బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, సింగపూర్ లో చంద్రబాబుతో భేటీ పై ట్వీట్ చేసారు... చంద్రబాబుతో మాట్లాడటం చాలా ఉత్సాహంగా ఉంది, ఆయన విజన్ గురించి డిస్కస్ చేసాం అంటూ ట్వీట్ చేసారు... అంతకు ముందు, ఉదయం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ నేతృత్వంలోని ‘టోనీ బ్లేయర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్’ సంస్థ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరించింది. ఈ విషయాన్ని టోనీ బ్లేయర్ శుక్రవారం సింగపూర్ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా వెల్లడించారు. భారత్‌లో ఇప్పటికే తమ సంస్థ 200 విద్యాలయాలతో కలిసి పనిచేస్తోందని వివరించిన బ్లేయర్, భారత్‌లో తమకు కార్యాలయం వుందని, ప్రత్యేక బృందం కూడా ఇందుకోసం పనిచేస్తోందని చెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు తమ బృందాన్ని పంపిస్తానని చెప్పారు.

tony 13042018 1

ఈ ద్వైపాక్షిక సమావేశంలో రియల్‌టైమ్ గవర్నెన్స్, సమగ్ర ఆర్ధిక నిర్వహణ విధానం, విద్యుత్ సంస్కరణలు, సౌర-పవన విద్యుత్ విధానాలు, నూరుశాతం ఓడీఎఫ్, ఐవోటీ, డ్రోన్లు, అప్లికేషన్లతో వ్యవసాయ రంగానికి సాంకేతికత జోడింపు ఇలా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను బ్లేయర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఒకప్పటి తన హైదరాబాద్‌ సందర్శనను, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబుతో కలిసి మహబూబ్‌నగర్‌లోని ఒక గ్రామాన్ని పరిశీలించిన జ్ఞాపకాలను టోనీ బ్లేయర్ గుర్తు చేసుకున్నారు. వాజ్‌‌ పేయి ఎంతో ఆదరాభిమానాలు చూపారని బ్లేయర్ వెల్లడించారు. ఎప్పుడైనా భారత్ వెళ్లినప్పుడు ఏపీని తప్పకుండా సందర్శించాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తనకు చెప్పిన సంగతిని తెలిపారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సందర్శనకు వచ్చానని చెప్పారు. 1978 నుంచి 40 ఏళ్లగా రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం ఎలా సాధ్యమైందంటూ చంద్రబాబు దగ్గర బ్లేయర్‌ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

tony 13042018 1

కొత్త రాష్ట్రం ఎలా ఉందని బ్లేయర్ ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో కొత్త రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తున్న తీరు తనకు తెలుసునని బ్లేయర్ పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకొచ్చి తమకు సమీకరణ విధానంలో ఎలా భూములు అందించిందీ ముఖ్యమంత్రి వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు, వచ్చే 20 ఏళ్ల పాటు 15 శాతం సుస్థిర వృద్ది లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్న తీరును, ఫైబర్ కనెక్టివిటీ, ఆహార శుద్ధి రంగంలో ఏపీలో ఉన్న అపార అవకాశాలను బ్లేయర్‌కు తెలిపారు. స్పష్టమైన విజన్‌తో నూతన రాష్ట్రాభివృద్ధికి ఎలా ముందుకెళ్తున్నది బ్లేయర్‌ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువచ్చారు. 2022, 2029, 2050 లక్ష్యాలను పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం 50 శాతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, వాటి అమలు తీరు, ఇతర కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకునేందుకు బ్లేయర్ ఆసక్తి కనబరిచారు. ఏపీని సందర్శించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించగా, అందుకు బ్లేయర్ సుముఖత వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వంలో ఇంటిదొంగలను కనుక్కునేందుకు ప్రభుత్వం అన్వేషణ ప్రారంభించింది. ప్రభుత్వంలోనే ఉంటూ అక్కడి రహస్యాలను ప్రత్యర్ధులకు చేరవేస్తున్న వారిపై నిఘాపెట్టారు. కొంతమంది మంత్రులు మధ్య జరిగిన ఈ చర్చ ఆసక్తికరంగా మారింది. కొంతమంది ప్రత్యర్ధి శిబిరానికి అస్త్రాలను అందిస్తున్నారట. తద్వారా ప్రభుత్వానికి వెన్నుపోటు పొడుస్తున్నారట! ఇదీ కొందరిలో ఉన్న బలమైన అభిప్రాయం. ముఖ్యమంత్రి వద్ద ఎక్కువ మార్కులు కొట్టేసిన కొంతమంది అధికారులే కీలక సమాచారం బయటకు పొక్కడంలో సూత్రధారులుగా ఉన్నారట! దీనిపై ఏపీ మంత్రులే చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాజెక్టులకు టెండర్లు పిలిచే సమయంలోనే ఆ టెండర్ల సమాచారం అంతా బయటకు పొక్కింది. అది కాస్తా ప్రత్యర్ధి శిబిరానికి చేరిందని పలువురు మంత్రులు చెబుతున్నారు. మరికొన్ని శాఖల్లోని కీలక సమాచారం కూడా గుట్టుచప్పుడు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేరిపోతోందట! ఈ విధంగా సమాచారం ఎలా లీకవుతోందన్న అంశంపై ఇప్పుడు లోతుగా ఆరాతీస్తున్నారు.

amaravati 13042018

ఉద్యోగుల పనితీరు బాగోకపోతే ముందుగానే వారికి పదవీ విరమణ కల్పించే విషయమై ఉత్తర్వులు వెలువడబోతున్నాయనీ, అధికారుల స్థాయిలో ఈ ఉత్తర్వులు సిద్ధమయ్యాయంటూ గతంలో ఓ సమాచారం బయటకు పొక్కింది. ఈ విషయంలో లీకువీరులు ఎవరో ప్రభుత్వం తెలుసుకుంది. అలాగే మరికొన్ని శాఖల నుంచి కూడా సమాచారాన్ని సేకరించి.. ప్రత్యర్థులకు తెలివిగా చేరవేస్తున్న వారు ఎవరో ప్రభుత్వ ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రికీ తెలిసిందట. ఈ విషయాన్ని కూడా కొందరు మంత్రులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెక్రటేరియట్‌లో, మరికొన్ని శాఖలలో అధికారుల కదలికలపై, వారు ఎవరెవరిని కలుస్తున్నారనే విషయమై నిఘా పెరిగింది.

amaravati 13042018

ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రులు ఒకరిద్దరికి ఏపీలో ఉన్న ఇరువురు అధికారులు సమాచారం చేరవేస్తున్నారట. ఈ అంశాన్ని కూడా రాష్ట్రమంత్రులు ప్రస్తావిస్తున్నారు. ఇటువంటి అధికారులు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడం ఏమిటని నిలదీస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో చెప్పేందుకు ఎవరు సాహసించడంలేదు. కొన్ని శాఖలలో కిందిస్థాయి అధికారుల ద్వారా ఉన్నతాధికారులు ఈ సమాచారాన్ని రాబడుతున్నారనీ, రాష్ట్రంలో ప్రతిపక్షానికి, ఢిల్లీలో బీజేపీకి చెందిన కొంతమంది కీలక నేతలకు ఆ సమాచారాన్ని చేరవేస్తున్నారనీ ఓ మంత్రి చెప్పుకొచ్చారు. ఎన్నికల సంవత్సరంలో ఉద్యమాలు ఊపందుకుంటున్న తరుణంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలనీ, ఇంటిదొంగలపై గట్టి నిఘా పెట్టాలనీ ఆ మంత్రులు విశ్లేషించారు. తగిన సమయంలో ఈ ఇంటిదొంగలపై ముఖ్యమంత్రికి నిర్మొహమాటంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇస్తామని ఆ మంత్రులు చెప్పారు.

రేపు కృష్ణా జిల్లాలోకి దొంగల ముఠా ప్రవేశం... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు... ఇది చూసి పోలీసు వారి హెచ్చరిక అనుకునేరు... కాదండి, మన ప్రతిపక్ష నేత జగన్ ముఠా రేపు కృష్ణా జిల్లాలో అడుగుపెడుతుంది... అందుకే, తెలుగుదేశం పార్టీ ప్రజలను అలెర్ట్ చేస్తుంది.. శనివారం కృష్ణా జిల్లాలోకి దొంగల ముఠా ప్రవేశిస్తోందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ మ్మెల్సీ బచ్చుల అర్జునుడు హెచ్చరించారు. పట్టిసీమను వ్యతిరేకించిన ప్రతిపక్ష నేత జగన్ డెల్టా రైతాంగానికి క్షమాపణ చెప్పి జిల్లాలో అడుగుపెట్టాలని అల్టిమేటం జారీ చేశారు.

krishna 13042018

పదవి కోసమే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. మైలవరం నుంచి దేనినేని ఉమ పారిపోతారని వైసీపీ నేతల అసత్య ప్రచారం చేస్తున్నారని, పెడన నుంచి పారిపోయిన జోగి రమేష్‌... మైలవరం నుంచి కూడా పారిపోక తప్పదని బచ్చుల అర్జునుడు జోస్యం చెప్పారు... మరో పక్క ఈ రోజు, జగన్ పాదయాత్రకు సెలవు.. శుక్రవారం కావటంతో, పాదయాత్రకు సెలవు ఇచ్చి కోర్ట్ కు వెళ్లారు... వాన్‌పిక్‌ కేసులో జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌పై... సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. జగన్ తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో జగన్‌తో పాటుగా వైసీపీ నేత విజయ్‌సాయిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

krishna 13042018

గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. పట్టాభిరామయ్య కాలనీ సమీపంలో తాను బస చేసిన ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరిన ఆయన.. మహానాడు కరకట్ట మీదుగా సుందరయ్య నగర్‌ ముళ్లపూడి రాంప్‌, మణిపాల్‌ ఆసుపత్రి కూడలి వరకు నడిచారు. దారిపొడవునా వివిధ వర్గాల సమస్యలు వింటూ.. వినతి పత్రాలను తీసుకుంటూ ముందుకు సాగారు. మహానాడులో వైఎస్‌ విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించారు. ఉదయం 11 గంటలకల్లా పాదయాత్ర ముగించారు. అనంతరం హైదరాబాద్‌ బయల్దేరారు. రేపు పాదయాత్ర, కృష్ణా జిల్లాలోకి రానుంది...

గాలి జనార్దన్ రెడ్డి... ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అక్రమ మైనింగ్ లో, ఒక పీకు పీకాడు... జగన్ సొంత కొడుకు అయితే, గాలి నా పెద్ద కొడుకు అంటూ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చెప్తూ ఉండే వారు... అలాగే, జగన్ లక్ష కోట్లు కొట్టేస్తే, పెద్ద కొడుకు గాలి జనార్ధన్ రెడ్డి కొట్టేసిన అక్రమ మైనింగ్ లెక్క అంతా ఇంతా కాదు.. చివరకు ఇద్దరు కొడుకులు జైలుకు వెళ్లి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు అనుకోండి... అయితే గాలి మళ్ళీ బీజేపీలోకి రావటం, త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో, బీజేపీ తరుపున పోటీ చేస్తారు అనే వార్తలు రావటంతో దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది... దీంతో బీజేపీ అసలకే మోసం వస్తుందని, గాలి జనార్ధన్ రెడ్డికి మాకు సంబంధం లేదు అని చెప్పింది...

sreeramulu 13042018 2

కాని లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంది... అందులో భాగంగా, గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, శ్రీరాములుకు డిప్యూటీ సియం పదవి ఇస్తామని, కొన్ని జిల్లాల ఎన్నికలు ఖర్చు గాలి పెట్టుకోవాలని ఒప్పందం కుదిరింది... బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, బి. శ్రీరాములు. గతంలో బీజేపీకి రాజీనామా చేసిన శ్రీరాములు బీఎస్ఆర్ పార్టీని స్థాపించారు. కర్ణాటకలో దాదాపు అన్ని నియోజక వర్గాల నుంచి బీఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యర్థులను శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయించారు. తరువాత కాలంలో, గాలి జైలు నుంచి వచ్చిన తరువాత, మళ్ళీ బీజేపీలో చేరాడు...

sreeramulu 13042018 3

ఈ నేపథ్యంలో శ్రీరాములుపై రాళ్ల దాడి చర్చనీయాంశమైంది. శ్రీరాములుకు చిత్రదుర్గ జిల్లాలోని మొల్కలమూర్‌ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ టికెట్‌ కేటాయించింది. ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాములకు టికెట్ కేటాయించినందుకు నిరసనగా ఆయన కాన్వాయ్‌పై తిప్పేస్వామి వర్గీయుల దాడి చేసినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన పోలీసులు తిప్పేస్వామి వర్గీయులను చెదరగొట్టారు... ఇవన్నీ చూస్తున్న విశ్లేషకులు, రేపు జగన్ పరిస్థితి కూడా ఇంతే అని చెప్తున్నారు... ఒప్పందంలో భాగంగా, బీజేపీ - వైసిపీ కలవాల్సిన పరిస్థితి... అప్పుడు జగన్ ను కూడా ఇలాగే వాడుకుని వదిలేస్తారు బీజేపీ పెద్దలు... జగన్ పై ఉన్న కేసులు, కొంత కాలం లేట్ చెయ్యవచ్చు కాని, శిక్ష నుంచి తప్పించటం కుదరదు అనే విషయం గుర్తు చేస్తున్నారు...

Advertisements

Latest Articles

Most Read