మన ఘనత వహించిన ప్రతిపక్ష నాయకుడు, జగన్ మోహన్ రెడ్డికి, అసలు ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేనికి ఉపయోగమో ఇప్పటి వరకు తెలియదు. మొన్నా మధ్య అసలు పోలవరంలో స్టోరేజ్ క్యపాసిటీ ఎక్కడ ఉంది ? అసలు ఇక్కడ నీళ్ళు రాయలసీముకు ఎలా వెళ్తాయి అంటూ, చంద్రబాబుతో వితండవాదం చేసారు. చంద్రబాబు దాదాపు గంట సేపు చెప్పినా, అదే తంతు.. దీంతో చంద్రబాబు, మీ అందరికీ ట్యూషన్ పెట్టాలి అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయినా, ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డికి అర్ధం కావటం లేదు. ఆ అర్ధం లేని జ్ఞానంతోనే, రోడ్లు వెంట తిరుగుతూ, ప్రజలకు ఏవేవో చెప్తున్నాడు.. దీంతో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమకు చిర్రేత్తుకు వచ్చింది. సాగు నీటి రంగంపై ప్రతిపక్ష నేత జగన్‌కు ఏమాత్రం అవగాహన లేదని, అవసరం అయితే ఆయనకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సిద్ధమని ఉమా అన్నారు.

jagan 09062018 2

విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నీరు చెట్టు కింద పెద్ద ఎత్తున జల సంరక్షణ చర్యలు చేపట్టడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయని స్పష్టం చేశారు. ఆ ఫలాలనే వైకాపా నేతలు అనుభవిస్తున్నారన్నారు. పులిచింతల నీళ్లు ఎక్కడకు వెళ్తున్నాయో జగన్‌కు తెలియదని, రాష్ట్ర ప్రతిపక్ష నేతకు ప్రశ్నించే తత్వమే లేదని, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన వ్యక్తి రోడ్లపై తిరుగుతూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్‌కు అంతా అవినీతే కనిపిస్తోందని ఉమ అన్నారు. నాలుగేళ్లలో నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం 54 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్ష పార్టీలు ఫ్యాక్ట్‌ షీట్‌ విడుదల చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

jagan 09062018 3

రాష్ట్రంలో భూగర్భ జలాలు 2 మీటర్ల మేర పెరిగాయని, రాష్ట్ర సగటు 12.80 మీటర్ల పైకి వచ్చిందని, తద్వారా రూ. 400 కోట్ల విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. రాయలసీమలో 6 మీటర్ల మేర భూగర్బ జలాలు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం జలాశయాల్లో 237 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. జూన్ 18 తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించి డయా ఫ్రామ్ వాల్‌ను జాతికి అంకితం చేస్తారన్నారు. వైకాపా మూడేళ్లుగా రాజీనామా డ్రామాలు ఆడిందని, ఇప్పటికీ వాటిని ఆమోదించు కోలేక పోయారని విమర్శించారు. ఎన్నికలు రావనే ధైర్యం తో ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

"శ్రీకాకుళంలో వ్యక్తి భూమి అడిగితే ఇవ్వరు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి ఎకరం 30 లక్షలకి ఇచ్చారు, వాళ్లేమో 15 కోట్లకి అమ్ముకుంటున్నారు.." అంటూ నిన్న పవన్ కళ్యాణ్ చౌకబారు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఆ శ్రీకాకుళంలో వ్యక్తి ఎవరు ? ఏ కంపెనీ పెడతాడు ? అసలు తను ప్రభుత్వం ముందుకు వచ్చాడా లేదా ? ఇలాంటివి ఏవీ చెప్పకుండా, కేవలం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వైజాగ్ వచ్చింది అనే కుళ్ళు బుద్ధితో, పవన్ కళ్యాణ్ నిన్న ఆరోపణలు చేసారు.. ఇక పవన్ ఫాన్స్, ఎవరన్నా నోరు జారితే, వారిని ఎలా ఎగతాళి చేస్తారో చూసాం. ఇప్పుడు పవన్ కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ పట్టుకుని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తి అని అన్నారు. సరే ఇది ఎదో నోరు జారాడులే అనుకుందాం... ఎవరైనా నోరు జారటం సహజం.. కాని, ఇక్కడ ఆ సంస్థకు భూమి ఇవ్వటమే తప్పు అన్నట్టు, ఆ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంది అనే పవన్ ఆరోపణలు మాత్రం సమర్ధనీయం కాదు.

lokesh 09062018 2

పవన్ చేసిన ఈ వ్యాఖ్యల పై లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. ఎవరైనా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఇస్తాం అంటే, మన ప్రభుత్వం వారికి రెడ్ కార్పెట్ వేస్తుంది, కాని రెడ్ టేపిజమ్ తో స్వాగతం పలకదు. ఐటి మంత్రిగా నేను పెట్టుబడులు పెట్టేవారిని స్వయంగా ఆహ్వానిస్తాను. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ అయ్యింది అంటే, ఊరికే కాదు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ అనేది ఫార్చ్యూన్‌-500 కంపెనీ, వారు రియల్ ఎస్టేట్ చేసుకునే అవసరం లేదు. మన రాష్ట్రంలో 450 కోట్ల పెట్టుబడితో, 2500 హై ఎండ్ ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే పల్సేస్ అనే టెక్ కంపెనీకి కూడా వైజాగ్ లో భూమి ఇచ్చాం. ఆ కంపెనీ సిఈఓ శ్రీనుబాబు శ్రీకాకుళం జిల్లా వారే" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

lokesh 09062018 3

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ 33 దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. 1947లో స్థాపించిన ఈ కంపెనీ ఇప్పుడు 74000 కోట్ల డాలర్ల ఆస్తులు కలిగి ఉంది. ఇలాంటి కంపెనీకి భూమి ఇస్తే, రియల్ ఎస్టేట్ చేసుకుంటుందా ? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడే దానికి అర్ధం ఉందా ? ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన ఈ కంపెనీ, కేవలం భూమి అమ్ముకోవటం కోసం, చంద్రబాబుతో ఒప్పందం చేసుకుంటుందా ? అసలు ఈ కంపెనీ మన రాష్ట్రం తీసుకురావటానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా ? ఎన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయో తెలుసా ? ఇతర రాష్ట్రాలు పోటీ రాకుండా, ఈ డీల్ ఎంత సీక్రెట్ గా క్లోజ్ చేసారో తెలుసా ? 2017 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన చేసారు... ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రెసిడెంట్, సిఓఓ జెన్నిఫర్ జాన్సన్ ను కలిసి, ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ రంగాల్లో విశాఖ దూసుకెల్తుంది అని, అక్కడ కంపనీ పెట్టాలని చంద్రబాబు కోరారు.. అప్పుడు మొదలైన చర్చలు, ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 2017 నెలలో, చేసిన అమెరికా పర్యటనలో, సాన్ ఫ్రాన్సిస్కో లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆలోక్ సేతి,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జొయ్ బోయిరియో ని కలిసి డీల్ క్లోజ్ చేసారు... ఇంత కష్టపడి తెచ్చిన కంపెనీని, కూడా హేళన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.. మొన్నటి దాకా జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసేవాడు.. ఇప్పుడు పవన్ కూడా, ఇలాగే తయారు అయ్యాడు.

సీనియర్ నటుడు, మాజీ ఎమ్మల్యే బీజేపీ నేత కోట శ్రీనివాసరావు మహా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలు ప్రస్తావించారు... సినిమాలు గురించి విషయాలు చెప్పిన కోటా, రాజకీయాల పై కూడా మాట్లాడారు... ముందుగా సొంత పార్టీ గురించి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే.. బీజేపీకి ఊతం పట్టి నడిపే నాయకులు లేరు. బీజేపీకి దాని స్థానం దానికి పదిలం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొన్ని స్థానాలు వస్తే వస్తాయి. ఏపీ, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరచడం మాత్రం బీజేపీకి కష్టమే, అని అన్నారు. అలాగే ఇటు చంద్రబాబు గురించి, అటు కెసిఆర్ గురించి కూడా మాట్లడారు. కెసిఆర్ కు అన్నీ వడ్డించిన విస్తరి అని, ఆయన కష్టపడేది పెద్దగా ఏమి లేదు అని చెప్పారు.

pavan kota09062018 2

చంద్రబాబుకి కేసేఅర్ లా కాదని, చంద్రబాబు ఎంతో కస్టపడి అన్నీ నిర్మిస్తున్నారని, అమరావతి, హైదరాబాద్ లా కావలి అంటే, మరో 20 ఏళ్ళు పడుతుంది అని, చంద్రబాబు ఉంటేనే, ఆయన కష్టంతో అన్నీ కుదురుతాయని అని అన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం అనుభవాలనుంచైనా నేర్చుకోవాలి కదా అన్న ఆయన.. సినిమా వాళ్లకు రాజకీయ వాతవారణం పడదని వ్యాఖ్యానించారు. అసలు పవన్ రాజకీయాలపై ఆయనేమన్నారంటే.. "మనకెందుకు చెప్పండి... నేనే వెనక్కి వచ్చేశాను.. ఊరికే పిచ్చోడినై వచ్చానా.? రజనీకాంత్ వస్తానని చెప్పడు... వెళ్తానని చెప్పడు.

pavan kota09062018 3

పెద్దవాళ్లే అలా ఆలోచిస్తున్నప్పుడు .. కుర్రాడు ఆయన. వాళ్ల అన్నకు జరిగిందాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా... సినిమా వాళ్లకు ఆ వాతావరణం పడదు" అన్నారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి లాంటి క్రేజ్ ఉన్న వాడే, రాజకీయాల్లో ఎక్కడ ఉన్నారో చూసాం కదా, అప్పుడు మొత్తం చిరంజీవి వెంట ఉన్నా, సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు పవన్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అయినా, ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళ అన్నను చూసి అయినా, నేర్చుకోవాలిసింది అన్నారు కోటా.. అటు నాలుగు దశాబ్దాల సినీ అనుబంధం.. ఇటు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవమున్న కోట.. తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

జగన్ లాగా, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ, అన్నీ అబద్ధాలు చెప్తూ, చౌకబారు ఆరోపణలు చేస్తూ, యువతని రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే శ్రీకాకుళంలో సర్దార్ గౌతు లచ్చన్న, వారసుడిగా, గౌతు శివాజీ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన గత ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు... ఎంతో నిజాయితీ పరుడుగి పేరు ఉన్న గౌతు శివాజీ అంటే, శ్రీకాకుళం జిల్లాలో ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి వ్యక్తిని, ఎవరో రాసి ఇచ్చిన స్ర్కిప్ట్‌ చూసి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసారు. దాని పై ఇప్పటికే, పవన్ కళ్యాణ్ కు లీగల్ నోటీసు పంపించారు.. క్షమాపణ చెప్పని పక్షంలో, పరువు నష్టం దావా వేస్తాము అని నోటీసులో చెప్పారు. నిలకడ లేని తనంతో, నోటికి ఏది వస్తే అదే మాట్లాడే పవన్ కళ్యాణ్, ఇప్పటికే ట్విట్టర్ లో చేసిన రచ్చకు, రెండు న్యూస్ చానల్స్ లీగల్ నోటీసులు పంపించాయి.

pawan 09062018 2

అవి ఏమైనయ్యో తెలియదు, వాటితో రాజీ కుదురుచుకున్నారు అనే టాక్ నడుస్తుంది.. ఇది సెటిల్ అవుతుంది అనుకుంటున్న టైంలో, పవన్ నోటి దూలకు, గౌతు శివాజీ మరో లీగల్ నోటీసు వచ్చింది... అయితే, కేవలం ఆరోపణలు మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కు, ఇప్పుడు మరో పరువు నష్టం దావా కేసు కూడా వచ్చే అవకాసం ఉంది. పవన్ కళ్యాణ్ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలను 15 రోజుల్లో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. తనకు పవన్‌ క్షమాపణ చెప్పాలని లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని, అలాగని లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. పవన్ కల్యాణ్ లాగే తమక్కూడా తిక్కుందని...దానికో లెక్కుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పకపోతే ఆ లెక్కేంటో చెబుతామని పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. అసలు ఇన్ని ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్, ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించలేదని, ఒక్క ఆధారం అన్నా చూపించి, మా పై కోర్ట్ కి వెళ్ళవచ్చు కదా, ఈ రాజకీయ ఆరోపణలు సహించేది లేదన్నారు.

pawan 09062018 3

మరో పక్క పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా పవన్ ఆరోపణల పై, తన అవగాహన లేమి పై స్పందించారు. పీహెచ్‌సీకి, సీహెచ్‌సీకి తేడా తెలియకుండా పాయకరావుపేట పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌ చేయలేదని పవన్‌ విమర్శించడాన్ని ఎమ్మెల్యే అనిత తప్పుబట్టారు. పవన్‌కు సమస్యలపై అవగాహన లేదన్న విషయం అర్థమవుతుందన్నారు. పాయకరావుపేటలో పీహెచ్‌సీ వుండగా, కేవలం కిలోమీటరు దూరంలో తునిలో 100 పడకల ఆస్పత్రి వుందని, శ్రీరాంపురంలో కూడా పీహెచ్‌సీ వుందన్న విషయాన్ని పవన్‌ తెలుసుకోవాలని సూచించారు. ఇసుక తవ్వకాలను తాను ప్రోత్సహించనని, కఠిన చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని, తాండవ నది ఆక్రమణలు ఎవరి హయాంలో జరిగిందో తెలుసుకోవాలన్నారు. పాయకరావుపేటలో జూనియర్‌ కళాశాల వుండగా... లేదనడం హాస్యాస్పదమన్నారు. ఎవరో ఇచ్చిన స్ర్కిప్ట్‌ను పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాల్లో చదువుతున్నారని అర్థమవుతోందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే విషయం తెలియక 2019లో జనసేన ఖాతాలో పేట చేరుతుందనడం హాస్యాస్పదమన్నారు. తన సభలకు వచ్చిన జనాలను చూసి, అవే ఓట్లనుకునే భ్రమలో పవన్‌ వున్నారని, ఆయన సోదరుడు చిరంజీవి సభలకు అంతకంటే ఎక్కువ జనం హాజరయ్యేవారని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read