అదేమంటే బౌన్సర్ లు పండగ చేసుకోవాలి అన్నాడు.. పండగ అయిపోయిన 4 రోజులకు బయటకు వచ్చాడు.. కుంబకర్ణుడు నిద్ర లేగిసినట్టు, ఎప్పుడో అయిపోయిన విషయాలు, నెల రోజుల క్రిందట రమణ దీక్షితులు మాట్లాడిన మాటలు, మళ్ళీ ఇప్పుడు ట్వీట్ చేస్తున్నాడు.. అయినా వాటికి, డాక్యుమెంట్ లతో సహా, అప్పటి ఈఓలు, ఐఏఎస్ ఆఫీసర్లు, అక్కడ పై స్థాయిలో పని చేసిన వారు, అందరూ ఖండించారు. ఈ విషయం వచ్చినప్పుడు, పవన్ అప్పుడు యాత్ర అంటూ ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఈ విషయం మాత్రం, అప్పుడు మాట్లడలేదు. ఏమైందో ఏమో, ఎవరు చెప్పారో ఏమో కాని, రంజాన్ సెలవలు అయిపోయినాక, ఈ విషయం అందుకున్నాడు. సరే, ఇది కూడా తప్పు లేదు. ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వాన్ని ఇరికించే ఒక అవకాసం వాడుకుంటున్నాడు అనుకుందాం...

pk 23062018 2

కాని ఇదే సమయంలో ఒక్కటి అంటే ఒక్క ట్వీట్ కేంద్రం పై కాని, మోడీ పై కాని లేదు. 22 ట్వీట్లతో చంద్రబాబుని తిట్టాడు కాని, ఒక్కటి అంటే ఒక్కటి మోడీ పై లేదు.. పైగా ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ కడప స్టీల్ ప్లాంట్ పెట్టను అని కేంద్రం చెప్పటం, మరో పక్క రైల్వే జోన్ విషయంలో, పరిశీలించమని ఉంది, మేము పరిశీలిస్తూనే ఉంటాం అని పియూష్ గోయల్ చెప్పటం. దీని పై రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతుంది. అయినా పవన్ కళ్యాణ్ కు చీమ కుట్టినట్టు కూడా లేదు... ఒక్కటంటే ఒక్క ట్వీట్, స్టీల్ ప్లాంట్ పై కాని, రైల్వే జోన్ పై కాని, మిగతా విభజన హామీల పై కాని లేదు... ఇలాంటివి చేస్తేనే, ఈయన బీజేపీకి లొంగిపోయాడు అని, బీజేపీ ఆడిస్తుంది అనే ప్రచారానికి మరింత ఊతం ఇచ్చేది.

pk 23062018 3

నిజానికి ఈ ఏడాది జనవరి 6న మెకాన్ సంస్థ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కడపకు వచ్చి, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని పరిశీలించింది. 7,8 తేదీల్లో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూమి, విద్యుత్, నీరు, రవాణా ఇలా అన్ని రకాల రాయితీలు కల్పిస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. అంతకుముందే 2017 డిసెంబరు 27న జరిగిన చివరి సమావేశంలో మెకాన్‌ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల ప్రాథమిక నివేదికలో అనంతపురం జిల్లాలో లభ్యమయ్యే 110 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉక్కు పరిశ్రమను 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల పాటు నిర్వహించేందుకు సరిపోతాయని చెప్పడం జరిగింది. అంటే కమిటీ నివేదిక సానుకూలమన్నట్టే కదా. దీనికి బలం చేకూరుస్తూ మార్చి 15న పార్లమెంటులోని తన కార్యాలయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. మెకాన్‌ సంస్థ నివేదిక ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. మరి ఉన్నట్టుండి ఇప్పుడు ఏమైంది? ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా, లాభదాయకం కాదంటూ సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఎందుకు ఇచ్చింది? అసలు నివేదికలోని అంశాలను ఎందుకు బయటపెట్టరు? ఎందుకు కేంద్రం కడప ఉక్కును నాన్చుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయం పై కేంద్రాన్ని నిలదీస్తుంటే, పవన్ మాత్రం, ఒక్కటంటే ఒక్క మాట మోడీని అనకపోగా, చంద్రబాబు పై మాత్రం, విరుచుకుపడుతున్నాడు.

పోలవరం పనులు అద్భుతంగా జరుగుతున్నాయని, కాని భూనిర్వాసితులకు న్యాయం చేయాలని పదవీ విరమణ చేసిన సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ అభిప్రాయడ్డారు. శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు పై సంతృప్తి వ్యక్తం చేశారు. దీన్నొక అద్బు తంగా ఆయన అభివర్ణించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగిస్తున్నారన్నారు. సాధారణంగా ఏ ప్రాజెక్టులోనూ డయాఫ్రమ్‌వాల్‌ కనిపించదన్నారు. ఇదో కొత్త కాన్సెప్ట్‌గా పేర్కొన్నారు. సహజంగా డ్యామ్‌, స్పిల్‌వేలు ఒకటిగానే కనిపిస్తాయి. పోలవరం ఇవి వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఇది పూర్తయితే రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందన్నారు.

lakshminarayana 23062018 2

శ్రీశైలం ప్రాజెక్ట్‌తో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలున్నాయన్నారు. కొండల మధ్య నదీప్రవాహానికి అడ్డుకట్టేసి శ్రీశైలం ఆనకట్ట నిర్మించారన్నారు. కానీ ఇక్కడ సమాంతరంగా పారుతున్న గోదావరి ప్రవాహ దిశను మార్చి కుడి, ఎడమ కాలువల్లోకి నీరు మళ్ళిస్తారన్నారు. పోలవరం పురోగతి పై పత్రికల్లో వస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తించాయన్నారు. ఇదెప్పుడు పూర్తవుతుందా అన్న ఉత్కంఠ రైతుతో పాటు తనలోనూ ఉందన్నారు. దీని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేంద్రం త్వరగా విడుదల చేయాలన్నారు. అలాగే భూసేకరణ నష్టపరి హారంలో తేడాల్ని సవరించాలన్నారు. 2013 చట్టానికనుగుణంగా చెల్లింపులు జరపాలన్నారు. జిఓలన్నింటిని పారదర్శకంగా అమలు చేయాలన్నారు.

lakshminarayana 23062018 3

కాఫర్‌డ్యామ్‌ ఎత్తును 31నుంచి 41మీటర్లకు పెంచడం కూడా మంచిందే అన్నారు. దీని వల్ల డ్యామ్‌ పూర్తికాక ముందే గ్రావిటీ ద్వారా సాగు నీరివ్వొచ్చన్నారు. కుడి ప్రధాన కాలువ పనులు 98శాతం పూర్తయ్యాయన్నారు. ప్రధాన ప్రాజెక్ట్‌ పనులు 55 శాతం పైగా జరిగాయన్నారు. లక్ష్మీనారాయణకు పోలవరం ఇంజనీర్లు రమేష్‌బాబు, బాలకృష్ణలు స్వయంగా ప్రాజెక్ట్‌ పనుల వివరాల్ని వివరించారు. వాటిని ఆయన ఆసక్తిగా విన్నా రు. పలు సందేహాల్ని అడిగి నివృతి చేసుకున్నారు. పట్టిసీమ ద్వారా నీరిస్తుండగా భారీ వ్యయంతో కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంచి గ్రావిటీ ద్వారా నీరందించాల్సిన అవసరమేంటంటూ ఆయన ఇంజనీర్లను ప్రశ్నించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిమాణంలో నీటినిచ్చేందుకంటూ అధికారులు ఆయనకు వివరించారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాక ముందే, ఏయ్ చంద్రబాబు, దండయాత్రకు వస్తున్నాం అంటూ, ఛాలెంజ్ విసిరిన రాం మాధవ్ పరిస్థితి ఇప్పుడు తారు మారు అయ్యింది. అమిత్ షా తరువాత పార్టీకి నేనే అంటూ బిల్డ్ అప్ ఇచ్చిన రాం మాధవ్ ను సొంత పార్టీలోనే దూరం పెడుతున్నారు. దీని అంతటికీ కారణం మనోడు కాశ్మీర్ లో చేసిన విఫల ప్రయోగం. ఆయన చొరవతోనే కశ్మీరులో ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా పేరొందిన పీడీపీ-బీజేపీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే తరువాత పరిణామాలతో, శక్తిమంతుడైన నేత ఒక్కసారిగా ఫ్లాప్‌ల ఖాతాలో చేరిపోయారు. కశ్మీరు వైఫల్యంతో ఆయన ప్రభ మసకబారిపోయింది.

rammadhav 22062018 2

కశ్మీరు సంకీర్ణం సుస్థిరమని 3 నెలలుగా ఆయన చెబుతున్న మాటలన్నింటినీ అపహాస్యం చేస్తూ బీజేపీ అధినాయకత్వం కాశ్మీర్ లో సంకీర్ణ సర్కారుకు గుడ్‌బై చెప్పింది. పార్టీ అంతర్గత రాజకీయాలే కశ్మీరులో ఆయన ప్రయోగానికి గండి కొట్టాయని కొందరంటుంటే, పీడీపీ సర్కారుతో రాంమాధవ్‌ మెతకవైఖరి దేశవ్యాప్తంగా పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన మరోవైపు వినిపిస్తోంది. రాంమాధవ్‌ మొదటి నుంచీ పీడీపీ సర్కారుకు అండగా నిలిచారు. దేశంలో ఒక్క కశ్మీరులోనే జాతీయ పతాకానికి అవమానం జరగలేదని, ఛత్తీ్‌సగఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకానికి ఆహ్వానం కూడా లభించదన్నారు. అయితే ఇప్పుడు మాత్రం, రాం మాధవ్ ట్యూన్ మారింది.

rammadhav 22062018 3

రాంమాధవ్‌ పూనికతోనే జమ్ము కాశ్మీర్‌లో మిలిటెంట్లకూ, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు 2017 అక్టోబర్‌ 25న ఐబీ మాజీ డైరెక్టర్‌ దినేశ్‌ శర్మను నియమించారు. ఏడాది కాకముందే పీడీపీకి మద్దతు ఉపసంహరించారు. చర్చలు ఏమయ్యాయో, దినేశ్‌ శర్మ ఏం చేశారో రాంమాధవ్‌ చెప్పలేక పోయారు. కర్ణాటకలో ఫలితాలు పూర్తిగా వెలువడకముందే ‘‘చంద్రబాబు పని అయిపోయింది, దక్షిణాదిన బీజేపీ దండయాత్ర మొదలవుతుంది’’ అని రాంమాధవ్‌ ట్వీట్‌ చేశారు. చివరకు కర్ణాటకలోనే పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు ఇన్‌ఛార్జిగా ఉన్న జమ్ము కాశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీయే స్వయంగా కూల్చేసుకుంది. సంకీర్ణ ప్రభుత్వాలను బీజేపీ నడపలేదన్న విషయంమరోసారి స్పష్టమైంది. కాశ్మీర్‌లోనే విఫలమైన రాంమాధవ్‌ దక్షిణాది దండయాత్ర ఎలా ప్రారంభిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈశాన్యం, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లోనూ తలదూరుస్తున్న రాంమాధవ్‌ దూకుడుకు కాశ్మీర్‌ వైఫల్యం తర్వాత బ్రేకులు పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

బీజేపీ జాతీయా అధ్యక్షుడు అమిత్ షా పై, అన్ని జాతీయ వార్తా సంస్థలు ఒక వ్యతిరేక వార్తా రాసాయి. అయితే, పది అంటే పది నిమషాల్లో, ఆ వార్తను వాళ్ళ వెబ్ పోర్టల్ నుంచి డిలీట్ చేసాయి, ప్రముఖ జాతీయ వార్తా సంస్థలు. ఈ పరిణామాల పై ప్రజలు మండి పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా, అప్పట్లో, సోనియా గాంధీ పై ఏమన్నా వ్యతిరేక వార్తలు వస్తే, ఇలాగే బెదిరించి వార్తలు తీపించే వారని, ఇప్పుడు అమిత్ షా కూడా అలాగే చేస్తున్నారని, మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అది తప్పు అని, ప్రజాస్వామ్య దేశంలో మీడియా గొంతు నొక్కుతున్నారని గగ్గోలు పెట్టిన బీజేపీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత, అలాంటి పనులే మళ్ళీ రిపీట్ చేస్తుంటే, ఇద్దరికీ తేడా ఏంటి అని అంటున్నారు. ఇలా జాతీయ మీడియాను బెదిరించో, మరొక కారణంతోనే, వ్యతిరేక వార్తలు తీపిస్తున్న అమిత్ షా పై ప్రజలు మండి పడుతున్నారు.

media 22062018 2

ఇక విషయంలోకి వెళ్తే, పెద్ద నోట్ల రద్దు, అమిత్ షా పాలిట వరంగా మారిందని, ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ ద్వారా బయట పెట్టిన సమాచారం ధ్రువీకరిస్తుంది. అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న ఓ జిల్లా సహకార బ్యాంకు రద్దయిన నోట్లను జమ చేసుకున్న వ్యవహారంలో అగ్రస్థానంలో నిల్చింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆ బ్యాంకు లాభదాయకంగా మలుచుకున్నట్లు ఆరోపణలు రేగాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ లోని రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధిక మొత్తంలో రద్దయిన నోట్లను స్వీకరించినట్లు తాజాగా వెల్లడయ్యింది. ముంబైకి చెందిన మనోరంజన్‌ రాయ్‌ అనే సమాచార హక్కు ఓ పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు. రూ 500, రూ 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016 నవంబరు 8న ఆకస్మిక ప్రకటన చేశారు.

media 22062018 3

ప్రజలు తమ వద్ద ఉన్న ఆ నోట్లను డిసెంబరు 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించారు. అంతే ఆ మాటున పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరడం మొదలెట్టాయి. ఆ క్రమంలో అహ్మదాబాద్‌ డీసీసీబీకి కేవలం ఐదు రోజుల్లో అంటే నవంబరు 13 సాయంత్రానికి రూ 745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమ అయ్యాయి. అటు రాజ్‌కోట్‌ డీసీసీబీలో రూ 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్‌ జరిగింది. రాజ్‌కోట్‌ నుంచే మోదీ 2001లో మొట్టమొదట గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్కడి డీసీసీబీకి చైర్మన్‌ అయిన జయేశ్‌భాయ్‌ విఠల్‌భాయ్‌ రదాదియా ప్రస్తుతం విజయ్‌ రూపానీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. అహ్మదాబాద్‌ డీసీసీబీకి అమిత్‌ షా 2000లో ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత నుంచి నేటి దాకా ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read