సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందు కు టీడీపీ సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష వైకాపా ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యంలేకనే 2015లో ఎంపీల రాజీనామా ప్రకటించి మూడేళ్ల అనంతరం ఎన్నికలు రావని తెలిసి రాజీనామాలు చేసి ఇప్పటికి ఆమోదం పొందడంలో డ్రామా లాడుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్‌లో వర్చువల్‌ తనిఖీ అనంతరం సీఎం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విపక్ష వైకాపా, బీజేపీ నేతల కుట్ర రాజకీయాలు, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ఢిల్లిలో ఫిర్యాదులు, గవర్నర్‌ వ్యవస్థ, విపక్షనేత జగన్‌ ఆచరణకు నోచుకోలేని వాగ్ధానాలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

cbn 16062018 2

కుట్ర రాజకీయాలు ఎదుర్కోవడం టీడీపీకి కొత్త కాదని 1984లోనే కేంద్రం కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని బీజేపీ, వైకాపాల కుట్రలను అదేస్పూర్తితో అధిగమిస్తామని చంద్రబాబు అన్నారు. విపక్ష వైకాపా చెప్పే మాటలకు, ఆచరణకు పొంతన లేకుండా వ్యవహ రిస్తోందన్నారు. హోదా అంశంపై పార్లమెంటులో ఓ వైపు అవిశ్వాస తీర్మానం పెట్టి, మరోవైపు ప్రధాని మోడీ వద్దకు వెళ్లి విశ్వాసం ప్రకటించడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తుంటే విపక్షం నోటికొచ్చి నట్లుగా మాట్లాడుతోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచరణకు సాధ్యంకాని హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

cbn 16062018 3

ముఖ్యమంత్రిగా పదేళ్లకుపైగా అనుభవం కలిగిన ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల బ్యాంకు ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పిన హామీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. ప్రధానికే సాధ్యంకానిది జగన్‌కు హామీలు నెరవేర్చడం సాధ్యమవు తుందా అని ప్రశ్నించారు. మోడీ కంటే జగన్‌ గొప్పవాడా అని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ అంటే ఏమిటో తెలీదు, సెక్రటేరియట్‌ అంటే అసలే తెలీదు, ప్రభుత్వ పరిపాలన వ్యవస్థపై అవగాహన లేని జగన్‌ ఆచరణకు సాధ్యంకాని హామీలు కురిపిస్తున్నారని ఆరోపించారు. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తారంట అని వ్యంగోక్తి విసిరారు. ఈవెంట్‌ మేనేజ్‌ మెంట్‌తో జనాన్ని సభలకు తీసుకొచ్చినంత మాత్రానా రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని నిలదీశారు. కన్సల్టెంట్లు అంతా నాయకుల వుతారా పరొ క్షంగా వైకాపా రాజకీయ సలహాదారు పీకేపై సీఎం సెటైర్లు విసిరారు. ప్ర భుత్వం నడిపేందుకు సమర్ధవంతమైన నాయకత్వం కావాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నెల కొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించారా? ప్రధానితో తెలంగాణ సీఎం కేసీఆర్‌ గంటపాటు సాగిన ప్రత్యేక భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలేంటి? అసలు గవర్నర్‌ హుటాహుటిన హస్తినకు ఎందుకు వెళ్ళారు? తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రధానిమంత్రి కార్యాలయం ఇచ్చిన అపాయింట్‌ మెంట్‌ మేరకు గురువారం ప్రత్యేక విమానంలో ఢిల్లి వెళ్ళారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని తీసుకుని కేసీఆర్‌ ప్రధానిని కలిశారు. ఏకాంతంగా 55 నిమిషాల పాటు చర్చలు సాగించారు. ఇదే సమయంలో గవర్నర్‌ నరసింహన్‌, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. ఒకేరోజు వివిధ సమయాల్లో కేసీఆర్‌, గవర్నర్లు ప్రధాని, రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

modi kcr 16062018 2

తన ఢిల్లి పర్యటనకు సంబంధించిన అంశాలను మీడియా ప్రతినిధులు గవర్నర్‌తో ఆరా తీయగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఢిల్లిలో కేసీఆర్‌, గవ ర్నర్‌ ప్రధాని, రాజ్‌నాథ్‌ సింగ్‌లతో సమావేశమైన సమయం లోనే ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లిలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరా తీశారు. ఈనెల 17వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశంలో చర్చించే అంశాలను ఖరారు చేసేందుకు చంద్రబాబు మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఢిల్లి లో ఏదో జరుగుతోందంటూ ఏపీ తెదేపా నేతలు అనుమానం వ్యక్తం చేయడంతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, వైకాపాకు చెందిన పత్తికొండ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇరువురు కలిసి గురువారం భాజపా అగ్ర నేతలతో సమావేశమయ్యారని ఈ సమావేశానికి కొనసాగింపుగానే గవర్నర్‌ నరసింహన్‌ హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

modi kcr 16062018 3

కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు ఎండగట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్‌ హస్తిన పర్యటనకు వెళ్ళడం తీవ్ర చర్చనీ యాంశమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సుదీర్ఘంగా సమావేశం కావడం, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించడం బట్టి చూస్తుంటే కేంద్రంలో ఏదో జరగబోతోందన్న సంకేతాలు వెలువడుతు న్నాయని తెదేపా సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఢిల్లి పర్యటనకు ఒకరోజు ముందు బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌తో గంటకుపైగా సమావేశం కావడం వెనకగల కారణాలను విశ్లేషించే పనిలో ఆయా పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఢిల్లిలో ప్రధానితో కేసీఆర్‌ భేటీ అయిన సందర్భంగా తృతీయ ఫ్రంట్‌పై కూడా చర్చ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్రధానితో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా 20 నుంచి అరగంట పాటు సమావేశమవుతారని అయితే కేసీఆర్‌తో దాదాపు గంటపాటు మోడీ సమావేశం కావడంతో రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు భావిస్తున్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోడీ పావులు కదుపుతున్నారా? ఏపీలోని పరిస్థితు లపై ఆయన కేసీఆర్‌తో ఆరా తీశారా? అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారా? వచ్చే ఎన్నికల్లో ఏపీలో పరిస్థితిపై ఆయన సమాచారం సేకరించినట్టు కథనాలు వెలువడు తున్నాయి. ఒకేరోజున కేసీఆర్‌, గవర్నర్‌ నరసిం హన్‌లు హస్తినలో సుడిగాలి పర్యటనలు చేయడంతో జాతీయ మీడియా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది.

అమరావతి ప్రజాదర్బార్‌ హాల్‌లో పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం సమావేశమయ్యారు. నీతిఆయోగ్‌ సమావేశం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కుట్ర రాజకీయాలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని టీడీపీ నిర్ణయించింది. ఎంపీలతో, మంత్రులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్ర మంత్రిత్వశాఖల కార్యాలయాల దగ్గర ఆందోళనలు, నీతి ఆయోగ్‌ సమావేశంలో విభజన అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించారు. అలాగే ప్రధాని ప్రసంగం పూర్తయిన వెంటనే ఏపీ అంశాలను ప్రస్తావించి... సమావేశం నుంచి వాకౌట్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈనెల 17న ఉదయం చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలంతా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.

cbn 15062018 2

ఇప్పటికే చంద్రబాబు పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక సీఎంలతో మాట్లాడారు. అలాగే పాండిచ్చేరి, పంజాబ్‌, ఢిల్లీ సీఎంలతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల సీఎంలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. నీతిఆయోగ్‌ సమావేశంలో మాట్లాడాక బాయ్‌కాట్‌ చేయాలని సీఎం నిర్ణయించినట్లుగా సమాచారం. మరో పక్క బీజేపీ వైఖరి పై కూడా చర్చ జరిగింది. కర్ణాటక ఎన్నికల్లో గనుల మాఫియా కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి అనుచరులకు 9 సీట్లు ఇచ్చి.. అవినీతిపై బీజేపీ పోరాటం అంటే ఎవరైనా నమ్ముతారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి కేసులను ఏడాదిలోపు విచారణ పూర్తిచేయాలని కోర్టులు చెప్పాయని, జగన్‌ కేసులను నాలుగేళ్లుగా నాన్చడాన్ని ఏమనాలని నిలదీశారు. కేసులు బలహీనపర్చాలని చూడటం కుట్ర రాజకీయం కాదా అని సీఎం ప్రశ్నించారు.

 

cbn 15062018 3

ఒకవైపు కడప స్టీల్ ప్లాంట్ అసాధ్యమని కోర్టులో కేంద్రం అఫిడవిట్ వేస్తుందని, మరోవైపు వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో లాలూచీ చేస్తారని ఆయన మండిపడ్డారు. మొన్న కేంద్రం స్టీల్ ప్లాంట్‌పై అఫిడవిట్ వేస్తే.. నిన్న బుగ్గన ఢిల్లీ వెళ్లి రాంమాధవ్‌ను కలవడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. పొత్తుతో సాధించలేనిది పోరాటంతో సాధించాలని చంద్రబాబు నేతలకు పిలుపు ఇచ్చారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఏమరుపాటుగా ఉండొద్దని సూచించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడాన్ని నిలదీయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసించాలని బాబు పేర్కొన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన 18 అంశాలు, 6 హామీలు నెరవేర్చేదాకా పోరాడాలని అన్నారు.

బీజేపీ, జగన్, పవన్, గవర్నర్, కెసిఆర్, ఐవైఆర్, ముద్రగడ, మోత్కుపల్లి, పోసాని, రమణ దీక్షితులు, ఇలా అందరి టార్గెట్ ఒక్కటే... చంద్రబాబును ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రంలో అనిశ్చితి రావాలి, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలి... ఈ ఆపరేషన్ కు పేరే, ఆపరేషన్ గరుడ అని ప్రచారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ఆరోపిస్తుంది. జర్గుతున్న పరిణామాలు కూడా ఇవే నిజం అని చెప్తున్నాయి.. అయితే, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటమే లక్ష్యంగా చేస్తున్న పరిణామాలు వేగవంతం అయ్యాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, చంద్రబాబు లక్ష్యంగా బీజేపీ పావులు కదపడం వేగవంతం చేసింది. దీని కోసం, వేదికగా ఢిల్లీని ఎంచుకున్నారు. గత నాలుగు రోజులుగా ఢిల్లీలో, పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

cbn 16062018 2

ఇందుకోసం కెసిఆర్, గవర్నర్ ను కూడా ఢిల్లీ రప్పించారు. వైసిపీ ఎమ్మల్యే, బీజేపీ ఎమ్మల్యే , రాం మాధవ్ ఇంట్లో సమావేశం అయినట్టు, ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో గట్టిగా దెబ్బతీసేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించి, వ్యూహరచన చేస్తున్నారు. ఇందు కోసం, ముందుగా, చంద్రబాబుని, జగన్ స్థాయికి తీసుకు వచ్చే ప్లాన్ వేసారు. జగన్ లాగే, చంద్రబాబు కూడా అవినీతి పరుడు అని చిత్రీకరించాలని, గత నాలుగు నెలలుగా ప్రయత్నం చేస్తున్నా, ఒక్కటంటే, ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఇలా చేస్తేనే, చంద్రబాబుని ఎదుర్కోవటం తేలిక అని, ప్రజల్లో చంద్రబాబు పట్ల నెగటివ్ ఫీలింగ్ తెప్పిస్తేనే, తరువాత అడుగు వెయ్యగలమని, అందుకే ఎలాగైనా, చంద్రబాబు పై అవినీతి మరక వెయ్యటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

cbn 16062018 3

ఆధారాలు లేకపోయినా, కోర్ట్ లో కేసు వేసి, విచారణ వరకు తీసుకు వచ్చినా చాలని, అందుకోసం ప్లాన్ సిద్ధం చెయ్యటానికి, గత నాలుగు రోజులుగా అందరూ కలిసి, కుట్రలు పన్నుతున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, ఆకుల సత్యనారాయణ, నాలుగు రోజలుగా రాం మాధవ్ ను కలుస్తూనే ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ప్రధాని మోదీని కూడా కలుసుకున్నారు. ఆ తర్వాత, ఆకుల సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కలిసారు. నిన్న గవర్నర్, కెసిఆర్ కూడా వెళ్లి కలిసారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని ఏ విధంగా దెబ్బ తీయాలన్నదే ప్రధాని, బీజేపీ నేతల ఆకాంక్షగా కనబడుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు, తెలుగుదేశం నేతలపై ముప్పేట దాడికి కేంద్రం పథకం పన్నుతోందని, అందుకోసమే అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి, చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోందని ఈ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం వర్గాలు మాత్రం, ఢిల్లీ నుంచి వచ్చే ఎలాంటి కుట్రలు అయినా ఎదుర్కుంటామని, ఇలాంటి కుట్రలు మాకు కొత్త కాదని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read