ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, అంటే ఈ రాష్ట్రంలో తెలీనివారు ఉండరు... ఈ రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఒకరు... శాసనసభాపతిగా, ఇటు నియోజకవర్గ ఎమ్మల్యేగా, రెండు పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు... ఇవాళ చేసిన మంచి పని, మరోసారి ఆయన ప్రజా నాయకుడు అని ప్రూవ్ చేసింది... స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరో సారి మానవత్వాన్ని చాటుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముపాళ్ల మండలం ఇరుకుపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ డీ కొట్టటంతో, ప్రమాదం జరిగింది.
కృష్ణాజిల్లా జగయ్యపేటకు చెందిన షేక్ కరిముల్లా మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన యండ్రాతి ఆంజనేయులకి తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో స్పీకర్ కోడెల అటుగా వెళ్తున్నారు. ఈ సంఘటన చుసిన స్పీకర్ వెంటనే తన కాన్వాయ్ ఆపి, అక్కడకు వెళ్లి చూసారు. వివరాలు తెలుసుకున్న స్పీకర్, అంబులన్స్ వచ్చే లోపు, వారిని హాస్పిటల్ కు తీసుకువేల్లని నిశ్చయించారు. వెంటనే గాయాలు పాలయినా యండ్రాతి ఆంజనేయులును తన వ్యక్తి గత సిబ్బందిని సైతం పక్కన పెట్టి సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించచారు స్పీకర్ కోడెల. వెంటనే మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యీలను ఆదేశించారు స్పీకర్. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని పోలీసులను ఆదేశించారు స్పీకర్.
ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి, స్పీకర్ ఇలా చెయ్యటంతో అందరూ శభాష్ అన్నారు. మనిషి ప్రాణాల కంటే, ఇవేమీ ఎక్కువ కాదని, మానవత్వాన్ని చాటుకున్న స్పీకర్ ని అక్కడ ప్రజలు అభినందించారు. విధి నిర్వహణలోనే కాదు, సాటి మనుషులను కాపదతంలోను ముందు ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు... ఈ మధ్య మంత్రి జవహర్, పరిటాల సునీత, రోడ్ మీద ఆక్సిడెంట్ అయిన వారిని కాపాడి, స్వయంగా హాస్పిటల్ కు తీసుకువెళ్లటం చూసాం. ప్రజల పట్ల అందరు నాయకులు ఇదే దృక్పదంతో ఉండాలి అని కోరుకుటున్నారు...