ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం తెలుసుకున్న బ్రాహ్మణ సంఘాలు, పెద్ద ఎత్తున సమీకరణ జరిపి, ఆ ఆత్మీయ సమావేశానికి జగన్ ను ఆహ్వానించారు. ఏమైందో ఏమో కాని, ముందు వస్తాను అని చెప్పిన జగన్, తరువాత హ్యాండ్ ఇచ్చారు. అంతకు ముందు జగన్ ను కలవటానికి వచ్చిన బ్రాహ్మణ సోదరులు, కొంత మంది, జగన్ ను ఆశీర్వదిస్తూ, జగన్ పై చేయి పెట్టగానే, సెక్యూరిటీ సిబ్బంది లాగి పడేసారు. ఇలా చేస్తున్నా, జగన్ మాత్రం వారిని వారించలేదు. జగన్ ను ఆశీర్వదిస్తానికి వస్తే, ఇలా అవమానిస్తారా అంటూ, అక్కడ వారు చిన్నబుచ్చుకున్నారు.. ఇంత చేసిన జగన్, ఏమి అనకపోవటం చూస్తుంటే, జగనే ఇలా చెయ్యమన్నాడేమో, ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారు తప్పితే, మా లాంటి పేద బ్రాహ్మణలు జగన్ కు కనిపించరేమో అని, వారు అన్నారు.

jagan 13062018 2

అయితే, ఈ రెండు సంఘటనలతో బ్రాహ్మణ సంఘాలు రగిలిపోతున్నాయి. రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సభకు రాకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ తమను అవమానపరిచారని రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులు మండిపడుతున్నారు. జగన్ వస్తారన్న వైసీపీ నేతల భరోసాతోనే ఏర్పాట్లు చేసుకున్నామని, సభ కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు తరలి వచ్చారని బ్రాహ్మణ సంఘాలు చెబుతున్నాయి. ప్రజాసంకల్ప యాత్రంలో భాగంగా జగన్ రాజమండ్రిలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయసభకు హాజరవుతారని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. దాంతో ఈ సభ కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే జగన్ మాత్రం హాజరు కాకుండా తన జాతిని అవమానపరిచారని బ్రాహ్మణ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

jagan 13062018 3

బ్రాహ్మణులకు జరిగిన అవమానంపై రాష్ట్ర నేతలంతా రాజమండ్రిలోని ఓ హోటల్‌లో అత్యవసర సమావేశం అయ్యారు. జగన్ అవమానించిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించకపోతే రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, వైసీపికి వ్యతిరేకంగా పనిచేస్తామని అన్నారు. జగన్‌తోపాటు వైసీపీ నేతలను బహిష్కరిస్తామని అన్నారు. త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రంలో జగన్ చేసిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తామని బ్రాహ్మణ సంఘం నేతలు పేక్కొన్నారు. ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారు తప్పితే, మా లాంటి పేద బ్రాహ్మణలు జగన్ కు కనిపించరేమో అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

గన్నవరం కేంద్రంగా తన విమాన సర్వీసులను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఇండిగో భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు ఎయిర్‌బస్‌-320 విమానాల నైట్‌ పార్కింగ్‌కు సంబంధించి అనుమతులు ఇవ్వాలని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులను కోరింది. ఇండిగో తీసుకుంటున్న తాజా చర్యలతో విజయవాడ నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ పెరగనుంది. దక్షిణాదిలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తర్వాత విజయవాడ విమానాశ్రయాన్ని నాలుగో బేస్‌ స్టేషన్‌గా ఎంచుకుంది. ఇప్పుడు ఇండిగో 4 ఎయిర్‌బ్‌సలను విజయవాడ నుంచి నిర్వహించాలని ప్రతిపాదించింది.

indigo 13062018 2

ఇండిగో ప్రతిపాదన అమల్లోకి రావాలంటే 4 విమానాల నైట్‌ పార్కింగ్‌కు విమానాశ్రయ అధికారులు అనుమతివ్వాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి ప్రతి రోజు ఢిల్లీకి ఎయిర్‌బస్‌-320 ద్వారా విమాన సర్వీసును నిర్వహించాలని ఇండిగో భావిస్తోంది. ఢిల్లీతో పాటు ముంబైకి మరొక సర్వీసును నడపాలని యోచిస్తోంది. మరో రెండు సర్వీసులను ఎక్కడికి నిర్వహించాలనే దానిపై ఇండిగో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపే ఇండిగో 4 ఎయిర్‌ బస్సు లను ఢిల్లీ,ముంబై,బెంగళూరు,చెన్నై లకు నడపాలి నిర్ణయించారు. అందుకే ఇండిగో దక్షిణాదిలో తన నాలుగో బేస్‌ స్టేషన్‌గా విజయవాడ విమానాశ్రయాన్ని ఎంచుకుంది.

indigo 13062018 3

ఇప్పటి వరకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి మోనోపలీగా ఉన్న విమానయాన సంస్థలకు ఇక చెక్ పడనుంది. మోనోపలీ కారణంగా విమాన ధరలు ఆకాశానికంటుతున్నాయి. హైదరాబాద్ కు రూ. 18 వేల టిక్కెట్ ధర పలుకుతోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రయాణీ కులు బావురు మంటున్నారు. ఇండిగో ప్రవేశంతో విమానయాన సంస్థల మధ్య పోటీ ఏర్పడబోతోంది. ఇండిగో సంస్థ తన ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది. విజయవాడ నుంచి బెంగళూరుకు రూ. 2097 గా ఛార్జీని నిర్ణయించగా... బెంగళూరు నుంచి విజయవాడకు రూ. 1826గా నిర్ణయిం చింది. విజయవాడ నుంచి చెన్నైకు రూ 1179, చెన్నై నుంచి విజయవాడకు రూ. 1283గా నిర్ణయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్క రూ. 1099, హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.1699గా ఛార్జీలను నిర్ణయిస్తూ అధికారికంగా ఇండిగో ప్రకటించింది.

ఆంధ్రోడు కొట్టిన దెబ్బకి,మొన్నే కర్ణాటకలో బీజేపీకి చుక్కలు కనిపించాయి... ఒక 10సీట్లు పోయి ఉంటాయి తక్కువలో తక్కువ... ఆ 10 సీట్లే తగ్గినయ్యి మెజారిటికి.... ఆ 10 సీట్ల లోటు పూడ్చుకోవటానికి బేరసారాలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు... దేశవ్యాప్తంగా పరువు పోయింది... బీజేపీ వేసుకున్న విలువలు అనే ముసుగు తొలిగిపోయింది.... ఒక్క ముక్కలో చెప్పాలంటే... రెండు నెలల్లో బీజేపీని గుడ్డలూడదీసి నడిరోడ్డు మీద నుంచో పెట్టాడు చంద్రబాబు నాయుడు... తెలుగువారికి అన్యాయం చేసిన బీజేపీని ఓడించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఒక్క పిలుపు అక్కడి తెలుగువారందరినీ ఏకం చేసింది. తెలుగువారు ప్రభావం చూపగలిగిన స్థానాలు ఆ రాష్ట్రంలో సుమారు 50 ఉంటే.. అందులో 40 చోట్ల కాంగ్రెస్‌, జేడీఎ్‌సలే గెలిచాయి.

karnataka 13062018 2

ఇప్పుడు మరో సారి, బీజేపీకి అదే కర్ణాటకలో తెలుగు వారు మన పవర్ చూపించారు.. కర్ణాటకలోని జయనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్+జేడీఎస్ హవా కొనసాగుతోంది. కర్ణాటకలోని జయనగర శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడింది. ఈ స్థానానికి జూన్‌ 11న ఉప ఎన్నిక జరగగా బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాగా.. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యరెడ్డి సమీప భాజపా అభ్యర్థి బీఎన్‌ ప్రహ్లాద్‌పై 2989 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల కోసం జయనగర నుంచి బరిలోకి దిగిన భాజపా అభ్యర్థి బీఎన్‌ విజయకుమార్‌ మరణంతో అక్కడ ఎన్నిక రద్దయ్యింది.

karnataka 13062018 3

దీంతో జూన్‌ 11న ఉప ఎన్నిక నిర్వహించారు. ఉప ఎన్నికలో భాజపా తరఫున విజయకుమార్‌ సోదరుడు బీఎన్‌ ప్రహ్లాద్‌.. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి పోటీ చేశారు. వీరితో పాటు మరో 17మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. దీంతో తమ కూటమి పార్టీ అయిన కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు జయనగర ఉప ఎన్నికల్లో జేడీఎస్‌ పోటీ నుంచి విరమించుకుంది. బీజేపీకి పట్టు ఉన్న సీట్ కావటం, పైగా చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి పోటీ ఉండే సెంటిమెంట్, యడ్యురప్ప సియం సీటు వదులుకున్న సెంటిమెంట్, ఇవన్నీ చూసి, బీజేపీ తేలికగా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. అయితే, ఇది కూడా పోయింది. ఇక్కడ కూడా దాదాపు 25 శాతం మంది తెలుగు వారు ఉంటారు. వారి వల్లే, తక్కువ మెజారిటీతో ఓడిపోయామని బీజేపీ అంటుంది. మొత్తానికి మరో సారి ఆంధ్రోడి దెబ్బ, బీజేపీకి తగిలింది.

అసలు సర్కారీ బడి అంటే ఎలా ఉంటుంది...మొండిగోడలు...పెచ్చులూడే భవనాలు...అరకొర సదుపాయాలు...వసతుల లేమి...ఉపాధ్యాయుల లేమి...ఇవీ సాధారణంగా ఏ ప్రభుత్వ పాఠశాలను చూసినా కనిపించే సమస్యలు...కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలు నెమ్మదిగా, సకల సౌకర్యాలతో...సమస్త సదుపాయాలతో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలుగా మారుతున్నాయి... ఇప్పటికే డిజిటల్ తరగతులతో ఒక విప్లవం సృష్టించిన ప్రభుత్వం, ఆ ఫలితాలతో, పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా కూడా చేస్తుంది.. దీంతో సామాన్య ప్రజలకు కూడా ప్రైవేటు స్కూల్స్ కాకుండా, మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ వైపు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. ప్రైవేటు స్కూల్స్ దీటుగా, మేము కూడా చదువు చెప్తున్నాం అంటూ, ప్రభుత్వ స్కూల్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి.

schools 13062018 2

మొన్న వచ్చిన భారత్ అనే నేను సినిమాలో ఒక సీన్ లో, మన రాష్ట్రంలో రెండు సంఘటనలు జరిగాయి.. చంద్రబాబు పాలనలో ఇదీ జరుగుతున్న రియాలిటీ... ఆ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు ఉన్నవి 80 సీట్లు.. చేరాలని ఆసక్తి చూపుతున్న విద్యార్థులు 180 మంది! అలాగని ఇదేదో కార్పొరేట్ పాఠశాల కాదు.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధిలోని లక్ష్మీన గర్ ఉన్నత పాఠశాల. అంతలా ఉంది ఇక్కడ అడ్మి షన్ల డిమాండ్. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్ధులు పదో తరగతి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. సుమారు 26 మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులుండడం, కేరీర్ ఫౌండేషన్ కోర్సులు అందిస్తుండడమే ఈ డిమాండ్ కు కారణం. మంగళవారం ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నామని ఉపాధ్యా యులు చెప్పడంతో పెద్దఎత్తున తల్లిదండ్రులు పిల్లలతో అక్కడకు చేరుకోవడంతో సందడి నెలకొంది.

schools 13062018 3

180 మందికి ప్రవేశాలు కల్పించే అవకాశం లేకపో వడంతో విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ప్రవేశాలు కల్పించాల్సి వచ్చింది.. మరో పక్క చీరాలలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ బడికి పరిమితి వెయ్యి సీట్లు. ఇప్పటికే 1472 దరఖాస్తులు వచ్చయి. దీంతో ఇక దరఖాస్తులు తీసుకోవటం ఆపేశారు. ఆదర్శవంతమైన ప్రణాలికలు, వినూత్న ప్రచారం ఆ బడిని తల్లిదండ్రులకు చేరువ చేసాయి. స్థానికంగా ఉన్న దాదాపు తొమ్మిది ప్రైవేటు స్కూల్స్ లోని పలువురు విధ్యార్ధులు ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చీరాల పట్టణం సమీపంలోని కొత్త పేటలో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత స్కూల్ వైభవం ఇది. ఎకరాకి పైగా విస్తీర్ణంలో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతుంది. ఈ నెల 18న నారా లోకేష్ ఈ స్కూల్ ప్రారంభం చెయ్యనున్నారు. విద్యార్ధులకు డైనింగ్ హాల్, పది రకాల ఆటలు ఆడేలా వివిధ రకాల కోర్ట్ లు, నెలకి ఒకసారి వైద్య పరీక్షలు ఇక్కడ ప్రత్యేకత..

Advertisements

Latest Articles

Most Read