తిరుపతిలోని అలిపిరి వద్ద బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ వస్తున్న సమయంలో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తిరుపతి ప్రజలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.. అయితే, ఆ సమయంలో బీజేపీ నేతలు దాడి చెయ్యటంతో, తెలుగుదేశం శ్రేణులు కూడా ఎదురుతిరిగి, వారి పై దాడి చేసిన వారి, కారు అద్దాలు పగలగొట్టిన విషయం తెలిసిందే... దీని పై, అమిత్ షా కార్ పై దాడి జరిగింది అంటూ, వీర్రాజు, విశాఖ రాజు, తెగ బాధపడుతూ, ఎదో జరిగిపోయింది అంటూ, పెర్ఫార్మన్స్ ఇరగదీస్తున్నారు.. అయితే, ఆ బీజేపీ వారికి మించిన పెర్ఫార్మన్స్, ఈ రోజు జగన్ ఇచ్చారు... ఆయన బాస్ అమిత్ షా పై, నిరసన తట్టుకోలేని జగన్, తన బాస్ పై దాడి జరిగింది అంటూ, దారుణం అంటూ, కైకలూరులో స్పందించారు...
ఇప్పటి వరకు అమిత్ షా పేరు కూడా తలవని జగన్, మొదటి సారి అమిత్ షా పేరు తలవటంతో అందరూ ఆశ్చర్యపోయారు... విభజన హామీల అమలు కోసం, ఒక్కసారి కూడా, అమిత్ షా ని కాని, మోడీ ని కాని ఇప్పటి వరకు జగన్ తలవని విషయం తెలిసిందే.. అయితే, అమిత్ షా పై, తెలుగుదేశం నిరసన విషయంలో మాత్రం, ఖండఖండాలుగా ఖండించారు జగన్.. రుమలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై సీఎం చంద్రబాబే దాడి చేయించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. ఆ పని తానే చేశానని చంద్రబాబు ధైర్యంగా చెప్పలేకపోయారని, అమిత్ షాపై దాడిని ఖండించి తూచ్ అనిపించారని అన్నారు.
ఈ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా కైకలూరు గాంధీబొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ మాట్లాడుతూ... అమిత్ షా వాహన శ్రేణిపై రాళ్లు వేయడం తనకు ఆశ్చర్యమేసిందన్నారు. రాక్షసుడు మనిషిగా పుడితే ఎలా ఉంటాడో చంద్రబాబే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. తాను ఎంతో శాంతి స్వరూపుడుని అని, ఇలాంటి దాడులు, ఎప్పుడూ చూడలేదని, దారుణం అంటూ, బాధపడ్డాడు జగన్... ఎన్నికలకు ఏడాది ముందు డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు... చంద్రబాబు అంతా పథకం ప్రకారమే చేశారని, పైగా ఆ దాడిని ఖండిస్తున్నట్లు మాట్లాడుతున్నారని జగన్ ఆరోపించారు... మొత్తానికి జగన్ బాధపడటం చూస్తుంటే, బీజేపీ వారి కంటే, అమిత్ షా పై నిరసన కార్యక్రమం జగన్ ని, ఎక్కువ బాధ కలిగించినట్టు ఉంది.. పాపం...