బీఎస్పీ చీఫ్ మాయావతి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు... నిన్న అమిత్ షా మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలని జంతువలతో పోల్చటం పై మాయావతి తప్పుబట్టారు... తెలుగుదేశం పార్టీ లాంటి మిత్ర పక్షం కొట్టిన దెబ్బకు, అమిత్ షా ఏవోవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు... టీడీపీ సహా మిత్రపక్షాలన్నీ దూరం కావడంతో బీజేపీ నేతలు ఇప్పుడు ఏకాకిలా మారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు... బీజేపీ వ్యవస్థాపక దినం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... మోదీ హవాకు ఎదురొడ్డేందుకు పాములు, ముంగిసలు, పిల్లులు, కుక్కలు జతకట్టాయంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ చీఫ్‌కు మాయావతి లేఖ రాశారు.
మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రతిపక్షాలపై నోరుపారేసుకుని భారీ మూల్యం చెల్లించుకున్నారని, బీజేపీకి గుణపాఠం చెప్పడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచడం లేదని, దీని కారణంగానే అవమానకర భాషతో దూషణకు దిగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన శిష్యుడు అమిత్ షా నాయకత్వంలో ఆ పార్టీ విలువలు ఎంత దిగజారాయో తాజా వ్యాఖ్యలు రుజువుచేస్తున్నాయని బీఎస్పీ అధినేత తన లేఖలో పేర్కొన్నారు.
‘‘బీజేపీ చెప్పిన నవ భారతం ఇలాగే ఉంటుందా? అసహ్యమైన మాటలు, చులకన చేసే వ్యాఖ్యలతో దేశాన్ని నిర్మిస్తారా? భారత అధికార పార్టీకి ఇది తగునా?’’ అని మాయవతి సూటిగా ప్రశ్నించారు. అతివిశ్వాసం, అహంకారం కారణంగా ఆ పార్టీకి మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయనీ... దీంతో ఇప్పుడు బీజేపీ ఏకాకిగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చకపోవడం వల్ల... ఎప్పటినుంచో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సైతం బీజేపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిందన్నారు.