ఢిల్లీ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా నడుస్తుంది... ఢిల్లీ అయినా, గుజరాత్ అయినా, తెలంగాణా అయినా, ఏదైనా పరవాలేదు... చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పాలి, దీని కోసం ఎవరినైనా తీసుకోవటానికి రెడీ... జగన్, పవన్, ఐవైఆర్, ముద్రగడ, ఉండవల్లి, పోసాని, ఇప్పుడు మోత్కుపల్లి... చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రం నాశనమైనా పర్వాలేదనే మూడ్ లో ఉన్నారు ఆపరేషన్ గరుడ టీం... అందుకే తెలంగాణా నాయకుడిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువచ్చి, చంద్రబాబుని తిట్టించే ప్లాన్ వేసారు... మొన్న పోసాని, జగన్ ను పాదయాత్రలో కలిసి వెళ్ళిన తరువాత ఎలా అయితే, బూతులు తిట్టాడో, అలాంటి బూతులే ఇప్పుడు మోత్కుపల్లి చేత తిట్టించే ప్లాన్ వేసారు. ఇందుకోసం, మన A2 రంగంలోకి దిగాడు.. ఆపరేషన్ గరుడలోకి, మోత్కుపల్లిని ఆహ్వానించి, చెయ్యాల్సిన పనులు చెప్పారు.
ఈ నెల 11న కూడా మోత్కుపల్లి ఇంటికి విజయసాయిరెడ్డి వచ్చారు. అయితే మీడియాను చూసి మోత్కుపల్లిని కలవకుండానే ఆయన వెళ్లిపోయారు. వెంటనే బుధవారం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తిరుమల వెంకన్నను దర్శించుకుని చంద్రబాబును ఓడించమని కోరతానన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెబుతారని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలు పిలుపునిచ్చారు. చంద్రబాబుపై నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లిని నేడు విజయసాయి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అంతే కాదు, మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైసీపీ మద్దతు తెలుపింది. భవిష్యత్తులో కలిసి పని చేస్తామని విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఇటీవల మోత్కుపల్లి నర్సింహులును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు. మోత్కుపల్లికి ముద్రగడ సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయాలపై మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు జరిపారు. టీడీపీ నుంచి మోత్కుపల్లిని బహిష్కరించిన తర్వాత ముద్రగడ, విజయ్‌సాయిలు కలవడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదంతా అమిత్ షా స్కెచ్ లో భాగమే అని, విజయసాయి రెడ్డి పెర్ఫార్మన్స్ ఇరగదీస్తున్నాడని, ఆంధ్రప్రదేశ్ ని నాశనం చెయ్యటానికి, ఇలాంటి సైతాన్ లు అందరూ ఏకమవుతున్నారని, వీరికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అంటున్నారు.