ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికి, ప్రభుత్వం శుభ వార్త వినిపించింది. రాష్ట్రంలో వచ్చే నెల నుంచి ప్రతి రేషన్‌ కార్డుకూ రెండు కిలోల కందిపప్పును ఇవ్వనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. శుక్రవారం నిర్వహించిన గుంటూరు జిల్లా విజిలెన్సు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్‌ కార్డులపై ఇచ్చే కందిపప్పు ధరను రూ.40 నుంచి రూ.35కు తగ్గించే ఆలోచన ఉందన్న ఆయన... తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రేషన్‌ బియ్యంలో అక్రమాలను నిరోధించేందుకు అందరికీ నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. రేషన్‌ బియ్యంలో 20 శాతం రీసైక్లింగ్‌ అవుతోందని, వీటిని సాధారణ బియ్యంలో కలిపి విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున దీని నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ration 26052018 2

ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.131 కోట్ల రాయితీని భరించనుంది. మార్క్‌ఫెడ్‌ ఇప్పటికే రైతుల నుంచి కొనుగోలు చేసిన 84వేల టన్నుల కందుల్లో 53 వేల టన్నులను పౌరసరఫరాల విభాగానికి అందిస్తారు. అదనంగా బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పును రూ.63.75 చొప్పున కొనుగోలు చేసి రాయితీపై కార్డుదారులకు పంపిణీ చేస్తారు. వేలిముద్రల పడక రేషన్‌ తీసుకోలేకపోతున్న వృద్ధులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులిస్తామన్నారు. 100 శాతం మంది రేషన్‌ తీసుకెళ్లేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. నిర్దేశించిన రోజుల్లో, సమయాల్లో రేషన్‌ దుకాణాలను తెరవాలని, లేకుంటే రోజుకు రూ.వెయ్యి, రెండో రోజుకు రూ.1500, మూడో రోజూ తెరవకుంటే రూ.రెండు వేలు జరిమానాతోపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

ration 26052018 3

మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు వేరుగా నాణ్యమైన బియ్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే పచ్చశనగపప్పు పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం అయ్యింది. పచ్చశనగపప్పును మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి 42 లక్షల తెల్లకార్డుదారులకు అందిస్తున్నారు. నాణ్యతలో లోపం వస్తే 1100 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జూన్ 1 నుంచి రాష్ట్రంలో ఉన్న 27.666 రేషన్ డిపోల ద్వారా రంజాన్ తోఫా అందజేయనున్నారు. నాణ్యత లోపం లేకుండా ఉండేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసింది. సరుకులు పక్కదారి పట్టినా, నాణ్యత లోపించినా 1100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కార్డుదారుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, సరకుల నాణ్యతాలోపంతో ఎవరూ నష్టపోకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల బాట పట్టిస్తామని, ఇందుకు కావాల్సిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని సంస్థ ఎండీ సురేంద్రబాబు తెలిపారు.  డీజిల్‌ ధరలు పెరగడం వల్ల ఆర్టీసి పై ఆర్థిక భారం పడుతున్నా బస్‌ ఛార్జీలు పెంచబోమని ఆర్టీసి ఎమ్‌డి ఎన్‌వి సురేంద్ర బాబు వెల్లడించారు. ఎమ్‌డిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసి హౌస్‌లో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నష్టాలు వచ్చే బస్సు సర్వీసులున్నా ప్రజలకు సేవలందించా లనే ఉద్దేశంతో లాభాలు ఆశించకుండా సర్వీసులను నడుపుతున్నామన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధుల ద్వారా 850 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించామని, వాటిలో 700 బస్సులను పాత సర్వీసుల స్థానాల్లో భర్తీ చేస్తామని తెలిపారు. సంస్థ ఆస్తులను ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడు తున్నామని, ఇప్పటికే 300 ఎకరాలు గుర్తించా మని వివరించారు. డిమాండ్‌లేని రోజుల్లో తక్కువ ఛార్జీ, డిమాండ్‌ ఉన్న రోజుల్లో ఎక్కువ ఛార్జీతో బస్సులు నడిపేలా ఫ్లెక్సిబుల్‌ ఫేర్‌ విధానంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

surendrababu 26052018 2

సిబ్బంది సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని, సెలవుల విషయంలో సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సిబ్బందికి సెలవులు ఇచ్చినా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా సర్వీసు నుంచి తొలగించిన వారిని, రిటైరై పనిచేసే సామర్థ్యం ఉన్నవారిని, ఆసక్తి ఉన్న ఇతరులను ఆన్‌కాల్‌ పద్ధతిలో తీసుకుని సర్వీసులను నడపాలని నిర్ణయించామన్నారు. రిటైర్‌ అయిన వారికి అదే రోజు బెనిఫిట్స్‌ అన్నీ అందేలా చర్యలు తీసుకున్నామని, జూన్‌ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. 2600 పెన్షన్లు, 4100 మందికి వివిధ బకాయిలు, 1100 మందికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. 70 శాతం మంది సిబ్బందికి ఏదో ఒక ఛార్జ్‌షీట్‌ ఇచ్చారని, అనవసరంగా ఛార్జిషీట్‌ ఇవ్వకుండా అందుకు విధివిధానాలు రూపొందించామని, పాత వాటిని విచారించి అనవసరంగా ఇచ్చిన వాటిని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆపరేషన్‌ సామర్థ్యం పెంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని యోచిస్తున్నామని, బస్‌ షెడ్యూళ్లను పరిశీలించి డిమాండ్‌ను బట్టి సర్వీసులను నిర్ణయిస్తామని తెలిపారు.

surendrababu 26052018 3

ఈ పరిశీలనను మంగళగిరి డిపోలో ప్రయోగాత్మకంగా చేపట్టామని, రెండు నెలల్లో అన్ని డిపోల్లో చేపడతామని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌, మేతో పోలిస్తే ఈ ఏడాది ఆక్యుపెన్సీ రేషియో పెరిగిం దన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తానే నేరుగా మాట్లాడుతున్నానని, ఆలస్యంగా నడుస్తున్న సర్వీసుల గురించి పరిశీలించి ఆపరేషన్స్‌ మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెలావారీ పాస్‌ల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వార్షిక పాస్‌లను ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నామన్నారు. అన్ని బస్సు లనూ ట్రాకింగ్‌ సిస్టంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతేడాది రూ.5500 కోట్లు ఆదాయం వచ్చిందని, అందులో రూ.4500 కోట్లు ట్రాఫిక్‌ ఆదాయం, రూ.400 కోట్లు నాన్‌ ట్రాఫిక్‌, రూ.600 కోట్లు రీప్లేస్‌మెంట్‌ ద్వారా వచ్చిందని, నాన్‌ట్రాఫిక్‌ ఆదాయాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. గతంలో రూ.790 ఉన్న నష్టాన్ని గతేడాది రూ.440 కోట్లకు తగ్గించగలిగామని, పిఆర్‌సి వల్ల ఈ ఏడాది కొంత భారం పడే అవకాశం ఉందని అన్నారు. ఆస్తుల విభజన చివరి దశకు చేరుకుందని, కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. లాస్ట్‌ మైల్‌ కార్గో ఆలోచన ఇప్పట్లో లేదని, ఏఎన్‌ఎల్‌ ఉన్నప్పుడు ఏడాదికి రూ.తొమ్మిది కోట్లు ఆదాయం వచ్చేదని, కార్గో సర్వీస్‌ ద్వారా 43 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. డీజిల్‌ ధరలో పన్ను మినహాయించాలని ప్రభుత్వాన్ని గతేడాదే కోరామన్నారు. తిరుపతిలో ఆర్టీసి రీజినల్‌ ఆస్పత్రి నిర్మించాలనే ఆలోచన ఉందని తెలిపారు.

"ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సన్ రైజ్ స్టేట్ కాదు, సన్ షైన్ స్టేట్... ప్రపంచం భారత వైపు చూస్తుంటే... భారతకు వచ్చిన వారు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడాలి! అపార వనరులు, వ్యాపార నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఉన్న నవ్యాంధ్రకు రండి! పెట్టుబడులు పెట్టండి!"... ఇది వివిధ సందర్భాలో పారిశ్రామిక వర్గాలకు చంద్రబాబు ఇచ్చిన మెసేజ్... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు విశ్లేషించుకుని, ముఖ్యమంత్రి పరిపాలనా దక్షత, మన రాష్ట్ర పాలసీలు నచ్చి, గత ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల పంట పండింది...అయితే ఈ సమ్మిట్ల పై జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లాంటి విపక్ష నేతలు ఎంతో అవహేళనగా మాట్లాడటం చూసాం.. ఇప్పుడు విశాఖ భాగస్వామ్య సదస్సు ఫలితాలు కనిపిస్తున్నాయి.

cii 25052018 2

మొదటిదశలో 18 సంస్థలతో రూ.2955.52 కోట్ల పెట్టుబడులు పెట్టటానికి కంపనీలు రెడీ అయ్యాయి. డీపీఆర్‌ అందించిన వీరికి, సింగలి విండో పోర్టల్ ద్వారా తదుపరి అనుమాతలు ఇస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్య మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో దేశ, విదేశాలకు చెందిన వివిధ పారిశ్రామిక సంస్థలు పలు రంగాల్లో రూ.4.39 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో పరిశ్రామిక రంగంలో చేసిన ఒప్పందాలు సాకారమయ్యేలా గత రెండు నెలలుగా అధికారులు యత్నిస్తున్నారు. 60 పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి మూడు విడతలుగా నిర్వహించిన సమావేశాలకు 40 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

cii 25052018 3

మొదటి విడతగా 18 సంస్థలతో పెట్టుబడులు పెట్టించేలా రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), విద్యుత్తు, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ), కర్మాగారాల, పరిశ్రమలశాఖల నుంచి తదుపరి అనుమతులిచ్చేలా ఉన్నత స్థాయి సమావేశం ఆదేశాలిచ్చింది. మొదటి విడతలో ముందుకొచ్చిన సంస్థల్లో అత్యధికం విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఏపీఐఐసీ తరఫున వీరందరికీ స్థలాల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పెట్టుబడుదారుల్లో కొందరు పారిశ్రామికవాడల్లో భూములు, స్థలాలను పరిశీలించాయి.

నేను ఒక కిడ్నీ వ్యాధి నిపుణుడిని నాకు ఈ రంగంలో 23 యేళ్ల అనుభవం ఉంది. కానీ నాకు అర్ధం కాని విషయం ఏంటంటే నన్ను గెలిపించితే లేదా నా దగ్గర 5గురు లేదా 6గురు ఎమ్మెలేలు ఉంటే నేను ఈ సమస్యని వెంటనే నేను పవర్ లోకి రాగానే పరిష్కరిస్తాను అని పవన్ కల్యాణ్ చెప్పడం . ఈ క్రానిక్ రెనల్ ఫయిల్యూర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి! ప్రపంచం మొత్తం ప్రతీ సంవత్సరం 35 మిలియన్ మందిని చంపుతున్న జబ్బు, ఇది ఒక్క ఉద్దానం లోనే కాదు ఇంకా చాల చోట్ల ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ! ఈ ఉద్దానం కిడ్నీ జబ్బు అనేది ఒక' కారణం తెలియని జబ్బుగా' తేల్చి చెప్పింది,అది కూడా ఊరికే కాదు! ఎన్నో పరిశోధనలు ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఐసీఎమార్, బాబా రీసర్చ్ సెంటర్, హార్వార్డ్ విశ్వవిద్యాలయం లాంటివి చేసిన తర్వాత. ఆలాగే ఈ ఉద్దానం లాంటి స్థలాలు, వీటిని టెక్నిక భాషలో 'పాకెట్లు' అంటారు, ఇవి ప్రపంచం మొత్తం లో అమెరికాలో బ్రెజిల్లో శ్రీలంకలో కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఈ జబ్బు రావడానికి గల ఎలాంటి కారణము ఇపటి వరుకూ కనిపెట్టలేక పోయారు.

pk 25052018 2

ఉద్దానం ఒక్క చోటే కాకుండా ఆంధ్రా మరియూ తెలంగాణాలో ఇంకా ఎన్నో గూడాలూ, తండాలలో ఈ జబ్బు బాగ ప్రబలిన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడున్న ప్రజలు ఇక్కడినించి వేరే చోటకి వెళ్లటానికి ఇష్టపడక పోవడమే దీనికొక పెద్ద కారణమనిపిస్తుంది! 'క్రానిక్ రీనల్ ఫైల్యూర్' అనేది ఒక కాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి రోగిని పీల్చి పిప్పి చేస్తుంది. కానీ దీని గురించి జనాలకి బాగానే తెలుసు, దీన్ని తగ్గించడానికి రక రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి, మందులు, 'హీమోడయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిసి, కిడ్నీ మార్చడం' లాంటివి. ఆది ఉద్దానం కావొచ్చు ప్రపంచంలో ఇంకెక్కడైనా కావొచ్చు కానీ ట్రీట్మెంటు మాత్రం ఇదే. ఈ జబ్బు కూడా కాన్సర్ లాగా ప్రతీ సంవత్సరం చాలా మంది ప్రాణాలు తీసే మహమ్మారి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద శ్రద్ధ వహించి ఇప్పటికే ఈ కిడ్నీ పాడైన పేషెంట్లందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ పధకం కింద ఉచితంగా వైద్యం చెయ్యడమూ, నెలకి 2500 రూపాయల పెన్షను ఇవ్వడమూ చేస్తోంది.దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేసి ఈ మహమ్మారి లాంటి జబ్బు బారిన పడ్డ వాళ్లని ఇంకా క్షోభ పెట్టకండి. ఈ క్రానిక్ రెనల్ ఫయిల్యూర్ కన్నా ఇంకా భయంకరమైన జబ్బు ఒకటి ఉంది దాని పేరు 'ఫ్లోరసిస్',అది ఫ్లొరిన్ ఎక్కువున్న తాగు నీటి వల్ల వస్తుంది, ఈ జబ్బు తెలంగాణాలో ఎక్కువగా ఉంది, ఫ్లొరిన్ తక్కువున్న నీళ్ళు సరఫరా చేస్తే ఈ జబ్బు తగ్గించొచ్చు.

pk 25052018 3

దేశం మొత్తం లో కానీ, మిగతా రాష్ట్రం మొత్తం మీద కానీ మనము కానీ లెక్కలు పోల్చి చూస్తే ఆంధ్రాలో పది యేళ్లల్లో 2500 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక పెద్ద సంఖ్య కానే కాదు ఎందుకంటే ఈ సంఖ్య దేశం మొత్తం లో చూస్తే లక్షల్లో ఉంటుంది. కంట్రొల్ లో లేని షుగర్ లెవెల్స్, అంటే డయబీటిస్, నొప్పులు తగ్గించే మాత్రలని, పెయిన్ కిల్లర్స్, అతిగా వాడడం ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీస్కోవడం లాంటివి ఈ జబ్బు రావడానికి కొన్ని ముఖ్య కారణాలు.అలానే ఈ జబ్బు ఇలానే ట్రీట్ చెయ్యాలీ అనే రకమైన విధానం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, ఇది ప్రతీ పేషెంటుకీ మారుతూ ఉంటుంది. నేను ఈ జబ్బుకి శాశ్వత పరిష్కారం చూపిస్తాను అని ఎవరన్నా చెప్పడం, అది కూడా అసలు వైద్య రంగానికి సంబంధం లేని వ్యక్తి చెప్పడం అనేది ఒక రకమైన ఫూలిష్ నెస్ తప్ప ఇంకొకటి కాదు. ఒకవేళ ఒక కొత్త రీసర్చ్ లేదా పరిశోధన మొదలు అయ్యిందనుకుందాం, కానీ అది కూడా మొదటి ఫలితాలను ప్రకటించడానికి కూడా కొన్ని సంవత్సరాలు తీస్కుంటుంది. ఈ జబ్బు అనేది 2001 నించీ బాగా తెల్సిన జబ్బే అంతే కాకుండా ఈ వుద్దానం కిడ్నీ ఫెయిల్యూర్ మీద చాలా పేపర్లు ప్రచురించారు! చాలా మంది ఈ విషయం మీద పరిశోధనలు చేసే వాళ్లని సంప్రదించడం కూడా జరిగింది. కానీ అసలు ఈ జబ్బు రావడానికి ఒక ప్రత్యేక కారణం అంటూ ఏముందో ఎవరూ కనిపెట్టలేక పోయారు.

Advertisements

Latest Articles

Most Read