జగన్ మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్ లు వస్తున్నాయి... కాని, ఆయనే స్పందించటం లేదు... ఎందుకో తెలియదు కాని, ఈ విషయాల పై మాత్రం, ఎంత ఒత్తిడి ఉన్నా, ఒక్కరు కూడా నోరు విప్పటం లేదు... జవాబివ్వలేక వైకాపా నేతలు సతమతమవుతున్నారు.... ఒక్క వీడియో క్లిప్పింగ్ అయినా చూపించమని ఆయన... కాళ్ళు పట్టుకుంటా అని ఈయన... కాని పాపం, వారి మీద కనికరం చూపించటం లేదు జగన్... ఇంతకీ విషయం ఏంటి అంటే, కర్నూలు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి చేసిన సవాల్‌ మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో బాణంలా దూసుకెళ్లింది...

jagan 14042018 1

జగన్మోహన్‌రెడ్డి నాలుగేళ్ల కాలంలో ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్రమోదీని ఒక్కసారైనా విమర్శించినట్లు ఒక్క వీడియో క్లిప్పింగ్‌ చూపించినా చాలు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తమ అధినేతకే మోహన్‌రెడ్డి సవాల్‌ విసరడంపైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు సీరియస్‌గా తీసుకుని తీవ్రంగా చర్చించారట! మోహన్‌రెడ్డి సవాల్‌కు వైకాపా నేతలు సమాధానం వెతికేందుకు కృషి చేస్తున్న క్రమంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో ఇటీవల జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా జగన్‌కు చేసిన సవాల్‌ను మరోసారి రిపీట్‌ చేశారు. తాను చేసిన సవాల్‌కు రోజులు గడుస్తున్నా వైకాపా నుంచి సమాధానం రావడం లేదంటే ప్రధాని మోదీని జగన్‌ పల్లెత్తుమాటైనా అనలేదని అర్థమవుతోందని మోహన్‌రెడ్డి అన్నారు.

jagan 14042018 1

ఇది ఇలా ఉండగానే, బీకాం ఫిజిక్స్ అంటూ ఎగతాళి చేసిన ఎమ్మల్యే జలీల్ ఖాన్ కూడా స్పందించారు... ప్రధానమంత్రి నరేంద్రమోడీని జగన్ విమర్శించగలిగితే నేను జగన్ కాళ్ళు పట్టుకుంటానని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... పాదయాత్రలో జగన్ నోటి వెంట మోదీ దొంగ, బీజేపీ మోసం చేసింది అని ఒక్క మాట అంటే నా పదవికి రాజీనామా చేస్తానని జలీల్‌ఖాన్ అన్నారు... అయితే అటు మోహన్ రెడ్డి సవాల్ కు కాని, ఇటు జలీల్ ఖాన్ సవాల్ కు కాని, ఎవరూ సమాధానం చెప్పటం లేదు.. మోడీ అంటే భయపడి పోతున్నారు... బీజేపీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతల లోపాయికారి ఒప్పందం ఏమిటన్నది ఈ సంఘటన రుజువు చేస్తున్నదని టీడీపీ నాయకులు అంటున్నారు.. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో పాదయత్ర చేస్తూ, రాజధానికి అనువైన ప్రాంతం దొనకొండ అని, నేను సియం అయిన వెంటనే, అమరావతిని మార్చేస్తంటూ జగన్ చేసిన ప్రకటన, అమరావతిలో వ్యతిరేకత తెప్పించిన సంగతి తెలిసిందే.. అయితే, అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, వారిని సముదాయించారు... పాదయాత్ర మంగళగరికి వచ్చినప్పుడు, జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని వారికి హామీ ఇచ్చారు... అయితే, గురువారం వరకు జగన్ మంగళగిరిలోనే ఉన్నా, అమరావతి పై ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు... ఇదే విషయం నిన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేని రైతులు అడగ్గా, ఈ రోజు శుక్రవారం కోర్ట్ కి వెళ్ళారని, రేపు విజయవాడలో అడుగు పెట్టే లోపు, జగన్ అమరావతి పై ప్రకటన చేస్తారని చెప్పారు...

amaravati 14042018

అయితే, జగన్ మాత్రం, అమరావతి అనే పేరు పలకటానికి కూడా ఇష్ట పడలేదు... తెల్లారి లేగిస్తే, అమరావతిలో అల్లకల్లోలం జరుగుతుంది అంటూ హడావిడి చేసి జగన్ బ్యాచ్, మరి పాదయాత్ర రాజధాని గ్రామాల నుంచి ఎందుకు చెయ్యలేదు ? నిజంగా అంత ఘోరాలు అమరావతిలో జరుగుతుంటే, జగన్ ప్రతిపక్ష నాయకుడుగా అటు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కదా అంటూ, నిలదీశారు.. జగన్ మాత్రం, ఇవేమీ పట్టించుకోలేదు... అమరావతి పై తనుకున్న ద్వేషాన్ని చూపిస్తూ, అమరావతి అనే మాట కూడా ఎత్తకుండా, విజయవాడ వెళ్ళిపోయారు... దీంతో రాజధాని రైతులు మండిపడుతున్నారు...

amaravati 14042018

రాజధానిపై జగన్‌ స్పష్టమైన ప్రక టన చేస్తాడని చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యాత్రలో ఆ విషయమే ప్రస్తావించలేదని.. దానికి ఆర్కే రాజీనామా చేస్తారా..? అని రైతు నాయకులు నేలపాడు సర్పంచ్‌ ధనేకుల సుబ్బారావు ప్రశ్నించారు. రైల్వేస్టేషన్‌, ఎయిర్‌ పోర్టు ఉండి, పుష్కలమైన నీరు, రాష్ట్రానికి మధ్యలో ఉన్నప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తుంటే ఓర్వలేని జగన్‌ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. జగన్‌లా దోచుకొని ఇక్కడ రైతులు కోటీశ్వరులు అవలేదన్నారు. రాజధాని రావటంతో కష్టపడి సంపాదించిన భూములకు విలువ పెరిగి కోటీశ్వరులు అయ్యారని అన్నారు. 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చి సంతోషంగా ఉంటే రాజకీయాల కోసం అభాండాలు వేయటం సరికాదని, జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో పాదయాత్ర చేసేవారని రాజధాని రైతులు అన్నారు...

రెండు నెలల నుంచి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం... కేంద్రం చేస్తున్న అన్యాయం పై అందరూ రోడ్డుఎక్కారు... ఎంతో సహనంగా ఉండే చంద్రబాబు కూడా, బీజేపీతో తెగదెంపులు చేసుకుని, కేంద్ర మంత్రి పదవులని కూడా వదులుకున్నారు... ప్రజలు ఎంత ఆందోళన చేస్తున్నా, కేంద్రం మాత్రం పట్టించుకోవటం లేదు... పైగా, మీకు అన్నీ ఇచ్చేసాం అంటుంది... హోదా ఇవ్వమంటే, కుదరదు అన్నారు... కాని ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు... మా ఇష్టం అంటూ, ఆందోళన చేస్తున్న, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని రెచ్చగొడుతున్నారు.... నెల రోజుల క్రితం, ‘హోదా’ జాబితాలోనే ఉన్న సిక్కింతోపాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు మరో 3వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే...

modi 14042018

ఈ నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు పన్నురాయితీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు ఈశాన్య రాష్ట్రాలపై కేంద్రం వరాలు గుప్పిస్తోంది. ఇవీ రాయితీలు... ఆదాయ పన్ను: పరిశ్రమ స్థాపించిన మొదటి ఐదేళ్లూ ఆయా పరిశ్రమలు చెల్లించిన పన్నుల్లో కేంద్రం వాటాను తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. వస్తు రవాణా: పరిశ్రమల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసిన వస్తువులను రైల్వే, నిర్దేశిత జల రవాణా, వాయుమార్గ సంస్థల్లో రవాణా చేసే ఖర్చులపై ఐదేళ్లపాటు రాయితీలు అందిస్తారు. జీఎస్‌టీ: వస్తు సేవల పన్నుపై రాయితీని మొదటి ఐదేళ్ల వరకు తిరిగి చెలిం్లచనున్నారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఈ చెల్లింపులు చేస్తారు. బీమా: భవనం, కార్మాగారం, యంత్రాలపై కట్టిన బీమా ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు తిరిగి చెల్లిస్తుంది. ఉపాధి: ఉద్యోగులకు చెల్లించే పీఎఫ్‌ మొత్తంలో యజమాని తరఫున 3.67 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రోత్సాహకాల పరిమితి: పథకం అమలు కాలంలో ఒక్కో యూనిట్‌కు వివిధ రూపాల్లో ఇచ్చే ప్రోత్సాహకాలు గరిష్ఠ పరిమితి రూ.200 కోట్లు.

modi 14042018

రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇలాంటి రాయితీలనే కోరుతోంది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక పథకాన్ని అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. ఈ తరహా రాయితీలు కల్పించడంతో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొస్తాయని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ‘‘ఇప్పుడు ఎవ్వరికీ హోదా లేదు. అన్ని రాష్ట్రాలూ సమానమే’’ అంటూ నవ్యాంధ్రకు మొండిచేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకు మా రాష్ట్రానికి అన్యాయం చేసింది అని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, పవన్ కాని, జగన్ కాని, ఈ విషయం పై కనీసం మాట్లాడరు...

ఈ వైసిపీ పార్టీకి విజయవాడ ప్రజలు ఒకరకంగా కూడా కనిపించటం లేదు... రోజుకి ఒక డ్రామా ఆడుతూ, ప్రజలని పిచ్చోళ్లని చేస్తూ, నిజం అనుకునే లోప అబద్దం అంటారు, అబద్దం అనుకుంటే నిజం అంటారు... అసలు ఎవరు ఎవరి పక్షమో అర్ధం కాక, ఇటు ప్రజలు, అటు కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు... మొన్నటి మొన్న పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు అంటూ డ్రామా ఆడిన గౌతంరెడ్డి, నెల రోజుల క్రితం వైఎస్ జగన్ ను పాదయత్రలో కలవటం సంచలనం అయ్యింది... వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో, కాపుల ఆగ్రహానికి గురై, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ, అప్పట్లో వైసీపీ డ్రామా ఆడింది...

jagan 14042018

గౌతంరెడ్డి జగన్ ను కలిసిన్ వెంటనే, విజయసాయి వచ్చి, ఒక ప్రకటన విడుదల చేసారు... గౌతమ్‌రెడ్డికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ పార్టీ సభ్యుడు కూడా కాదని, ఆయన్ను సస్పెండ్ చేసాం అని చెప్పారు.. ఇది ఇలా ఉండగానే, ఈ రోజు జగన్ పాదయాత్ర విజయవాడలో అడుగుపెట్టింది... మరి ఏమైందో ఏమో తెలియదు కాని, వంగవీటి రాధాతో పని లేదు అనుకున్నాడో ఏమో కాని, గౌతం రెడ్డి సస్పెన్షన్ ఎత్తి వేస్తూ, లోటస్ పాండ్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి... సరిగ్గా, జగన్ విజయవాడలో అడుగుపెట్టిన క్షణమే, గౌతం రెడ్డి సస్పెన్షన్ ఎత్తి వేసారు అని తెలియటంతో, రాధా వర్గం ఒకింత షాక్ కు గురైంది... తన తండ్రిని ఘోరంగా అవమానించిన, వాడిని నెత్తిన పెట్టుకోవటంతో, ఇప్పుడు రాధా ఎలా స్పందిస్తారో అని ఆయన వర్గం వేచి చూస్తుంది...

jagan 14042018

రాధా ఇక మన మాట వినడు అని, జగన్ కు అర్ధమై పోయిందో ఏమో కాని, రంగాను అన్ని బూతులు తిట్టిన గౌతం రెడ్డిని, బహిరంగంగా కలిసి, తనతో పాటు నడిపించుకుని, రాధా ఉంటే ఎంత పొతే ఎంత అనే సంకేతం జగన్ ఇచ్చారు అని పరిశీలకులు అంటున్నారు.. రాధా సామాజికవర్గం కంటే, నా సొంత సామాజికవర్గమే నాకు ముద్దు అనే సంకేతం ఇచ్చి, రెడ్డి సామాజికవర్గాన్ని మంచి చేసుకోవటానికి, జగన్ ఇలా చేసారేమో అని అంటున్నారు... మరి ఈ పరిణామాలు చూస్తున్న రాధా, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి... ఇప్పటికే జగన్ పై అసహనంతో, ఊగిసలాటలో ఉన్న రాధా, ఈ పరిణామాలు చూసి, త్వరగా రియాక్ట్ అవుతారని అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read