ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని నగరంలోని రాయపూడిలో, రేపు ఐకానిక్ టవర్ కు శంకుస్థాపన జరగనుంది. ఉదయం 10గంటలకు రాయపూడిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ సైట్‌లో ప్రాంభమయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు పాల్గొంటారని గుంటూరు జిల్లా అధికారవర్గాలు తెలిపాయి. ప్రవాస తెలుగు ప్రజలు సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆ సంస్థ ప్రత్యేకంగా ఐకాన్‌.ఏపీఎన్‌ఆర్‌టీ.కామ్‌ వెబ్‌సైట్‌ని కూడా ప్రారంభించింది. ఐకాన్‌ కోసం పేర్లను నమోదు చేసుకొనేందుకు, మెంబర్‌గా రిజిస్టర్‌ అయ్యేందుకు ఆప్షన్స్‌ని అందుబాటులో ఉంచింది.

iconitower21062018 2

ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి సంబంధించిన మొట్టమొదటి ప్రత్యక్ష పెట్టుబడి ప్రాజెక్టుగా ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ని సంస్థ పేర్కొంటోంది. మల్టిపుల్‌ బ్లూచిప్‌ కంపెనీలకు ఈ ఐకాన్‌ గుడారంలా ఉంటుంది. 2000 నుంచి 3000 మంది ఎక్కువ వేతనాలను పొందే ఉద్యోగులను అమరావతి రాజధాని నగరానికి ఈ ఐకాన్‌ తీసుకొస్తుంది. ఇక్కడ లభించే ఉద్యోగాలు అంతర్జాతీయ స్థాయిలో ఖర్చులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. అలానే ప్రపంచవ్యాప్తంగా బయ్యర్లకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు తీసుకొస్తుంది. పెట్టుబడిదారులకు ఎలాంటి రిస్కు ఉండదు. ఈ ప్రాజెక్టుకు ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీతోపాటు ఏపీ ప్రభుత్వం ప్రమోటర్లుగా ఉన్నందున ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఈ ప్రాజెక్టులో బహిరంగ ప్రదేశాలు, కన్వెన్షన్‌ హాల్స్‌, ఆఫీసులు, సమావేశ మందిరాలు, గార్డెన్‌ అపార్టుమెంట్స్‌, సూట్స్‌, టెర్రాస్‌ గార్డెన్‌, ఇన్‌ఫినిటీ పూల్‌, స్పా, చుట్టూత తిరిగే రెస్టారెంట్‌ వంటి సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు.

iconitower21062018 3

33 అంతస్తులలో ఐకాన్‌ టవర్‌ ఉంటుంది. ఇది రాజధానికే ఒక వజ్రంలా ఉంటుందని సొసైటీ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, కృష్ణానదికి మధ్యన ఉండటం వల్ల ప్రకృతి ఒడిలో ఇమిడినట్లుగా ఉంటుంది. 33వ అంతస్తులో రూఫ్‌టాప్‌ పూల్‌, ఎన్‌ఆర్‌టీ క్లబ్‌ ఉంటాయి. ప్రైవేటు కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, జిమ్నాజియం కూడా ఉంటాయి. ఐకాన్‌ చుట్టూత ఇన్‌సులార్‌ స్కిర్ట్‌ ఏర్పాటు చేయడం వల్ల 30 శాతం ఇంధనం ఆదా అవుతుంది. రూప్‌ టాప్‌ గార్డెన్స్‌తో సహజసిద్ధమైన చల్లదనం అమరుతుంది. నీటిని పొదుపు చేసేందుకు కూడా ప్రాజెక్టులు చేపడతారు. సోలార్‌ విద్యుత్‌తో కార్బన్‌ ఎమిషన్స్‌ ఉండవు. రివర్‌ఫ్రంట్‌లో పర్యాటకులను ఆకట్టుకొనేందుకు స్పెషాలిటీ కియోస్క్‌లు ఏర్పాటుచేస్తారు. ఒక్కో సంస్థకి 4,500 ఎస్‌ఎఫ్‌టీని కేటాయిస్తారు.

ఫెడరల్ ఫ్రంట్ అని హడావిడి చేసిన కెసిఆర్, మాకు ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారితోనే పొత్తు అంటున్న జగన్... ఇప్పుడు ఇద్దరూ కలిసి, బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే వీరు రహస్య స్నేహితులు అయినా, బయటకు మాత్రం, బిల్డ్ అప్ ఇస్తూ ఉంటారు. తెలంగాణాలో అదికారంలో ఉన్న కేసీఆర్, ఆంద్ర‌లో ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లతో, అమిత్ షా మంతనాలు చేసినట్టు తెలుస్తుంది. తెలుగుదేశం దూరం అవ్వటం, శివసేన అడ్డం తిరగటంతో, కేసిఆర్ జగన్ లను కలుపుకుని, మాకు బలం ఏ మాత్రం తగ్గలేదు అని బీజేపీ చూపించాలి అనుకుంటుంది. ఇందుకోసం, రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నికలను, బీజేపీ వాడుకుంటుంది. త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఇటు టీఆర్ఎస్ కు, అటు వైసీపీల మద్దతు అమిత్ షా కోరారు.

amtishah 21062018 2

రాజ్యసభలో 245 అభ్యర్ధులు ఓటింగ్ కు వస్తే, డిప్యూటీ చైర్మెన్ పదవికి 122 ఓట్లు అవసరం. తెలుగుదేశం పార్టీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం 117 మంది ఉన్నారు. అలాగే, బీజేపీ తన మిత్రపక్షాలు, ఏఐడీయంకే కలుపుకిని, 111 మంది ఉన్నారు. ఈ నేపధ్యంలో బీజేడీ పార్టీకి చెందిన 9 మంది, తెరాసా కు చెందిన 6 గురు, వైసిపీ కి చెందినా 2 మంది, కీలకం కానున్నారు. బీజేడీ మద్ధతు ఇచ్చిన తర్వాత కూడా ఈ రెండు పార్టీల మద్ధతు బీజేపీకి అవసరమవుతుంది. టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో కయ్యానికి కాలుదువ్వింది కనుక ఆ పార్టీకి మద్ధతిచ్చే అవకాశం లేనే లేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, వైసీపీల మద్ధతు బీజేపీకి అనివార్యం అవుతుంది.

amtishah 21062018 3

కథ అంతటితో అయిపోలేదు... రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంలో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఈ ఎన్నికకు అభ్యర్థిని నిలిపే యోచనలో కొన్ని ప్రాంతీయ శక్తులు వ్యూహ రచన చేస్తున్నాయి. బీజేపీ ఎలాగూ జగన్ మద్ధతు అడుగుతుంది. ఆయన వారి కోరిక మేరకు కమలానికి జై కొడితే... ఆంధ్రాలో టీడీపీకి మరో బలమైన అస్త్రాన్ని ఇచ్చినట్టవుతుంది. ఇప్పటికే బీజేపీ - వైసీపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందని... కొన్ని ఆధారాలను టీడీపీ బయటపెట్టింది. తాజాగా డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కమలానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరింత ఇబ్బందులు వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాదంటే మోడీ క‌న్నెర్ర‌ - అవునంటే ఏపీ ప్రజలకు ఆగ్ర‌హం అన్నట్టుగా వైసీపీ పరిస్థితి మారుతుంది. సైలెంట్ గా ఓటింగ్ కు దూరంగా ఉంటే, అమిత్ షా తన్ని లోపల వేస్తాడు. అందుకే జగన్ కు తప్పని పరిస్థితి. ఇక కెసిఆర్ ఆడుతున్న ఫెడరల్ ఫ్రంట్ డ్రామా కూడా తెర పడుతుంది. మొత్తానికి, ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికతో, దేశ రాజకీయం మరో మలుపు తిరగనుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా, కేంద్రంలోని మిగతా మంత్రులకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గత పది రోజుల్లో, వివిధ సమస్యల పై 10 లేఖలు రాసారు. తాజాగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు పై లేఖ రసారు. మెకాన్‌ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదిక ఆధారంగా సుప్రీంలో సవరణ అఫిడవిట్‌ను కేంద్రం వెంటనే దాఖలు చేయాలని కోరుతూ సోమవారమే మోడీకి చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖ వివరాలను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. సెయిల్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇటీవల సుప్రీంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అనుకూలం కాదంటూ అఫిడవిట్‌ దాఖలు చేసిందని, ఇది ఏపీ ప్రజలకు ఆందోళనను కలిగించిందని, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ ప్రాజెక్టు వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఆర్థికంగా దన్నుగా ఉంటుందని, సుప్రీంలో వెంటనే సవరణ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

cbn 21062048 2

చంద్రబాబు పది రోజులుగా కేంద్రానికి విభజన హామీలపై లేఖలు రాస్తున్నారు. వివిధ అంశాలపై ఆయన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు లేఖలు రాస్తున్నారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభును కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా కాలుష్య నియంత్రణ మండలి, చత్తీస్‌గఢ్ పర్యావరణ సంరక్షణ బోర్డు ఇచ్చిన పనుల నిలిపివేత ఉత్తర్వులను పూర్తిస్థాయిలో ఉపసంహరించేలా మరో లేఖ రాశారు.

cbn 21062048 3

గ్యాస్ గురించి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు, తిరుమల విషయంలో పురావస్తు శాఖ కార్యాలయం మొదలు అమరావతి సర్కిల్ వరకు జరిగిన వ్యవహారాలపై విచారణ జరిపించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మకు, జీడిపప్పు పరిశ్రమ గురించి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభుకు, బకాయి వసూళ్లు, విద్యుత్ రంగం ఒత్తిడిపై మరో కేంద్రమంత్రికి, విశాఖలో పౌర విమానాల రాకపోకల సమయాలపై ఆంక్షలు విధించవద్దని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. మరి ఈ లేఖల అన్నిటి పై, కేంద్రం స్పందిస్తుందో, పక్కన పదేస్తుందో చూడాలి...

నిన్న జరిగిన టీవీ డిబేట్లలో, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీల్ కు ఛాలెంజ్ విసిరితే పారిపోయారు. ఇంతకీ జీవీల్ అంటే ఎవరో తెలీదు అంటారా.. ఈ మధ్యే వార్తల్లో వస్తున్నారు. అరకోటు వేసుకుని, ఎక్కువగా అమరావతి పై విమర్శలు చేస్తూ, మీకు మయసభ కావాలా అని అడుగుతూ ఉంటారు.. ఆయనే జేవీఎల్ అంటే... నిన్న టీవీ డిబేట్ లో, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఒక ఛాలెంజ్ విసిరారు. మీరు, నేను కొట్టుకోవటం ఎందుకు, కేంద్రం నుంచి ఒక ఐదుగురు, రాష్ట్రం నుంచి ఐదుగురు అధికారులని, ఓపెన్ డిబేట్ చెయ్యమని చెప్దాం.. టీవీ చానల్స్ ముందు ఈ డిబేట్ పెడదాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒప్పించి తీసుకువస్తా, మీరు కేంద్రం నుంచి తీసుకురండి, ప్రజల ముందు వాస్తవాలు ఉంచుదాం. నేను చెప్పింది తప్పు అయితే గుండు కొట్టించుకుంటా అని కుటుంబరావు అంటే, జీవీఎల్ ఈ ఛాలెంజ్ స్వీకరించకుండా పారిపోయారు.

gvl 21062018 2

కేంద్రం సాయం పై టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావుకు, బీజేపీ నేతలకు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు 2017 మార్చి తర్వాత ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని, ఇచ్చినట్టు నిరూపిస్తే తాను గుండు కొట్టించుకుంటానని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుకు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ విసిరారు. ‘టీవీ9’ లో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో వీళ్లిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబరావు మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతోనే నాడు ప్రత్యేక ప్యాకేజ్ కు ఒప్పుకున్నామని, పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి డీపీఆర్-2 కూడా ఇంతవరకు ఆమోదించలేదని అన్నారు.

gvl 21062018 3

2015-16 వరకు ఆరు ప్రాజెక్టులకు వడ్డీతో సహా ఖర్చులను కేంద్రం భరిస్తుందా చెప్పాలని నిలదీశారు. మే 30న రెసిడెంట్ కమిషనర్‌కు మరో లేఖ రాశారని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో వడ్డీ సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నామని అన్నారు. 2016 సెప్టెంబర్ లో ప్రకటించిన ఈఏపీకి మార్గదర్శకాలు జారీ చేయలేదని, 2015-20 వరకు ఆరు ప్రాజెక్ట్ లకు వడ్డీతో సహా ఖర్చులన్నింటినీ కేంద్రం భరిస్తుందా? అని ప్రశ్నిస్తూ కేంద్రానికి ఓ లేఖ రాసినా స్పందించలేదని, మే 30న రెసిడెంట్ కమిషనర్ కు మరో లేఖ రాశారని అన్నారు. ఈ ప్రాజెక్టుల విషయంలో వడ్డీ సహా అసలు మొత్తం కూడా చెల్లిస్తున్నామని చెప్పారు. దీన్ని పట్టుకుని, మేము ప్యాకేజీకి ఒప్పుకున్నాం అంటూ, అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయం పై సవాల్ చేస్తున్నాని అని అన్నారు. కుటుంబరావు గారు అడిగిన ప్రశ్నలకు జీవీఎల్ దగ్గర సరైన సమాధానం లేదు. ఆఫీసర్-టు-ఆఫీసర్ సమావేశానికి కుటుంబరావు 100 సార్లు అడిగారు, అయినా జీవీఎల్ మాత్రం తన తెలివి తేటలతో, తప్పించుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read