గత మూడు రోజుల నుంచి, శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్, అక్కడ ఉన్న కిడ్నీ సమస్యల గురించి ప్రస్తావిస్తూ, అసలు ప్రభుత్వం ఏమి చెయ్యటం లేదని, చంద్రబాబుకు ఇంగితం లేదు అని, మానవత్వం లేదని, ఇలా కొన్ని సినిమా డైలాగులతో, సీన్ పండించారు... శ్రీకాకుళంలో సమస్య ఇప్పటిది కాదు.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత అక్కడ సమస్య గురించి ఎన్నో రీసెర్చ్ లు చేసారు, చేస్తున్నారు.. అలాగే, అక్కడ ఇప్పటికే జబ్బు బారిన పడినవారికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు... ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ హార్వర్డ్ నుంచి కొంత మంది డాక్టర్ లను తీసుకువచ్చి, ప్రభుత్వానికి ఎదో నివేదిక ఇచ్చారు.. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న పరిస్థితుల పై అధ్యయనం చేస్తున్నారు... ఇన్ని జరుగుతున్నా, పవన్ కళ్యాణ్ మాత్రం, ఒక నాలుగు నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు వచ్చి, నాలుగు డైలాగులు కొట్టి, చంద్రబాబుకి ఇంగితం లేదు అనే స్థాయికి మాట్లాడుతున్నాడు...
నిజానికి పవన్ ఆపరేషన్ గరుడలో, బీజేపీ పావు అని, అతనకి అనవసర ప్రాధాన్యత ఇచ్చి, అతను మాట్లాడే మాటలకు రియాక్ట్ అవ్వద్దు అని, జగన్ లాగే, ఇతన్ని కూడా వదిలేయమని టిడిపి నాయకులకు ఆదేశాలు వెళ్ళాయి.. అయితే, పవన్ మరీ దిగాజారి, ఆరోపణలు చెయ్యటం, ప్రజలు నిజం అని నమ్మే అవకాసం ఉండటంతో, లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు... ఇవి లోకేష్ ట్వీట్లు... "పవన్ కళ్యాణ్ గారికి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు... కిడ్నీ సమస్య ఉన్న పలాస,వజ్రపు కొత్తూరు,కవిటి,సోంపేట,కంచిలి,ఇచ్ఛాపురం,మందసా ల్లో సుమారుగా 16 కోట్ల నిధులతో 7 ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసాం... వీటి ద్వారా 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరా జరుగుతుంది..."
"136 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాం.ఇందులో 109 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏర్పాటు పూర్తి అయ్యింది. మరో 27 యూనిట్స్ ఈ నెలాఖరుకి పూర్తి కాబోతున్నాయి... ప్రభుత్వం ఏర్పాటు చేసిన డైయాలిసిస్ సెంటర్లలో డైయాలిసిస్ పొందుతున్న కిడ్నీ వ్యాధి గ్రస్తులకు 2500 రూపాయిల పెన్షన్ అందిస్తున్నాం... 4 నెలల్లో 15 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి,ఇప్పటి వరకూ లక్ష మందికి పైగా స్క్రీనింగ్ జరిగింది.సోంపేట లో ఎన్టీఆర్ వైద్య పరీక్షల్లో భాగంగా నూతన ల్యాబ్ ఏర్పాటు చేసాం... ప్రజలకు అందుబాటు లో ఉండేలా పలాస,సోంపేట,పాలకొండ లో 3 రినల్ డయాలసిస్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసాం ఇప్పటి వరకూ 64,816 సెషన్స్ ఈ సెంటర్లలో జరిగాయి... డయాలసిస్ సెంటర్లకు వచ్చే ఖర్చులు కూడా లేకుండా చంద్రన్న సంచార వాహనాలు ఏర్పాటు చేసి డయాలసిస్ తో పాటు ఇతర సేవలు అందిస్తున్నాం... జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆస్టేలియా ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాల పై పరిశోధన,వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యల పై అధ్యయనం ప్రారంభం అయ్యింది... ఒక నిర్ణయానికి వచ్చే ముందు క్షేత్ర స్థాయిలో ఉన్న నిజాలను బేరీజు వేసుకోవాలి అని పవన్ కల్యాణ్ గారిని కోరుతున్నాను.." అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.. పవన్ కళ్యాణ్, ఇవన్నీ అబద్ధం అయితే, ఎలాగూ శ్రీకాకుళంలోనే ఉన్నాడు కాబట్టి, వీటి పై ప్రజలను అడిగి, నిజమో కాదు తెలుసుకుని, స్పందిస్తే మంచింది...