ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, వాస్తవానికి 2019 మే నెల లో సార్వ త్రిక ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ పరిస్థితులకు అను గుణంగా కేం ద్రం ముందస్తుగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొ న్నారు. రానున్న 11 నెలలు నేతలంతా గ్రామాల్లో పర్య టించి తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగేళ్ళ కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని పిలుపు నిచ్చారు. కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొం దిం చే ఉద్యమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు భాగ స్వాములు కావాలని కోరారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమ న్వయ కమిటి సమావేశం ఉండవల్లిలోని ప్రజాదర్భార్‌ హాల్‌ లో జరిగింది.

cbn 13062018 2

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జలసంరక్షణ కోసం చేపట్టిన చర్యలు, తీసుకుం టున్న జాగ్రత్తలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సూచించారు. ప్రధానంగా నవ్యాంధ్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు తెలపాలని సూచించారు. పోలవరం, పట్టిసీమ వల్ల వివిధ జిల్లాలకు ఒనకూరే ప్రయోజనాలు, లబ్ధిని వివరించాలని చెప్పారు. రాష్ట్రంలో సమగ్ర నీటి నిర్వహణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా నేతలకు అధినేత చంద్రబాబు వివరించారు. జరుగుతున్న పనులు చూసి అందరూ ప్రశంసి స్తుంటే కొందరు మాత్రం అసూయ, ద్వేషాలతో రగిలిపోతూ తప్పుడు విమర్శలకు పాల్పడతున్నారని మండిపడ్డారు. తొలుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, కృషి నేతలకు తెలిస్తేనే ప్రజలకు వివరించగలరని, అందుకే ప్రాజెక్టుల నిర్మాణంపై అవగాహన పెంపొందించుకుని తప్పుడు విమర్శలకు దీటుగా స్పందించాలని సూచించారు.

cbn 13062018 3

రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని నియోజకవర్గాలలోని బూత్‌ ఇంఛార్జ్‌లను సన్నద్దం చేసేందుకు 3 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ ఈ సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఒక్కొక్క శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి 42,269 బాద్యులకు ఈనెల ఆఖరు నుంచి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు నాటికి శిక్షణ పూర్తి అవుతుందని తెలిపారు. బూత్‌ ఇన్‌ఛార్జ్‌ అందరికి సెల్‌ఫోన్లను అందజేయనున్నట్లు మంత్రి లోకేష్‌ ప్రకటించారు. ప్రస్తుతం 55 శాతం బూత్‌ కమిటీలు ఖరారు అయ్యాయని, మిగిలిన చోట్ల కూడా తక్షణమే భర్తి చేయాలని ఆదేశించారు. భూత్‌ వారి ఓటర్‌ లిస్టుపై జిల్లా నేతలు పూర్తి పట్టు సాధించాలని సూచించారు.

మంగళవారం కియా ప్రతినిధులతో సచివాల యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో తన వేగాన్ని కియా ప్రతినిధులు అందుకున్నారని, అం దుకు తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. జనవరి మొదటి తేదీ నాటికి తొలి ఇండియా మేడ్‌ కారు ఏపీ రోడ్లపై తిరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కియా ప్రతినిధులకు దిశానిర్ధేశం చేశారు. కొత్త ఏడాది కొత్త రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రోడ్లపై కొత్త కారు తిరగాలనేది తన అభిలాష అని చెప్పారు. తన అభి లాషకనుగుణంగా కియా కంపెనీ ప్రతినిధులు నిర్మాణాన్ని వేగవంతం చేయాల న్నారు. విభజన అనంతరం అతిపెద్ద మోటారు కంపెనీ అమరావతిలో తమ కంపెనీ ఏర్పాటుకు ముందుకు రావడం శుభసూచకంగా భావించి తమ ప్రభుత్వం అవ సరమైన అనుమతులను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేసిందన్నారు.

kia 13062018 2

తమ శ్రద్దను గుర్తించిన కియా మోటార్సు కూడా అంతే వేగంతో తమ కంపెనీ నిర్మాణ పనులను చేెస్తోందని చెప్పారు. ఇదే వేగం అమరావతిలో నిర్మితమయ్యే అన్ని కంపె నీల యాజమాన్యాల్లోనూ రావాలని అభిలాషించారు. అప్పుడే తాను అనుకున్న అమరావతిని త్వరితగతిన భావితరాలకు చూపించే అవకాశముందన్నారు. ఈ కంపెనీల ఏర్పాటు ఎంత త్వరగా పూర్తయితే ఇక్కడి నిరుద్యోగులకు, పట్టభధ్రులకు అంతే త్వరగా ఉద్యోగాలు కల్పించే వీలవుతుందని తెలిపారు. అంతేకాకుండా పరో క్షంగా ఈ కంపెనీపై ఆధారపడి ఉపాధి పొందే వారి సంఖ్య లక్షల్లో ఉండే అవకాశ ముందన్నారు. ఇటువంటి ఉపాధి కల్పతరువులాంటి అనేక కంపెనీలు రాష్ట్ర ప్రభు త్వ సంకల్పాన్ని, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తమ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి తమ ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలని కోరారు.

kia 13062018 3

ముఖ్యంగా నిరుద్యోగ యువతకు వీలైనంత త్వరగా ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర ఆదాయం పెరగ డంతోపాటు సగటు మానవుడి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ఈ సందర్భంగా కియా మోటార్స్‌ ప్లాంటు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిపై వీడియో చిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతపురం జిల్లాలోని యువతకు ఆటోమొబైల్‌ విభాగంలో నైపుణ్యం కల్పించేందుకు కియా, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కలిసి ఈనెల 20 నుంచి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

నవ్యాంధ్ర జల, జీవ నాడి పోలవరం ప్రాజెక్టు కొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. కేవలం 16 గంటల్లో 8వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేసి జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టింది. అంతేకాదు... త్వరలో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ రికార్డునూ అధిగమిస్తామని ‘నవయుగ’ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ ధీమా వ్యక్తం చేశారు. పోలవరం కాంక్రీటు పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో... రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, పాత ధరలకే ఈ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే పోలవరం కాంక్రీటు పనులు పరుగులు తీయడం మొదలైంది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. ఇప్పటిదాకా ఇదే జాతీయ రికార్డు. దీనిని ఆదివారం పోలవరం ప్రాజెక్టు అధిగమించింది.

polavaram 12062018 2

ఉదయం 7 గంటల నుంచి స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లలో నిరాటంకంగా కాంక్రీట్‌ పనులు కొనసాగాయి. రాత్రి 11 గంటలకల్లా... అంటే 16 గంటల్లో 8000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ప్రాజెక్టులో ఉపయోగించారు. జాతీయ రికార్డును బద్దలుకొట్టారు. 24 గంటల్లో 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని పూర్తి చేసారు.. దీని కోసం, 47 వేల సిమెంట్‌ బస్తాలు... 11 వేల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌... ఆరువేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక! ఐదు భారీ బ్లాచింగ్‌ ప్లాంట్లు! వందల సంఖ్యలో వాహనాలు! రెండు షిఫ్టులు... మొత్తం 250 మంది ఇంజనీర్లు, ఆరువేల మంది కార్మికులు, సిబ్బంది! 24 గంటల శ్రమ... దీని ఫలితమే... పోలవరం ప్రాజెక్టులో ఒక రికార్డు బద్దలైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల దాకా యంత్రాలు నిర్విరామంగా పని చేశాయి. ఇంజనీర్లు, కార్మికులు, సిబ్బంది కూడా యంత్రాల్లా విసుగూ విరామం లేకుండా పని చేశారు.

polavaram 12062018 3

24 గంటల్లో 10వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సరిగ్గా ఉదయం 7 గంటలకు కాంక్రీటు పని మొదలైంది. వచ్చే వాహనం వస్తూనే ఉంటుంది, వెళ్లేది వెళ్తూనే ఉంది! కాంక్రీట్‌ను ఎప్పటికప్పుడు సరైన ప్రాంతంలో నింపివేసే ప్రక్రియ ఇంజనీర్ల పర్యవేక్షణలో పకడ్బందీగా సాగింది. రాత్రి 11 గంటలకు ‘కాళేశ్వరం రికార్డు’ను అలవోకగా దాటేశారు. తదుపరి టార్గెట్‌... 10వేల క్యూబిక్‌ మీటర్లను సాధించే దిశగా కదిలారు. అయితే... అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా జోరున వర్షం మొదలైంది. శరవేగంగా సాగుతున్న పనికి బ్రేక్‌ పడింది. ‘పదివేల క్యూబిక్‌ మీటర్ల లక్ష్యం చేరుకోలేమేమో!’ అనే ఆందోళన మొదలైంది. అయితే... గంట వ్యవధిలోనే వాన తగ్గింది. అంతే... కార్మికులు, ఇంజనీర్లు ఎగిరి గంతేశారు. రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ పనులు మొదలుపెట్టారు. తెల్లవారుజామున 3, 4, 5, 6 గంటలు ఇలా గుడుస్తూనే ఉన్నాయి. ఏడోగంట రానేవచ్చింది. అప్పటికి నమోదైన కాంక్రీట్‌... 11,158 క్యూబిక్‌ మీటర్లు! ఇంజనీర్లు ఈ ప్రకటన చేయగానే ఒక్కసారిగా ప్రాజెక్టు సైట్‌లో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇంజనీర్లు, కార్మికులు అన్న తేడా లేకుండా సంతోషాన్ని పంచుకున్నారు.

తిరుమల తిరుమల దేవస్థానం, చెప్పినట్టే చేసింది. తిరుమల పవిత్రతకు, ఆ వెంకన్న స్వామిని, తమ నీఛ రాజకీయాల కోసం అప్రతిష్ట పాలు చేయ్యాలనుకున్న వారికి చెప్పినట్టే, లీగల్ నోటీసులు పంపించింది. తిరుమల పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. టీటీడీపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని దేవస్థానం బోర్డు కోరింది. టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నోటీసులో పేర్కొంది. మరి ఈ లీగల్ నోటీసుకు, ఎలాంటి గరుడ పురాణం చెప్తారో చూడాలి... ఈ ఎపిసోడ్ అంతా ఆపరేషన్ గరుడలో భాగమే అని ప్రభుత్వం కూడా నమ్ముతుంది. అమిత్ షా తిరుమల వెళ్లి వచ్చిన మరుసటి రోజే రమణ దీక్షితులు ఆరోపణలు మొదలు పెట్టటం, వెళ్లి జగన్ ను కలవటం, ఇవన్నీ కుట్ర ప్రకారమే జరుగుతున్నాయి.

tirumala 19032018 2

సాక్షాత్తు కలియుగ దైవం వెంకన్న స్వామినే రాజకీయాల్లోకి లాగి, స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటూ, బీజేపీ నేతలను కలుస్తూ, తిరుమల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితుల పై టీటీడీ పాలకమండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి ఆభరణాలు, కైంకర్యాలు, ఇతర అంశాలపై, నిరాధార ఆరోపణలకు కళ్లెం వేసి తీరాల్సిందేనని నిర్ణయించింది. ఆయనతోపాటు... ఆ ఆరోపణలను సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని గత వారం తీర్మానించింది. ‘‘రమణ దీక్షితులు ఆరోపణలపై నివేదికను రూపొందించి న్యాయ నిపుణుల సూచనలు కోరతాం. ఆయనతోపాటు టీటీడీపై విమర్శలు చేసిన వ్యక్తులకూ నోటీసులు జారీ చేస్తాం’’ అని టిటిడి చెప్పినట్టే, చేసింది.

tirumala 19032018 3

దీక్షితులు పై టిటిడి చైర్మన్ సుధాకర్‌ యాదవ్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘24 ఏళ్లుగా స్వామివారికి సేవలందించారు. అప్పుడు లేని అనుమానం ఈ రోజే ఎందుకొచ్చింది? నిజంగా తప్పు జరిగి ఉంటే ఆయన తిరుమలకు వచ్చి మాట్లాడాలి. మేమెక్కడికీ పారిపోలేదు. తప్పు జరిగినట్లయితే మాకు చూపించవచ్చు కదా! మేమూ మీవెంట వస్తాం. ఆలయంలో చూద్దాం రా! అది వదిలేసి హైదరాబాద్‌లో ఒకసారి ఢిల్లీలో ఒకసారి, చెన్నైలో ఒకసారి ఎవరి పోత్సాహంతోనో పూటకో మాట మాట్లాడుతున్నావు? భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నావ్‌! దేవునిపై దుష్ప్రచారం చేస్తున్నావ్‌! ఆ దేవుడే నీకు సరైన గుణపాఠం చెబుతాడు’’ అని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read