ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంతో పాటు, విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం విశాలాంధ్ర మహాసభ ఉద్యమించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించింది. విజయవాడ ఆటోనగర్‌లో సమావేశమైన తర్వాత కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి విశాలాంధ్ర మహాసభ ప్రయత్నించింది. కేంద్రానికి నిరసన తెలియచెయ్యాలి అంటే, కేంద్ర కార్యలాయాలనే అడ్డుకోవాలని నిర్ణయించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఆదాయపన్ను, జీఎస్టీ, కస్టమ్స్ ఈ కార్యక్రమాలు నిర్వహించే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించామని, కార్యకలాపాలను అడ్డుకున్నామని నేతలు చెప్పారు.

visalandra 24052018 2

ఐదు వందల మంది కార్యకర్తలు ఒక్కసారిగా ముట్టడికి యత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయాల ద్వారాలను మూసివేసి ఆందోళనకారులను అతికష్టం మీద అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి సమీప పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయడంలేదని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమకు రూ. 40వేల కోట్లు రావాల్సి ఉందని వారన్నారు.

visalandra 24052018 3

రూ. 16వేల లోటు బడ్జెట్ ఉంటే రూ. 4వేలు కోట్లు ఇచ్చి మోదీ చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఏపీకి జాతీయ సంస్థల కోసం రూ. 12వేల కోట్లు ఖర్చు అయితే కేవలం రూ. 8 వందల కోట్లు ఇచ్చి... అన్ని ఇచ్చేశామని అమిత్ షా చెబుతున్నారని, పోలవరానికి, రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని నేతలు మండిపడ్డారు. తెలుగు ప్రజలు పోరాడితే గానీ కేంద్రం దిగిరాదని వారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలను విశాలాంధ్ర మహా సభ అడ్డుకుంటుందని హెచ్చరించారు.

నిలకడ లేని తనంతో, నోటికి ఏది వస్తే అదే మాట్లాడే పవన్ కళ్యాణ్, ఇప్పటికే ట్విట్టర్ లో చేసిన రచ్చకు, రెండు న్యూస్ చానల్స్ లీగల్ నోటీసులు పంపించాయి. అవి ఏమైనయ్యో తెలియదు, వాటితో రాజీ కుదురుచుకున్నారు అనే టాక్ నడుస్తుంది.. ఇది సెటిల్ అవుతుంది అనుకుంటున్న టైంలో, పవన్ నోటి దూలకు, మరో లీగల్ నోటీసు వచ్చింది... సర్దార్ గౌతు లచ్చన్న... ఈయన గురించి తెలియని వారు ఉండరు... ఎంతో మందికి ఆదర్శం ఆయన... ఆయన వారసుడిగా, గౌతు శివాజీ ఉన్నారు.. ఆయన గత ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు... ఎంతో నిజాయితీ పరుడుగి పేరు ఉన్న గౌతు శివాజీ అంటే, శ్రీకాకుళం జిల్లాలో ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి వ్యక్తిని, ఎవరో రాసి ఇచ్చిన స్ర్కిప్ట్‌ చూసి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసారు...

pavan 24052018 2

దీని పై నొచ్చుకున్న గౌతు శివాజీ నిన్న స్పందించారు. తాను సర్దార్‌ గౌతు లచ్చ న్న కుమారుడినని, ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను, తన కుటుంబం ఏనాడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని ఎమ్మెల్యే గౌతు శివాజీ అన్నారు. ఎవరో ఇచ్చిన స్ర్కిప్ట్‌ చదివి, నేను అవినీతి పరుడుని అని, నా కుటుంబం అవినీతి కుటుంబం అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మా కుటుంబ వ్యక్తి పై ఆరోపణలు చేయడం తగదన్నారు. అవినీతి ఆరోపణలు చేసిన పవన్‌కు ఇప్పటికే లీగల్‌ నోటీసులు పంపించామని చెబుతూ వాటి ప్రతులను విలేకరులకు అందించారు. నియోజకవర్గం లో తానంటే ఏమిటో అందరికీ తెలుసని, జిల్లా లో సీనియర్‌ ఎమ్మెల్యేగా జిల్లాలో ఏ కార్య క్రమంలోనైనా ముక్కు సూటిగా మాట్లాడుతూ స్వపక్షంలో విపక్ష నేతగా గుర్తింపు పొందానన్నారు.

pavan 24052018 3

కిడ్నీ వ్యాధులపై స్పందించడం లేదని నినదించడం తగదని, విశాఖపట్నానికే పరిమితమైన డయాలసిస్‌ కేంద్రాలను పలాస, సోంపేటకు తీసుకువచ్చామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలకు కట్టుబడి నిలబడి నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలన్నారు. బహిరంగంగా అన్ని మాటలు మాట్లాడారు, మీరు చెప్పిన వాటి పై ఒక్క ఆధారమన్నా చూపండి, ఎవరో చెప్పారో అందుకే చెప్పాను అంటే, మీ గురించి కూడా అందరూ చాలా చెప్తున్నారు, మేము కూడా అవి చెప్పమంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు... రాజకీయాలు హుందాగా ఉండాలని, మీరు ఇక్కడే కొన్ని రోజులు ఉంటున్నారు కాబట్టి, ఈ చౌకబారు మాటలు కాకుండా, ఆధారాలతో మాట్లాడాలని చాలెంజ్ చేసారు.

పవన్ కళ్యాణ్ ను, బీజేపీ నడిపిస్తుంది అనే ప్రచారం, పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉంది.. పవన్ తీరు కూడా, ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.. ప్రత్యెక హోదా పై ప్రధాని మోడీని ఒక్కటంటే ఒక్క మాట అనకపోవటం, నాలుగేళ్ళు చంద్రబాబుని ఆహా ఓహో అని, రాత్రికి రాత్రి చంద్రబాబుని తిడుతూ, మోడీ నాకు ఆదర్శం అని చెప్పటం, అవిశ్వాస తీర్మాన సమయంలో నేషనల్ మీడియాకు ఎక్కి, చంద్రబాబుని బలహీన పరచటం, ఇలా అనేక ఉదహారణలు, పవన్ బీజేపీకి దగ్గరగా ఉన్నాడు అని ప్రూవ్ చేసాయి... ఇప్పుడు కూడా, చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేసి, మోడీని ఎండగడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం, ఎందుకు అలా చేస్తున్నారు అంటూ హడావడి చేస్తున్నారు.. మరో పక్క విజయసాయి రెడ్డి కూడా, ఇలాగే మోడీ పై ఈగ కూడా వాలనివ్వటం లేదు...

somu 24052018 2

ఇప్పుడు మరో సారి, పవన్ బీజేపీకి ఎంత దగ్గరగా ఉన్నారో, తెలియచేస్తూ, సోము వీర్రాజు, తాజాగా చెప్పారు... ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, సోము వీర్రాజు మాట్లాడుతూ, పవన్ మా లైన్ లో నే ఉన్నాడు అంటూ, కుండ బద్దలు కొట్టారు.. మా ఉమ్మడి శత్రువు చంద్రబాబు అని, అందుకోసం కలిసి పని చేస్తామని అన్నారు.. పవన్ కల్యాణ్ స్పందించే తీరు, మా బీజేపీ ఆలోచనకు దగ్గరగా ఉందని, ఇది శుభ పరిణామం అంటూ, సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ మా అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగానే టీడీపీ పాలన పై స్పందిస్తున్నారని, దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.

somu 24052018 3

ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్‌కు ఉన్న సందేహాలను నివృతి చేసి, ఆయనకు నచ్చజెప్పే బాధ్యత తనకు గానీ, మరే ఇతర బీజేపీ నేతలెవరికైనా అప్పజెపితే తాను సందర్భం వచ్చినప్పుడు ఆ పనిని పూర్తి చేస్తామని ఇంటర్వ్యూలో సోము వీర్రాజు చెప్పారు. జనసేనతో పొత్తు విషయమై స్పందిస్తూ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని సోము వీర్రాజు కామెంట్ చేశారు.. వాటికి ఇంకా టైం ఉందని, చంద్రబాబు మాకు ఉమ్మడి శత్రువు అయినప్పుడు, కలిసి పని చేస్తే తప్పు ఏమి లేదని అన్నారు.. మొత్తానికి, పవన్ కళ్యాణ్, బీజేపీ లైన్ లో, బీజేపీ ఆలోచనలకు తగ్గాటే ఉన్నారని సోము వీర్రాజు చెప్పారు.. ఇప్పుడు ప్రజలకి అర్ధమైంది, పవన్ పై మోడీని ఒక్క మాట కూడా ఎందుకు అనటం లేదో... https://youtu.be/ax9-OKQV4rA

మన రాష్ట్రంలో పని చేసిన సిన్సియర్ ఐఏఎస్‌ ఆఫీసర్లలో ఈయన ఒకరు.. ఒకప్పుడు టీటీడీ ఈవోగా పనిచేసారు... ఆయనే ఐఏఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం.. ప్రస్తుతం, రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు... ఒకప్పుడు స్వామి వారికి సేవ చేసిన అనుభువంతో, ఇప్పుడు జరుగుతున్న విష ప్రచారం చూసి, తట్టుకోలేక, బయటకు వచ్చి మాట్లాడారు.. స్వామి వారి కంటే, ఏది ఎక్కువ కాదని, అందుకే వాస్తవాలు చెప్పటానికి వచ్చానని చెప్పారు.. తిరుమలలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలన్నీ అభూతకల్పనలు, అవాస్తవాలని అని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏకంగా స్వామివారి ప్రతిష్ఠకే భంగం కలిగించేలా వ్యవహరించడం, అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. ఆరోపణలు చేసే వ్యక్తుల గురించి ప్రభుత్వం, టీటీడీ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. ఈ అంశాన్ని ఇంతటితో ముగించి స్వామివారి ప్రతిష్ఠను పెంచాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు.

lv 24052018 2

తిరుమలలో అన్ని వ్యవహారాలు చాలా పకడ్బందీగా, కట్టుదిట్టంగా ఉంటాయని ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. శ్రీవారికి వచ్చిన కానుకలను లెక్కించే పరకామణి నుంచి సూది కూడా బయటకు వెళ్లదన్నారు. ఇక గులాబీ వజ్రం ఏదో పోయిందని ఆరోపణలు చేస్తున్నారు. 1950వ దశకం నుంచి శ్రీవారికి కానుకలుగా వచ్చిన వస్తువుల రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయి. గులాబీ వజ్రం అన్నది అసలా జాబితాలోనే లేదు. ఇదే విషయాన్ని ప్రస్తుత ఈవో కూడా చెప్పారు. లేని వజ్రం మాయమైందని ఆరోపణలు చేయడం అత్యంత గర్హనీయం’ అని స్పష్టం చేశారు.

lv 24052018 3

తిరుమలలో ప్రధాన అర్చకుడు, అర్చకులకు పదవీ విరమణ వయసు పెట్టాలని అర్చకులే అడిగారని ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడించారు. ‘స్వామి వారికి కైంకర్యాలు చేయడం అత్యంత ప్రీతిపాత్రం.. ఇలాంటి అదృష్టం దక్కడం మా పూర్వజన్మ సుకృతం.. అయితే ఒక వయసు దాటాక శరీరం పట్టుతప్పుతోంది.. స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు పట్టుతప్పి పడిపోతే.. చేతిలోని పళ్లెం జారిపోతే అపచారం అవుతుంది.. ఒక వయసు దాటాక చేయడం కష్టంగా ఉంటోంది. అందుకే పదవీ విరమణ పెట్టండని 2011లో పలువురు శ్రీవారి అర్చకులే అడిగారు. అదే సమయంలో ఇప్పుడున్న అర్చకులు పదవీ విరమణ చేస్తే.. వారి వారసులకు అవకాశం వస్తుందనే అభిప్రాయమూ వ్యక్తం చేశారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా నిర్ణయించారు’ అని తెలిపారు. ఈ అంశాన్ని ఇంతటితో ముగించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో... కూడబెట్టుకున్న ప్రతి పైసా ఖర్చుపెట్టుకుని, కొన్ని రోజులు ఉపవాసాలుండి తిరుమలకు వస్తుంటారని, వారందరి మనోభావాలను గౌరవించాలని సుబ్రమణ్యం హితవు పలికారు.

Advertisements

Latest Articles

Most Read