గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్, ఎక్కడి వెళ్తే అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, అసలు రాష్ట్రంలో వైద్యమే లేదు, చంద్రబాబుకి సిగ్గు లేదు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలకు సమాధానంగా, రాష్ట్రంలో ఆరోగ్య పరంగా అందిస్తున్న సేవలపై ఏపీ ప్రభుత్వం ప్రెస్ నోట్ విడుదల చేసింది.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం పాలన సాగుతోంది. ముఖ్యంగా ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆరోగ్య పథకాలను అమలు చేస్తోంది. ‘ఎన్టీఆర్ వైద్య సేవ’, ‘ఎన్టీఆర్ వైద్య పరీక్ష’, ‘అన్న సంజీవని’, ‘చంద్రన్న సంచార చికిత్స’, ‘ఈ ఔషధి’, ‘ఈ యూపీహెచ్ సి’, ‘మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ (ఎంఎంహెచ్ సి)’, 108, 102 వంటి ఆరోగ్య పథకాలతో ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తోంది. పేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తూ ఉచిత డయాలసిస్ సేవల పథకాన్ని పెద్దఎత్తున అమలు చేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేస్తోంది.

ప్రస్తుత సమాజంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో పేదలే అధికంగా ఉంటున్నారు. కిడ్నీ వ్యాధుల నుంచి బయటపడాలంటే ఆర్థికంగా ఎంతో ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో, పేదరికంతో బాధపడుతున్న కిడ్నీ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కిడ్నీ రోగుల ప్రాణాలకు భరోసా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది.

పేదల బతుకుల్లో వెలుగులు నింపే ధ్యేయంతో ఉచిత డయాలసిస్ సేవల పథకాన్ని 2016 లో ప్రారంభించింది. దీని ద్వారా కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు, పింఛన్లు, సురక్షితమైన తాగునీటిని, మందులను అందజేస్తోంది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి గురువారం సాయంత్రం (7.6.2018) నాటికి వరకూ 2,666 రోగులకు 1,81,473 డయాలసిస్ సెషన్లు నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్ల నిర్వహణతోనే ప్రభుత్వం సరిపెట్టడంలేదు. ‘ఉద్ధానం పరిధిలో ఉన్న గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఉచిత కిడ్నీరోగ నిర్ధారణ పరీక్షల నిమిత్తం 15 మొబైల్ మెడికల్ క్లినిక్ లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

మరో 14 డయాలసిస్ కేంద్రాలు: దేశంలోనే మొదటిసారి ఉచిత డయాలసిస్ సేవలను నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద ఈ సేవలను ప్రభుత్వాసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 18 డయాలసిస్ సెంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్తగా మరో 14 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం చీరాల, గూడూరు, హిందూపూర్, కందుకూరు, కనిగిరి, మచిలీపట్నం, మర్కాపుర్, నంద్యాల, నర్సీపట్నం, పాలకొండ, పలాస, పార్వతీపురం, ప్రొద్దుటూరు, రాజమండ్రి, సోంపేట, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, తెనాలి ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు పని చేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే 14 కేంద్రాలను పాడేరు, రంపచోడవరం, తుని, అమలాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసరావు పేట, మాచర్ల, ఆత్మకూరు, మదనపల్లి, కుప్పం, కదిరి, రాయచోటి, ఆదోనిలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

రూ.16 కోట్లతో 7 ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్లు: కిడ్నీ బాధితులకు ప్రభుత్వం సురక్షితమైన నీటిని అందించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉద్దానంలోని పలాస, వజ్రపు కొత్తూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, మందస మండలాల్లో రూ.16 కోట్లతో 7 ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాటి ద్వారా 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరా చేస్తోంది. 136 రిమోట్ డిస్పె న్సింగ్ యూనిట్లకు గానూ ఇప్పటికే 109 యూనిట్లను ఏర్పాటు చేసింది. మరో 27 యూనిట్లు త్వరలో పూర్తి చేయనుంది.

నెలకు రూ.లక్షా 70 వేల డయాలసిస్ సేవలు ఉచితంగా: ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ నిర్వహించడమంటే మామూలు విషయం కాదు. ఒక పర్యాయానికే రూ.2000 నుంచి రూ.3000 వరకూ వసూలు చేస్తుంటారు. కొందరికి రెండ్రోజులకొకసారి, మరికొందరికి వారానికి రెండు పర్యాయాలు డయాలసిస్ అవసరమవుతుంది. ఇలా నెలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేసుకుంటే లక్షా 70 వేల రూపాయల వరకూ వ్యయమవుతుంది. ఇది పేదలకు పెను ఆర్థిక భారమే. పేదల ప్రాణాలకు భరోసానిస్తూ, ప్రభుత్వమే డయాలసిస్ సేవలను ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల తమకు ఆర్థిక భారం నుంచి తప్పించడమే కాకుండా భవిష్యత్తుపై భరోసా కలుగుతోందని బడుగు జీవులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అవకాశం తమకు పునర్జన్మ వంటిదని ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానాన్నిపీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు త్వరలో విశాఖపట్నంలోని విమ్స్ లో ఐ.సి.ఎం.ఆర్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

బాధితులందరికీ రూ.2,500 పెన్షన్: రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో పాలన ప్రారంభమైనా, కిడ్నీ రోగులకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం రూ.లక్షల విలువైన వైద్య సేవలతోనే సరిపెట్టకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించేలా పెన్షన్లు కూడా అందిస్తోంది. ఒక్కో రోగికి నెలకు రూ.2,500 చొప్పున పింఛన్ అందజేస్తోంది.

ఆంధ్రప్రదేశ్... పేరు మాత్రమే పాతది! ప్రస్థానం మాత్రం పూర్తిగా కొత్త... విభజనలో అనేకం కోల్పోయి, ఎన్నెన్నో సమకూర్చుకోవాల్సినంత సంక్లిష్టత! రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఇలా మిగిలింది! ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం మొదలుపెట్టి సరిగ్గా నాలుగేళ్ళు గడిచింది. సరిగ్గా ఇదే రోజు 08-06-2014న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు చంద్రబాబు. నేటికీ నాలుగేళ్ళు పూర్తిచేసుకొని అయిదవ ఏట అడుగెడుతున్నారు.

విభజన సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కుట్రలు కుతంత్రాలకు, బలైన ఆంధ్రప్రదేశ్ ను నాలుగేళ్ళులోనే శిఖరాగ్రానికి చేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుత విజయం సాధించారు. బాధ్యత లేని స్వార్ధ పాలకులు కుప్పకూల్చిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడానికి ఒక సైన్యంలా యుద్ధం చేస్తున్న సాధకుడు చంద్రబాబునాయుడు. సవాళ్ళ మద్య సారధ్యం చేపట్టి సమస్యలకు తలొగ్గేది లేదన్న తెగువను కనబరిచారు. భారమైనా నవ్యాంధ్ర ఐదుకోట్ల ప్రజల భవితను తన భుజాలకు ఎత్తుకొని మోస్తున్నారు చంద్రబాబునాయుడు. పట్టిన పట్టువదలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం పై నమ్మకం! రాష్ట్రానికి ఉన్న వనరులు.. ఈ రెండు ఉన్నాయి అనే ధైర్యంతో, భవిష్యత్తు పై నమ్మకంతో నవ్యాంధ్ర ప్రజలు ముందుకు సాగుతున్నారు ! మరి నాలుగేళ్ళులో ఈ ప్రయాణం ఎందాకా సాగింది? నవ్యాంధ్ర భవిష్యత్తు ఎలా ఉంది? చంద్రబాబు పాలన ఏ దిశగా సాగుతోంది?

విభాజన జరిగిన నాడు, నవ్యాంధ్రకు ఉన్న సానుకూలాంశం ఒక్కటే, సమర్ధ నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటమే తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి వనరులు లేవు. ఆ పరిస్థితుల నుండి దిక్కు మొక్కు లేని అనాథగా మారిన ఆంధ్రప్రదేశ్ కు దశా, దిశ కల్పించి, నాలుగేళ్ళులో రాష్ట్రాన్ని, నిలబెట్టారు చంద్రబాబు. అధికారం చేపట్టిన ఈ మూడేళ్లలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అబ్బుర పరుస్తున్నాయి.

24 గంటలు విరామంలేని విద్యుత్ సరఫరా, రాజధాని ప్రాంతం ఎంపిక, రాజధాని భూసేకరణ, రాజధాని శంకుస్థాపన, పట్టిసీమ నిర్మాణం,యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు, ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, ఫైబర్ గ్రిడ్, భారీ స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక క్లస్టర్లు, ఆహార శుద్ధి పార్కులు, పర్యాటకం, మీ ఇంటికి-మీ భూమి, వ్యవసాయ రంగం బలోపేతం, రైతు సంక్షేమం, ఆకర్షణీయమైన గ్రామాలు, జన్మభూమి, పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ విద్య సంస్థలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, నీరు-ప్రగతి, పంటకుంటలు, 7 మిషన్లు, 5 గ్రిడ్ లు, దేశంలో ఏ రాష్ట్రం అమలుచేయనటువంటి సంక్షేమ పథకాలకు ఆకాశమే హద్దు అనే విధంగా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి రాష్ట్రాన్ని రాచబాట ఎక్కించారు ముఖ్యమంత్రి చంద్ర బాబు.

అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యటం: అసాధ్యాన్ని సుసాధ్యం చేయటంలో చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు లేడు. సవాళ్లు ఎదురైనా సమస్య ఎంత తీవ్రమైనది అయినా పరిష్కారం ఎంత కష్టసాధ్యమైనది అయినా చంద్రబాబు వెనుతిరిగిన దాఖలాలు లేవు. ఏ పని అయినా పట్టుకుంటే అది అనుకున్న సమయానికి పూర్తి కావాల్సిందే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీని 13 నెలల్లో నిర్మించిన ఘనత, ఏడాదిలో కృష్ణా నీటిని హైదరాబాదుకు తరలించిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు గోదావరి నదిపై పట్టిసీమ పథకాన్ని పట్టుబట్టి ఐదున్నర నెలల్లో పూర్తి చేశారు. కృష్ణమ్మ, గోదావరిలను జత కలిపిన సాధకుడు చంద్రబాబు.

మన గడ్డ నుంచే పాలన: ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాదులో కొనసాగే అవకాశం ఉన్నప్పటికి సాధ్యమైనంత త్వరగా పరిపాలన సొంతగడ్డకు తరలించాలన్న పట్టుదలతో వ్యవహరించి అకుంఠిత దీక్షతో ముందడుగు వేశారు. అమరావతి నడిబొడ్డున వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టి ఆరు నెలల్లో పూర్తి చేశారు. అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టిన 192 రోజుల్లో ఆధునిక హంగులతో నిర్మాణమైంది.

అమరావతి: భవిష్యత్ అవసరాలను అందుకునే భారీ ప్రణాళికలతో అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. అమరావతి రేసు గుర్రంలా పరుగెడబోతుంది. అధునాతన ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణానికి పూనుకోవడం సాదాసీదా వ్యవహారం కాదు. ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించగానే 34వేల ఎకరాలు సారవంతమైన భూముల్ని ప్రభుత్వానికి రాసిచ్చి సరికొత్త చరిత్రను సృష్టించి దేశానికి ఆదర్శంగా నిలిచారు రైతులు. గత మూడేళ్ళలో ప్రపంచ స్థాయి రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి తగిన వనరుల్ని సమీకరించుకున్నారు. అంతర్జాతీయ స్థాయి నిపుణుల్తో ఈ నగర నిర్మాణానికి ఆకృతుల రూపకల్పన చేయిస్తున్నారు. 2019నాటికి అమరావతి నగరానికో రూపురేఖలు తేవడం ఇప్పుడు చంద్రబాబు ప్రధాన లక్ష్యం.

పోలవరం: 2014 ఎన్నికల్లో విజయం సాధించాక, ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే సాగునీటి పథకాలపై దృష్టి సారించారు. దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయిన పోలవరం ప్రాజెక్టు ఫైలు దుమ్ము దులిపారు. ఈ ప్రాజెక్టును 2018 నాటికే పూర్తి చేయాలని సంకల్పించారు. కాని కేంద్రం సహకారం లేకపోవటంతో, ఈ లక్ష్యం 2019కి చేరింది. ప్రతి సోమవారం పోలవరం పనులపై ‘వర్చువల్‌ రివ్యూ’ చేస్తున్నారు. ఇప్పటిదాకా 56 సమీక్షలు చేశారు. ‘సోమవారం నాకు పోలవారం’ అని ప్రకటించేశారు.

ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు: పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాలే కాకుండా సీమకు సాగునీటిని అందించే పథకాల వేగాన్ని పెంచింది. హంద్రీ-నీవా మెదటి, రెండో దశలు, గాలేరు నగరి సుజల స్రవంతి తొలి దశ, వెలిగొండ, గుండ్లకమ్మ, వంశధార, తోటపల్లి ప్రాజెక్టులనూ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. ‘భూగర్భమే పెద్ద జలాశ యం. వర్షపు నీటిని అందు లో భద్రపరచాలి’ అని తరచూ చెప్పే ముఖ్యమంత్రి.. పంట కుంటలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉపాధి హామీ పథకం నిధులను ఇందుకు సమర్థంగా ఉపయోగిస్తున్నారు

రైతు రుణమాఫీ: రూ.50వేల లోపు రుణాలు ఏకమొత్తంలో మాఫీ జరిగాయి. ఇప్పటికే మూడు విడతల్లో రైతు ఖాతాల్లో జమ చేయడమైంది. హామీ ఇవ్వకపోయినప్పటికీ ఉద్యాన రైతులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఎకరానికి రూ.10వేల చొప్పున రూ.370 కోట్ల రుణాలు మాఫీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన తొలి రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్‌ దేశంలో గుర్తింపు పొందింది.

డ్వాక్రా రుణమాఫీ: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక శక్తిని పెంపొందించాలని ఒక్కొక్కరికి రూ.10 వేలు ధన సహాయం ప్రకటించడమైంది. 86,79,129 మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరింది.

విద్యుత్: గృహ విద్యుత్తు సరఫరాకు 4 నుంచి 10 గంటలపాటు అధికారిక కోతలు.. పరిశ్రమలకు వారంలో మూడు రోజులు పవర్‌ హాలిడేస్‌.. రాత్రి 10 దాటాక విద్యుత్తు వాడే పరిశ్రమలపై ఫైన్... వ్యవసాయ అవసరాలకు అర్థరాత్రి వేళ ఎప్పుడు విద్యుత్తు సరఫరా అవుతుందో తెలియని దుస్థితి... ఇదీ రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు సరఫరా పరిస్థితి.

అలాంటి దుస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసే స్థాయికి తీసుకురావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే నవ్యాంధ్ర ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించిన కీలక రంగాల్లో విద్యుత్తు రంగం ఒకటి. తనకున్న అనుభవం, సామర్థ్యంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే రోజుకి 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు లోటులో ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్తు దిశగా నడిపించగలిగారు. మూడేళ్లలో విద్యుత్తు రంగంలో భారీ మార్పులు జరిగాయి. పరిశ్రమలు, గృహాలకు 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్‌ అందుతోంది. రైతులకు వేలాది సోలార్‌ పంప్‌సెట్లు సరఫరా చేస్తున్నారు. విద్యుత్‌రంగ సమర్థ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 19 అవార్డులు వచ్చాయి.

పెన్షన్లు: మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెన్షన్లు ఐదు రెట్లు పెరిగాయి. వితంతువులు, వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్‌ అందిస్తున్నారు. ప్రతినెలా 47 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత, కళాకారులకు పెన్లన్లు అందుతున్నాయి. ఇందుకోసం ఏటా రూ.5,500 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు.

పెట్టుబడులు: హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలకు కంటే దీటుగా నవ్యాంధ్రను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. సమగ్రాభివృద్ధి చెందాలంటే పెట్టుబడులే ప్రధానమని గుర్తించి చంద్రబాబు ఇప్పటి వరకు మలేషియా, సింగపూర్‌, జపాన్‌, చైనా, దావోస్‌, రష్యా, అమెరికా వంటి దేశాల్లో విస్తృతంగా పర్యటించి, వివిధ ఐటీ కంపెనీల సీఈవోలతో చర్చలు జరిపి రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. 13 వేల కోట్ల పెట్టుబడులతో "కియా" రాకతో రాష్ట్రానికి ఆటోమొబైల్‌ రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. ఇప్పటికే రాష్ట్రానికి ఇసుజు, హీరో మోటార్స్‌, ఆశోక్‌ లెలాండ్‌, అపోలో టై ర్స్‌, సియట్‌ టైర్స్‌, భారత్‌ ఫోర్డు, టివిఎస్‌ గ్రూపు, వీరా బస్‌బిల్డింగ్‌ యూనిట్‌ వంటి సంస్థలు వచ్చాయి.

ప్రజలే ముందు: "ప్రజలే ముందు" ఇదే ఇప్పుడు ప్రభుత్వ నినాదం... పీపుల్‌ ఫస్ట్‌ (ప్రజలే ముందు) పేరిట ఒక కాల్‌ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. ప్రజలు 1100 నెంబరుకు నేరుగా ఫోన్‌ చేసి తమ సమస్యలను, ఫిర్యాదులను, సలహాలను, అభిప్రాయాలను నిర్భయంగా తెలియచేయడమే గాక, పరిష్కారం కూడా పొందవచ్చు.

టెక్నాలజీ: టెక్నాలజీ వినియోగం ద్వారా సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంచి అవినీతికి అడ్డుకట్ట వేయడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.24 వేల కోట్ల రైతు రుణమాఫీ, ప్రతి ఏటా రూ.5,700 కోట్ల విలువైన పింఛన్ల పంపిణీ, రూ.3 వేల కోట్ల రేషన్‌ పంపిణీలో పైసా అవినీతి లేకుండా అమలుచేయడం ప్రభుత్వం సాధించిన విజయం.

ఆదాయం: విభజన నాటికి తలసరి ఆదాయం రూ.95,689తో దేశంలో 9వ స్థానంలో రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండంకెల అభివృద్ధి రేటును అందుకున్నది. జాతీయ సగటు వృద్ధిరేటు కంటే రాష్ట్రం అధిక వృద్ధిరేటు సాధించగలిగింది. ప్రతికూలతలను అనుకూలతలుగా మలుచుకోగల సమర్థ నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైందని విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు. మూడేళ్లలో ఇంత ప్రగతిని సాధించడం ఆషామాషీ విషయం కాదు.

బిసి సంక్షేమం: బిసి సబ్‌ప్లాన్‌ కింద రూ.10,000 కోట్లు బడ్జెట్‌ కేటాయింపు జరిగింది. అత్యంత వెనుకబడిన 32 కులాలకు ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం, బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు ఆర్థిక సాయం, బీసీ భవన్‌ల నిర్మాణాలకు నిధులను కేటాయించడం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలవుతున్నాయి.

ఎస్సీ , ఎస్టీ సంక్షేమం: ఎస్సీ సబ్‌ప్లాన్‌కు మూడేళ్లలోనే 19,532.22 కోట్లు ఖర్చు చేయడం జరిగింది (నాలుగో ఏడు వివరాలు అందలేదు). ఈ ఏడాదికి రూ. 9,837 కోట్లు కేటాయించడం జరిగింది. అమరావతిలో అంబేద్కర్‌ స్మృతివనం నిర్మాణంలో భాగంగా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహానికి భూమిపూజ జరిగింది.

గతంలో ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా ఎస్టీల సంక్షేమం కోసం 2017-18లో రూ.1815.32 కోట్లు కేటాయించారు. ఎస్టీ బాలికలకు వివాహ సమయంలో రూ.50వేలు ఆర్థికసాయం అందించడం జరుగుతోంది. జగ్జీవన్‌ జ్యోతి పేరుతో నెలకు 75 యూనిట్ల లోపు వినియోగించిన వారికి ఉచిత విద్యుత్‌ అందుతోంది. మైనార్టీల సంక్షేమం కోసం మూడేళ్లలో రూ.1962 కోట్లు ఖర్చు జరిగింది. కడపలో హజ్‌హౌస్‌ను నిర్మించడం జరుగుతోంది.

మైనారిటీస్‌ కార్పొరేషన్‌: మైనారిటీస్‌ కార్పొరేషన్‌ ద్వారా పేదలకు రుణాలు, ఇమాం, మౌజమ్‌లకు గౌరవ వేతనం అందుతున్నాయి. దుల్హన్‌ స్కీమ్‌ ద్వారా వివాహ సమయంలో మైనారిటీ బాలికలకు రూ.50వేల ఆర్థికసాయం అందిస్తున్నారు.

క్రిస్టియన్‌ కార్పొరేషన్‌: క్రిస్టియన్‌ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ.75 కోట్లు కేటాయించారు. గుంటూరులో క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణం, జెరూసలేం యాత్ర పథకం ద్వారా రూ.40వేల ఆర్థిక సాయం అందుతోంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాపుల అభివృద్ధి కోసం ఏడాదికి రూ.1000 కోట్లు కేటాయించడం జరిగింది. 65 వేల మందికి కాపు కార్పోరేషన్‌ ద్వారా రుణాలు అందాయి, 1000 మందికి పైగా విద్యార్థులకు విదేశీ విద్య లభిస్తోంది.

బ్రాహ్మణ సంక్షేమం: బ్రాహ్మణ సంక్షేమానికి 2017–-18 బడ్జెట్‌లో రూ. 97 కోట్లు కేటాయించి బ్రాహ్మణ సంక్షేమం పట్ల చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధిని చాటుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ పర్యవేక్షణలోని ఆలయాల్లో పనిచేసే వారి కోసం ‘అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి’ బాసటగా నిలుస్తోంది. అర్చకులకు వంశపారంపర్య హక్కు కలగ జేసింది. 50 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల్లో పనిచేస్తూ నెలకు రూ.12,500 కంటే తక్కువ వేతనం ఉన్న వారి కోసం అర్చక, ఉద్యోగుల సంక్షేమనిధి ఏర్పాటైంది.

అగ్రవర్ణ పేదలకు సాయం: కులాలకు అతీతంగా, అన్ని వర్గాల్లోని పేదలకు (ఈబీసీ) సాయం చేద్దామనే ఉద్దేశంతో అగ్రవర్ణ పేదలకు సాయం. 2017-18 నుండే ఈబీసీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని నిర్ణయం. రూ.700 కోట్లతో ఈబీసీ కార్పొరేషన్. బ్యాంకుల ద్వారా విద్యా , వ్యాపారాభివృద్ధికి రుణాలు , అగ్రవర్ణ పేద విద్యార్ధులకు ఫీజు రీఎంబెర్సుమెంట్, చిన్న , మధ్య తరహా వ్యాపారస్తులకు రుణాలు ఇప్పించే కార్యక్రమాలు

బాలికలకు ఉచిత సైకిళ్ళు: మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని పాఠశాల విద్యను అభ్యసించే లక్షా 82వేల 556 మంది బాలికలకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది.

అన్న సంజీవని: ‘అన్న సంజీవని’ పథకం కింద జెనరిక్‌ మందుల దుకాణాల బాధ్యతను మహిళలకు అప్పగించారు. సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు, కిశోర్‌ బాలికా సంరక్షణ పథకం, గృహిణి, రోషిణి, దీపం, ముస్లిం మహిళల కోసం డ్వామ్వా పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది.

ఆరోగ్యం: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ, ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద పరిమితిని 2.5 లక్షలకు పెంచి, అదనంగా 100 వ్యాధులు చేర్చి 1,038 వ్యాధులకు వైద్యం అందించడం జరుగుతోంది.

చంద్రన్న భీమా: అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం ద్వారా కేవలం రూ.15 చెల్లించి, వ్యవసాయ కార్మికులు, స్వయం సహాయక బృందాల మహిళలు, ఉపాధి హామీ కార్మికులు, లారీ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్లు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని పొందుతున్నారు.

రేషన్: 1.25 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డు దారులకు రేషన్‌ బియ్యం 4 కేజీల నుంచి 5 కేజీలకు పెంచడమైంది. సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్‌మస్‌ కానుక అందించడం జరుగుతుంది.

మరెన్నో పధకాలు: ఆరోగ్య రక్ష, స్వాస్ద్హ్య విద్యావాహిని, పుర సేవ, బడికొస్తా, ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పధకం, దివ్యదర్శనం, చంద్రన్న ఉన్నత విద్యాదీపం, చంద్రన్న సంచార చికిత్స, జన్మభూమి - మా ఊరు, నీరు-ప్రగతి, షీ ఆటో, ఎన్టీఆర్ జలసిరి, ఈ-ప్రగతి, మీ ఇంటికి - మీ భూమి లాంటి మరెన్నో పధకాలు ఉన్నాయి.

ఆంధ్రుల నమ్మకాన్ని నిలబెట్టడంలో చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ముందడుగు వేశారు అనటంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రజలకు కనీస సౌకర్యాలు అందించడం కూడా కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం సాధించిన విజయం ఆషామాషీ కాదు. శిథిలమైన నవ్యాంధ్రను శిఖరాగ్రానికి చేర్చడానికి ఆయన తన శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారు. దుర్మార్గుల ఉచ్చులో పడకుండా, ఆ నాయకుడి సార్దంలో, స్వర్ణాంధ్ర సాధించుకుందాం... మన కలల రాజధాని అయిన అమరావతిని, మన జీవనాడి అయిన పోలవరాన్ని నిర్మించుకుని, బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుందాం.

నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలీదు అని, రెండు సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో అశోక్ గజపతి రాజు గారు అన్నారు.. ఆ వ్యాఖ్య పట్టుకుని, రెండేళ్ళు అయినా, పవన్ కళ్యాణ్ అదే విషయం పై తన యాత్ర మొదలైన దగ్గర నుంచి ఎదో ఒక సందర్భంలో అంటున్నారు. "అశోక్ గారూ.. నేను మీ విజయనగరం వచ్చాను.. మీ కోట దగ్గరకు వచ్చాను. నా పేరేనండి పవన్ కల్యాణ్. నన్ను పవన్ కల్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను. మీరు అనుభవించిన కేంద్రం మంత్రి పదవికి కారకుడినండి."అంటూ పీక్స్ కి వెళ్ళిపోయాడు పవన్... గత పది రోజుల నుండి, నేను ఎవరో తెలీదు అంటారా అంటూ, పవన్ కొడుతున్న డైలాగ్లు చూసి ప్రజలు కూడా నవ్వుకున్నారు. అశోక్ గజపతి రాజు, నాకు పవన్ తెలుసు అనే దాక పవన్ ఈ విషయం వదలడు అనే మాటలు వినిపించాయి..

ashok 07062018 2

అయితే, నిన్న అశోక్ గజపతి రాజు గారు మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ విషయమై మాట్లాడుతూ ఆన్‌ స్క్రీన్ కాని, ఆఫ్‌ స్క్రీన్ కాని ఆయన గురించి నాకు తెలియదని అశోక్‌ అన్నారు. తెర వెనుక ఎవరో రాసి ఇచ్చినది చదివితే ఉన్న గౌరవాన్ని కోల్పోతారన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ లెజెండ్‌ అని, ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ కుమారుల పెళ్లి సమ యాల్లో కూడా ప్రజా సేవలోనే ఉండి ప్రజలే ముఖ్యమన్న సంకేతాలు పంపారన్నారు. మొత్తానికి, మళ్ళీ నాకు పవన్ అంటే ఎవరో తెలీదు అనటంతో, మళ్ళీ పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..

ashok 07062018 3

మరో పక్క, ఎయిర్‌ ఆసియా విషయమై అశోక్‌ మాట్లాడుతూ సంబంధిత సీఈవో ఫోన్‌ సంభాషణతో తనకు సంబంధం లేదన్నారు. భారత్‌లో విమాన రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చి, యువతకు ఉపాధి కల్పించాలని అనుకున్నానని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు గ్రోత్‌ పెంచాల్సిన అవసరం కేంద్రంపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్‌ చైర్మన్‌ రామకృష్ణ, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, బొద్దల నర్సింగరావు, వీఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఒక పాక్ సాక్షిలో కాని, జగన్ మీటింగ్ లో కాని, వైసిపీ నేతలు కాని, నిన్న చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మా రాజీనామాలు ఆమోదించారు అంటూ ప్రచారం చేసారు. కాని వాస్తవం ఇది. వైసీపీ ఎంపీల రాజీనామాలు మళ్లీ పెండింగ్‌లోకి వెళ్లిపోయాయి. ఎంపీల రాజీనామాపై నిన్న ఢిల్లీలో హైడ్రామా నడిచింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో వైసీపీ ఎంపీల భేటీ తర్వాత మా రాజీనామాలు ఆమోదమైనట్లేనని మీడియాకు వెల్లడించారు. భేటీ అయ్యి 24 గంటలు గడిచినా స్పీకర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తన కార్యాలయానికి వచ్చినా.. వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. ఇదిలా ఉంటే రేపటి నుంచి 10 రోజుల పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మరి ఎప్పుడు రాజీనామా ఆమోదిస్తారో, అసలు ఆమోదిస్తారో లేదో, ఆ దేవుడికే తెలియాలి.

speaker 07062018 2

నిజానికి వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న రాజీనామా లేఖలను స్పీకర్ ఫార్మెట్‌లో సుమిత్రామహాజన్‌కు ఇచ్చారు. వ్యక్తిగతంగా కలిసి లేఖలు ఇచ్చి రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరారు. కానీ ఆమె పెండింగ్‌లో పెట్టారు. ఆగష్టులో మళ్లీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే వరకు నిర్ణయం తీసుకోరని అందరూ భావించారు. ఈలోపే కర్ణాటక ఎంపీలు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలు చేయడంతో అప్పటికప్పుడు ఆమోదింపజేశారు. దీంతో బీజేపీ, వైసీపీ కలిసే రాజీనామా నాటకాలు ఆడుతున్నాయన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇవి అంతకంతకూ పెరుగుతుండటంతో చెక్‌పెట్టేందుకు సుమిత్రామహాజన్ హఠాత్తుగా ఎంపీలను పిలిచి మరీ మాట్లాడారు. 29న వారి రాజీనామాలను ఆమోదిస్తారని అందరూ అనుకున్నారు. కానీ స్పీకర్ తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. నిన్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాల్సిందింగా స్పీకర్‌ను కోరారు...

speaker 07062018 3

అయితే, వీరి గుట్టు ఇలా బయట పడింది... రిప్రజెంటేషన్ అఫ్ పీపుల్స్ ఆక్ట్ 1951, సెక్షన్ 151-A ప్రకారం, ఏడాది లోపు ఎన్నికలు ఉంటే, ఉప ఎన్నికలు రావు.. ఒక్క రోజు గ్యాప్ తో, జగన్ ఇలా దొరికిపోయాడు.. మన ఎంపీ లు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 5 2014 న. జూన్ 5 2018 లోపు రాజీనామా చేస్తే వాటిని స్పీకర్ ఆమోదిస్తే, ఉప ఎన్నిక నిర్వహించాలి. అదే రాజీనామాలు జూన్ 5 తరువాత ఆమోదిస్తే జనరల్ ఎలక్షన్స్ కి సంవత్సరమే ఉంటది కాబట్టి ఎన్నికలు నిర్వహించరు. మేము చేసాము అనిపించు కోవచ్చు , ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరము లేదు. అందుకే వైసీపీ ఎంపీ ల రాజీనామాలని ఇన్ని రోజులు నడిపించారు బిజెపి వారు. ఎంతయినా ఇద్దరు ఒక్కటే కదా.. ఇవన్నీ ప్రజలకు తెలియదు, మనం డ్రామా ఆడచ్చు అని, ఇద్దరూ కలిసి అద్భుతమైన డ్రామాకి తెర దింపారు.

Advertisements

Latest Articles

Most Read