ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారు ఆంధ్రా జేఏసీ చైర్మన్, న్యాయవాది సుంకర కృష్ణమూర్తి, రవీందర్ రెడ్డి.. అయితే ఈ విషయం పై సుప్రీం కోర్ట్ కొన్ని అభ్యంతరాలు తెలిపింది.. విభజన చట్టంపై ఎందుకు ఇన్ని పిటిషన్లు వస్తున్నాయని ధర్మాసనం అడిగింది... గతంలో దాఖలైన పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్‌కు, తమ పిటిషన్‌కు వ్యత్యాసం ఉందని, ఆంధ్రా సమస్యల పై దాఖలు చేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ , సుప్రీం కోర్ట్ కు తెలిపారు.. అయినా సరే, పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్‌ కేసులోనే ఇంప్లీడ్ కావాలని, సుప్రీం కోర్ట్ సూచించింది.. ఏది చెప్పాలనుకున్నా ఆ కేసులో ఇంప్లీడై చెప్పుకోవచ్చని ధర్మాసనం తెలిపింది...

supreme 14052018 2

ప్రధాన మంత్రి రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా 6 హామీలు, విభజన చట్టాన్ని యధాతథంగా అమలు చేయాలని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో అమరావతి నిర్మాణం చేపట్టాలని, పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ సమగ్రంగా అధ్యయనం చేసి సత్వరం పూర్తిచేయాలని పిటిషన్లో, పిటిషనర్లు విజ్ఞప్తి చేసారు. నాలుగు సంవత్సరాలు అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, చట్టంలో చెప్పిన ఏ విషయం పూర్తి కాలేదని, ఆ పిటీషన్ లో తెలిపారు.

supreme 14052018 3

సుప్రీం కోర్ట్, ఈ పిటీషన్ పై ఎప్పుడు విచారణ చేస్తుందో చూడాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, తెలుగు రాష్ట్రాలకు విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై వారం క్రితం, జస్టిస్‌ సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో వేటిని అమలు చేశారో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వివరాలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. నాలుగు వారాలు సమయం ఇవ్వాలని కోరగా అంగీకరించిన ధర్మాసనం విచారణను అప్పటికి వాయిదా వేసింది.

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై మన్మోహన్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని హుబ్లీ బహిరంగ సభలో కాంగ్రెస్‌ను మోదీ బెదిరించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మన్మోహన్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు రాష్ట్రపతికి మన్మోహన్ ఒక లేఖ రాశారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ లబ్ది కోసం తన శక్తియుక్తులు, అధికారాలను ఉపయోగించుకుంటున్నారని సింగ్ ఆరోపించారు. ప్రధాని మోదీ ఈనెల 6న హుబ్లీలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఘాటు హెచ్చరికలు చేశారు. 'కాంగ్రెస్ నేతలు చెవులు పెద్దవిగా చేసుకుని నా మాటలు వినండి. మీరు హద్దులు దాటితే, నేను మోదీని, మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది' అని మోదీ బెదిరించినట్టు మన్మోహన్ తన లేఖలో పేర్కొన్నారు.

manmohan 14052018 2

మోదీ మాటలు అవమానపరచేలా ఉండటమే కాక, శాంతికి విఘాతం కలిగిస్తూ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. 'అలాంటి బెదిరింపులకు మా పార్టీ కానీ పార్టీ నేతలు కానీ బెదిరిపోరని నేను చెప్పదలచుకున్నాను' అని సింగ్ పేర్కొన్నారు. మోదీ ఉపయోగిస్తున్న బెదిరింపుల భాష, అనుచిత వ్యాఖ్యలను మన్మోహన్ తన లేఖలో ఎండగట్టారు. ఆయన రాసిన లేఖపై పార్లమెంటు ఉభయసభల విపక్ష నేతలు, కాంగ్రెస్ సీనియర్ నేతలైన పి.చిదంబరం, అశోక్ గెహ్లాట్, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, మోతీలాల్ వోరా, కమల్‌నాథ్, అహ్మద్ పటేల్ తదితరులు సంతకాలు చేశారు.

manmohan 14052018 3

ఆయనను కాస్త భాష మార్చుకోమని చెప్పాలని హితబోధ చేశారు. మోడీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. లేఖతో పాటు ప్రచారంలో మోడీ మాట్లాడిన వీడియో లింక్‌ను జత చేసి పంపించారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, దేశంలోకెల్లా అత్యంత ప్రాచీన పార్టీ కాంగ్రెస్ అని, ఇన్నేళ్ల కాలంలో మా పార్టీ చాలా ఒడిదుడుగులు ఎదుర్కొందని, అయినా ఎక్కడా తగ్గలేదన్నారు. పార్టీ ధైర్యంగా ముందుకు సాగిందన్నారు.

మొన్నటి దాక పవన్ ను ఎగతాళి చేసిన జగన్ పార్టీకి, ఇప్పుడు పవన్ ఎంతో ప్రియం అయిపోయాడు... అంతా అమిత్ షా దయ... మరి కొన్ని రోజుల్లో, ఇద్దరూ కలిసి, 2019 ఎన్నికలకు వెళ్తారు అని ప్రచారం జరుగుతున్న టైంలో, వైసిపీ నుంచి పవన్ కు పోజిటివ్ ఫీలర్ వచ్చింది. ఇరు పార్టీల కార్యకర్తలు/ఫాన్స్ ను సమాయత్తం చేస్తూ, ఇక వీరి ప్రయత్నాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే చింతలబస్తీ దేవ్, బీహార్ ప్రశాంత్ కిశోర్ కలిసి పని చేస్తున్నారని, సోషల్ మీడియా ప్రమోషన్ లు, ఇద్దరూ కలిసి చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఈ తరుణంలో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించతలపెట్టిన బస్సు యాత్రపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు.

vijayasayi 14052018 2

సోమవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాసమస్యలపై ఎవరు పోరాడినా సంతోషమేనన్నారు. పవన్ కళ్యాణ్ పాదయత్ర చెయ్యటంతో ఎంతో సంతోషంగా ఉండి అని అన్నారు. అలాగే ప్రజాసమస్యల పై ఎవరు పరిష్కారం చూపినా అభినందించాల్సిందేనని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు పై పోరాడేవారు అందరూ మాకు మిత్రులే అన్నారు. మొత్తానికి, భవిష్యత్తులో జరిగే అపురూప కలియిక గురించి, విజయసాయి రెడ్డి ఒక ఫీలర్ ఇచ్చారు. ఇక పవన్ అభిమానులు రియాలిటీలోకి వస్తే, భవిష్యత్తులో పవన్, జగన్ ను ఒకే వేదిక మీద చూసి షాక్ తినకుండా ఉంటారు.

vijayasayi 14052018 3

ఇన్నాళ్ళు ట్విట్టర్ లో గడిపిన పవన్, కర్ణాటక ఎన్నికలు అవ్వగానే బయటకు వచ్చారు. బస్సు యాత్ర చేస్తాడు అంటూ లీకులు ఇస్తున్నారు. అయితే, దీని పై కూడా సస్పెన్స్. రేపు కర్ణటక ఎన్నికల ఫలితాలు వచ్చే దాక, పవన్ ఏమి బయటకు చెప్పడు. దీని వెనుక కూడా పెద్ద స్టొరీ ఉంది. మొత్తానికి, మొత్తానికి, అమిత్ షా డైరక్షన్ లో, కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే వస్తున్నాడు పవన్... పవన్ వస్తున్నాడు అని తెలిసి, విజయసాయి రెడ్డికి కూడా స్వాగతం పలికారు, అభినందించారు. మన చేతిలో ఏముంది అంతా, గుజరాత్ అంకుల్ దయ... వీరిద్దరూ, ఆయన ఎలా చెప్తే నడవాలి... మనం కూడా పవన్ కు స్వాగతం పలుకుదాం..

పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో ముఖ్య ఘట్టం పూర్తి కావస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు పనులు మొత్తం 53.50% పూర్తికాగా, ఇప్పుడు కీలకమైన డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ నిర్మాణం పనులు తుదిదశకు చేరాయి. వచ్చే నెల 11 నాటికి ఈ రెండింటి నిర్మాణం పూర్తి అవుతున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి 60వ సారి వర్చువల్ రివ్యూ చేశారు. డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పనులు తుది అంఖానికి రావడంపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని నిర్మిస్తున్న కెల్లర్, బావర్-ఎల్ అండ్ టీ సంస్థలు పనులు పూర్తి చేయగానే రిలీవ్‌ అవుతాయని అన్నారు. వచ్చే నెల 11న తాను పోలవరం సందర్శిస్తానని చెప్పారు.

polavaram 14052018 2

పోలవరం ప్రాజెక్టులో భాగమైన పోలవరం కుడి ప్రధాన కాలువ 89.60%, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.60%, స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్ ఎర్త్‌వర్క్ 73.26%, స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 21.83%, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 91%, జెట్ గ్రౌటింగ్ పనులు 70%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 60.28% పనులు ఇప్పటివరకు పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. గ్యాలరీ వాక్ నిర్మాణం కూడా ఆగస్టు కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. గత వారం రోజుల్లో స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 5.59 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 29 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, అలాగే డయాఫ్రమ్ వాల్ 29 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు.

polavaram 14052018 3

పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 817.32 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌, స్పిల్ చానల్‌కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 8.03 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,271.60 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 10,850 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. కాంక్రీట్ పనుల్లో వేగం మందగించడంపై ముఖ్యమంత్రి ప్రశ్నించగా, మిషనరీలో తలెత్తిన సమస్యలతో కాస్త వెనుకబడినట్టు నిర్మాణ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఏ నెలకు సంబంధించిన లక్ష్యాలను అదే నెలలో అధిగమించాలని అధికారులకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలవరం కుడి కాలువ పనులను త్వరగా పూర్తి చేస్తే కృష్ణా డెల్టాకు ముందుగా నీటిని విడుదల చేయొచ్చని సూచించారు.

Advertisements

Latest Articles

Most Read