జగన్ మోహన్ రెడ్డి పరువు చంద్రబాబు కాపాడటం ఏంటి ? ఇద్దరూ ప్రత్యర్ధులు కదా అనుకుంటున్నారా ? కానీ మీరు విన్నది నిజం. నిన్న జగన్ మోహన్ రెడ్డి పరువుని కాపాడింది చంద్రబాబే. నిన్న కేంద్ర జల శక్తి శాఖా మంత్రి షెకావత్ పోలవరం పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గున్నారు. పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధాన సమస్య నిర్వాసితుల సమస్య. అయితే ముందే ట్రైనింగ్ ఇచ్చిన కొంత మందిని తెప్పించుకుని, జగన్ తోపు, జగన్ తురం అని కేంద్ర మంత్రి ముందు డబ్బా కొట్టించుకున్నారు. ఇక్కడ వరకు బాగానే గట్టెక్కారు. అయితే కేంద్ర మంత్రి నిర్వాసితుల కాలనీలు చూసే ప్రోగ్రాం కూడా. అయితే జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది, ఇక్కడ జరగటానికి ? ఇక్కడ కూడా ఏ అభివృద్ధి కూడా జరగలేదు. అందుకే అధికారులకు అద్భుతమైన ఐడియా వచ్చింది. గతంలో చంద్రబాబు హాయంలో దాదాపుగా పూర్తి చేసిన కాలనీలు ఎంపిక చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, దేవీపట్నం నిర్వాసితులకు, తూర్పు గోదావారి జిల్లా ఇందుకూరులో నిర్మించిన నిర్వాసితుల కాలనీకి, కేంద్ర మంత్రిని తీసుకుని వెళ్లారు. జగన్ మోహన్ రెడ్డి ఈ కాలనీలు గురించి కేంద్ర మంత్రికి వివరించారు.
ఎవరైనా ఏమి అనుకుంటారు ? జగన్ మోహన్ రెడ్డే కట్టాడు అనుకుంటారు కదా? ఈ రకంగా చంద్రబాబు చేసిన పనిని తన పనిగా కేంద్ర మంత్రికి చూపించుకున్నారు. జగన్ పరువుని, చంద్రబాబు తన పనితనంతో ఇలా కాపాడాడు. మూడేళ్ళ క్రితమే ఈ కాలనీని చంద్రబాబు హయాంలోనే పూర్తి చేసారు. ఏడాది క్రితం వరదలు వచ్చినప్పుడు, ఈ ఇళ్ళను నిర్వాసితులకు కేటాయించారు. అప్పుడు కూడా లోకేష్ ఇక్కడకు వెళ్లి, తాము కట్టిన కాలనీలకు కనీసం మౌళిక వసతులని ఈ ప్రభుత్వం రెండేళ్ళలో చేయలేక పోయిందని విమర్శలు కూడా చేసారు. ఈ కాలనీకి కొంచెం మెరుగులు అద్ది, నిన్న కేంద్ర మంత్రికి, జగన్ మోహన్ రెడ్డి తన పనిగా చూపించుకున్నారు. విషయం తెలియని కేంద్ర మంత్రి, జగన్ మోహన్ రెడ్డి బాగా కట్టారు అంటూ అభినంధించి, ప్రశంసించారు. టిడిపి హాయంలో 6,551 ఇళ్లు పూర్తి చేసారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క నిర్వాసితుడకి కూడా ఇళ్లు కట్టి ఇవ్వలేదు. ఏదైతేనేం చంద్రబాబు చేసిన పనిని, తన పనిగా చెప్పుకుని, జగన్ పరువు కాపాడుకున్నారు.