మరో రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజికి పట్టిసీమ నీళ్ళు వస్తాయి అనే సంతోషంతో ఉంటే, అక్కడ రోజు రోజుకి పేరుకుపోతున్న గుర్రపుడెక్క సమస్యగా మారింది. దీంతో, జలవనరుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పొక్లెయిన్ల సహాయంతో తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఆదివారం ఉదయం ఆయన పనులు జరిగే ప్రాంతాన్ని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, మంత్రి దేవినేని ఉమా, సందర్శించి తొలగింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గుర్రపుడెక్క కృష్ణానదిలో విస్తరించి ఉన్న విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నందున రెండు, మూడు రోజుల్లో మొత్తం ప్రాంతం అంతా క్లియర్ చేసి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

prakaams 18062018

సోమవారం ఉదయం నుండి 500 మంది మత్స్యకార నిపుణులను గుర్రపుడెక్కను తొలగింపునకై అదనంగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సుమారు రెండు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నదిని మూడింతలు ఆక్రమించుకుంది. గత మూడు రోజులుగా అధికారులు తొలగింపు చర్యలు చేపట్టినా గాని ఈ జాఢ్యం వదలడం లేదు. ఇప్పటివరకు 40 వేల చదరపు మీటర్ల గుర్రపుడెక్కను తొలగించామని అధికారులు చెబుతున్నారు. ప్రతి నిత్యం నది ఎగువ భాగాన్నుండి ఈ ఆకు తెట్టలు తెట్టలుగా వచ్చి చేరుతూనే ఉంది. పట్టిసీమ నీరు రాక మొదలైతే, తూర్పు, పశ్చిమ డెల్టాలకు సాగునీరు వదిలే సమయంలో, సాగునీరుతో పాటు ఈ ఆకు కూడా నీటి ప్రవాహానికి కొట్టుకెళితే రైతులపై పెనుభారం పడుతుంది. ఏరువాక కోసం ఎదురు చూస్తున్న రైతులు ఈ గుర్రపు డెక్క ఆకుతో పాటు నీరు వస్తే దానిని తొలగించుకోవడానికి అదనపు వ్యయభారం అవుతుంది. పైగా పంట కాలువల నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతుంది.

prakaams 18062018

అందుకే ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, దీని పై సమీక్ష జరిపారు. శుక్రవారం రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుండి డ్రోన్ కెమేరాలతో గుర్రపు డెక్కను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట కాలువల పూడికలు తీసుకొని రైతులు ఏరువాక కోసం ఎదురుచూస్తున్నారని, సాగునీటి విడుదల నాటికి ఈ ఆకును పూర్తిస్థాయిలో తొలగించి సాగునీటికి అవరోధాలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో దాదాపు 500 మందిని, ఈ పనుల్లో పెట్టారు. పడవల సాయంతో కెఇ మెయిన్ రెగ్యులేటరు వద్దకు ఆకును పోగు చేయించి అనంతరం పొక్లెయిన్ల సాయంతో , దీన్ని తొలగిస్తున్నారు.

నిన్న విజయవాడలో జరిగిన పాప కిడ్నాప్ కేసు, వార్తా ప్రసారాల్లో హాల్ చల్ చేసింది. ఒక ఛానల్ అయితే, ఎదావిధగా, అమరావతిలో శాంతిబధ్రతలు లేవు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే బెజవాడ పోలీసులు మాత్రం, ఇవేమీ పట్టించుకోకుండా, 24 గంటల్లో కేసు ఛేదించారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఐదేళ్ల పాప ఆదివారం అదృశ్యమైంది. కొన్ని గంటల తర్వాత నరసరావుపేటలో ప్రత్యక్షమైంది. పోలీసులు, తల్లిదండ్రుల కథనం మేరకు.. శ్రీకాకుళానికి చెందిన పైడి రాజు, శాంతి శ్రీ దంపతులు, వారి కుమార్తే నవ్యశ్రీ(5) శనివారం తిరుపతి వెళ్లి వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం దుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ వచ్చారు. ఆదివారం ఉదయం బయట తలనీలాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో పాప అదృశ్యమైంది.

police 18062018 2

ఆ బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు దుర్గగుడి అధికారులను ప్రాధేయపడినా వారు పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసి కెమెరాల ద్వారా పాపను గుర్తించేందుకు వారు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నవ్యశ్రీ ఆచూకిని నర్సరావుపేటలో పోలీసులు గుర్తించారు. బాలికను కిడ్నాప్‌ చేసిన వారినీ అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో నవ్యశ్రీని కిడ్నాప్‌ చేసిన దంపతులు విజయవాడ రైల్వేస్టేషన్‌లో నరసరావుపేటకు టిక్కెట్లు కొని ప్యాసింజర్‌ రైలులో వెళ్లినట్టు గుర్తించారు. నర్సరావుపేట రైల్వేస్టేషన్‌లో డిఎస్‌పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిఘా ఉంచారు. రైలు నరసరావుపేటకు రాగానే దంపతులతో పాటు బాలికను అదుపులోకి తీసుకున్నారు.

police 18062018 3

ఇదిలా ఉండగా నిందితులు నరసరావుపేట వడ్డెర బజారుకు చెందిన సుబ్బలక్ష్మీ నర్సరావుపేటలో ఒక ప్రయివేటు నర్సింగ్‌ హోంలో నర్సుగా పని చేస్తోంది. ఆమె ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు ఈ పాప ఏడుస్తూ కన్పించిందని, పాప తాలుకూ ఎవ్వరూ కన్పించకపోవడంతో తీసుకొచ్చామని అంటున్నారు. తమకు ఒక కుమారుడు ఉన్నాడని, కిడ్నాప్‌ చేసే ఉద్దేశమేమీ లేదని చెప్పారు. పోలీసులకు విజయవాడలోని అప్పగిద్దామనుకున్నా పెళ్లి పనుల నిమిత్తం అత్యవసరంగా రావాలని ఇంటిదగ్గర నుండి ఫోన్‌ రావడంతో బాలికను నరసరావుపేటలోనే అప్పగిద్దామని వచ్చామని, కాకపోతే ఇక్కడ పనుల్లో పడి బాలికను పోలీసులకు అప్పగించడం ఆలస్యమైందని చెబుతున్నారు. ఈ మాటలను పోలీసులు విశ్వసించడంలేదు. కిడ్నాప్‌ కోణంలోనే విచారిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు నరసరావుపేట పోలీసుస్టేషన్‌కు వెళ్లగా వారికి ఆ చిన్నారిని అప్పగించారు.

దేశం చూస్తుండగా షేక్ హ్యాండ్ ఇస్తే అది నీతి ఆయోగ్... దొడ్డిదారిన పీఎంవోలో దూరి మీడియాను చూసి పారిపోతే అది అవినీతి ఆయోగ్... ఇలాంటి పనులు చేసే వైసీపీ, దాని అవినీతి చెంచా సాక్షి కలిసి, నిన్నటి నుంచి, చంద్రబాబు, ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు అని, లొంగిపోయారు అని, ఇలా ఇష్టం వచ్చినట్టు కూస్తున్నారు. ఇంకో పిల్ల పార్టీ అయితే, వాళ్ళ నాయకుడు కనీసం ఆంధ్రా వీధుల్లో మోడీ అనే పేరు తలవటానికి కూడా భయపడుతూ నాలుగు రోజులు తిరిగి, ఫార్మ్ హౌస్ లో పడుకున్నాడు.. వీళ్ళందరూ, కలిసి, దేశం మొత్తం, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులకు, ప్రధాని వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరిస్తే, ఆ సందర్భంలో చంద్రబాబు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీనికి ఎదో ఒంగిపోయాడు అని, లొంగిపోయాడు అని, పిచ్చ ప్రచారాలు ఎందుకు ? నిజానికి, నీతి అయోగ్ సమావేశానికి ముందు, ఏమి జరిగిందో టీవీల్లో అందరూ చూసారు. మోడీ అక్కడ ఉన్నా, చంద్రబాబు పలకరించకుండా వెళ్ళిపోయారు. టీ బ్రేక్ సమయంలో, ప్రధాని మోడీ, అందరి ముఖ్యమంత్రులని పలకరిస్తూ, మమత, చంద్రబాబు, కుమారస్వామి దగ్గరకు వచ్చి, వీరిని కూడా పలకరించారు. అంటే ప్రధాని అందరి ముఖ్యమంత్రుల దగ్గరకు వచ్చి పలకరిచ్చారు అంటే, ఆయనకు ముఖ్యమంత్రులు అంటే భయం అనుకోవాలా ? ఇలా అంటే, ఎంత చండాలంగా ఉంటుందో, చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇస్తే, లొంగిపోయాడు అనటం కూడా అంతే చండాలంగా ఉంటుంది.

modi 18062018 2

ఒక ముఖ్యమంత్రి, ప్రధానిని కలిస్తే, చొక్కాలు చించేసి కొట్టుకోవాలా ? రాజకీయంగా ఎన్ని వైరాలు ఉన్నా, ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఒక ప్రధాని స్థాయిలో వ్యక్తి వచ్చి పలకరిస్తే, దానికి ముఖ్యమంత్రి స్పందిస్తే, అది కూడా తప్పా ? ఒక్క ఫోటో పట్టుకుని, లొంగిపోయాడు అని వాగే సైకోలకి, నిన్న చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని దులిపిన దులుపుడు కనిపించదు. మా రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటూ, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు, ప్రధానిని నిలదీస్తే, ఇది కనిపించదు.. చంద్రబాబు ఉతుకుడు తట్టుకోలేక, ఇంకా ఆపెయ్యండి, మీ టైం అయిపొయింది అని హోం మంత్రి అంటే, లేదు నేను చెప్పాలి అంటూ, 21 నిమషాలు, 5 కోట్ల మంది ఆకాంక్షను, ఈ దేశ ప్రధాని ముందు, 29 రాష్ట్రాల ముందు వినిపిస్తే, అది కనిపించదు... చివరకు ఇంత వైరం నడుస్తున్నా, వ్యవసాయనికి, ఉపాధి హామీ అనుసంధానం పై అధ్యయనం చేయ్యమని మన ముఖ్యమంత్రిని, ప్రధాని కోరారు... దేశంలో అన్ని రాష్ట్రాలు, విద్యుత్ రంగం విషయంలో, ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకోమన్నారు, ప్రధాని... ఇలాంటివి ఈ సైకోలకు కనిపించవు...

modi 18062018 3

ఇదే సైకోలు, సైకో ఛానల్, మొన్న తిరుమల వచ్చినప్పుడు, అమిత్ షా కు నిరసన తెలిపితే, ఇది ఘోరం, అమానుషం, జాతీయ పార్టీ ప్రెసిడెంట్ కు గౌరవం ఇవ్వాలి, ప్రోటోకాల్ పాటించాలి అంటూ కబురులు చెప్పారు. నిరసన తెలిపితీనే ఘోరం, అమానుషం అంటారు.. ఏ సంబంధం లేని జగన్ కూడా, అమిత్ షా కి ఎందుకు నిరసన తెలిపారు అంటూ అడుగుతాడు.. అదే ప్రధానికి షేక్ హ్యాండ్ ఇస్తే, లొంగిపోయాడు అంటారు.. అసలు, మీ మోఖాలకి ఒక క్లారిటీ ఏడ్చిందా ? జగన్-చంద్రబాబుకు, చంద్రబాబు - పవన్ కు ఎలాంటి వైరం ఉందో తెలిసిందే.. వీరు ఎదురు పడితే, చంద్రబాబుని ముఖ్యమంత్రి హోదాలో, పలకరించరా ? షేక్ హ్యాండ్ ఇవ్వరా ? ఎన్ని సార్లు, జగన్, పవన్, చంద్రబాబుకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ? అంటే వారు చంద్రబాబు ఉన్నప్పుడు ఒకలా, చంద్రబాబు ఎదురుగా ఉంటే ఒకలా, ఉంటారని, చంద్రబాబుని చూస్తే భయపడతారు అంటే కుదురుతుందా ? నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబుని కలిసినప్పుడు ? చంద్రబాబు అంటే, భయం ఉండి షేక్ హ్యాండ్ ఇచ్చాడా ? అది ఆ పదవికి ఉండే గౌరవం.. ఎన్ని అనుకున్నా, ప్రధాని స్థాయి వ్యక్తి ఎదురుపడితే, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, చొక్కాలు చించి, తలకాయి పగలగొట్టి రావాలా ? అయినా, ఎవడి కాళ్ళు కనిపిస్తే, వాళ్ళ కాళ్ళ మీద పడే జగన్ మోహన్ రెడ్డి పార్టీ, ఇలాంటివి చెప్తే, భలే కామెడీగా ఉంటుంది... చివరగా, ఇలాంటివి అందరి రాజాకీయ నేతలకు ఎదురు అవుతూనే ఉంటాయి... ఇలాంటి వాటి మీద ఎక్కువగా లాగితే, నీవు నేర్పిన విద్యే అంటూ, చివరకు మీ నాయకులకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది... జీవితం ఎవ్వరినీ వదలదు.. అందరి సరదా తీర్చేస్తుంది.. టైం రావాలి అంతే...

ఏడాదిన్నర కాలంగా, అదిగో ఇదిగో అంటూ, చెప్తూ వస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం, కావాల్సినవై అన్నీ సమకూర్చినా, లేట్ చేస్తూనే ఉన్నారు.. అయితే, ఎట్టలేకలు రేపటి నుంచి, ఆ సేవలు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎట్టకేలకు కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. గన్నవరం నుంచి కార్గో సేవలు ప్రారంభించాలని చాలాకాలంగా కోరుతూ వచ్చారు. ఎట్టకేలకు ఏడాదిన్నర కిందట కార్గో సేవలను ప్రారంభించేందుకు కేంద్ర విమానయాన సంస్థ పచ్చజెండా ఊపింది. సేవల అమలుకు భవనంతో పాటు అన్ని సౌకర్యాలు విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నాయి. సేవలు ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సి ఉండగా.. భద్రతా పరమైన అనుమతుల నేపథ్యంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అనుమతుల ప్రక్రియ పూర్తయ్యి.. మంగళవారం నుంచి కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

gannavaram 18062018 2

గన్నవరం విమానాశ్రయానికి 1980 కాలంలోనే కార్గో సేవలు అందించిన ఘనత ఉంది. అప్పట్లో స్థానికంగా ఉండే బ్యాకన్‌ పరిశ్రమ నుంచి మాంసం ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేవారు. తరువాత కాలంలో ఈ విమానాశ్రయానికి ప్రాధాన్యం తగ్గడంతో సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం విమానాశ్రయంలో ఉండే రన్‌వే కార్గో, భారీ విమానాలు రాకపోకలకు అనువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కార్గో సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు పలుమార్లు కేంద్ర పౌర విమానయానశాఖకు విజ్ఞప్తులు పంపించారు. దీంతో కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో గతేడాది జులైలోనే ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. భద్రతా పరమైన అనుమతుల విషయంలో అనుకోని సమస్యలు ఎదురవ్వడంతో ఆలస్యమవుతూ వచ్చింది.

gannavaram 18062018 3

ప్రస్తుతం గన్నవరం నుంచి ప్రయాణికులతో పాటు అదే విమానంలో సరకు సరఫరా చేసే బెల్లీ కార్గో సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిలో పెద్దస్థాయిలో సరకును రవాణా చేసే అవకాశం లేదు. దీనిలో అత్యవసరంగా తరలించాల్సి వచ్చినప్పుడు చిన్న, ఓ మోస్తరు సరకులను మాత్రమే తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక్కడ నుంచే అన్ని రకాల వస్తువులను నేరుగా విదేశాలకు తరలించే అవకాశం ఉంది. దీని వల్ల ఆహార, వ్యవసాయోత్పత్తులు వాటి తాజాదనం పోకుండా ఉండటంతో పాటు ఖర్చు కూడా చాలా వరకు తగ్గనుందని లాజిస్టిక్‌ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. విదేశాల్లో ఎక్కడెక్కడ మన ఉత్పత్తులకు డిమాండ్‌ ఉదో అక్కడికి మరింత భారీ ఎత్తున సరకు తరలించేందుకు సైతం వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆసక్తి చూపుతారు.

Advertisements

Latest Articles

Most Read