రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మరో వినూత్న పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు గ్రిడ్‌ అనుసంధానిత సౌర పంపుసెట్లు అందించడంతోపాటు ఆదాయాన్ని సమకూర్చే సౌర సిరి పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమయ్యింది. ఈ సౌర పంపుసెట్లతో రైతులు పంటల సాగుకు ఉచితంగా విద్యుత్‌ను వాడుకోవచ్చు. అంతేగాకుండా మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఏడాదికి 5 నుంచి 10 వేల రూపాయలు సమకూర్చుకోవచ్చు. రైతులు ఏడాదిలో 200 రోజులు సౌర పంపుసెట్లను వినియోగించుకున్నా... మిగిలిన 165 రోజులూ గ్రిడ్‌కు విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. ఈ పథకాన్ని తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

cbn farmers 14052018 2

ఒక్కో పంపుసెట్‌కు రూ.3.5 లక్షల చొప్పున రూ.2625 కోట్లతో 75 వేల సౌర పంపుసెట్లను అందజేయాలని భావిస్తోంది. ప్రపంచబ్యాంకు, పీఎఫ్సీ, ఐఆర్‌ఈడీఏ, నాబార్డు వంటి సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టులో డిస్కంలు ప్రాథమికంగా పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ పథకం అమలుపై రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా సౌర పంపుసెట్లు, ఇంధన సామర్థ్య పంపుసెట్లు అందుకున్న 25 వేల మంది రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు . ఈ పంపుసెట్లు ఇంధన వినియోగాన్ని 30 శాతం తగ్గించడంతోపాటు 15 శాతం ఎక్కువగా నీటిని తోడుతాయని తెలిపారు. తద్వారా 45 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అవడంతో ఏటా రూ.20 కోట్ల మేరకు లబ్ధి కలుగుతుందని అంచనా వేశారు.

cbn farmers 14052018 3

కొత్త పథకం వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం వస్తుంది . . కరువు పరిస్థితుల్లో సౌర విద్యుత్‌ను పూర్తిగా విద్యుత్‌ సంస్థలకు విక్రయించడం ద్వారా రైతులకు ఏడాదికి 12 నుంచి 15 వేల రూపాయల ఆదాయం సమకూరేలా !! దీనివల్ల విద్యుత్‌ సంస్థలకు పంపిణీ, సరఫరా నష్టాలు తగ్గి రూ.300 కోట్లు ఆదా అవుతుంది !! రాష్ట్రంలో ఇప్పటికే 9.62 లక్షల హెచ్‌వీడీఎస్‌ పంపు సెట్లను రైతులకు సమకూర్చారు , ఫలితంగా మోటార్లు కాలిపోవడం, పంపిణీ నష్టాలు కూడా తగ్గాయి . ఉచిత విద్యుత్‌ రూపంలో ప్రభుత్వం ఏటా ఒక్కో రైతుపై రూ.30 వేలు వెచ్చిస్తోంది . ఈ నేపథ్యంలో పంపుల తయారీదారులు, డిస్కంలు, బీమా కంపెనీలు, సౌర పంపుసెట్ల డెవలపర్లు తదితర అన్ని వర్గాల ప్రతినిధులతో ఈ నెల 22న సమావేశంఅవుతారు!!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, నిన్న ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన జగన్ కేసుల పై స్పందించారు. ఈ సందర్భంలో, ప్రస్తుతం జగన్ కేసులు నడుస్తున్న తీరు గురించి స్పందించమని అడగ్గా, తనకు జగన్ కేసులను విచారించిన అధికారిగా పేరు వచ్చినప్పటికీ, తాను ఆ ఇమేజ్ ని కోరుకోవడం లేదని చెప్పారు. నాడు తనకు అప్పగించిన డ్యూటీని తాను చేశానని, ఆనాడు తన పై ఏ విధమైన రాజకీయ ఒత్తిడులూ లేవని స్పష్టం చేశారు. ఆ కేసును తనకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, హైకోర్టు బెంచ్ నిర్ణయించి విచారించాలని అప్పగించిందని, ఎవరూ డైరెక్టుగా ఇచ్చిన కంప్లయింట్ కాదని గుర్తు చేశారు. కేసులో అందుబాటులోని సాక్ష్యాధారాల ప్రకారం తాను డ్యూటీ చేశానని, తాను ఎంతో మంది అధికారులను పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టానని, క్షేత్రస్థాయిలో ఎంతోమంది అధికారులు జగన్ కేసులపై దర్యాఫ్తు చేశారని లక్ష్మీనారాయణ వెల్లడించారు.

lakshminarayana 14052018 2

తాను ఆ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత, ఎంతో మంది అధికారులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారని, దీంతో జగన్ కేసు బలహీనపడి, వీగిపోతుందని పలువురు భావిస్తున్నారన్న వార్తల పై స్పందిస్తూ, ఆ విషయంలో తానేమీ వ్యాఖ్యానించలేనని, ఇప్పుడున్న అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే అనుకుంటున్నానని తెలిపారు. తాను సీబీఐ నుంచి తప్పుకున్న తర్వాతి పరిణామాల గురించి తనకు తెలియదన్నారు. అధికారులు ఒక్కొక్కరు బయటకు వస్తుండడాన్ని తాను పేపర్లలోనే చదువుతున్నానని… తాను పనిచేసినంత కాలం ఏ ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి రాలేదని స్పష్టం చేశారు.

lakshminarayana 14052018 3

తాను 2013లో సీబీఐ విధుల నుంచి బదిలీ అయిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ పై సీబీఐ కేసుల విషయాన్ని ఇప్పుడున్న సిబిఐ అధికారులని అడిగితే, తెలుస్తుందని చెప్పారు... లక్ష్మీనారాయణ, ఎంతో పర్ఫెక్ట్ గా, జగన్ పై 11 చార్జ్ షీట్లు పెట్టి, 16 నెలలు జైలులో ఉంచిన సంగతి తెలిసిందే... అయితే, ఇప్పుడు జగన్ కేసులలో వేగం తగ్గింది అనే, ఆరోపణలు వస్తున్నాయి... అందుకు తగ్గటే, పరిణామాలు కూడా జరుగుతున్నాయి.. ప్రస్తుతం లక్ష్మీనారాయణ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల పై అధ్యయనం చేస్తున్నారు.. తాను ఏ పార్టీలో చేరను అంటూనే, సమయం వచ్చినప్పుడు ప్రజలకు చెప్పే చేరతాను అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో సోము వీర్రాజు అలక పాన్పు ఎక్కారు. దీంతో ఇవాళ ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా, ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నం చేసినా, వీర్రాజు అందుబాటులో లేడనే సమాచారం వచ్చింది. మరోవైపు సాయంకాలం వరకూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సోమువీర్రాజు వర్గం రాత్రి 8 గంటల సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేసింది. సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేసి వాటిని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు, ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌కు పంపినట్టు తెలిపారు.

somu 14052018

అయితే మొదట నుంచీ పార్టీలో ఉన్న తనను కాదని రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నాకు పదవి ఇవ్వడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వర్గీయుల సమాచారం. అవసరం అయితే కొత్త పార్టీ కూడా పెడతానని వీర్రాజు అంటున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా, మొదటి నుంచి చంద్రబాబుని అమ్మనా బూతులు తిడుతూ వచ్చానని, అనవసరంగా అటు చంద్రబాబుకి చెడు అయ్యాను, ఇటు బీజేపీకి అక్కరలేకుండా పోయాను అని వీర్రాజు బాధ పడుతున్నారని ఆయాన అనుచరులు అంటున్నారు. నేను కన్నా లక్ష్మీనారాయణ పాటి చేయ్యానా అంటూ బాధ పడుతున్నారు అంట..

somu 14052018

మరో వైపు శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించకపోతే తాము బీజేపీకి రాజీనామా చేస్తామని తూర్పు, గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు ప్రకటించారు. ఇప్పటికే రాజమండ్రి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు రాజీనామా చేయగా ఆయన బాటలో బీజేపీ రాజమండ్రి అర్భన్ కార్యవర్గం ఉన్నట్లు సమాచారం. అలాగే ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పలువురు బీజేపీ నేతలు కూడా సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించకపోతే రాజీనామా చేస్తామని ప్రకటించారు. అయితే, ఈ విషయం పై ఢిల్లీ పెద్దలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది. మన పార్టీకి ఏపిలో ఉన్నదే, ఒక 10 మంది నాయకులు, వాళ్ళు కూడా రాజీనామా చేసి పొతే, చంద్రబాబుకి చుక్కలు ఎలా చూపించాలి అని ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. మరి వీర్రాజు లైన్ లోకి రాగానే, అమిత్ షా ఎలా సముదాయిస్తారో చూడాలి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ భేటీ కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సెక్రటేరియట్‌లో వీరిద్దరూ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి వీరిద్దరూ భేటీ అవుతున్నారని అధికారిక వర్గాలు అంటున్నా, రాజకీయ పరిణామాల గురించి వస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. రేపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం నుంచి వైదొలగిన తరవాత మోడీ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపు ఇచ్చారు కూడా.

cbn anbil 14052018 2

కొన్ని రోజుల క్రితం అనిల్‌ అంబానీ అన్న ముకేష్‌ అంబానీ భేటీ తరవాతే చంద్రబాబు వైఖరిలో పూర్తి మార్పు వచ్చినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. బాబు, ముకేష్ భేటీ తరవాతే మోడీ పై బాబు దాడి తీవ్రం చేశారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్తల్లో అనిల్‌ అంబానీ ఒకరు. రాఫెల్‌ డీల్‌ విషయంలో మోడీ-అనిల్ బంధం పై కాంగ్రెస్‌ ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పక్షంలో మోడీ వ్యతిరేక వర్గం మరింత బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు వైపు కాంగ్రెస్, బీజేపీ యేతర పక్షాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు-అనిల్‌ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ తరఫున అనిల్‌ అంబానీ రాయబారం నెరుపుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

cbn anbil 14052018 3

అయితే అధికారికి వర్గాలు చెప్తున్న విషయం ఏంటి అంటే, అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) గ్రూప్ నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను చేపట్టారు. అయితే, ఈ ప్రాజెక్టుల్లో పురోగతి కనిపించడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సదరు భూమిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ, చంద్రబాబుతో భేటీ అవుతున్నారని, ఇందుకోసం అపాయింట్ మెంట్ ఫిక్స్ కాగా, తమ సంస్థ పెట్టుబడులపై ఆయన వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అనేక కేంద్ర సంస్థలకు, పనులు చేపట్టటంలో ఆలస్యం చేస్తున్న అనేక మందికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే...

Advertisements

Latest Articles

Most Read