11 సిబిఐ కేసులు... 5 ఈడీ కేసులు... అన్నిట్లో A2... 16 నెలలు చిప్ప కూడు.. కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్నాడు... ప్రతి శుక్రవారం కోర్ట్ లో సంతకం పెట్టాలి... ఆర్ధిక ఉగ్రవాది అని కోర్ట్ లు బిరుదు కూడా ఇచ్చాయి.. ఇలాంటి వ్యక్తి వచ్చి, చంద్రబాబు స్థాయి నాయకుడు పై, విమర్శలు చేస్తుంటే ఏమనాలి ? ప్రధాని ఆఫీస్ లో కూర్చుని, చంద్రబాబుని జైలుకు పంపిస్తా అంటాడు, ఈ కండీషనల్ బెయిల్ పై బయట తిరిగే వ్యక్తి... గతంలో ఎన్నో సార్లు, నోటికి ఇష్టం వచ్చిన్నట్టు మాట్లాడాడు... చంద్రబాబు నాయుడు తల్లి గురించి, అసభ్యంగా మాట్లాడిన సంస్కార హీనుడు.. ఇలాంటి వ్యక్తి విమర్శలు చేస్తూ, చంద్రబాబుకి ఛాలెంజ్ విసురుతాడు.. అయితే, ఇప్పుడు ఇలాగే ఇష్టం వచ్చినట్టు వాగి, నవ్వులపాలు అయ్యాడు..
అసలు విషయానికి వస్తే.. ధర్మవరం పట్టణానికి చెందిన నాగూర్ హుస్సేన్ గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన హుస్సేన్ జిల్లాలోకి ఆయుధాలతో ప్రవేశించాడనీ, అతనిపై కేసులు పెట్టకపోగా, అధికారపార్టీ నేతల సూచన మేరకు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అతన్ని జిల్లా సరిహద్దు దాటించారనీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణపై వెంటనే జిల్లా ఎస్పీ స్పందించారు. విజయసాయిరెడ్డి పేర్కొన్న తేదీల్లో అసలు తాను దేశంలోనే లేననీ, విదేశాలకు వెళ్లానని స్పష్టంచేశారు. దీంతో వైకాపా నేతలు కూడా నాలుక కరుచుకోవాల్సి వచ్చింది.
ఇటీవల మరో సందర్భంలోనూ ఇలాగే జరిగింది. పరిటాల శ్రీరామ్‌పై కూడా వైసీపీ నేతలు నోరు జారారు. అధికారబలంతో జిల్లాలో పరిటాల శ్రీరామ్ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతలు చేసిన ఈ ఆరోపణలకు వైసీపీ అధిష్టానం కూడా వత్తాసు పలికింది. అయితే సరైన పరిశీలన చేసుకోకుండా ఒక పార్టీ ఇలాంటి వైఖరి తీసుకోవడంపై జిల్లాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలను తనకు ఆపాదించడంపై శ్రీరామ్ స్వయంగా మీడియా సమావేశంలో ఖండించారు.