నమ్మకానికి అమ్మ వంటిది .. వెల్ఫేర్ గ్రూప్ ఈ యాడ్ మీకు పరిచయమే కధ... ఆ కంపెనీపై గతంలో సీబీఐ దాడులు జరిగాయి తాజాగా మరో ఇష్యూ... ఇంతకీ ఈయన ఎవరు అనేగా ? జగన్ పార్టీ నాయకుడు... విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌... జగన్ పార్టీలో ఇలాంటి నాయకులే ఉంటారు... ఇంతకంటే ఎక్కువ క్యారెక్టర్ ని ఉహించుకోలేం.. విజయ్ ప్రసాద్ మల్లా..వెల్ఫెర్ గ్రూప్ మెనెజింగ్ డైరెక్టర్.. వైజాగ్ పశ్చిమ మాజీ కాంగ్రెస్ ఎమ్మేల్యే, ప్రస్తుతం వైకాపా వైజాగ్ నగర ప్రెసిడెంట్... ప్రజలకు వందల కోట్ల టోపీ... వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఎన్నికల ఖర్చులకి సరిపడా నొక్కేసి బోర్డ్ తిప్పినట్లున్నారు...

మే 2 నుంచి, విశాఖలో, జగన్ చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా రాజ్యసభ సభ్యు డు వి.విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.. ఆ యాత్రకు ఫండింగ్ అంతా, ఈ వెల్ఫేర్ గ్రూప్ అధినేతే అని టాక్... మొత్తానికి, చిన్న చిన్న కుటుంబాల నుంచి, డిపాజిట్లు తీసుకుని, వారి పొట్ట కొట్టి, వారి టోపీ పెట్టి, కంపెనీ ఎత్తేసారు.. పాపం ఆ పేద కుటుంబాల వారు లబోదిబో అంటున్నారు... ఈ దొంగని పట్టుకునే బాధ్యత ఇప్పుడు చంద్రబాబు... లేకపోతే మళ్ళీ, అగ్రిగోల్డ్ లాగా, వీళ్ళే నాటకాలు మొదలు పెడతారు... అగ్రిగోల్డ్ కూడా, కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కాం అయితే, ఏ రకంగా చంద్రబాబు పై నింద మోపుతున్నారో, ఇది కూడా అలాగే చేస్తారు...

నమ్మకానికి అమ్మ వంటిది, అంటూ రోజు టీవీల్లో పలకరిస్తూ, ప్రజలను నమ్మించి మోసం చేసాడు, ఈ వైసిపీ నాయకుడు... మరి, జగన్ ఇలాంటి వాళ్ళు చేస్తున్న పనికి ఎలాంటి సమాధానం చెప్తాడు ? ఇలాంటి వారు మోసం చేసి, పోగేసిన డబ్బులతో, రేపు జగన్ పాదయాత్ర చేస్తాడు.. అలాగే రేపు ఎలక్షన్ కు కూడా ప్రజల నుంచి కొట్టేసిన, ఈ డబ్బే ఖర్చు పెడతారు... ఇలాంటి వాళ్ళు వచ్చి, చంద్రబాబుని తిడతారు.. చంద్రబాబుని విమర్శిస్తారు... ఈ పార్టీ మొత్తం దొంగలతో, మోసగాళ్ళతోనే నిండిపోయింది అనటానికి, ఇదే ఉదాహరణ... ప్రభుత్వం, ఈ దొంగలని పట్టుకుని, ఆ డబ్బులు పాదయాత్రకి, ఎన్నికలకు వెళ్ళకుండా, ప్రజలకే చెందేలా చెయ్యాలి...

గన్నవరం ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు పరుగులు పెడుతున్నాయి. పది నెలల కాలంలో సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం సేకరించిన 600 ఎకరాల భూముల్లో, ప్రస్తుతం ఎర్త్‌ఫిల్లింగ్‌ పనులు జోరుగా జరుగుతున్నాయి. విస్తరణలో ఈ ఎర్త్‌ఫిల్లింగ్‌ పనులే కీలకం. ఈ విస్తరణ పనుల్లో దాదాపు 70 శాతం మేర ఎర్త్‌ఫిల్లింగ్‌ పని ఉంది. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మయ్యలింగం చెరువు నుంచి మట్టిని ఇక్కడికి తరలిస్తున్నారు. ఈ పనులు మరో రెండు నెలలు జరుగుతాయి. ఆ తర్వాత కాంక్రీట్‌ పనులు, ఆ తర్వాత బీఎం, ఎస్‌డీఏసీ, డీఏసీ విధానంలో మూడు లేయర్లతో రన్‌వేను మరింత బలోపేతం చేసే పనులు జరుగుతాయి.

విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ కోసం రూ.117 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా టెండర్లు పిలిచింది. పీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కాంట్రాక్టును దక్కించుకుంది. పది నెలలుగా పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు రూ.58 కోట్ల బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. వాస్తవానికి రన్‌వే ప్రాజెక్టు వ్యయం రూ.98 కోట్లు మాత్రమే! మిగిలిన వ్యయం జీఎస్టీ కిందకు వెళుతుంది. విస్తరణ పనులు వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. విస్తరించిన రన్‌వే వచ్చేఏడాది ప్రారంభం అవుతుంది. నూతన రన్‌వే అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్టుగా గుర్తింపు వస్తుంది.

విశాఖపట్నం, రాజమండ్రి, చిత్తూరు ఎయిర్‌పోర్టులు కూడా విజయవాడ తర్వాత స్థానంలోనే ఉంటాయి. ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు ప్రారంభించటం వల్ల విజయవాడ ప్రస్తుత రన్‌వేతో సమానంగా ఉంది. విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే పొడవు ప్రస్తుతం 7500 అడుగులు (2286 మీటర్లు). దీనిని మరో 3500 అడుగులు (1704 మీటర్ల) మేర ప్రస్తుతం పొడిగిస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టుకు అదనపు రన్‌వే అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో అత్యంత పొడవైన రన్‌వేగా రికార్డుకెక్కుతుంది.

కాపు రిజర్వేషన్ల అంశం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, 5 శాతం రిజర్వేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే... జస్టిస్ మంజునాథన్ తో కమిషన్ వేసి, ఆ కమిషన్ సూచనలు ప్రకారం, నిర్ణయం తీసుకుంటూ, డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది... వెంటనే, బిల్లు రూపంలో అసెంబ్లీలో కూడా పెట్టింది... ఈ బిల్లు అసెంబ్లీలో కూడా ఆమోదం పొంది, కేంద్రానికి వెళ్ళింది... అంతకంటే ముందు, ఈ బిల్లు గోవర్నర్ వద్ద కూడా ఆమోదం పొందింది... ఇప్పుడు కేంద్రం పరిధిలో ఈ బిల్లు ఉంది... కేంద్ర హోంశాఖ వద్దకు ఈ బిల్లు చేరింది... అక్కడ నుంచి వివిధ మంత్రిత్వ శాఖలకు, ఈ బిల్ వెళ్ళింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ, ఈ కాపు కోటా పై అభ్యంతరాలను తెలిపింది.

ఇది సాకుగా చూపి కేంద్రం కూడా ఆట ఆడిస్తాం మొదలు పెట్టింది... మొత్తం రిజర్వేషన్లు 50 శా తం మించవద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది... అయితే, ఈ విషయం పై శుక్రవారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సత్‌పాల్‌ చౌహాన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో ఏపీ తరఫున బీసీ కమిషన్‌ సభ్యుడు వీ.సుబ్రహ్మణ్యం, సీఐడీ డీజీ తిరుమలరావు, ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగానే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రానికి వివరించారు.

బీసీ కమిషన్‌ కూడా దీనిని సమర్థించిందని చెప్పారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే, రిజర్వేషన్ ఇచ్చినట్టు చెప్పారు.. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది, రాష్ట్రపతి కూడా ఆమోదించాలా చూడండి అంటూ కేంద్రంలో హోమ శాఖ అధికారులని కోరింది ఏపి ప్రభుత్వం. అయితే, ఈ వాదనలను, సహేతుకమైన కారణాలను లిఖితపూర్వకంగా అందించాలని హోం శాఖ అదనపు కార్యదర్శి సత్‌పాల్‌ చౌహాన్‌ సూచించారు. కాపు రిజర్వేషన్‌ బిల్లుతో పాటు, భూసేకరణ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్‌ డిపాజిటర్ల పరిరక్షణ బిల్లు, విద్యుచ్ఛక్తి సుంకం చట్టం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదించిన గుజరాత్‌, తెలంగాణ భూసేకరణ చట్ట సవరణ బిల్లుల్లో పేర్కొన్న పదాలనే తామూ వినియోగించామని, అయినా ఆ బిల్లు ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారని, అది కూడా క్లియర్ చెయ్యమని రాష్ట్ర అధికారులు, కేంద్రాన్ని అడిగారు.

రెండు రోజుల నుంచి , గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, జనసేన పార్టీ మధ్య నడుస్తున్న ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది... నిన్న గల్లా రిప్లై కి, ఈ రోజు జనసేన మరో ట్వీట్ చేసింది... మీకోసం గుంటూరు ప్రజలు వెతుకుతున్నారు, మీ బాటరీ చార్జ్ చేసుకోండి అంటూ వెకిలిగా ఒక పార్టీ ఆఫిషయల్ ఎకౌంటు నుంచి ఖండన వచ్చింది... దీనికి గల్లా ధీటైన జవాబు ఇచ్చారు.. నేను గుంటూరులోనే ఉంటున్నా, మీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన సార్లు కంటే, నేను గుంటూరుకు ఎక్కువ సార్లే వచ్చాను అంటూ ట్వీట్ చేసారు గల్లా.. నిజానికి, గల్లా, పార్లమెంట్ సమావేశాలు అయ్యిన దగ్గర నుంచి గుంటూరులో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గున్తున్నారు.. మరి, జనసేనకు ఎక్కడ నొప్పి వచ్చిందో కాని, లేపి మరీ, నీ పవన్ ఎన్ని సార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చాడు అనే ప్రశ్న వేయించుకుని, హైదరాబాద్ లో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు..

రెండు రోజుల క్రితం, గల్లా జయదేవ్ తన ట్విట్టర్ లో, జగన్ - పవన్ కలిసిపోతున్నారు అని, త్వరలోనే ప్రజల ముందుకు కలిసి వస్తున్నారు అంటూ, ఒక ట్వీట్ చేసారు.. దానికి, తాపీగా రెండు రోజుల తరువాత, జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది... చౌకబారు భాషలో ఒక ట్వీట్ వేసింది... ‘‘వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లా ఒక్కసారి లోక్ సభలో స్పెషల్ స్టేటస్‌పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు..’’ అంటూ జనసేన ఆఫిషయల్ హేండిల్ నుంచి ట్వీట్ వచ్చింది..

దీనికి వెంటనే జయదేవ్ రియాక్ట్ అయ్యారు. ‘‘4 సంవత్సరాల నుంచి సుమారు 100 సార్లు స్పీచ్ ఇచ్చాను. అంటే సెంచరీ కొట్టాను. ప్రత్యేక హోదా కోసం మేము కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రిపై యుద్ధం చేస్తూనే ఉన్నాం. మరి పవన్ కల్యాణ్ గారు ప్రధానమంత్రిపై ఎందుకు ఆధారపడుతున్నారో? అసలు ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నాడు? ఇక మా బ్యాటరీస్ గురించి చెప్పాలంటే.. అవి ఎప్పుడూ ఫుల్ చార్జింగ్‌తోనే ఉంటాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. నిజంగా అలాగే ఉంటాయి’’ అంటూ గల్లా దానిని రిప్లై ఇచ్చారు...

Advertisements

Latest Articles

Most Read