దుట్టా రామచంద్రరావు, గన్నవరం నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు... పోయిన ఎన్నికల్లో వల్లభనేని వంశీతో పోరాడారు... ప్రస్తుతం, వైకాపా రాష్ట్ర రాజకీయ సలహాదారుగా ఉన్నారు... సహజంగా, ఈయన వివాదాల జోలికి వెళ్లరు... ఆయన పని ఆయన చేసుకుంటూ, పార్టీ ఆదేశాలు ప్రకారమే నడుచుకుంటే ఉండేవారు... అయితే, అలాంటి నేత, నిన్న జగన్ చేసిన ప్రకటన పై తిరగబడ్డారు... ఇది పధ్ధతి కాదు అంటూ, హెచ్చరించారు.. సీనియర్లను సంప్రదించకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తే ఎలా అనే ధోరణిలో, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై విరుచుకు పడ్డారు.. నిర్ణయం వెనక్కు తీసుకోపోతే, తాము పార్టీకి రాజీనామా చేసి ఉద్యమబాట పడతామని రామచంద్రరావు హెచ్చరించారు.
ఇంతకీ విషయం ఏంటి అంటే, నిన్న జగన్ మోహన్ రెడ్డి, నిమ్మకూరులో పర్యటించారు... అది స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం.. అయితే, ఒక సామాజిక వర్గాన్ని మంచి చేసుకోవటానికి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాను అంటూ, ఎన్టీఆర్ పై ఎక్కడ లేని ప్రేమ చూపించారు... ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు అని, ఆయన సేవలకు గుర్తింపుగా, కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మారుస్తా అంటూ ఒక తలతిక్క ప్రకటన చేసారు... అయితే, ఈ ప్రకటన పై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి... మీ నాన్న, ఎన్టీఆర్ పేరును కనీసం ఒక ఎయిర్ పోర్ట్ కు పెట్టలేదు, నువ్వు వచ్చి ఒక జిల్లాకు పెడతావా ? ఆ మహానుభావుడుని, ఒక జిల్లాకు పరిమితం చేస్తావా అంటూ విమర్శలు వచ్చయి...
అయితే, ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఎదురుతిరుగుతున్నారు.. పైగా, ఎప్పుడూ కూల్ గా ఉండే, దుట్టా రామచంద్రరావు లాంటి వారు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.. ఎంతోమందికి జీవనాధారమైన కృష్ణా నది పేర ఏర్పడిన జిల్లా పేరు మార్చితే సహించేది లేదని రామచంద్రరావు అన్నారు. కృష్ణమ్మ ఎన్నో రాష్ట్రాలు దాటుకుని ఏపీలో ప్రవహిస్తోందని... కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తోందని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ కూడా కృష్ణా పేరుతో జిల్లా లేదని... మన రాష్ట్రంలో మాత్రమే ఉందని, అలాంటి మహా తల్లి పేరును మారిస్తే సహించబోమని హెచ్చరించారు. ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉన్నప్పుడు విగ్రహాలు పెట్టుకోవాలని, స్మారక భవనాలు కట్టుకోవాలని... జిల్లా పేరును మార్చడానికి మాత్రం ఒప్పుకోబోమని తెలిపారు. పేరు మార్పు హామీని జగన్ ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. ఒకవేళ జగన్ తన నిర్ణయం మార్చుకోకపోతే తాము పార్టీకి రాజీనామా చేసి ఉద్యమబాట పడతామని రామచంద్రరావు హెచ్చరించారు.