"మే 15 తరువాత మనకు చుక్కలు చూపిస్తాం అని, ఢిల్లీ బీజేపీ నాయకులు అంటున్నారు, మీరు చుక్కలు చూపిస్తే, మేము ఆ చుక్కలు చూస్తూ కూర్చుంటామా' అంటూ చంద్రబాబు బీజేపీ నేతల పై మాస్ పంచ్ వేసారు.. రాష్ట్ర హక్కుల కోసం తెలుగు జాతి అంతా ఏకమై తిరుగుబాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం గజగజ వణకాలని చంద్రబాబు అన్నారు. ‘‘మేం పోరాడుతోంది తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే భాజపా ఎంపీ కర్ణాటక ఎన్నికల తర్వాత చుక్కలు చూపిస్తామంటున్నారు. మేం ఎవ్వరికీ భయపడే సమస్యే లేదు. ప్రతిపక్ష పార్టీ అవినీతి కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ముందు తాకట్టుపెట్టింది. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని విమర్శించాల్సిన ప్రతిపక్షనేత నాపై విమర్శలు చేస్తున్నారు’’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

cbn 13052018 2

విజయవాడలో రూ.80 కోట్లతో 1.20 ఎకరాల్లో నిర్మించబోయే హజ్‌హౌస్‌ పనులకు సీఎం శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు.. ‘‘ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను ప్రజలంతా అర్థం చేసుకోవాలి. కొంత మంది నాయకులు కేసుల మాఫీ కోసం కేంద్రంతో లాలూచీ పడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు’’ అని వైసీపీపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీ నాయకుడు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు విమర్శించారు. ‘‘ధర్మ పోరాటం నా కోసం కాదు. భావి తరాల కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, ఇందులో మతాలు, కులాలు, ప్రాంతాలు లేవు. వాటన్నింటికి అతీతంగా అందరం కలిసి పిల్లల భవిష్యత్‌ కోసం పోరాటం చేయాలి. ప్రజలకు న్యాయం చేయడానికి నేను అన్నివిధాలా ముందుకు వెళ్తున్నాను’’ అని ప్రకటించారు.

cbn 13052018 3

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని, మోదీని విమర్శించాల్సిన ఆయన (జగన్‌) తనను విమర్శిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో నినదించి, టీడీపీ పోరాటానికి సహకరించాలని చంద్రబాబు కోరారు. కేంద్రంపై తాము చేస్తున్నది తెలుగు వారి ఆత్మగౌరవ పోరాటమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘విభజన సమయంలో అన్యాయం జరిగింది. మళ్లీ అన్యాయం చేయాలని కేంద్రం చూస్తోంది. రాష్ట్రంలో ఎవరికీ ఇబ్బంది కలుగకుండా పాలన చేస్తూనే, కేంద్రంతో రాజీలేని పోరాటం చేసి రాష్ట్ర హక్కులను సాధించుకుంటాం’’ అని ప్రకటించారు. అప్పటికీ స్పందించకపోతే వదిలి పెట్టే పరిస్థితి లేదని హెచ్చరించారు.

ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మల్యే, యలమంచలి రవి, నిన్న రాత్రి బెంజ్ సర్కిల్ వద్ద హంగామా సృష్టించారు... బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనుల్లో భాగంగా, బెంజ్ సర్కిల్ లో ఉన్న సర్కిల్ తో పాటు, అక్కడ ఉన్న జై ఆంధ్రా ఉద్యమ నేత కాకాని వెంకట రత్నం విగ్రహం అక్కడ నుంచి తొలగించటానికి, గత రాత్రి ప్రయత్నాలు జరిగాయి... ఫ్లై ఓవర్ పనుల్లో భాగంగా, ఇది తొలగిస్తారని, ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన విషయమే... అయితే, ప్రతిది రాజకీయం చేసే వైసిపీ నేతలు, దీన్ని కూడా అడ్డుకున్నారు... అక్కడ నుంచి విగ్రహం తియ్యకూడదు అంటూ యలమంచలి రవి హంగామా చేసారు... అది తియ్యకుంటే, ఫ్లై ఓవర్ ఎలా కడతారు అని, ప్లాన్ ముందే ఇచ్చాం కదా అని అధికారులు, పోలీసులు ఎంత చెప్పినా రవి వినిపించుకోలేదు...

benz 13052018 2

ఇక్కడ నుంచి విగ్రహం తియ్యకూడదు అని, తియ్యకుండా ఫ్లై ఓవర్ కట్టుకోవాలని చెప్పటంతో, అధికారులు అవాక్కయ్యారు... ఎంత నచ్చ చెప్పినా, వినక పోవటంతో, చివరకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... తరువాత అక్కడ నుంచి కాకాని విగ్రహం బధ్రంగా తొలగించి, బధ్రపరిచారు... స్థానిక ఎమ్మల్యే గద్దే మాట్లాడుతూ, ఫ్లై ఓవర్ నిర్మాణానికి, అడ్డు కాబట్టే తోలిగించామని, ఫ్లై ఓవర్ పూర్తయిన తరువాత, అక్కడే మళ్ళీ విగ్రహం పెడతామని చెప్పారు... కాకాని అంటే విజయవాడలో అందరికీ గౌరవమే అని, వైసిపీ నేతలకే కాదని అన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే సమయంలో, పొరపాటున ఏదన్న మెటీరియల్ వచ్చి విగ్రహం మీద పడి ధ్వంసం అయితే, ఇదే వైసిపీ వచ్చి, విగ్రహం ఎందుకు తియ్యలేదు అని అంటారని, గద్దే అన్నారు... ఏ పని చేసినా విమర్శించటం, అడ్డు పడటం ఏంటి అని అన్నారు... పనులు జరుగున్నాయని తీసామని, మళ్ళీ అక్కడే విగ్రహం పెడతాం అని చెప్పినా, వినకుండా, మొండిగా ఉంటే ఎలా అని అన్నారు.

benz 13052018 3

కాకాని విగ్రహం, ఫ్లై ఓవర్ నిర్మాణానికి తొలగిస్తూంటే, మాకు ఎందుకు సమాచారం చెప్పలేదని వైసిపీ చెప్పటం విడ్డురంగా ఉంది... రోడ్డు వెడల్పు లేక, బెంజ్ సర్కిల్ లాంటి చోట ట్రాఫిక్ కష్టాలు తప్పించటానికి ఫ్లై ఓవర్ నిర్మిస్తుంటే, దానికి కాకాని విగ్రహం, ఎక్కడా ఇబ్బంది లేకుండా, జాగ్రత్తగా తొలగించి, భద్రపరిస్తే, దానికి కూడా రాజాకీయం చెయ్యటం వైసిపీ కే చెల్లింది... కాకాని విగ్రహమే కాదు, పటమటలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం కూడా తొలగించి, రోడ్డు పక్కన పెడతారని ఇప్పటికే టిడిపి పార్టీకి అధికారులు సమాచారం ఇచ్చారు... బందర్ రోడ్డు విస్తరణ, పటమట దగ్గరకి వచ్చినప్పుడు, ఎన్టీఆర్ విగ్రహం కూడా తీసి పక్కన పెడతారు... ప్రజల ప్రణాల కంటే, విగ్రహాలు ముఖ్యం కాదు.. వారి స్పూర్తి మనం తీసుకోవాలి కాని, భవిష్యత్తు తరాలకు చెప్పాలి, విగ్రాహాలు ఉండాలి, కాని రోడ్డుకి అడ్డంగా కాదు... రోడ్డు ఇరుకు అయినప్పుడు, విగ్రహాలు సరైన రీతిలో తొలగించి, వాటిని బధ్రపరిచి, వేరే చోట, ప్రజలకు ఇబ్బంది లేని చోట ప్రతిష్టించటంలో తప్పేమీ లేదు... ప్రజల ప్రాణాల కంటే, ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎక్కువ అయ్యాయి...

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఏపీ ప్ర‌జ‌లు చాలా కోపంగా ఉన్నారని నిర్మాత యలమంచిలి రవిచంద్ తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు పోరాటం చేస్తుంటే సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని అన్నారు. అదే తెలంగాణ రాష్ట్రం అడిగినా… అడగకపోయినా సినీ పరిశ్రమ వెంటనే స్పందిస్తుందని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు టికెట్స్ రూపంలో సంవత్సరానికి రూ. 1000 కోట్లు ఇస్తున్నారని, అటువంటి ఆంద్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న ఉద్యమంపై ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని రవిచంద్‌ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు రావాలని డిమాండ్ చేస్తూ విజయవాడ పున్నమి ఘాట్ లో సినీ నిర్మాత రవిచంద్ జలదీక్ష చేసారు.

cinema 1052018 3

ప్రజలకు అన్యాయం జరిగినా పెద్ద హీరోలు , నిర్మాతలు, దర్శకులు స్పందించరా అని అయన ప్రశ్నించారు. వారికి సమస్యలు వస్తే వెంటనే సమావేశాలు పెట్టుకునే వాళ్లు .. ప్రజల కోసం ఎందుకు బయటకు రారు. ఆదివారం ఒక వేదిక ఏర్పాటు చేసుకుని హోదా కోసం ఉద్యమించాలని అయన అన్నారు. తమిళ హీరోలను చూసి అయినా తెలుగు హీరోలు బుద్ది తెచ్చుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమ ఉద్యమించేంత వరకు వివిధ రూపాలలో నా ఆందోళన కొనసాగిస్తానని అన్నారు. జల్లికట్టు, రైతుల సమస్యల గురించి తమిళ సినీ పరిశ్రమ ఏ విధంగా పోరాడిందో అందరికీ తెలుసని, ఆ మాదిరిగా మన హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎందుకు స్పందించరు? అని ప్రశ్నించారు.

cinema 1052018 4

ఈ విషయమై స్పందించమని కోరుతూ ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మా అసోసియేషన్ కు తాను ఇప్పటికే లేఖలు రాశానని, ఈ లేఖలను చూసి అక్కడి పెద్దలు నవ్వుకున్నారని తనకు సమాచారం ఉందని చెప్పారు. ఈ విషయం తెలిసి తనకు చాలా బాధ కలిగిందని, సినీ పరిశ్రమ పెద్దలు దిగొచ్చే వరకూ ఈ పోరాటం చేయాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు. ‘హోదా’ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు హీరో లెవ్వరూ ఆందోళనలకు దిగాల్సిన అవసరం లేదని, ప్రతి నెలా రెండో ఆదివారం దీక్ష చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆరు నెలల పాటు పోరాటం చేద్దామని, అలా చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే.. స్ట్రయిక్ చేద్దామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, హామీల అమలు విషయమై తెలంగాణ ప్రభుత్వమే సపోర్టు చేసిందని, పక్క రాష్ట్రాల్లో హీరోలకు ఉన్న బుద్ధిజ్ఞానం కూడా మీకు లేదా? అంటూ రవిచంద్ మండిపడ్డారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని కోరుతూ గురువానంద గురూజీ ఆశీర్వాదాన్ని అమిత్ షా పొందినట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న తిరుమలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమాన్ని అమిత్ షా తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించారు. రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమంలో శుక్రవారం కుటుంబసభ్యులతో కలసి 40 నిమిషాల పాటు ఏకాంతంగా గడిపారు. మొదట ఆయన ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి అమిత్‌షా హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి నేరుగా పీఠాధిపతి గురువానంద గురూజీ కుటీరానికి అమిత్‌షా కొడుకు, కోడలుతో కలసి వెళ్లారు.

asramam 12052018 2

కుటీరంలోకి అమిత్‌షా కుటుంబ సభ్యులు తప్ప ఆయనతో వచ్చిన ఎవరినీ అనుమతించలేదు. అమిత్‌షా చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ను సైతం కుటీర ప్రధాన ద్వారం వద్ద పోలీసులు ఆపేశారు. గురూజీతో అమిత్‌షా దాదాపు 40 నిమిషాలు గడిపారు. అమిత్‌షా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం గురూజీ వద్ద ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినట్టు ఆశ్రమ వర్గాలు తెలిపాయి. గురూజీ వద్దకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మంత్రులు, నాయకులు నాలుగేళ్లుగా వస్తున్నారు.

asramam 12052018 3

రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమానికి అమిత్‌షా రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశ్రమం వద్ద నాయకుల కంటే పోలీసుల హడావుడే ఎక్కువగా కనిపించింది. అమిత్‌షా లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన సమయంలో ప్రత్యేకదళం అమిత్‌షా చుట్టూ నిలిచి ఎవ్వరినీ ఆయన దగ్గరకు వెళ్ళనివ్వలేదు. ఆశ్రమం లోపల అమిత్‌షా ఉన్నంత సేపు ప్రధాన ద్వారం వద్ద కాపలాగా ఉన్న పోలీసులు బీజేపీ నేతలను కూడా లోనికి వెళ్లనివ్వలేదు. డీఎస్పీలు నంజుండప్ప, ఆంటోని, నలుగురు సీఐలు, 5 మంది ఎస్‌ఐలు, పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read