కాపు రిజర్వేషన్ ఉద్యమ సెగ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తాకింది. మొన్నటి వరకు కాపు రిజర్వేషన్ పై చంద్రబాబు ప్రభుత్వం పై, విమర్శలు చేసిన జగన్, ఎప్పుడైతే చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి కాపులకి రిజర్వేషన్ ఇవ్వమని పంపించారో, అప్పటి నుంచి జగన్, కాపు రిజర్వేషన్ పై అసలు మాట మాట్లాడటం లేదని కాపు జేఏసీ నాయకులు ఆందోళన చేసారు. కేంద్రం కోర్ట్ లో కాపు రిజర్వేషన్ ఉంది కాబట్టి, అప్పటి నుంచి జగన్, కాపు రిజర్వేషన్ గురించి మాట్లడటం లేదని ఆందోళన చేసారు. గంటి పెదపూడిలో ప్రారంభమైన జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు అడుగడుగునా కాపు నాయకులు, యువత ప్లకార్డులతో నిరసన తెలుపుతూ వైసీపీ కాపులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని నినాదాలు చేశారు.

kapu 19062018 2

గంటిపెదపూడి వద్ద జగన్‌ పాదయాత్రలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం జగన్‌ పాదయాత్ర ముందు రోడ్డుపై భైఠాయించగా జగన్‌ వ్యక్తిగత సిబ్బంది నిరసనకారులను పక్కకి నెట్టివేశారు. అనంతరం మధ్యాహ్నం వైవీపాలెం మీదుగా జగన్‌ పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో వైవీపాలెం సెంటర్‌లో మహిళలు, కాపు యువత ప్లకార్డులు ప్రదర్శించి స్పష్టమైన హామీ ఇవ్వాలని నినాదాలు చేశారు. అయితే మహిళలను కూడా జగన్‌ వ్యక్తిగత సిబ్బంది పక్కకు నెట్టివేసి యాత్రను కొనసాగించారు. జగన్‌ యాత్ర బోడపాటివారిపాలెం సెంటర్‌కు చేరుకునే సరికి అప్పటికే పెద్దసంఖ్యలో వేచియున్న కాపుయువత, నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు.

kapu 19062018 3

జగన్‌ పాదయాత్రను ఆపి వారిని ముందుకు రావాలని సూచించారు. వారు జగన్‌ వద్దకు వెళ్లి కాపు రిజర్వేషన్లపై వైసీపీ తరపున స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. తాడేపల్లిగూడెంలో మాట్లాడాను కదా అని జగన్‌ సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు పి.గన్నవరం సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో కాపు రిజర్వేషన్లు ప్రస్తావించాలని పట్టుబట్టారు. జగన్‌ వినతిపత్రాన్ని తీసుకుని పాదయాత్రను ముందుకు కొనసాగించారు. నిరసన కార్యక్రమాల్లో యర్రంశెట్టి సాయిబాబు, బోడపాటివారిపాలెం కాపునాయకులు, యువత పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నాని చెప్తూ, జగన్ ప్రజలు తమ సమస్యలు తెలియజేసినా పట్టించుకోవటం లేదని, ఆగ్రహం వ్యక్తం చేసారు.

దేశాన్ని మొత్తం కబలించాలి అనే ఏకైక ధ్యేయంతో, రాం మాధవ్ లాంటి వ్యక్తి మాటలు విశ్వసించి, అమిత్ షా, మోడీ చేసిన పనికి, అనుభవిస్తున్నారు. నైతికత అనేది ఏ మాత్రం లేకుండా, కేవలం అధికారం కోసం, ఎవరితో పడితే వారితో పొత్తు పెట్టుకుని, దేశాన్ని నాశనం చెయ్యటమే పనిగా పెట్టుకున్నారు. జమ్ము-కశ్మీర్‌లో పీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అందరూ ఆశ్చర్య పోయారు. అయినా, నైతికత పక్కన పెట్టి, కేవలం అధికారం కోసం, రాం మాధవ్ అనే వ్యక్తి మాటలు విశ్వసించి, బీజేపీ చేసిన అతి పెద్ద తప్పిదంతో, కాశ్మీర్ అస్త వ్యస్తం అయ్యింది. కాశ్మీర్ లో ఎప్పుడూ లేనంతగా, వేర్పాటు వాదం, ఎక్కువ అయిపొయింది. ఎప్పుడూ అశాంతితోనే అక్కడ ప్రజలు ఉన్నారు. దీనికి అక్కడ మూడేళ్ళుగా కలిసి, డిప్యూటీ సియం సహా, 9 మంది మంత్రులతో అధికారం పంచుకున్న బీజేపీ కూడా కారణం..

rammadhav 19062018 2

అయితే, ఇప్పుడు దేశ వ్యాప్తంగా, కాశ్మీర్ పై విమర్శలు వస్తూ ఉండటంతో, బీజేపీ అధిష్టానం మేల్కుంది. కలిసి అధికారంలో ఉన్నా, తప్పు మాత్రం పీడీపీ మీదకు నెట్టి, ఉగ్రవాదం కారణంగా చూపి, జమ్ము-కశ్మీర్‌లో పీడీపీతో పొత్తుకు భాజపా గుడ్‌బై చెప్పింది. రాష్ట్రంలో ఉగ్రవాదం పెరిగిపోవడంతో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయింది అంటూ కొత్త రాగం అందుకుంది. మరి ఈ రోజు వరుకు కలిసి ఉన్న బీజేపీ కి బాధ్యత లేదా అంటే, తప్పించుకుని పారిపోయాడు రాం మాధవ్.. అంతే కాదు, దేశ దీర్ఘకాలిక రక్షణ, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అధికారాలను గవర్నర్‌కు బదలాయిస్తున్నట్లు చెప్పి, కాశ్మీర్ ను కేంద్రం ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

rammadhav 19062018 3

రంజాన్‌ సందర్భంగా ప్రకటించిన కాల్పుల విరమణతో నెల రోజుల్లో ఉగ్రవాదం పెరిగిపోయింది. బద్రతా దళాలు ఇలాంటివి వద్దు అని చెప్పినా, అనోలచిత నిర్ణయాలతో కేంద్రం చేసిన చర్యను అందరూ ఖండించారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోవటంతో, ఇలాంటి డ్రామాతో, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాం మాధవ్. ఇలా మిత్రపక్షాలని ముంచటం, బీజేపీ కి కొత్త ఏమి కాదు. మిత్రపక్షాలు ద్వారా, రాజ్యసభ సీట్లు పొందటం, వారిని ముంచటం, వీరికి బాగా అలవాటు. అన్ని రాష్ట్రాలు మా ఆధీనంలోనే ఉండాలి అని అహంకార ధోరణితో, దేశాన్ని సర్వ నాశనం చేస్తుంది బీజేపీ... నోట్ల రద్దుతో , ఉగ్రవాదులకు డబ్బులు అందటం లేదు, అసలు దేశంలో ఉగ్రవాదమే లేదు అని ఊదరగోట్టే బీజేపీ, ఇప్పుడు మాత్రం, ఉగ్రవాదం బాగా పెరిగిపోయింది అని చెప్పి కాశ్మీర్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు.. కాశ్మీర్ ను కెలికి కెలికి కంపు చేసిన రాం మాధవ్, మన రాష్ట్రానికి వచ్చి ఎదో పొడుస్తాడు అంట.. మొన్న కర్ణాటకలో కూడా, ఫలితాలు రాక ముందే, సౌత్ వర్డ్ మార్చ్ కి వస్తున్నాం, రెడీగా ఉండు చంద్రబాబు అని చెప్పిన గంటలోనే, చతికిలబడ్డాడు... ఈయన చేసే పనులు అన్నీ ఇలాగే ఉంటాయి.. అన్నీ పెటాకలు అవుతాయి..

ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్ ను, అమరావతి రమ్మని ప్రభుత్వం కబురు పంపించింది... ఒకటి రెండు సార్లు.. కాని జగన్ మాత్రం నేను రాను అని కబురు పంపించారు... "అమరావతి శంకుస్థాపనకే రాని వాడు, ఇలాంటి వాటి కోసం ఎందుకు వస్తాడులే అండి, పిలావాల్సిన బాధ్యత మనది, పిలిచాం... మొహమాటం లేకుండా, నేను రాను అని చెప్పాడు... అయినా ఇది ఎమన్నా మన ఇంట్లో వ్యవహారమా, రాష్ట్రానికి సంబంధించింది, ఆయన ఎప్పుడో ప్రతిపక్ష నేత బాధ్యత నుంచి తప్పుకున్నాడు, ఇప్పుడు ఆయన వస్తాడు అని ఎవరు అనుకోవట్లేదు అంటూ", ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు... అసలు జగన్ ను ఎందుకు అమరావతి రావలాని ప్రభుత్వం ఆహ్వానించింది అంటే ? ఇప్పుడు మూడో సారి, కబురు పంపారు..

jagan 19062018 2

సమాచార కమిషనర్ల ఎంపిక పై ఇవాళ మధ్యాహ్నం త్రిసభ్య కమిటీ భేటీ కానుండి. కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌, మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఈ సమావేశానికి హాజరుకాలేనని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి సమాచారమిచ్చి, తన తరఫున ప్రతినిధి వస్తారని తెలిపారు. ఇందుకు నిబంధనల ప్రకారం వేరే వ్యక్తులకు అవకాశం లేదని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. జగన్‌ హాజరు కాక పోవడంతో జాప్యం అవుతోందని ప్రభుత్వం పేర్కొంటోంది. కాగా ప్రతిపక్ష నేత రాకుంటే ఆర్టీఐ కమిషనర్ల ఎంపికను ఏ విధంగా జరపాలన్న అంశంపై సర్కారు న్యాయ సలహా తీసుకోనుంది.

jagan 19062018 3

చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, భేషిజాలకు పోకుండా, రెండు సార్లు అప్పటి సచివాలయానికి వెళ్లి, ప్రక్రియలో పాల్గున్నారు... కాని, జగన్ మాత్రం, ఎప్పటి లాగే, ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నారు... ప్రతి శుక్రవారం కోర్ట్ కి ఎలా వెళ్తున్నాడో, అలాగే అమరావతి వచ్చి వెళ్ళటానికి జగన్ కు ఇబ్బంది ఏంటో మరి... రాజిమండ్రిలో ఫ్లైట్ ఎక్కితే, అరగంటలో అమరావతిలో ఉంటాడు.. కాని, జగన్ మాత్రం నాకు అది అనవసరం అన్నట్టు వ్యవహిరించటంతో, ప్రభుత్వం తాను ఇష్టం వచ్చిన వాళ్ళని సమాచార కమిషనర్లగా ఎంపిక చేసుకుంటుంది... అప్పుడు మాత్రం, విమర్శలు చెయ్యటానికి ముందు ఉంటారు...

జగన్ మోహన్ రెడ్డి విపరీత మనస్తత్వానికి, ఎంత మంది బలయ్యారో అందరికీ తెలుసు.. ఐఏఎస్ ల దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి వెనకాల ఉండే సూరీడు దాకా, అందరూ నాశనం అయ్యారు. ఇప్పుడు తన విపరీత మనస్తత్వంతో, ప్రభుత్వంలో ఉండే వారిని కూడా ఇబ్బంది పెడుతూ, హేళన చేస్తూ, ఇబ్బంది పెడుతున్నాడు. పరకాల ప్రభాకర్, ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన భార్య నిర్మలా సీతారామన్ బీజేపీ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి నేపధ్యంలో, చంద్రబాబు కావాలనే ఇలా చేస్తున్నారు అంటూ, భర్త ఇక్కడ, భార్య అక్కడ అంటూ, జగన్ చేసే ప్రచారం తట్టుకోలేక పరకాల, ఆయన పదవికి రాజీనామా చేసారు. అయితే, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన కొత్తలోనే, పరకాల ఈ నిర్ణయం తీసుకున్నా, అప్పుడు చంద్రబాబు ఒప్పుకోలేదు. మీ సామర్ధ్యం మీద, మీ మీద విశ్వాసం ఉంది,ఎవరు ఏమి అనుకున్నా, మీరు ఇక్కడే ఉండాలి అని ఆయన్ను అప్పట్లో వారించినట్టు వార్తలు వచ్చాయి. కాని, జగన్ మోహన్ రెడ్డి మరీ పర్సనల్ గా వెళ్ళిపోయి, ఆరోపణలు చెయ్యటంతో, ముఖ్యమంత్రికి ఇబ్బంది కలగకూడదు, ఆయన పోరాటాన్ని, జగన్ లాంటి వారు తన వాళ్ళ ఎగతాళి చెయ్యటంతో, ఈ రోజు రాజీనామా చేసారు..

parakala 19062018 2

ముఖ్యమంత్రికి రాసిన లేఖలో డాక్టర్ పరకాల ప్రభాకర్ : విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలలో ఉండడాన్ని పదే పదే ఎత్తి చూపుతున్నారు.. కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం మీద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు... ప్రభుత్వంలో నా ఉనికిని, మీ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారు... బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి మీరు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారు... నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు, రాజకీయ ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ ఆపాదించ పూనుకోవడం, వాటిని తెరవెనుక మంతనాలకు బేరసారాలకూ మీరు వినియోగిస్తారని ఆరోపించడం ప్రతిపక్ష నాయకుల నీచ స్థాయి ఆలోచనలకు తార్కాణం...

parakala 19062018 3

నా కుటుంబం లోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతాను అని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోంది... పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరనీ, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరం.... నేను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు మీరు చేపట్టిన ధర్మపోరాట దీక్షమీదా, మీ చిత్తశుద్ధి మీదా నీలినీడలు పడకూడదని నా కోరిక... నా వల్ల మీకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ నలుసంతయినా నష్టం జరగరాదని నా దృఢ అభిప్రాయం.... అందుచేత నేను ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నాను... మీ మీదా, ప్రభుత్వం మీదా బురదజల్లడానికీ, లేనిపోని ఆరోపణలు చెయ్యడానికీ నా పేరూ, నా కుటుంబ సభ్యుల పేర్లూ ఎవ్వరూ వాడుకోకూడదు... గత నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడనై ఉంటాను...

Advertisements

Latest Articles

Most Read