నిజంగా జగన్ మోహన్ రెడ్డికి, ఇది పండుగ లాంటి వార్తా... అవినీతి పరుల పై యుద్ధం అంటూ, నరేంద్ర మోడీ, అమిత్ షా చేసిన ప్రచారం చూసి, పాపం బిడ్డ మొన్నటి దాక భయపడ్డాడు... కాని విజయసాయి రెడ్డి చేసిన పనులు తరువాత, మోడీ, అమిత్ షా లో మార్పు వచ్చి, జగన్ ను క్షమించినట్టు కనిపించారు... కాని, పాపం జగన్ కు ఎదో భయం పట్టుకుంది... వీళ్ళని నమ్మితే, నమ్మితే ఏంటి నమ్మాలి.. కాని, తరువాత టైం చూసుకుని శశికళకు పట్టిన గతి పట్తిస్తారేమో అని... కాని, ఈ రోజు వచ్చిన వార్తా విన్న తరువాత, జగన్ ఎగిరి గంతులు వేస్తున్నాడు... కృష్ణా జిల్లా పాదయాత్రలో రెస్ట్ తీసుకుంటున్న జగన్ కు, బళ్ళారి నుంచి ఒక ఫోన్ వచ్చింది... ఇక అంతే ఎగిరి గంతులు వేస్తున్నాడు... ఆ ఫోన్ చేసింది, జగన్ కు సోదర సమానుడు అయిన, గాలి జనార్ధన్ రెడ్డి... ఇంతకీ విషయం ఏంటి అనుకుంటున్నారా ?

jagan gali 16042018

గాలి జనార్దన్ రెడ్డి, ఎంత అవినీతి పరుడో, రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో, గాలి, జగన్ కలిసి ఎలా దోచేసింది ప్రపంచం మొత్తం చూసాం... ఇద్దరూ జైలుకి కూడా వెళ్లి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారు... అయితే, గాలి మళ్ళీ బీజేపీలోకి రావటం, త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో, బీజేపీ తరుపున పోటీ చేస్తారు అనే వార్తలు రావటంతో దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది... దీంతో బీజేపీ అసలకే మోసం వస్తుందని, గాలి జనార్ధన్ రెడ్డికి మాకు సంబంధం లేదు అని చెప్పింది... కాని లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంది... అందులో భాగంగా, గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, శ్రీరాములుకు డిప్యూటీ సియం పదవి ఇస్తామని, కొన్ని జిల్లాల ఎన్నికలు ఖర్చు గాలి పెట్టుకోవాలని ఒప్పందం కుదిరింది... అయితే ఈ రోజు, మరో దిమ్మ తిరిగే వార్తా వచ్చింది...

jagan gali 16042018

గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డికి, బీజేపీ ఎమ్మల్యే టికెట్ ఇచ్చింది... ఇన్ని రోజులు బీజేపీ అధికారికంగా బళ్లారిలో తమ పార్టీ అభ్యర్థిని ఇంత వరకూ ప్రకటించలేదు... అయితే, ఈ రోజు బీజేపీ అభ్యర్ధిని ప్రకటించింది... అవినీతి పరులకు శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వమని, గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడంతో అందరూ నిజమే అనుకున్నారు... కాని, ఈ రోజు, అదే అవినీతిపరుడుకి టికెట్ ఇచ్చి, తాము ఏంటో చెప్పకనే చెప్పారు... ఇక ఈ వార్తా తెలిసిన జగన్, చిందులు వేస్తున్నారు... నేను అవినీతిపరుడుని అని, జైలుకి వెళ్ళివచ్చాని, బీజేపీ ఎక్కడ దూరం పెడుతుందో అని ఖంగారు పడ్డాను... గాలన్న, సోదరుడుకు టికెట్ వచ్చింది అంటే, బీజేపీ నాతో కూడా కులుస్తుంది అంటూ, జగన్ సంబరపడిపోతున్నారు...

పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఖర్చు పెట్టిన వ్యయంలో ఇంకా కేంద్రం చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా తిరిగిచ్చేలా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీకి లేఖలు రాయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ‘పునరావాసం-పరిహారం’ ప్యాకేజ్ కింద నిర్వాసిత కుటుంబాల కోసం చేపట్టిన కాలనీల అభివృద్ధిని శరవేగంగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇప్పటివరకు 15 కాలనీలను అభివృద్ధి చేశామని, ప్రస్తుతం 38 కాలనీలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే పూర్తయిన 15 కాలనీలలో 3,348 నిర్వాసిత కుటుంబాలు నివాసం వుంటున్నాయని తెలిపారు. టెండర్ల దశలో వున్న మరో 7 కాలనీల పనులను వచ్చే నెల మొదటి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న 38 కాలనీలతో పాటు, వచ్చే నెల నుంచి చేపట్టే 7 కాలనీల నిర్మాణంతో 16,687 నిర్వాసిత కుటుంబాలకు నివాస సదుపాయం కలుగుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు.

cbn 16042018

సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గడిచిన వారం రోజుల్లో 2.29 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 28 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్ వాల్ 42 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తంమీద 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 795.390 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తయ్యాయని చెప్పారు. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 5.14 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని అన్నారు. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,175.6 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యిందని వెల్లడించారు. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 10,450 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయినట్టు తెలిపారు.

cbn 16042018

స్పిల్ వే నిర్మాణంలో తొలిసారిగా వారం రోజుల్లో 5 వేల క్యూబిక్ మీటర్లకు పైగా కాంక్రీట్ పనులు చేపట్టడం, డయాఫ్రమ్ వాల్ పనులు లక్ష్యాన్ని మించి సాగుతుండటంపై అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇప్పటివరకు 52.20% పోలవరం ప్రాజెక్టు పూర్తికాగా, కుడి ప్రధాన కాలువ 89.10%, ఎడమ ప్రధాన కాలువ 58.30% పనులు పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 71.30% మేర స్పిల్ వే, స్పిల్ చానల్ తవ్వకం పనులు, 14.60% వరకు స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు, 82.40% డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, జెట్ గ్రౌంటింగ్ 61%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తయినట్టు తెలిపారు.

cbn 16042018

ప్రభుత్వం చేపట్టిన 53 ప్రాధాన్య ప్రాజెక్టులలో పులకుర్తి ఎత్తిపోతల పథకం, హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశలో భాగమైన అడవిపల్లి రిజర్వాయర్ ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని, అడవిపల్లి ఎత్తిపోతల పథకం వచ్చే నెల 15 నాటికి సిద్ధం కానుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్మాణం పనులు వచ్చే నెలాఖరుకు పూర్తవుతాయని చెప్పారు. 2015-16 నుంచి 2017-18 వరకు 6,59,744 పంటకుంటలు ఏర్పాటు చేశామని, 65,966 చెక్‌డ్యామ్‌లు నిర్మించామని తెలిపారు.

బంద్ పేరుతో, వైసిపీ నేతలు అనేక చోట్ల రెచ్చిపోయారు.. తెనాలిలో, మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి మరీ, అక్కడ ఉద్యోగం చేసుకుంటున్న మహిళా ఉద్యోగిని, వైసిపీ నేత శివ కుమార్ కుర్చీతో దాడి చేసి కొట్టారు... ఇలా బంద్ చేస్తూ, దుకాణాలు ఏమన్నా తెరిచి ఉంటే చాలు, వారి పై రేచ్చిపోతూ దాడి చేస్తున్నారు... ఈ రోజు ఉదయం తెనాలిలో బంద్ పేరుతో వైసిపీ నేతలు, దుకాణాలు అన్నీ ముపిస్తూ వచ్చారు... అయితే, అదే సందర్భంలో మున్సిపల్ ఆఫీస్ తెరిచి ఉండటం గమనించి, అక్కడకు వెళ్లి, అక్కడ ఉద్యోగులని భయబ్రాంతులకు గురి చేసారు... మేము బంద్ పిలుపు ఇస్తే, మీరు ఉద్యోగాలు చేసుకుంటారా అంటూ, అక్కడ ఉన్న మహిళా ఉద్యోగి పై, కుర్చీతో దాడి చేసారు వైసిపీ నేత శివ కుమార్.. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు... అక్కడకు వచ్చిన పోలీసులు, పరిస్థితి అదుపులోకి తెచ్చారు... కేసు కూడా బుక్ చేస్తామని చెప్పారు...

ycp goons 16042018 1

అయితే ఉదయం తిరుపతిలో కూడా వైసిపీ ఇలాగే రెచ్చిపోయింది... ఈ రోజు ఉదయం రాష్ట్ర బంద్ సందర్భంగా తిరుపతి బస్టాండ్ సమీపంలో ఓ వాహన దారుడు రోడ్ ప్రక్కన పార్క్ చేసిన టూవీలర్ బైక్ దహనం చేశారు. వాహనదారుడు లబోదిబోమంటున్నారు. త‌న‌కు న్యాయం చేయాలని కోరారు. వైస్సార్ సీపీ నాయకులు పై పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానన్న బాధితుడు. సామాన్య ప్రజల ఆస్థులు ధ్వంసం చేస్తూ, కేంద్రం పై యుద్ధం ఏంటో వీరికే తెలియాలి... ఇలా బంద్ చెయ్యటం వళ్ళ, రాష్ట్రానికి నష్టం తప్ప, మోడీకి ఏమన్నా అవుతుందా ? ఇలా బంద్ లతో,ర రాష్ట్రం నాశనం అవ్వాలనే వారి ప్లాన్ సక్సెస్ అయినట్టే కాని, వారికి ఏమి అవ్వదు... సామాన్య ప్రజలు ప్రయాణాలు వాయిదా పడితే, రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? బ్యాంకు లు మూసుకుపొతే, రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? స్కూల్స్ మూసుకుపొతే రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? వ్యాపారాలు మూసేస్తే రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? ఎవరి కోసం చేస్తున్నారు ఇది ?

ycp goons 16042018 1

మరో పక్క చంద్రబాబు బంద్ పై, కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఉదయం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సీఎం మాట్లాడుతూ ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఉద్యమసంస్థలు ఆలోచించాలన్నారు. తమని తాము శిక్షించుకోరాదని.. అన్యాయం చేసిన వారిని శిక్షించాలని సూచించారు. తాము చేపట్టే నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలన్నారు. అరగంట సేపు నిరసనలో పాల్గొని...మరో గంటసేపు అదనంగా పని చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న రాష్ట్ర బంద్‌లో టీడీపీ మినహా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, వైసీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహిళలపై దాడులు చేసే బలహీనులను పట్టించుకోనని సినీ నటి పూనమ్‌ కౌర్‌ అన్నారు. ‘‘ఆయుధాలు లేని వాళ్లతో యుద్ధం చేయకూడదని గురు గోవింద్‌ చెబుతారు. బలహీనులతో యుద్ధం చేయకూడదంటారు. ఏ వ్యక్తి అయినా ఓ అమ్మాయితో పోరాటం చేస్తున్నాడంటే, అతడు బలహీనుడని అర్థం. దిగజారిపోయిన వ్యక్తే మహిళతో తప్పుగా ప్రవర్తిస్తాడు. మోసం చేయాలనుకుంటాడు. అలాగని నేను తిరగబడి కక్ష సాధించేందుకు ఫూలన్‌ దేవిని కాదు కదా? అందుకే మోసం చేసేవాళ్లని దేవుడే చూసుకుంటాడని నమ్ముతాను’’ అని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌కు విద్యా సంస్థలను తీసుకొచ్చారని, అందుకే తనలాంటి వాళ్లు చదువుకోగలిగారని అన్నారు. ఆయన వల్లే తాను నిఫ్ట్ లాంటి జాతీయస్థాయి విద్యాసంస్థలో చదువుకున్నా అన్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై తన గౌరవాన్ని రాజకీయం చేయవద్దని, గురు గోవింద్‌ను గౌరవించినట్టే ఆయననూ గౌరవించానని చెప్పారు. ఇప్పుడు తాను రాజకీయాల గురించి మాట్లాడనని, తాను ఏది మాట్లాడినా దాన్ని రివర్స్‌లో తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.

poonam 16042018 1

తప్పుడు మార్గంలో సరైన లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేమంటూ గురు గోవింద్‌ మాటలను ఉటంకించారు. ‘‘నేను పోరాడుతున్నప్పుడే నా బలం ఏమిటో నాకు తెలుస్తుంది. ఎవరికీ హాని కల్గించే పనిని నేను చేయను. నాతో యుద్ధం చెయ్‌. ఏం జరుగుతుందో జరుగుతుంది అనుకుంటాను. మిమ్మల్ని ఓసారి కొట్టారనుకోండి. నొప్పి అనిపిస్తుంది. మళ్లీ కొడితే, మళ్లీ మళ్లీ కొడితే నొప్పికి మీరు అలవాటు పడిపోతారు. నా విషయంలో అదే జరిగింది అనుకుంటాను’’ అని స్పష్టం చేశారు. ఎవరైనా బలహీనతలతో ఆడుకోవడం.. అమ్మాయి జీవితంతో ఆడుకోవాలని అనుకోవడం చాలా తప్పు అని చెప్పారు. అలాంటివాళ్లు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని అన్నారు. స్వామీజీలుగా బయటకు కనిపించిన వాళ్లు కూడా జైళ్లలో ఉన్నది అందుకే కదా అని అభిప్రాయపడ్డారు. తాను ఎవరి నాశనాన్ని కోరుకోనని అన్నారు.

poonam 16042018 1

అలాంటివాళ్లు వాళ్లంతట వాళ్లే మారాలని, వారిలో మార్పు రావాలని కోరుకున్నారు. ‘‘నేను ఈ క్షణం వరకూ ఎవరి సాయం ఆశించలేదు. చిన్నప్పటి నుంచీ ఇంతే. 12వ తరగతి వరకూ మాత్రమే తల్లిదండ్రులపై ఆధారపడ్డా. ఆ తర్వాత స్వతంత్రంగా బతుకుతున్నా. నేను నా ఆత్మను ఎప్పటికీ అమ్ముకోను. వ్యక్తిత్వంతో ఉన్నా. సమాన హక్కులను నమ్ముతాను. నేను నిఖార్సైన సిక్కు మహిళను’’ అని పూనమ్‌ అన్నారు. తన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసునని, అందరి ఆడపిల్లల్లా వీళ్ల ఆటలు తన దగ్గర చెల్లవని అన్నారు. ఎవరైనా ఏం చేయగలరు? ప్రాణం తీస్తారా అని ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read