కొంత మంది చట్టాలు చేస్తే శాసనం.. కొంత మంది చట్టాలు చేస్తే నాశనం, both are not same. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతునన్ డైలాగ్. నిన్న అమరావతి తీర్పు రాగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డైలాగ్ ఇది. చంద్రబాబు అధికారంలో లేక పోయినా, ఆయన తెచ్చిన చట్టాలు డ్యూటీ చేస్తాయి అంటూ, చెప్పిన డైలాగ్ వైరల్ అయ్యింది. ఇవి పక్కన పెడితే, చంద్రబాబు ఆ నాడు తెచ్చిన సీఆర్డీఏ చట్టం, ఇప్పుడు రైతుల పాలిత రక్షణగా నిలిచింది. ఆ చట్టం ఎంత పక్కాగా చేసారు అంటే, ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీలు లేదు. తమకు అధికారం ఉంది కదా అని ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు చేసి, రైతులను ఇబ్బంది పెడతాయని గ్రహించి చంద్రబాబు ఆనాడే సీఆర్డీఏ చట్టాన్ని పక్కాగా అమలు చేసారు. ఇప్పుడు హైకోర్టు తీర్పులో అదే కీలకం అయ్యింది. అందుకే అందరూ చంద్రబాబు ముందు చూపు, ఆయన విజన్ కు మరోసారి హాట్స్ ఆఫ్ చెప్తున్నారు. నిన్న కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో, కీలకమైన అంశం, సీఆర్డీఏ చట్టం రద్దు చేసే అధికారం మీకు లేదు. మీర్ ఆ చట్ట ప్రకారం అన్నీ చేయాల్సిందే అని అందులో ఉంది. అయితే చాలా మందిని, కొన్ని అనుమానాలు ఉన్నాయి. శాసనసభ చేసే చట్టాలు, కోర్టులు జోక్యం చేసుకోవటం ఏమిటి అనే అనుమానం ఉంది.
దానికి ఇక్కడ కోర్టు సరైన సమాధానం చెప్పింది. ఏపీసీఆర్డీయే చట్టంలో, నాడు చంద్రబాబు పెట్టిన ఈ క్లాజ్ దానికి కారణం. ఏపీసీఆర్డీయే చట్టంలో ప్రభుత్వం కనుక ఆ చట్టం ఉల్లంఘిస్తే, 226 అధికరణ ప్రకారం కోర్టులు జోక్యం చేసుకునే అవకాసం ఉందని ఉంది. సరిగ్గా ఇదే ఇప్పుడు అమరావతి రైతుల పాలిట భ్రమ్మస్త్రం అయ్యింది. ఇదే చూపిస్తూ, తమకు ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఉందని కోర్టు చెప్పింది. అంతే కాదు, ఇదే హక్కు ప్రకారం, ఏపీసీఆర్డీయే చట్టం రద్దు చేసే అవకాసం అసెంబ్లీకి లేదని, అందులో చెప్పిన అంశాలు అన్నీ ప్రభుత్వం పాటించాల్సిందే అని ఉంది. గత ప్రభుత్వం మొదలు పెట్టిన పనులు అన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని కోర్ట్ తేల్చి చెప్పింది. ఏపీసీఆర్డీయే చట్టంకు సంబంధించే, కోర్టు పది అంశాలను తమ తీర్పులో ఇచ్చింది. మొత్తంగా చంద్రబాబు ఆనాడు ముందు చూపుతో, ఇలాంటి పలకులు వస్తారని తెలిసే, ఇలాంటి పటిష్టమైన చట్టం తెచ్చారని, చంద్రబాబు పై ప్రశంసలు వినిపిస్తున్నాయి. చట్టాలు చేయటం అంటే ఇలా ఉండాలని, ప్రతి చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా కోర్టులు కొట్టేసాలా ఉండకూడదనే మాటలు వినిపిస్తున్నాయి.