వీరంతా ముసలి వాళ్ళు... ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో బ్రతికే వారు.. అయతే ఏంటి, వారికి ఎంతో పెద్ద మనుసు ఉంది... రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంతో ఔదార్యంతో, పెద్దమనసుతో రూ.40 వేల విరాళంగా అందజేసారు. వీరంతా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం వాసులు. వీరంతా రైతు కూలీలు. ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లలోని సొమ్మును సేకరించి ముఖ్యమంత్రికి అందచేసారు. తమ పెన్షన్లు రూ. 40 వేలు విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసి, రాష్ట్ర భవిష్యత్తుకు వారి సహాయం కూడా అందించారు. నలభై మంది తరపున పెన్షన్ డబ్బు రూ.40 వేలను ముఖ్యమంత్రికి అందజేసిన వారిలో కఠారి ఆదెమ్మ, చాగంటి బాలమ్మ, సి. ప్రసాద్, నడింపాలెం గ్రామపెద్దలు ఎలిపిల్లి వెంకట సుబ్బారావు, నేలపాటి జయరాజ్, ఉప సర్పంచ్, జాగర్లమూడి వెంకటేశ్వరరావు, ఐటీ నిపుణులు బిక్షాల రావు ఆధ్వర్యంలో వచ్చి సీఎంను కలిసారు.
కఠారి ఆదెమ్మ మాట్లాడుతూ, "మీరు నా పెద్ద కొడుకుగా ఆదుకొంటానన్నారు. ఆదుకున్నారు. సంతోషంగా ఉంది. మీరు రాజధాని నిర్మించాలి. రాజధాని చూసి తనువు చాలిస్తానయ్యా." అంటూ ఆమె చంద్రబాబు వద్ద భావోద్వేగానికి గురైయ్యారు... చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని రైతుకూలీలు ప్రశంసించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, నేను రాజధానిని తప్పక నిర్మిస్తాను, మీరు చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చిన స్ఫూర్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తనకున్నంతలో ఎదుటివారికి సహాయపడాలి అనే తెలుగువారి సేవా గుణానికి ఇదొక నిదర్శనమని ముఖ్యమంత్రి కొనియాడారు.
మరో పక్క, ఇలాంటి వారిని చుసైనా, పవన్, జగన్, మనసు మార్చుకోవాలని, నిత్యం అమరావతి పై చేసే కుట్రలు ఇలాంటి వారిని చూసైనా ఆపాలి.. జగన్, విజయవాడ పాదయత్రకు వచ్చి, భ్రమరావతి అంటూ యెగతాళి చేసాడు.. మంగళగిరిలో పాదయాత్ర చేసినా, కూత వేటు దూరంలో ఉన్న అమరావతికి రావటానికి మాత్రం ఇష్టపడలేదు... ఇక జగన్ మీడియా, పార్టీ, అమరావతి పై చిమ్మే విషం గురించి చెప్పే పని లేదు... ఇక పవన్ విషయానికి వస్తే, ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారితో కలిసి, ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తాకాలు వదులుతాడు.. అమరావతికి అన్ని ఎకరాలు ఎందుకు అంటాడు... వీరందరూ కలిసి, అదే స్టేజి పై, అమరావతి రైతుల త్యాగాలను కూడా అవహేళన చేస్తారు... కానీసం ఇలాంటి వారిని చూసైనా, బుద్ధి తెచ్చుకుని, రాజధానికి అడ్డు రాకుండా, సహకరిస్తారని ఆశిద్దాం..