రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుపతిలో అతి పెద్ద బహిరంగ సభ వేదిక పై నుంచి, ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మోసం గురించి, ఎండగట్టనున్నారు.. ఈ నేపధ్యంలో, రేపటి సభ కంటే ముందుగానే, బీజేపీ నేతలకు షాక్ తగిలింది... గత సాధారణ ఎన్నికల్లో తిరుపతి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన కారుమంచి జయరామ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు... రాజీనామా లేఖను నిన్న సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫ్యాక్స్‌లో పంపారు... రేపు తిరుపతిలో జరిగే ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకొన్నారు...

ఆయన గత వారం రోజులుగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అనుచరులు, స్నేహితుల అభిప్రాయాలను సేకరించారు. 2014లో పోలీస్‌ ఆఫీసర్‌ పదవికి రాజీనామా చేసి తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గ సమస్యలను రాష్ట్ర, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన అన్నారు..

బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు మూడు గ్రూపులు, ఆరు ముఠాలుగా కొనసాగుతున్నాయన్నారు. ‘నరేంద్ర మోదీ తిరుపతి బహిరంగ సభలో ఏడుకొండలుపైన, తిరునామం వైపు వేలెత్తిచూపుతూ ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. నేను దీనికి ప్రత్యక్ష సాక్షిని’’ అన్నారు. రాష్ట్ర ప్రగతి చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. రాష్ట్రాభివృద్ధిపట్ల నిరంతరం తపనపడే వ్యక్తి సారథ్యంలోని టీడీపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు జయరామ్‌ చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థుతుల్లో ఏపిలో బీజేపీకి ఉన్న పరిస్థితి, మరీ ముఖ్యంగా కొందరు నాయకుల తీరుపై భగ్గుమంటూ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కు ఘాటు లేఖ రసారు.. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడుగా హరిబాబు రాజీనామా చేసిన తరువాత, కొత్త అధ్యక్షుడి ఎన్నిక విషయంలో, తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని, కొత్త అధ్యక్షుడికి ఎన్నికకు ముందు తమతో మాట్లాడాలని సూచించారు... రాష్ట్రంలో కొంత మంది బీజేపీ నేతల తీరు పై కూడా, ఆ లేఖలో విరుచుకుపడ్డారు.. సొంత ప్రాంతంలో కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవలేని కొందరు నాయకులు ప్రజల ముందు, మీడియా ముందు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు నేతలు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా, సోము వీర్రాజు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా అర్ధమవుతుంది.

అంతే కాదు, ఇంకా కొంత మంది బీజేపీ నాయకులు అవినీతికి మారుపేరుగా మారారన్నారు. 2014 ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన, సీనియర్‌ నాయకులను తీవ్రంగా అవమానిస్తున్నారు... దీనివల్ల వారు బీజేపీని వీడి మరో పార్టీలో చేరక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నారు... ఒక అసమర్థ నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో తప్పటడుగులు వేస్తే సీనియర్‌ నేతలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు... ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు కూడా పార్టీని వీడిపోయే ప్రమాదం ఉంది'' అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలిసింది.

మరో పక్క రాష్ట్రంలో బీజేపీ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని, పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని రాష్ట్ర బీజేపీ నేతలు అమిత్ షా ను కోరడం ఆసక్తికరంగా మారింది... రాష్ట్రంలో పరిస్థితులను అధిష్ఠానానికి వివరించేందుకు కొన్ని రోజులుగా పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నా వీలు పడటం లేదు.. రాష్ట్ర పార్టీ నాయకులతో, ప్రజా ప్రజా ప్రతినిధులతో చర్చించకుండా... వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడమేమిటన్నది వీరి ప్రధాన అభ్యంతరం. కానీ... తమకు అన్నీ తెలుసు అనే వైఖరివల్లో, కర్ణాటక ఎన్నికల వల్లో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సమయం ఇవ్వడంలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

నరేంద్ర మోడీ పై దూకుడు పెంచిన చంద్రబాబు, గేర్ మారుస్తున్నారు... ముఖ్యామంత్రి హోదాలో, కేంద్రం పై నిరసన తెలుపుతూ, తన పుట్టిన రోజు నాడు దీక్ష చేసిన చంద్రబాబు, ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి, మోడీ మోసం పై ప్రజలకు వీడియోలు, డాక్యుమెంట్ లు చూపించి మరీ, ఎండగట్టనున్నారు... అయితే, ఈ నెల 7న అమరావతిలో, బీజేపీ యేతర పార్టీలు అన్నీ సమావేశం కానున్నాయి... ఇదే సమావేశంలో, చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ ప్రకటన చేస్తారని, నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... మే 7న అమరావతిలో జకీయంగానే కాకుండా, రాష్ట్రాలకు చేస్తున్న వివక్ష పై, అన్ని రాష్ట్రాలని చంద్రబాబు ఏకం చేస్తున్నారు...

ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలను ఒక్కతాటి పై తెచ్చిన చంద్రబాబు, ఈ సారి దేశంలో వివిక్షకు గురవుతున్న మిగతా రాష్ట్రాలను కూడా రమ్మని కబురు పంపించారు.. మే 7న విజయవాడలో ఈ సమావేశం జరగనుంది... అయితే ఈ సమావేశం జరిగితే, అన్ని రాష్ట్రాలకు మోడీ చూపిస్తున్న వివక్ష క్లియర్ గా ప్రజలకు చెప్పనున్నారు... ఇది కర్ణాటక ఎన్నికల పై కూడా పడుతుంది.. అంతే కాదు, బీజేపీ యేతర రాష్ట్రాలను చంద్రబాబు ఏకం చేసి, ఒక ఫ్రంట్ ని కూడా ప్రకతిస్తారు అనే వార్తలు వస్తున్నాయి... దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఇటీవల తిరువనంతపురంలో భేటీ కాగా, రెండో భేటీని విజయవాడ వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు..

అయితే ఈసారి దేశంలోని అన్ని బిజెపియేతర రాష్ట్రాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి పోరాటాన్ని ఉధృతం చేయాలని సంకల్పించారు. ఈ బాధ్యతను ఎపి రాష్ట్ర ఆర్థిక శాఖకు అప్పగించారు. దీంతో ఇతర రాష్ట్రాలను ఆహ్వానించే పనిలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు బిజీ అయ్యారు. ఈసారి చర్చల్లో ఆర్ధిక నిపుణులను కూడా భాగస్వాములను చేస్తూ వారినీ ఆహ్వానిస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఆర్ధికంగా నష్టపోతున్న నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు, అధికారులు తిరువనంతపురంలో భేటీ అయిన సందర్భంలో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు గైర్హాజరయ్యాయి. తొలుత విశాఖపట్నంలో ఈ భేటీని నిర్వహించాలనుకున్నా, చివరిగా విజయవాడకు వేదికను మార్పు చేశారు. ఈ భేటీకి కొత్తగా ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మిజోరాం రాష్ట్రాలను కూడా ఆహ్వానించారు... మరో నేషనల్ మీడియాలో వస్తున్నట్టు, ఆ రోజు చంద్రబాబు, కొత్త ఫ్రంట్ గురించి ప్రకటన చేస్తారా అనేది చూడాల్సి ఉంది...

ఈ రోజు అమెరికాలోని డల్లాస్ నగరంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను, ఘనంగా నిర్వచించేందుకు ప్లాన్ చేసింది... ఆ ఉత్సవాలకు రావటానికి, టికెట్ పెట్టటమే కాక, నిధుల సమీకరణకు కూడా మా ముందుకు వచ్చింది... 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని డాలస్‌లో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న డల్లాస్ ప్రవాసాంధ్రులు మాత్రం, ఈ ఉత్సవాలకు సహకరించేది లేదని ముందు నుంచి చెప్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకహోదా, నిధుల కేటాయింపు, విభజన చట్టం హామీల అంశాల్లో కేంద్రప్రభుత్వం చేతిలో వంచనకు గురైనా, చిరంజీవిగారు మరియు ఇతర సినిమాతారలెవరూ ఆంధ్రుల నిరసనకు మద్దతు తెలిపుతూ కనీస సంఘీభావ ప్రకటన కూడా చేయలేదనే కోపంతో, డల్లాస్ ప్రవాసాంధ్రులు, ఈ కార్యక్రమంలో నిరసన తెలిపి, చిరంజీవికి తన కర్తవ్యం గుర్తు చేసారు... విభజన హామీ విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతున్నా సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం పై డల్లాస్ లోని ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు... నిరసన చేస్తున్న ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ, ఆంధ్రా నుంచి ‘మా’ అసోసియేషన్ తరఫున భవనం నిర్మించడానికి ఫండ్స్ కోసం తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొంతమంది వచ్చారని, మేము దానికి వ్యతిరేకం కాదని, ఇలాంటి వాటికి చాలా విరాళాలు ఇచ్చామని, ఇదే శ్రద్ధ, మన రాష్ట్రము మీద సినీ పెద్దలకు ఎందుకు లేదని అడిగారు. ప్రధానంగా లోటుబడ్జెట్‌లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు హోదా, విభజన హామీల విషయంలో సినీ పరిశ్రమ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

కావేరి, జల్లికట్టు విషయంలో తమిళనాడు రాష్ట్రం మొత్తం ఏకమైందని, ఆ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని వారన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయనా? ఏపీలో ఏమీ లేవనా? అని ప్రశ్నించారు. ఇక్కడ మీకు ఫండ్స్ కలెక్ట్ చేసి ఇస్తుంటే, ప్రజలగురించి ఒక్క మాటకూడా మాట్లాడరా అంటూ ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. ప్రధానంగా తమ ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెప్పాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి ఏం చేశారని వారు నిలదీశారు. పార్లమెంట్‌లో, పక్క రాష్ట్రాలు ఏపీకి మద్దతుగా మాట్లాడుతుంటే... చిరంజీవి ఆడియో ఫంక్షన్లకు, కుటుంబ సమస్యల కోసం మా అషోసియేషన్‌కు గుంపును పోగేసుకునివెళ్లినంత శ్రద్ధ.. ఏపీపై ఎందుకు చూపడంలేదని ప్రవాసాంధ్రులు ప్రశ్నించారు. ఏపీ ప్రజలు సినీ పరిశ్రమను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారని, అలాంటిది కష్ట సమయంలో, ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడంలేదని వారు ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read